అస్సాం, బెంగాల్‌లో బీజేపీదే గెలుపు.. గడ్కరి ధీమా…

అస్సాం, బెంగాల్‌లో బీజేపీదే గెలుపు.. గడ్కరి ధీమా

త్వరలో జరుగనున్న అస్సాం, పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి అన్నారు. సమ్మిళిత అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని, మతపరమైన ఏ గ్రూపులకు బీజేపీ వ్యతిరేకం కాదని చెప్పారు.

న్యూఢిల్లీ: త్వరలో జరుగనున్న అస్సాం (Assam), పశ్చిమబెంగాల్ (West Bengal) అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి (Nitin Gadkari) అన్నారు. సమ్మిళిత అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని, మతపరమైన ఏ గ్రూపులకు వ్యతిరేకం కాదని చెప్పారు.

 

అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్ ఓటమిపై మాజీ క్రికెటర్ అశ్విన్

కుట్టు దహీ భల్లా.. దీని రుచే వేరుగా..

బట్టలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చను: ఈటల

జగన్‌ను చూస్తే తుగ్లక్ గుర్తొస్తున్నారు: మంత్రి కొలుసు పార్థ

డయాబెటిస్ ఉందా? ఇదిగో సూపర్ డైట్ ప్లాన్..

బాదం పూరీ.. ఇలా తయారు చేస్తే.. ఇక మీరు..

ప్రాణం తీసిన చేప.. యువకుడు నోటిలో పెట్టుకోగానే..

మైదాపిండికి ప్రత్యామ్నాయం

షాకింగ్ వీడియో.. రెస్టారెంట్‌లోకి దూసుకెళ్లిన విమానం.. నలుగు

చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన ఆపరేషన్.. రెండో పైలట్‌‌ను రక్ష

ఆఫర్లున్నా కదలరు…ఉద్యోగం వదలరు!

స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్‌ తెరవడంపై రేపటితో ముగియనున్న డెడ్ లైన్

పిచ్చి కుక్క బీభత్సం.. 15 సెకన్లలో నలుగురిని కొరికేసింది..

అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్ ఓటమిపై మాజీ క్రికెటర్ అశ్విన్

కుట్టు దహీ భల్లా.. దీని రుచే వేరుగా..

బట్టలు మార్చినంత ఈజీగా పార్టీలు మార్చను: ఈటల

జగన్‌ను చూస్తే తుగ్లక్ గుర్తొస్తున్నారు: మంత్రి కొలుసు పార్థ

డయాబెటిస్ ఉందా? ఇదిగో సూపర్ డైట్ ప్లాన్..

బాదం పూరీ.. ఇలా తయారు చేస్తే.. ఇక మీరు..

ప్రాణం తీసిన చేప.. యువకుడు నోటిలో పెట్టుకోగానే..

మైదాపిండికి ప్రత్యామ్నాయం

షాకింగ్ వీడియో.. రెస్టారెంట్‌లోకి దూసుకెళ్లిన విమానం.. నలుగు

చరిత్రలోనే అత్యంత సాహసోపేతమైన ఆపరేషన్.. రెండో పైలట్‌‌ను రక్ష

ఆఫర్లున్నా కదలరు…ఉద్యోగం వదలరు!

స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్‌ తెరవడంపై రేపటితో ముగియనున్న డెడ్ లైన్

పిచ్చి కుక్క బీభత్సం.. 15 సెకన్లలో నలుగురిని కొరికేసింది..

మైనారిటీలు, ఎస్ఐఆర్‌పై..

మైనారిటీలు, ఎస్ఐఆర్‌పై కేంద్రంలోని బీజీపీ వైఖరిపై ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, సమ్మళిత అభివృద్ధే బీజేపీ విధానమని అన్నారు. ప్రగతి, ఐక్యతకు కట్టుబడి పార్టీ పనిచేస్తోందని, మతపరమైన ఏ గ్రూపులకు వ్యతిరేకం కాదని చెప్పారు. ఎస్ఐఆర్ వంటి అంశాల విషయంలో దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటుందని తెలిపారు. ‘అటు అస్సాం, అటు బెంగాల్‌లో మేము గెలుస్తామనే గట్టి నమ్మకం నాకుంది. ఏదో ఒక మతాన్ని కాకుండా అందర్నీ కలుపుకుని వెళ్లడమే బీజేపీ విధానం. చొరబాటుదారులను మేము వ్యతిరేకిస్తామే కానీ ముస్లింలకు వ్యతిరేకం కాదు’ అని గడ్కరి వివరణ ఇచ్చారు.

