ఇందిరమ్మ ఇండ్లను శంకుస్థాపన చేసిన న్యాల్కల్ ఎంపిఓ D. సౌజన్య గారు.

ఇందిరమ్మ ఇండ్లను శంకుస్థాపన చేసిన న్యాల్కల్ ఎంపిఓ D. సౌజన్య గారు

జహీరాబాద్ నేటి ధాత్రి:

న్యాల్కల్ మండలం అత్నూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మొగ్గు వేసి ప్రారంభం చేసిన ఎంపిఓ సౌజన్య రావు గారు, హౌసింగ్ DE అంజయ్య గారు,న్యాల్కల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు B. శ్రీనివాస్ రెడ్డి , సంగారెడ్డి డీసీసీ ప్రధాన కార్యదర్శి K. భాస్కర్ రెడ్డి, జహీరాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి, న్యాల్కల్ పాక్స్ చైర్మన్ సిద్ది లింగా స్వామి, మండల మాజీ ఉప అధ్యక్షుడు మొహమ్మద్ గౌసోద్దీన్, జిల్లా మైనారిటీ నాయకులు మొహమ్మద్ రఫియోద్దీన్, మాజీ ఎంపీటీసీ శాంత్ కుమార్ పటేల్, AE శివానంద, పంచాయతీ కార్యదర్శి N. సరేన్ రాజ్, అత్నూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఫీక్ పటేల్, మాజీ ఉప సర్పంచ్ నిలయా గౌడ్, నయీమొద్దీన్, ముస్తఫా, లాలూ పటేల్, ఖాయమొద్దీన్, పాషా భాయ్, యాదుల్ భాయ్, మిస్లోడ్డిన్, మౌల పటేల్, అఫ్జల్ భాయ్, మచ్కురి శంకర్, మచ్కురి మాణిక్, సురేష్ , బసవరాజు, సమీర్, నాసర్ , అక్బర్, సయ్యోజి గౌడ్, అజర్, జలీల్ మియా, మహిళలు కమలమ్మ , శేషమ్మ, జ్యోతి , గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

తంగళ్ళపల్లి మండలో ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ.

తంగళ్ళపల్లి మండలో ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి:

తంగళ్ళపల్లిమండలం బస్వాపూర్ గ్రామంలో. ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు. సత్తు శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో భూమి పూజ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ. రాష్ట్రంలో తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు.కార్యక్రమాలు తీసుకొచ్చి. రాష్ట్రంలో ప్రజలకు సన్న బియ్యం కార్యక్రమాన్ని అలాగే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తూ. ప్రభుత్వం ఇచ్చినటువంటి . ఆరు గ్యారంటీలే కాకుండా. ఎన్నో సంక్షేమ.పథకాలు తీసుకొచ్చి రాష్ట్రంలోని ప్రజలు అభివృద్ధిలో ఉంచాలని. ప్రజలకు. అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ. రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందు ఉంచుతున్నారని. అలాంటిది దేశంలో ఎక్కడ లేని సంక్షేమ పథకాలు తీసుకొచ్చి రాష్ట్ర అభివృద్ధిలో ముందు ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు దువ్వాసి దేవరాజు. సెక్రెటరీ వేణు. బలసాని శ్రీనివాస్ గౌడ్. అల్లూరి తిరుపతిరెడ్డి. బద్రి. లింబాద్రులు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామా ప్రజలు తదితరులు పాల్గొన్నారు

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టడంలో రేటు కట్టడి చేయాలి.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టడంలో రేటు కట్టడి చేయాలి

హౌజింగ్ పిడి రవీందర్

పరకాల నేటిధాత్రి:

 

మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది ఆంజనేయులు అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హోసింగ్ పీడీ. రవీందర్ హాజరయ్యారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందని ఇట్టి ఇండ్లు నిర్మాణంలో ఎక్కువ ఖర్చు కాకుండా కట్టడి చేయాలని
పంచాయతీ కార్యదర్శులకు సూచించారు.

