అందుకే పేదల ఇళ్లు కూల్చడం లేదు..

అందుకే పేదల ఇళ్లు కూల్చడం లేదు.. రంగనాథ్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలతో సామాజిక కోణంలో చూసి పేదల ఇళ్లు కూల్చడం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. కబ్జాలు చేసిన వారే హైడ్రాపై విమర్శలు చేస్తున్నారని తెలిపారు. సెప్టెంబర్ 21వ తేదీన బతుకమ్మ కుంటను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని రంగనాథ్ పేర్కొన్నారు.

భావితరాలకు భవిష్యత్‌ని ఇవ్వడం కోసం హైడ్రా (HYDRA) పని చేస్తోందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Ranganath) ఉద్ఘాటించారు. చెరువులను కాపాడాలనే ఉద్దేశ్యంతో మొదట్లో తాము చాలా దూకుడుగా వెళ్లామని చెప్పుకొచ్చారు. దూకుడుతో వెళ్లడంతో చెరువుల ఆక్రమణలు తగ్గాయని గుర్తుచేశారు. హైడ్రా ఏర్పాటు చేసి శుక్రవారం(జులై18)తో ఏడాది పూర్తి అయింది. ఈ సందర్భంగా అంబర్‌పేట్ బతుకమ్మ కుంట వద్ద హైడ్రా ప్రథమ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్, హైదరాబాద్ కలెక్టర్ హరి చందన, మాజీ ఎంపీ వి. హనుమంతురావు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంగనాథ్ మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలతో సామాజిక కోణంలో చూసి పేదల ఇళ్లు కూల్చడం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. కబ్జాలు చేసిన వారే హైడ్రాపై విమర్శలు చేస్తున్నారని తెలిపారు. సెప్టెంబర్ 21వ తేదీన బతుకమ్మ కుంటను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని అన్నారు. హైడ్రా అంటే డిమాలీషన్, డెవలప్‌మెంట్ అని అభివర్ణించారు. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన బతుకమ్మకుంట శాంపిల్ మాత్రమేనని.. త్వరగా ఎన్నో బతుకమ్మ కుంటలు వెలుగులోకి వస్తాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు.

చెక్ డ్యామ్ ను కూల్చిన వారిని కఠినంగా శిక్షించాలి.

చెక్ డ్యామ్ ను కూల్చిన వారిని కఠినంగా శిక్షించాలి.

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పిట్ట సురేష్

చిట్యాల, నేటిధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం,నవాబు పేట మరియు మొగుళ్ళపల్లి మండలం,బద్ధంపల్లి గ్రామాల నడుమ చలివాగు పై బిఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి దాదాపు 10 కోట్ల రూపాయలతో నిర్మించిన చెక్ డ్యామును టిఆర్ఎస్ పార్టీ నాయకులు గురువారం సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల సంక్షేమం కొరకు రైతులు రెండు పంటలు సునాయాసంగ పండించుకునేందుకు నిర్మించిన చెక్ డ్యామ్ ను కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు దగ్గర ఉండి మరీ చెక్ డ్యామ్ బాంబులతో కూలగొట్టడం ఎంత దుర్మార్గమో ప్రజలు, రైతులు గమనించాలి, ఈ దుర్మార్గమైన చర్యను బిఆర్ఎస్ పార్టీ తరుపున ఖండిస్తున్నాం.వెంటనే ఇరిగేషన్ అధికారులు మరియు పోలీస్ అధికారులు ఈ దుర్మార్గమైన చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూన్నాం.అదే విదంగా ఈ ఘటన పై స్థానిక ఎమ్మెల్యే బాధ్యత వహిస్తూ రైతులకు నష్టం కలిగించేలా ప్రభుత్వ ఆస్తులను ద్వసం చేసిన వారి కార్యకర్తలపై పార్టీపరంగా, చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యేను డిమాండ్ చేస్తూ.ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాడ్ చేస్తున్నాం.ఈ కార్యక్రమంలో చిట్యాల మండల బిఆర్ఎస్ ప్రెసిడెంట్ పిట్టా సురేష్ బాబు,మండల ప్రధాన కార్యదర్శి ఏరుకొండ రాజేందర్, మండల యువజన అధ్యక్షుడు తౌటం నవీన్, సీనియర్ నాయకులు పండ్రాల వీరస్వామి, ఆరేపల్లి సమ్మయ్య, సోషల్ మీడియా ఇంచార్జి కూస ప్రశాంత్ రెడ్డి, ఆలేటి సురేందర్ రెడ్డి, నరిగె అశోక్, మర్రి నరేష్,నవాబుపేట్ గ్రామ అధ్యక్షుడు సాధా రాజు,వలబోజు నరేష్,వేముల అశోక్,సంపంగి శ్రీను మరియు నవాబుపేట గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version