సంక్రాంతి పండుగ పురస్కరించుకొని.మండేపల్లిలో క్రికెట్ పోటీలు….
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి మండలం మండపల్లి గ్రామంలో క్రికెట్ పోటీలు నిర్వహించడం జరిగింది. మండపల్లి గ్రామంలో స్థానిక సర్పంచ్ గాధగోని సాగర్ ముఖ్య అతిథిగా హాజరై సంక్రాంతి పండుగ పురస్కరించుకుని క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో పలువురు యువత నాయకులు మాట్లాడుతూ. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నా ఎందరో వచ్చి పోతున్న కూడా గ్రామంలో యువతకు క్రీడా ప్రాగణం లేకపోవడంతో యువత గ్రామంలో క్రీడలు ఆడుకోవడానికి స్థలం లేకపోవడంతో ఈ పాలకవర్గమైన గ్రామ పరిసరాల్లో యువతకు అనుకూలంగా క్రీడలకు స్థలం కేటాయించవలసిందిగా దాని ద్వారా ప్రత్యేక నిధులు కేటాయించి ఒక మినీ స్టేడియం నిర్మించాలని గ్రామంలోని ప్రతి ఒక్కరు యువత ప్రజలు నూతనంగా ఎన్నుకోబడిన పాలకవర్గాన్ని కోరడం జరిగిందని దీనిపై స్పందించిన సర్పంచ్ సాగర్ సాధ్యమైనంత త్వరలో క్రీడా ప్రాగానం నిర్మాణం చేపట్టే విధంగా ప్రత్యేక నిధులు తీసుకువచ్చి యువతకు ఆటలు ఆడుకునే విధంగా ప్రాగణం ఏర్పాటు చేస్తానని ఈ సందర్భంగా యువతకు గ్రామ ప్రజలకు యువకులకు నాయకులకు ప్రజలకు హామీ ఇవ్వడం జరిగిందని తదనంతరం క్రికెట్ పోటీలు ప్రారంభించడం జరిగిందని ఇట్టి పోటీలలో గెలుపొందిన జట్లకు తగిన పారితోషకం బహుమతులు ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో గ్రామ యువత క్రీడాకారులు క్రికెట్ కు సంబంధించిన పలు గ్రామాల జట్లు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
