ఆటో యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ కు సన్మానం…

ఆటో యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ కు సన్మానం
మెట్ పల్లి మార్చి
24 నేటి ధాత్రి

మెట్ పల్లి లో ఆటో యూనియన్ బస్ డిపో చౌరస్త రింగ్ రోడ్డు వారి ఆధ్వర్యంలో ఇటీవల నూతనంగా మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన మైలారపు లింబాద్రి ని వైస్ చైర్మన్ ఓంకారి నవీన్ ని చైర్మన్ స్వగృహంలో ఘనంగా శాలువా పూలమాలతో సన్మానం చేశారు .అనంతరం చైర్మన్ మైలారపు లింబాద్రి మాట్లాడుతూ మీకు వార్డులో సమస్యలు గానీ అలాగే ఏ సహాయ సహకారాలు కావాలన్న ఎల్లప్పుడూ మీముందుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ సంఘ అధ్యక్షులు రంగు సంపత్ గౌడ్ ఉపాధ్యక్షులు భాష్పం నరేందర్ క్యాషియర్ కుడుముల లక్ష్మణ్ సెక్రెటరీ దాసరి బుచ్చయ్య పొన్నం రామచందర్.
ఎం అయిలయ్య.రామ్ రెడ్డి కనకయ్య నారాయణ గౌడ్ రాజ గౌడ్ రాజయ్య ఏసు గంగాధర్ మల్లయ్య రాజు మహేష్ మధు నక్క హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలి: ఎంపీ సురేష్ కుమార్…

అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలి: ఎంపీ సురేష్ కుమార్

◆-: ఎంఐఎం కౌన్సిలర్ మహమ్మద్ రఫీ

జహీరాబాద్ నతి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మునిసిపాలిటీలో జరిగిన అత్యవసర కౌన్సిల్ సమావేశంలో స్థానిక ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్, ఎంఐఎం కౌన్సిలర్ మహ్మద్ రఫీలను శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా జహీరాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలని ఎంపీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కమిషనర్ జైత్ రామ్, ఎంఆర్ దశరథ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version