Labor

ఇంటి నిర్మాణం విషయంలో ప్రభుత్వం నియమ నిబంధనల మేరకే నిర్మించాలని ఇందిరమ్మ కమిటీ సభ్యులు,పంచాయతీ కార్యదర్శులు,హౌసింగ్ డీఈ,యంపీడీఓ జిల్లా కలెక్టర్ వరకు పర్యవేక్షణ చేస్తారని డైరక్టర్ హౌజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చెక్ చేసి ఏలాంటి అవకతవకలు జరిగినా సంబందిత అధికారుల పై చర్యలు తీసుకుంటారని తెలిపారు.ఈ కార్యక్రమంలో పరకాల లేబర్ అధికారి జి.వినోద్ కుమార్,హౌజింగ్ ఏఈ ఆకాంక్ష,పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

ఇండ్లు కంప్లీట్ చేసుకోండి బిల్లులు చెల్లిస్తాం..

ఇండ్లు కంప్లీట్ చేసుకోండి..బిల్లులు చెల్లిస్తాం..

త్వరితగతిన ఇండ్ల నిర్మాణాలు పూర్తిచేసుకోవాలి.

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద..

దుగ్గొండి మండలంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పనుల పరిశీలన..

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు.సోమవారం దుగ్గొండి మండలంలోని రేకంపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పురోగతిని కలెక్టర్ జిల్లా పరిషత్ సీఈవో రామ్ రెడ్డి అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, స్థానిక అధికారులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇండ్ల నిర్మాణాలు కంప్లీట్ చేసుకోండి. బిల్లులు కూడా వెంటనే చెల్లించబడతాయని లబ్ధిదారులకు కలెక్టర్ హామీ ఇచ్చారు.అందుకు సంబంధించిన ఇనాగ్రేషన్ ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేస్తానని లబ్ధిదారులతో కలెక్టర్ వివరించారు.

Collector Dr. Satya Sarada..

 

ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఇండ్ల నిర్మాణాలు చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో రావిచంద్రా రెడ్డి,మండల పరిషత్ అభివృద్ధి అధికారి లెక్కల అరుంధతి,హౌసింగ్ పీడీ గణపతి, డిఇ విష్ణువర్ధన్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

దళితులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని.

దళితులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని
ఆగిన దళిత బంధు ఇవ్వాలని
…,. జిల్లా కలెక్టర్ ను కోరిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి….

జమ్మికుంట :నేటిధాత్రి

 

కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో జరుగుతున్న అక్రమాలు గురించి, హుజురాబాద్ నియోజకవర్గంలో నిలిపి వేయబడిన రెండవ విడత దళిత బంధు నిధులను వెంటనే విడుదల చేయాలని, స్పోర్ట్స్ గ్రౌడ్ పనులు వెంటనే ప్రారంభించాలి అని, దళితుల అందరికి ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వాలని కరీంనగర్ జిల్లాలో నిలిపివేయబడిన అభివృద్ది పనులను వెంటనే పూర్తి చేయాలని మరియు కరీంనగర్ జిల్లాను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేసిన

MLA Padi Kaushik Reddy

ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్ గారు, పాడి కౌశిక్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్ గారు, సుంకే రవిశంకర్ గారు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ రావు గారు, జిల్లా అధ్యక్షులు GV రామాక్రిష్ణా రావు గారు. మరియు మాజీ మున్సిపల్ చెర్మన్ లు కౌన్సెలర్స్ మాజీ ఎంపీపీ లు మాజీ జడ్పీటీసీలు పాల్గొన్నారు

పెద్దకోడేపాకలో ఇష్టాను సారంగా ఇందిరమ్మ ఇండ్.!

పెద్దకోడేపాకలో ఇష్టాను సారంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక

ఏకపక్ష నిర్ణయాలతో ఐదుగురు కమిటీ సభ్యుల హవా

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలం పెద్దకోడే పాక గ్రామంలో ఇష్టానుసా రంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల పేర్ల జాబితా విషయంలో ఏకపక్ష నిర్ణయాలతో ఐదుగురు కమిటీ వెనుక రహస్యమేముంది. బహుజన స్టూడెంట్స్ యూనియన్ వరంగల్ జిల్లా అధ్యక్షులు మంద సురేష్ మాట్లాడుతూ ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు చెందిన వారికి ఇల్లు ఇప్పించా లని ఎమ్మెల్యే ప్రధానంగా కార్యకర్తలకు చెబితే కార్యకర్తలు స్వార్థ స్వభావాల తో ఇల్లు లేని గ్రామ ప్రజలకు గుర్తించకుండా ఐదుగురు కమిటీ సభ్యులకు సంబంధిం చిన కుటుంబ సభ్యులకు మరియు వాళ్ళ పేర్లు పెట్టుకుని ఏకపక్ష తీర్మానం చేయడం ఎలాంటి ఎంక్వయిరీ చేయకుండా ఒకేచోట కూర్చుం డబెట్టి తీర్మానం చేసి పై అధికా రులకు పంపించడం జరిగింది. కావున తక్షణమే ఐదుగురు కమిటీ సభ్యులను పార్టీ నుండి సస్పెండ్ చేసి ఇల్లు లేని నిరు పేదలను గుర్తించి ఇల్లు వచ్చే విధంగా చేయాలని ప్రధా నంగా ఎమ్మెల్యే,కలెక్టర్ ను కోరుతున్నాం.లేనిపక్షంలో పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీసు ముందు ధర్నాలు చేపడతామని హెచ్చరించారు.

అర్హులైన లబ్ధి దారులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలి.

అర్హులైన లబ్ధి దారులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలి.

బిజెపి మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి రాజేశ్వర్.

బెల్లంపల్లి, నేటిధాత్రి:

 

 

అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని బెల్లంపల్లి బిజెపి మాజీ ఎమ్మెల్యే ఆమురాజుల శ్రీదేవి రాజేశ్వర్ అన్నారు.బెల్లంపల్లి పట్టణ కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడుతూ. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో ఇందిరమ్మ కమిటీ పేరుతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ కేవలం ఇందిరమ్మ కమిటీ, కాంగ్రెస్ నాయకులకు సిఫారసు చేసిన జాబితానే సర్వే చేస్తూ అధికార దుర్వినియోగానికి పాలు పడుతున్నారని ఆమె మండిపడ్డారు.కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలలో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని చేసిన వాగ్దానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిలుపుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.ఇందిరమ్మ ఇండ్ల కోసం సర్వే చేసినప్పుడే అధికారులు అర్హుల జాబితాను తప్పుల తడకగా అనర్హులతో తయారు చేశారన్నారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలను గుర్తించి వారికి మాత్రమే ఇండ్లను మంజూరు చేయాలని, ఇలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని ఆమె డిమాండ్ చేశారు.లేనియెడల బిజెపి ఆధ్వర్యంలో లబ్ధిదారులయిన నిరుపేదలతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రక్రియ వేగవంతం చేయండి.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రక్రియ వేగవంతం చేయండి

రాఘవ పట్నం లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలిన

రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క

ములుగు జిల్లా, నేటిధాత్రి :\

 

 

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రక్రియ వేగవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా స్ర్తీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క
అన్నారు.
గురువారం గోవిందరావు పేట మండలం రాఘవ పట్నం గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., డి ఎఫ్ ఓ రాహూల్ కిషన్ జాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్ లతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇండ్లు నిర్మించుకుంటున్న పొన్నం రవీందర్, ధనసరి లింగయ్య, కృష్ణ వేణి కోరం రామ్ మోహన్ లతో మాట్లాడారు. ఏమైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని అన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మంజూరైన ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలనీ అన్నారు. రెండవ దఫా లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాలని, అత్యంత పేదలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఎలాంటి ఇబ్బందులూ లేక

ఇందిరమ్మ ఇండ్ల మంజూరిలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి.

అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరిలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి

పేదల కాలనీలో కనీస సదుపాయాలు కల్పనకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి

ఎంసిపిఐ(యు) ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దొంతికి వినతి

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో అర్హులైన నిరుపేదలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి మంజూరు చేయాలని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ డిమాండ్ చేశారు. నర్సంపేట పట్టణంలో పేదలను నివసించే కాలనీలకు ప్రత్యేక నిధులు కేటాయించి కనీస వసతులు ఏర్పాటు చేయాలని కోరారు.బుదవారం ఎంసిపిఐ (యు) ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం స్థానిక నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కలిసి మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా పెద్దారపు రమేష్ మాట్లాడుతూ నర్సంపేట పట్టణం మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చెంది జనాభాపరంగా విపరీతంగా పెరుగుతున్నదని అదే స్థాయిలో కనీస వసతులు లేవని అందులో ముఖ్యంగా పేదల నివసించే కారల్ మార్క్స్ కాలనీ జ్యోతి బస్ నగర్ తదితర ఏరియాల్లో అంతర్గత రోడ్లు డ్రైనేజీ కాలువలు మంచినీటి నల్లాలు లేక అనేక అవస్థలు పడుతున్నారని అవేదన వ్యక్తం చేశారు.గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన పేదల కాలనీలో ఈ ప్రభుత్వంలోనైనా మెరుగుపడతాయని ఆశపడితే ఇంతవరకు కనీస దృష్టి పెట్టకపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు. అలాగే ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుల్లో సైతం పారదర్శకత లోపించిందని అర్హులైన నిరుపేదలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వకుండా తమ ఇష్టానుసారంగా ప్రక్రియ చేపట్టారని ఇది సరైన చర్య కాదని ఆరోపించారు. ప్రభుత్వానికి ఎంత మాత్రం చిత్తశుద్ధి ఉన్న అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లను కేటాయించి ప్రాధాన్యత క్రమంలో నిరుపేదలకు ఇండ్లు నిర్మించి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి నర్ర ప్రతాప్, యుపిఎన్ఎం రాష్ట్ర కార్యదర్శి కన్నం వెంకన్న, డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి, పట్టణ నాయకులు ముప్పారపు రాజేందర్, బైరబోయిన నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

జర్నలిస్టులకు వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి.

వరంగల్ తూర్పు జర్నలిస్టులకు వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి.

బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్.

వరంగల్, నేటిధాత్రి

 

భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ ఆధ్వర్యంలో జిల్లా అధికార ప్రతినిధి ఆడేపు వెంకటేష్ అధ్యక్షతన బుధవారం నాడు ఏకశిలా పార్క్ బాలసముద్రం వద్ద వరంగల్ తూర్పు జర్నలిస్టుల డబుల్ బెడ్ రూమ్ కొరకై మహాధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో ముందుండి పోరాడిన జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వకపోవడం సిగ్గుచేటు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని కోరుతూ దేశాయిపేట ఇండ్ల ముందు నిరాహార దీక్ష చేపట్టిన వారికి మద్దతుగా బీజేపీ మద్దతు ప్రకటించి ఈరోజు ఇళ్ల స్థలాలు, ఇల్లు మంజూరు చేయాలనీ ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న తమ కలలను నిజం చేస్తూ డబుల్ బెడ్ రూమ్ లను గత బిఅర్ఎస్ కేటాయించినా ఇండ్లు ఇవ్వలేకపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇన్ని రోజులు కావస్తున్న జర్నలిస్టులకు నీడ లేకపోయిందని విమర్శించారు.

BJP

ప్రభుత్వానికి, ప్రజలకు ప్రతినిధులగా వారి మధ్య జరిగే సమాచారాన్ని తెలియపర్చే వారు జర్నలిస్టులు. వారికి పేపర్ సంస్థ నుండి చాలీచాలని వేతనాలతో కుటుంబంతో జీవనాన్ని గడుపుతున్నారు. ఇంటి అద్దె కట్టలేక నాన అవస్థలు పడుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.

అప్పుడున్న రాజకీయ పరిణామాలు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోకపోవడం వలన లబ్ధిదారులను ఎంపిక చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు.