పార్టీ ఎన్నికల ప్రచారంలో అభివృద్ధి అనేదే ప్రధాన అంశమని, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధికి కట్టుబడి పార్టీ పనిచేస్తోందని గడ్కరి చెప్పారు. మౌలిక వసతుల కల్పనలో ప్రధానంగా పెట్టుబడులు పెడుతున్నామని, మరిన్ని ప్రాజెక్టులకు కూడా ప్లానింగ్ చేస్తున్నామని తెలిపారు. అస్సాం సహా ఈశాన్య ప్రాంతాల్లో రూ.5 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు అమలు చేస్తున్నామని, రూ.1.5 లక్షల కోట్ల విలువైన మౌలిక వసతుల ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తయ్యాయని, మరో రూ.1.5 నుంచి రూ.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు అమలు దశలో ఉన్నాయని, అదనంలో మరో రూ.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. రోడ్లు, హైవేలు, లాజిస్టిక్‌ వంటి సదుపాయాలతో కెనెక్టివిటీ పెరిగి, ఆయా ప్రాంతాలు ఆర్థికంగా బలపడతాయని అన్నారు. ఈశాన్య ప్రాంతాలు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న సవాళ్లకు ఇదే పరిష్కారమని అన్నారు.

చొరబాట్లపై..

అక్రమ చొరబాట్లకు తమ పార్టీ వ్యతిరేకమని, ఏ నిర్దిష్ట మతానికి కాదని గడ్కరి స్పష్టం చేశారు. అక్రమ చొరబాట్లను అడ్డుకోకుంటే దేశం ఒక ధర్మశాలగా మారుతుందని గడ్కరి హెచ్చరించారు. పశ్చిమబెంగాల్‌లో రాజకీయ మార్పు కోరుతూ ప్రజల నుంచి మద్దతు పెరుగుతోందని చెప్పారు. ఓటర్ల జాబితా ఎస్ఐఆర్ ప్రక్రియపై బెంగాల్ ముఖమంత్రి మమతా బెనర్జీ చేస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ, జాతీయ ప్రయోజనాలే బీజేపీకి ముఖ్యమని అన్నారు. జాతీయ ప్రయోజనాల విషయంలో తాము రాజకీయాలు చేయమని, ఆయా అంశాలను (ఎస్ఐఆర్ వంటి అంశాలు) కేవలం జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే చేపడుతున్నామని చెప్పారు.

కేంద్ర మంత్రి కలిసిన ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్, చైర్మన్ నాగేష్ శెట్కార్…

కేంద్ర మంత్రి కలిసిన ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్, చైర్మన్ నాగేష్ శెట్కార్

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఢిల్లీలోని కేంద్ర రహదారి మరియు రవాణా శాఖ మంత్రి నితిన్ గాడ్కరి గారి కార్యాలయంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్ , నారాయణాఖేడ్ మున్సిపల్ చైర్మన్ నాగేష్ శెట్కార్ గారు మర్యాదపూర్వకంగా కలిసి పలు అభివృద్ధి అంశాలపై చర్చించారు.ఈ సందర్భంగా నేషనల్ హైవే 161(B) నిజాంపేట్ – నారాయణాఖేడ్ మీదుగా కర్ణాటక సరిహద్దు వరకు ₹520 కోట్ల నిధులు మంజూరు చేసి పనులు కొనసాగుతున్న విషయంపై మంత్రి గారికి కృతజ్ఞతలు తెలిపారు.అదేవిధంగా, కర్ణాటక బోర్డర్ నుండి బీదర్ వరకు మిగిలిన 8 కిలోమీటర్ల రహదారికి కూడా నిధులు మంజూరు చేసి, 161(B) హైవేతో అనుసంధానం చేయాలని విజ్ఞప్తి చేశారు.జహీరాబాద్ చెక్ పోస్ట్ నుండి బీదర్ వరకు న్యాల్కల్ నుండి గంగ్వార్ వరకు ట్రాఫిక్ పెరగడం తో 6 లైన్ రోడ్డు కు ప్రతిపదన కోరడం జరిగింది ఇక నూతన నారాయణాఖేడ్ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కేంద్రం నుండి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు.
ఈ అంశాలపై కేంద్ర మంత్రి నితిన్ గాడ్కరి గారు సానుకూలంగా స్పందించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

