మున్సిపాలిటీ లో బీజేపీ విజయం దిశగా పని చేద్దాం…

మున్సిపాలిటీ లో బీజేపీ విజయం దిశగా పని చేద్దాం

బీజేపీ యువ నేత వెలిశాల సవీన్

కేసముద్రం/ నేటి దాత్రి

 

రానున్న మున్సిపాలిటీ ఎలక్షన్లో కేసముద్రం మండలంలో బిజెపి జెండా ఎగురవేయాలని దేశం కోసం ధర్మం కోసం ఎల్లప్పుడు శ్రమించే బిజెపి పార్టీ నీ మున్సిపాలిటీ ప్రజలు ఆదరించాలని రానున్న ఎలక్షన్లలో పార్టీ గెలుపు లక్ష్యంగా పనిచేయాలని బిజెపి యువనేత వెలిశాల సవీణ్ ఓ పత్రిక ప్రకటన ద్వారా వెల్లడించారు.పార్టీ అవకాశం ఇస్తే పార్టీ కోసం ధర్మం కోసం అభివృద్ధి కోసం ఏ స్థానంలో టికెట్ కేటాయించిన నిలబడి గెలవడానికి సిద్ధంగా ఉంటానని తెలిపారు.

సంక్రాంతి సందర్భంగా క్రికెట్ పోటీలు…

సంక్రాంతి సందర్భంగా క్రికెట్ పోటీలు

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలం అప్పయ్యపల్లె గ్రామంలో సంక్రాంతి సందర్భంగా సర్పంచ్ ఎలకపల్లి రమేష్ ఉపసర్పంచ్ కనపర్తి వినయ్ కుమా
ర్ ఆధ్వర్యంలోక్రికెట్ టోర్నమెంట్ పెట్టగా ఈ టోర్నమెంట్లో విజేతలుగా మొదటి బహుమతి లేవన్ బుల్లెట్స్ విజయం సాధించారు రెండవ బహుమతి అంబేద్కర్ టీం గెలుపొందారు గెలుపొందిన క్రీడాకారులకు నగదు బహుమతి సర్పంచ్ చేతుల మీదుగా ఇచ్చారు ఈ సమావేశానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా హ్యాండ్ బాల్ ప్రధాన కార్యదర్శి కన్నెబోయిన కుమార్ యాదవ్
గ్రామ పెద్దలు దోమల రాజయ్య ఎల్లబోయిన భద్రయ్య పిడిశెట్టి దేవేందర్ టీచర్ ఎల్లబోయిన భాస్కర్ బుర్రి సురేష్ కందికొండ అనిల్ ఎలకపల్లి రాజకుమార్ మద్దెల రాజు ఈ కార్యక్రమానికి హాజరైనారు

బస్వాపూర్ గ్రామంలో వాలీబాల్ పోటీలు ప్రారంభం

వాలీబాల్ పోటీలు ప్రారంభించిన గ్రామ సర్పంచ్ శేఖర్ రెడ్డి…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

 

తంగళ్ళపల్లి మండలం బస్వాపూర్ గ్రామంలో. వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. ఇట్టి వాలీబాల్ పోటీల కార్యక్రమాన్ని సంక్రాంతి పండుగ పురస్కరించుకొని. తన తాత అయిన పూర్మాని ఎల్లారెడ్డి జ్ఞాపకార్థం వాలీబాల్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది అని. ఇట్టి పోటీలను స్థానిక గ్రామ సర్పంచ్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని ఈ పోటీలలో 8 జట్లు పాల్గొన్నట్లు పోటీలలో గెలుపొందిన జట్లకు ప్రథమ ద్వితీయ బహుమతులు అందజేసినట్లు పేర్కొంటూ గ్రామ క్రీడల శరీరక దృఢత్వానికి మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదం చేస్తాయని. క్రీడలు ఆడటం వల్ల యువకులు మంచి ఫిట్నెస్ సాధిస్తారని స్నేహపూరిత వాతావరణంలో క్రీడలు ఆడుకోవాలని గెలుపోటములు సహజమని. గ్రామస్థాయి క్రీడాకారులు ప్రోత్సహించడానికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని. ఇట్టి కార్యక్రమానికి హాజరై యువతకు క్రీడాకారులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని ఈ సందర్భంగా స్థానిక బస్వాపూర్ సర్పంచి. సర్పంచులఫోరం మండల అధ్యక్షులు శేఖర్ రెడ్డి తెలిపారు. ఇట్టి కార్యక్రమానికి గ్రామ యువకులు ప్రజలు నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version