ప్రభుత్వాలు ఏవి ఉన్నా జర్నలిస్టులను వాడుకోవడం, ప్రభుత్వం పోయాక మళ్ళీ వచ్చిన ప్రభుత్వం అదే తరహా జర్నలిస్టులను వాడుకుంటూ, గత ప్రభుత్వాల మాదిరిగానే చేస్తూ ఉండడం అనవాయితిగా మారింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 18 నెలలు గడుస్తున్న గత ప్రభుత్వం చేసిన తప్పులనే ఈ ప్రభుత్వం చేస్తోంది.

ఇప్పడి లబ్ధి దారులకు ఇండ్లు ఇయ్యక పొవడం వలన శిథిలావస్థకు చేరుతుతున్నాయి. అసాంఘిక కర్యకలాపాలకు అడ్డాగా మారి జూదాలకి, వ్యభిచారులకు ఆశ్రయం ఐపోయి, తలుపులు, కిటికీలు, కరెంటు వైర్లు,నీటి పైపు లైను, ట్యాంకులు అన్ని ధ్వంసం చేశారు.

తూర్పులో శాసనసభ్యులుగా ఉన్న మంత్రి కొండా సురేఖ ఎన్నోసార్లు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ల దగ్గర పర్యటించినప్పటికీ జర్నలిస్టులపై అనుకూల భావన లేనట్లు కనిపిస్తుంది.

అదే నిజమైతే గత ప్రభుత్వంలో భూమి కేటాయింపు నిధుల కేటాయింపు శంకుస్థాపన ప్రారంభోత్సవం ఏ రకంగా చేశారు. దీనిని ప్రభుత్వాలు దేనికోసం నిర్మించాయి. సదరు పాలకులు గమనించాలి.

ప్రభుత్వాలు మారినప్పుడల్లా వారికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవడం సబబేనా అంటూ వరంగల్ తూర్పులో వర్కింగ్ జర్నలిస్టులు నిరాహార దీక్షలు చేపట్టారు.

సమస్య శాంతియుతంగా పరిష్కారం కాకపోతే నగర నడిబొడ్డున తీవ్రస్థాయిలో ఉద్యమిస్తామన్నారు తెలిపారు.

ఇప్పటికైనా ప్రజాపాలన ప్రభుత్వం స్పందించి తూర్పు వర్కింగ్ జర్నలిస్టులకు త్వరగా కేటాయించాలని కోరారు.

BJP

 

12 ఏప్రిల్, 2021 రోజున వరంగల్ తూర్పు జర్నలిస్టుల కోసం డబల్ బెడ్రూంలు భూమి పూజ చేసిన అప్పటి మంత్రివర్యులు కేటీఆర్..

రెండు ఏండ్లలో 12 కోట్లు ఖర్చు పెట్టి, మొత్తం మూడు ఎకరాల భూమిలో, రెండు ఎకరాల్లో మొత్తం 9 బ్లాకులు కలిపి 200 డబల్ బెడ్ రూమ్ ల నిర్మాణం పూర్తి చేసిన అప్పటి తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, తేదీ 17 జూన్, 2023 నాడు నిర్మాణం పూర్తి చేసిన డబల్ బెడ్ రూం లు, అట్టహాసంగా ప్రారంభం చేసి, ఆరుగురు జర్నలిస్టులకు గృహ ప్రవేశం, జర్నలిస్ట్ ల కాలనీ, జర్నలిస్టుల కొరకు అని పేర్కొన్న అప్పటి ప్రభుత్వం.

రెండు ఏండ్లుగా నిరుపయోగంగా ఉండటం వలన చాలా వరకు కిటికీలు, ఎలెక్ట్రిక్ పరికరాలు, డోర్ లు, పైపులు ధ్వంసం అయ్యాయి.

వాటర్ ఇంటెక్స్ ట్యాంక్ లు మాయమయ్యాయి, అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిన తీరు కనిపిస్తుందని అన్నారు.

వరంగల్ జర్నలిస్ట్ ఐకాస ప్రధాన డిమాండ్లు

 

అర్హులైన జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్ లను కేటాయించాలి.

 

జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ ( జేహెచ్ఎస్) పరిమితి రెండు లక్షల నుండి 10 లక్షలకు పెంచాలి.

 

అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో (జేహెచ్ఎస్) పనిచేయడంతో పాటు అన్ని వ్యాధులకు వర్తింపజేయాలి.

 

వరంగల్ ప్రెస్ క్లబ్ కు స్థలం కేటాయించాలని, అలాగే పలు డిమాండ్లతో వరంగల్ జిల్లా రెవెన్యూ అధికారికి భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మెమొరండం ఇవ్వడం జరిగింది.

BJP

 

 

 

ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా ఎలక్ట్రానిక్ & ప్రింట్ మీడియా మిత్రులు, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్, మాజీ శాసనసభ్యులు మార్తీనేని ధర్మారావు, మాజీ పార్లమెంట్ సభ్యులు అజ్మీర సీతారాం నాయక్, మాజీ శాసనసభ్యులు వన్నాల శ్రీరాములు, మాజీ శాసనసభ్యులు ఆరూరి రమేష్, మాజీ పూర్వ జిల్లా అధ్యక్షులు చాడ శ్రీనివాసరెడ్డి, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుసుమ సతీష్ , గురుమూర్తి శివకుమార్, రత్నం సతీష్ షా, వన్నాల వెంకటరమణ, జిల్లా ప్రధాన కార్యదర్శిలు బాకం హరిశంకర్, మల్లాడి తిరుపతిరెడ్డి, డాక్టర్ గోగుల రాణా ప్రతాపరెడ్డి, ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు బన్న ప్రభాకర్, కార్పొరేటర్ చాడ స్వాతి, కాసు శిల్పా, జిల్లా పదాధికారులు, మండల అధ్యక్షులు, వివిధ మోర్చా నాయకులు, బిజెపి జిల్లా నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

లక్ష్యం మేరకు ఇందిరమ్మ ఇండ్ల.!

లక్ష్యం మేరకు ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపిక పూర్తి చేయాలి

– కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

– ఇందిరమ్మ ఇండ్ల పథకంపై ప్రత్యేక అధికారులతో కలెక్టర్ సమీక్ష

సిరిసిల్ల(నేటి ధాత్రి):

జిల్లాలో లక్ష్యం మేరకు ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపిక పూర్తి చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంపై జిల్లాలోని ఆయా మండలాలు, మున్సిపాలిటీల ప్రత్యేక అధికారులతో కలెక్టర్ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఎన్ని సర్వే చేశారు? ఎన్ని దరఖాస్తులు ఆన్లైన్ చేశారో హౌసింగ్ పీడీ శంకర్ ను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయా మున్సిపాలిటీలు, మండలాల వారిగా లక్ష్యం మేరకు ఎంత పూర్తి చేశారో సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. అర్హులైన పేదల సొంత ఇంటి కల సాకారం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రవేశపెట్టిందని వివరించారు. ఇప్పటికే వచ్చిన దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో సర్వే చేశారని, అర్హులకే అందేలా చూడాలని స్పష్టం చేశారు. జిల్లాలోని ఆయా మున్సిపాలిటీలు, మండలాల్లో మొత్తం 7690 దరఖాస్తులు అధికారులు క్షేత్ర స్థాయిలో సర్వే చేశారని, వీటిలో ఇప్పటిదాకా 5776 వారి వివరాలు ఆన్లైన్ చేశారని వెల్లడించారు. మిగతా వివరాలు పరిశీలిస్తున్నారని పేర్కొన్నారు. అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు అందించాలని సూచించారు. వచ్చే నెల 2వ తేదీన ఆయా గ్రామాలు, మున్సిపాలిటీల వార్డుల్లో దరఖాస్తుదారు జాబితా ప్రదర్శిస్తారని, 5వ తేదీన తుది జాబితా ప్రదర్శిస్తారని కలెక్టర్ తెలిపారు. అధికారులు సమన్వయంతో పని చేసి లక్ష్యాన్ని పూర్తి చేయాలని సూచించారు.
సమావేశంలో సిరిసిల్ల ఆర్డీవో రాధాబాయి, డీఆర్డీఓ శేషాద్రి, ఆయా మండలాల ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం ఎదురు చూస్తున్న.!

జహీరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం ఎదురు చూస్తున్న దరఖాస్తుదారులు

జహీరాబాద్ నేతి ధాత్రి:

 

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం 2024 జనవరిలో నిర్వహించిన గ్రామ సభలలో దరఖాస్తు చేసుకున్నారు. పెదమద్యతరగతి నిరుపేద కుటుంబాలకు చెందిన జహీరాబాద్ నియోజకవర్గం ప్రజలు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం ఎదురు చూస్తున్నట్లు, సోమవారం ఉదయం పలువురు
ఝరాసంగం మండలం ప్రజలు తెలిపారు.

వరంగల్ తూర్పు వర్కింగ్ జర్నలిస్ట్ ల.!

వరంగల్ తూర్పు వర్కింగ్ జర్నలిస్ట్ ల డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సాధనకై జర్నలిస్టులు చేపట్టిన నిరహార దీక్షకి,

“నేటిధాత్రి”

దినపత్రిక ఎండీ కట్ట రాఘవేంద్రరావు,

డైరెక్టర్ కట్టా శివ సుబ్రమణ్యం లు హాజరై సంఘీభావం తెలిపారు..

ఇందిరమ్మ లబ్ధిదారుల ఇళ్ల కట్టడాలను పరిశీలించిన.!

ఇందిరమ్మ లబ్ధిదారుల ఇళ్ల కట్టడాలను పరిశీలించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

కరక గూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి..

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రేగళ్ల గ్రామం లో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారి తనప సుశీల ఇళ్ల నిర్మాణ పనులు పరిశీలించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అర్హులైన ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇళ్లను అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని చెప్పరు బేస్ మీట్ వరకు పూర్తి చేసిన వెంటనే లక్ష రూపాయలు లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తామని పేర్కొన్న వీలైనంత తొందరగా ఇందిరమ్మ ఇల్లు నిర్మాణాలను పూర్తి చేయాలని యజమానులు దగ్గరుండి మరి పరిశీలించి నాణ్యతగా కట్టుకోవాలని తెలియజేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు
ఈ యొక్క కార్యక్రమంలో కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇక్బాల్ హుస్సేన్ , మాజీ సర్పంచ్ పోలెబోయిన శ్రీ వాణి , తిరుపతయ్య గారు,యర్ర సురేష్ , రాందాస్ నాయక్ , కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, యువజన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

పైలెట్ ప్రాజెక్టుగా ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ.

పొన్నారం గ్రామంలో పైలెట్ ప్రాజెక్టుగా ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ

మందమర్రి నేటి ధాత్రి

 

మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని పొన్నారం గ్రామంలో, పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపికైన ఇళ్ల నిర్మాణం కోసం భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.

ఈ కార్యక్రమంలో చెన్నూరు ఎమ్మెల్యే శ్రీ వివేక్ వెంకటస్వామి గారు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ప్రజలకు వసతి హక్కు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, మొదటి దశగా పైలెట్ ప్రాజెక్టు కింద నిర్మాణం ప్రారంభమవుతుందని వారు తెలిపారు.

Sri Vivek Venkataswamy

 

నిరుపేద కుటుంబాలకు విశ్వసనీయంగా, నాణ్యమైన నివాస వసతులు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే, ఎంపీలు పేర్కొన్నారు.

ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన హౌసింగ్ పీడీ.

ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన హౌసింగ్ పీడీ

నిజాంపేట: నేటి ధాత్రి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పనులను మంగళవారం హౌసింగ్ పిడి మాణిక్యం పరిశీలించారు. ఈ మేరకు నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లను ఆయన పరిశీలించి మాట్లాడారు.. గ్రామంలో క్షేత్రస్థాయిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీవో రాజిరెడ్డి, గ్రామ కార్యదర్శి భాగ్యలక్ష్మి లు ఉన్నారు.