చొప్పదండి–మల్యాల రోడ్డుకు 50 కోట్ల మంజూరు…

చొప్పదండి నుండి మల్యాల వరకు రోడ్డు మంజూరు పట్ల కేంద్ర మంత్రులకు కృతజ్ఞతలు:బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్

రామడుగు, నేటిధాత్రి:

 

 

కరీంనగర్ జిల్లా చొప్పదండి మండల కేంద్రము నుండి రాగంపేట్, గోపాలరావుపేట, బురుగుపల్లి, తక్కలపల్లి గ్రామాలను కలుపుతూ జగిత్యాల జిల్లా మల్యాల ఎక్స్ రోడ్డు వరకు డబుల్ రోడ్డు కోసం యాభై కోట్ల సిఆర్ఎఫ్ నిధులు మంజూరు చేయడం పట్ల కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలో రామడుగు మండల శాఖ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు పాలాభిషేకం నిర్వహించి, స్వీట్లు పంపిణీ చేసి, బాణసంచా కాల్చడం జరిగింది. ఈసందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్ మాట్లాడుతూ చొప్పదండి నుండి మల్యాల వరకు రోడ్డు సరిగా లేక ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారన్న విషయాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రత్యేక చొరవ తీసుకుని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి విన్నవించి వెంటనే వారు స్పందించి మంజూరు చెపిచినందుకు కేంద్ర మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణకి నూట ఎనభై ఎనిమిది కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందని, చొప్పదండి నియోజవర్గంలో రోడ్ల అభివృద్ధికి యాభై కోట్ల నిధులు మంజూరు చేయడం హర్షణీయం అని అన్నారు. గ్రామాల అభివృద్ధికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అను నిత్యం పాటు పడుతున్నారని తెలిపారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వంతోనే రోడ్లు అభివృద్ధి చెందుతున్నాయని వారు అన్నారు. రోడ్డు మంజూరు పట్ల గ్రామస్థులు, వ్యాపారస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఉప్పు రాంకిషన్, మాజీ మండల శాఖ అధ్యక్షులు ఒంటెల కరుణాకర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శిలు పోచంపెల్లి నరేష్, పురేళ్ల శ్రీకాంత్ గౌడ్, మండల ఉపాధ్యక్షులు జాతరగొండ ఐలయ్య, కళ్లెం శివ, మండల కార్యదర్శి గుంట అశోక్, దళిత మోర్చా మండల అధ్యక్షులు సంటి జితేందర్, యువ మోర్చా మండల అధ్యక్షులు దురుశెట్టి రమేష్, యువ మోర్చా మండల అధికార ప్రతినిధి మాడిశెట్టి అనిల్, సీనియర్ నాయకులు జిట్టవేని అంజిబాబు, కట్ట రవీందర్, బద్ధం లక్ష్మారెడ్డి, మునిగంటి శ్రీనివాస్ చారి, మాజీ సర్పంచ్ ఉమ్మెంతల అభిషేక్ రెడ్డి, బూత్ కమిటీ అధ్యక్షులు పల్లపు చిరంజీవి, రేండ్ల తిరుపతి, మందపెళ్లి అరుణ్, వేముల దామోదర్, బండి శేఖర్, ఉత్తేం కనుకరాజు, మంద రాజశేఖర్, పొన్నం అభిషేక్, బుర్ర శ్రీధర్, దైవాల తిరుపతి గౌడ్, ఎగుర్ల ఎల్లయ్య, లింగంపెళ్లి శ్రీనివాస్, మేకల నాగరాజు, సత్తు రాకేష్, గ్రామస్తులు, వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version