సంక్రాంతి పండుగ పురస్కరించుకొని కాట్రేగుల పలు కార్యక్రమాల సంబరాలు…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి మండలం మండపల్లి గ్రామంలో సంక్రాంతి పండుగ పురస్కరించుకొని గ్రామంలో రాముల వారి గుట్ట వద్ద సంక్రాంతి సంబరాలు నిర్వహించారు ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక మండేపల్లి సర్పంచ్ గాధగోని సాగర్ హాజరై మాట్లాడుతూ ప్రతి ఏడాది వచ్చే సంక్రాంతి పండగ సందర్భంగా కాట్రేగుల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా గ్రామంలోని రాములవారి గుట్ట వద్ద రైతులు పశువులను దైవంగా భావించి పూజించి అంతరించిపోతున్న సాంస్కృతిక సంప్రదాయాలను పునరుద్ధరించే సందర్భంలో పశువులకు .జాజు.నూనె రాసి కాట్రేగుల కార్యక్రమాన్ని నిర్వహిస్తూ శీతాకాలంలో పశువులకు వచ్చే గాలి కుట్టు వంటి వ్యాధుల నుండి రక్షణ లభిస్తుందని మంటల వేడి మరియు పొగ పశువుల ఆరోగ్యానికి మేలు చేస్తుందని రైతులు నమ్ముతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ గ్రామంలో రాముల వారి గుట్ట వద్ద పెద్ద ఎత్తున సంక్రాంతి పురస్కరించుకొని సంబరాలు జరుపుకున్నారని అలాగే గ్రామంలో మకర సంక్రాంతి పురస్కరించుకొని. M.P.L. క్రికెట్ టోర్నమెంట్లు జరుగుతున్న సందర్భంగా క్రికెట్ టీం లకు లక్కీ ఈవెంట్స్.. టాటా. AIG. హెల్త్ ఇన్సూరెన్స్ వారు క్రికెట్ టీం సభ్యులకు .టీషర్ట్లు అందించడం జరిగింది. దీనికి సూపర్ అసిస్టెంట్ గుర్రం నవీన్ టీ షర్ట్లు అందించడం జరిగింది ఇట్టి.సంక్రాత్రి సంబరాలకు గ్రామంలోని యువత ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో. మండపల్లి గ్రామ సర్పంచ్ గాధగోని సాగర్. ఉప సర్పంచ్ యాస సందీప్. వార్డు మెంబర్లు. అమర గోoడప్రభుదాస్. మూర్తి .మైపాల్రెడ్డి. రాయి పెళ్లి కృష్ణారెడ్డి. ఆసాని మహిపాల్ రెడ్డి..కరోబార్ దుర్మట్లలచ్చిరెడ్డి. హరికృష్ణ. కోమ్మటదేవయ్య. దాసరి దేవయ్య. కుల మల్లేశం. రైతులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు
