`కడిగిన ముత్యంలా “కవిత”.
`ఆనాడే చెప్పిన “నేటిధాత్రి”.

`ఎంతో దైర్యంగా అందరికంటే ముందే రాసిన “నేటిధాత్రి”.
`కక్ష సాధింపులో భాగంగానే “కవిత” అరెస్ట్ అని కూడా దైర్యంగా రాసిన పత్రిక “నేటిధాత్రి”.
`ఎప్పటికైనా కేసు నిలవదని రాసిన “నేటిధాత్రి”.
`అక్రమంగా 5 నెలల పాటు కవిత” ను జైలు పాలు చేశారు.
`మూడేళ్ల పాటు”కవిత”ను రాజకీయంగా అణచివేసే కుట్రలు చేసారు.
`వ్యక్తిగతంగా “కవిత”కు అప్రతిష్ట మూటగట్టారు!
`“కవిత” రాజకీయ జీవితాన్ని చిదిమేసే కుట్రకు తెరలేపారు.
`“బీఆరఎస” పార్టీ ఓటమికి కారకులయ్యారు.
`“కవిత” ను అవినీతి పరురాలుగా చిత్రీకరించారు.
`“కవిత” కు అనుకూలంగా నిజ నిజాలు రాస్తే “నేటిధాత్రి” ని దుమ్మెత్తి పోశారు.
`“నేటిధాత్రి”ని కూడా నిందల పాలు చేశారు.
`“కవిత” కు మద్దతుగా వార్తలు రాస్తే అమ్ముడు పోయిన “నేటిధాత్రి” అని కూశారు.
`సోషల్ మీడియాలో “నేటిధాత్రి” ని విపరీతంగా ట్రోల్ చేశారు.
“కేసీఆర” కుటుంబాన్ని నమస్తే తెలంగాణా ను మించి జోకుతున్నారని ఏద్దేవా చేశారు.
`“కవిత”పై పెట్టిన అక్రమ కేసులపై నోరు తెరవడానికి “బిఆరఎస” నాయకులు కూడా ముందుకు రాలేదు.
”నమస్తే తెలంగాణా” కూడా “నేటిధాత్రి” అంత దైర్యంగా రాయలేదు.
`మొదటినుంచి న్యాయపరమైన అనేక అంశాలతో కూడిన విశ్లేషణలు చేసింది ఒక్క “నేటిధాత్రి” మాత్రమే..
`“కవిత” మీద కేసు అన్యాయమని అక్షర పోరాటం చేసింది కూడా ఒక్క “నేటిధాత్రి” మాత్రమే.
నిజాన్ని ఆనాడు దైర్యంగా రాసింది నేటిధాత్రి.. ఇప్పుడు గర్వంగా చెప్పగలుగుతోంది నేటిధాత్రి.
”బీఆరఎస” నాయకులే నిలబడకపోయిన.. “నేటిధాత్రి” అక్షరంలికవిత”కు అండగా నిలబడింది.
`కవిత తరుపున న్యాయం కోసం అక్షర పోరాటం చేసింది.
`అన్యాయాన్ని నేటిధాత్రి అక్షరాలు నిప్పు కణాలై కొట్లాడింది.
హైదరాబాద్, నేటిధాత్రి:
కాలం చాý విచిత్రమైనది. కొన్ని సార్లు క్రూరమైంది. సాఫీగా సాగుతున్న జీవితాలను సుడిగుండాలలోకి తోసేస్తుంది. మాజీ ఎంపి, ఎమ్మెల్సీ దేవనపల్లి కవిత జీవితంలో కల్లోలలం నింపింది. మూడు నాలుగేళ్లపాటు తన రాజకీయ జీవితంలో ఎదుర్కొరాన్నన్ని కష్టాలు తెచ్చిపెట్టింది. జరిగేవన్నీ మంచికని అనిపించేలా ఆఖరుకు తీర్పునిచ్చింది. ఇదంతా ఖర్మ అనుకునేలా చేసింది. సంబందం లేని నిందలను గుడి బండలు చేసి నెత్తిన వేస్తుంది. జీవితం అల్లకల్లోలం చేస్తుంది. ఏం జరుగుతుందో అర్దమయ్యే లోపే జీవితం ఆగమౌతుంది. విమర్శల జడివాన కురుస్తుంది. ఆరోపణల పిడుగులు కురిపిస్తుంది. గుండె దైర్యం చెదిరిపోయేలా చేస్తుంది. సమజాన్ని కాలమే తప్ప్పుదోవ పట్టిస్తుంది. మళ్లీ అదే కాలమే కొత్త లోకాన్ని చూపిస్తుంది. మేలిమి బంగారం మెరవాలంటే నిప్ప్పుల వానలో తడవాలన్నట్లు, గొప్ప గొప్పవారి జీవితాలకు ఇలాంటి అగ్ని గుండాలు ఎదురొస్తాయంటే ఇదేనేమో… ఏది ఏమైనా దేవనపల్లి కవిత జీవితంలో మళ్లీ ఆనందం నింపింది. ఆమె ఇరుకున్న కేసునుంచి కడిగిన ముత్యంలా కవిత బైటపడింది. ఇది ఆమెనే కాదు, ఆమెను అభిమానించే కోట్లాది మంది అభిమానులకు సంతోషం కలిగించింది. కవిత ఒక సామాన్యురాలు కాదు. ఆమె శక్తివంతమైన మహిళ. మహిళా లోకానికి దిక్సూచిగా నిలిచిన నాయకురాలు. నేటి పురుషాదిక్య సమాజంలో చైతన్యకాంతి కవిత. అలాంటి కవిత రాజకీయ ఎదుగుదల కొంత మందికి నచ్చలేదు. కొన్ని పార్టీలకు ఆమె రాజకీయ ప్రస్తానం అడ్డుగా మారింది. అంతే ఆమెపై లేనిపోని కుట్రలు చేశారు. కుతంత్రాలు చేశారు. ఆమె రాజకీయ జీవితాన్ని చిదిమేయాలని చూశారు. రాజకీయాల్లో వ్యక్తిగత కక్షలకు తావులేదు. ప్రజాస్వామ్య దేశంలో రాజకీయ వ్యవస్ధలో విలువలు లేని వారు అందలం ఎక్కాలనుకున్నప్ప్పుడు కవిత లాంటి నాయకులు అడ్డు అనుకున్నప్ప్పుడు ఇలాంటి అడ్డకుంటు సష్టిస్తుంటారు. అలాంటి కుట్రలకు బలైంది కవిత. ఎంతో ఉన్నత రాజకీయ భవిష్యత్తు వున్న ఆమెను రాజకీయాలకే మొత్తంగా దూరం చేయాలనుకున్నారు. అందుకు వ్యక్తులే కాదు, వ్యవస్దలు కూడా పనిచేశాయి. దాంతో ఆమె రాజకీయ జీవితం మరసబారుతుందనుకున్నారు. కాలం కొన్ని సార్లు వక్ర చూపు చూసినా, మళ్లీ తేరుకునే సమయం కూడా ఇస్తుంది. ఇప్ప్పుడు కూడా అదే జరిగింది. అయితే ఆమె అనుభవించిన ఆ కాలాన్ని ఎవరు తిరిగి తెచ్చి ఇవ్వగలరు? ఆమె వ్యక్తిగత స్వేచ్చను హరించి, ఆమెను జైలుకు పంపిక వారికి కూడా ఆనాడే తెలుసు. కాని కవిత రాజకీయం ఏకంగా ఒక పార్టీకే అడ్డంకిగా మాతుందని భయపడిందంటే కవిత నాయకత్వ పటిమ ఎంత బలమైందో అర్ధం చేసుకోవచ్చు. కుట్రలు, కుతంత్రాలు చేసి ఆమెను రాజకీయంగా పాతాలానికి తొక్కేయాలనుకున్నా, ఆమె ప్రతిష్ట ఇప్ప్పుడు ఎవరెస్టు శిఖరమంతా ఎదిగింది. ఆమె ఎదుర్కొన్న కేసులో పస లేదని సాక్ష్యాత్తు న్యాయ స్ధానం తీర్పునిచ్చింది. ఆమెకు స్వేచ్చను న్యాయ స్దానం ప్రసాదించింది. కవిత ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఎదిగిన నాయకురాలు కాదు. స్వయం ప్రతిపత్తితో ఆమె నాయకురాలిగా ఎదిగింది. ఆమె నాయకురాలు కాకముందు ప్రజా సేవకురాలు. సామాజిక సేవకురాలు. తెలంగాణ ఉద్యమ కారురాలు. మలి దశ ఉద్యమానికి బతుకమ్మతో ఊపిరి పోసిన నాయకురాలు. అలాంటి నాయకురాలు మీద నిందలు వేశారు. ఆమె రాజకీయ జీవితంలో నిప్ప్పులు పోశారు. కాని ఆ నిప్ప్పులు, ఆ నిందలు ఆమెను ఏమీ చేయలేకపోయాయి. అమాస్య వచ్చినంత మాత్రాన చంద్రుడు పూర్తిగా కనపండాపోరు. ఈ మూడు నాలుగు సంవత్సరాలు ఆమె అమావాస్య చీకట్లను అనుభించినా, రేపటి పౌర్ణమి జీవితమంతా వెలుగుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఇక ఆమె రాజకీయ జీవితాన్ని ఆపే శక్తి ఆ బ్రహ్మ దేవుడికి కూడా వుండకపోవచ్చు. ఒక శివంగిలాగా ఆమె ముందుకు దూకేందుకు మార్గం సుగమమైంది. ఇంత కాలం ఆమె ఏది చెప్పినా ఆ కేసు మరకలను చూపిస్తూ ఎద్దేవా చేసేవారు. ఇప్ప్పుడు ఆమె మాటకు ఎదురులేని రోజులు వచ్చాయి. ఆమె రాజకీయానికి తిరుగులేని రోజులు రానున్నాయి. అయితే ఇక్కడ ఒక విషయం చెప్ప్పుకోవాలి. కవితపై కేసు నమోదు చేసిన సమయంలోనే నేటిధాత్రి చూపిన దైర్యం ఆనాడు బిఆరఎస్ పార్టీ కూడా చూపలేదు. ఆ పార్టీకి చెందిన మీడియా కూడా చెప్పలేదు. కవితను ఆరెస్టు చేయడానికి వచ్చిన రోజునే ఆమె కవిత కడిగిన ముత్యమని రాసిని ఏకైక దిన పత్రిక నేటిధాత్రి. ఆ రోజు అన్ని పేపర్లు ఆమెపై నిందలు వేస్తూ వార్తలు రాశాయి. కాని దేశంలోనే కవిత కడిగిన ముత్యంలా వస్తుందని రాసింది నేటిధాత్రి అంటే ఏమిటో నిరూపించుకున్నది. ఇప్ప్పుడు అదే నిజమైంది. సమాజంలో కవిత కేసును తప్ప్పు పడుతూ, ఎప్పటికైనా ఆ కేసు నిలవదని చెప్పిన మొదటి పత్రిక నేటిధాత్రి. అంతే కాదు ఆనాడు డిల్లీ ప్రభుత్వం తీసుకున్నది కేవలం పాలసీ మాత్రమే అని, దానితో కవితకు ఎలా సంబంధం వుంటుందని కూడా ప్రశ్నించింది నేటిధాత్రి. ప్రభుత్వ స్కీమ్ మాత్రమే అని స్కామ్‌కు ఆస్కారమే లేదని వివరాలతో పాటు చెప్పిన ఏకైక పత్రిక నేటిధాత్రి. అప్పటి వరకు పెద్ద పెద్ద మీడియా సంస్దలు కూడా కవిత అరెస్టు అని రాశాయి. ప్రచారంలో వున్న అబద్దాలను రాసి కవితను బద్నాం చేశాయి. అసలు ఆ కేసు పూర్వాపరాలు కూడా తెలుసుకోకుండా కవిత మీద పుంఖాను పుంఖాలుగా వార్తలు రాసి వడ్డించాయి. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు అసలు ఆ కేసును ఎక్కడికో తీసుకెళ్లేందుకు తెలుగు మీడియా తహతహలాడింది. కాని అసలు కేసే కాదు, ఆ కేసు కోర్టులో నిలబడదు. అని అనేక న్యాయపరమైన అంశాలను ప్రస్తావిస్తూ కథనాలు రాసిన ఏకైక పత్రిక నేటిధాత్రి. అయితే ఆ సమయంలో తెలుగు మీడియా అంత ఒక వైపు, నేటిదాత్రి ఒక్కటే నిజం వైపు నిలబడి అక్షరాలు రాసింది. ఇప్ప్పుడు అదే నూరుపైసల నిజమైంది. కవితకు కోర్టు ఊరట కల్పించింది. అసలు కేసే లేదని నేటిదాత్రి ఊహించినట్లే తీర్పు కూడా వచ్చింది. అయితే ఆ సమయంలో నమస్తే తెలంగాణ పత్రిక కూడా నిజాలు రాసే ధైర్యం చేయలేదు. కవిత మీద అక్రమ కేసు అని రాసేందుకు కూడా ధైర్యం చేయలేదు. కవిత మీద కక్షతోపెట్టిన కేసులపై నేటిధాత్రి వరసగా కేసులో నిజా నిజా నిజాల పేరుతో అనేక కథనాలు రాసింది. ఆ కధనాలపై స్పందనలు తెలియజేసేందుకు కూడా బిఆరఎస్ పార్టీ నాయకులు ముందుకు రాలేదు. నేటిధాత్రి కేసు విషయాలు వివరంగా తెలిపి స్పందించమంటే కూడా మహిళా నాయకులు కూడా ముఖం చాటేశారు. ఆ సమయంలో ఆమెకు అండగా నిలవాల్సిన బిఆరఎస్ మహిళా నాయకులు కూడా ముందుకు రాలేదు. అదే సమయంలో నేటిధాత్రిని నిందించేందుకు కూడా కొంత మంది పనిగట్టుకు ప్రయత్నం చేశారు. నేటిధాత్రిని కూడా నిందల పాటు చేయాలని చాల మంది చూశారు. కవితకు మద్దతుగా వార్తలు రాస్తే నేటిధాత్రిని అమ్ముడుపోయిందని కూడా ఆ సమయంలో ఆరోపణలు గుప్పించారు. ఆ రోజుల్లో నేటిధాత్రిని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు. నేటిదాత్రి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారు. నమస్తే తెలంగాణ కన్నా ఎక్కువగా కవితను జోకుతున్నారని ఎద్దేవా చేశారు. కవిత మీద కేసుపై వ్యవస్ధలోపాలను ఎత్తిచూపి అక్షర పోరాటం చేసింది కూడా ఒక్క నేటిధాత్రి మాత్రమే. ఆ నిజాలను ఆనాడు ధైర్యంగా రాసింది. నేడు గర్వంగా నేటిదాత్రి ఆ నిజాలను మళ్లీ చెప్పగలుగుతోంది. నేటిధాత్రి నిబద్దత ఎంత గొప్పదో సమాజానికి కూడా అర్దమైంది. ఏది ఏమైనా జీవితంలో చీకటి వెలుగులు వున్నట్లే రాజకీయాలలో కూడా వుంటాయి. కాకపోతే కొంత మంది నాయకులపై కాలం పట్టే పగ కూడా తోడౌతుంది. అది తేలిపోయింది. మళ్లీ కవిత రాజకీయం జీవితం నిండు పౌర్ణమి వెలుగులు నిరంతరం వుండే రోజులు వచ్చాయి. అందుకు కవితకు నేటిధాత్రి అభినందనలు. కొత్త రాజకీయ పార్టీ ద్వారా కవిత రూపంలో గొప్ప నాయకత్వం తెలంగాణ ప్రజలకు అందాలని కోరుకుందాం.