లబ్ధిదారులకు పక్క ఇండ్లు పంపిణీ చేయాలి.

లబ్ధిదారులకు పక్క ఇండ్లు పంపిణీ చేయాలి

ఎంపీడీవో కల్పనకు వినతి పత్రం అందజేసిన బిజెపి నాయకులు

పరకాల,దామెర నేటిధాత్రి

పరకాల నియోజకవర్గంలోని దామెర మండల అధ్యక్షులు వేల్పుల రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఎంపీడీవో కల్పన కి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా మండలంలోని అన్ని గ్రామాల అర్హులైన లబ్ధిదారులందరికీ పక్క ఇండ్లు పంపిణీ చేసి లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలని భారతీయ జనతా పార్టీ దామెర మండల శాఖ తరపున వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మరియు దామెర మాజీ సర్పంచ్ గురిజాల శ్రీరామ్ రెడ్డి,నియోజకవర్గ కో కన్వీనర్ పిఎసిఎస్ డైరెక్టర్ మాదారపు రతన్ కుమార్,ఓబీసీ మోర్చా మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి, బీజేవైఎం జిల్లా కోశాధికారి సూర చంద్రర్,వన్ నేషన్ వన్ ఎలక్షన్ కన్వీనర్ కొట్టే రమేష్, కో కన్వీనర్ గండు ముఖేష్, సీనియర్ నాయకులు గువ్వ సాంబయ్య,ఆలేటి పోషాలు, దామెర పృథ్వీరాజ్,శక్తి కేంద్ర ఇన్చార్జ్ లు ఎక్కలదేవి రమేష్, గోగుల సమ్మిరెడ్డి,గండు పరుశురాం,బూత్ అధ్యక్షులు బి.రమేష్,చెల్పూరి రాజు, గూడూరు శ్రీనివాస్,మనోజ్, తదితరులు పాల్గొన్నారు.

ఇళ్ల మధ్యలో మురికి నీరు.

ఇళ్ల మధ్యలో మురికి నీరు.

జహీరాబాద్. నేటి ధాత్రి:

సంగారెడ్డి: జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో మురుకి నీరు మొత్తం ఇళ్ల మధ్యలో చేరుతోంది. మురికి నీరు ఇళ్ల మధ్యలో చేరడంతో పందులు, కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. దుర్వాసన వెదజలడంతో కాలనీవాసులు రోగాల బారిన పడుతున్నారు. ఇంత జరుగుతున్న మున్సిపల్ అధికారులు స్పందించడం లేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మురికి నీటిని తొలగింపజేయాలని కోరుతున్నారు.

ఇందిరమ్మ ఇండ్లను తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్.

ఇందిరమ్మ ఇండ్లను తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్.

చిట్యాల, నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని ముచిని పర్తి గ్రామాన్ని బుధవారం రోజున అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో మాట్లాడుతూ వీలైనంత తొందరగా ఇండ్లను పూర్తి చేయాలని అలాగే ఈ గ్రామానికి 64 వచ్చాయని వారిలో 12 మాత్రమే ప్రోగ్రెస్ లో ఉన్నాయని మిగతా వాటిని వీలైనంత తొందరగా ప్రారంభించి పూర్తి చేయాలని లబ్ధిదారులను అధికారులను కోరినారు ఆమె వెంట ఎంపీడీవో జయశ్రీ ,ఎంపీ ఓ రామకృష్ణ తదితరులు ాల్గొన్నారు.

నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇందిరమ్మ.

నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇందిరమ్మ పథకం లో పూర్తిచేసి నిరుపేదలకు ఇవ్వాలి…

అల్లాడి పౌల్ రాజ్ డిమాండ్.**

భద్రాచలం నేటి ధాత్రి

ఏఎంసీ కాలనీ నందు మాల మహానాడు ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లాడి. పౌల్ రాజ్ పాల్గొని మాట్లాడుతూ…. పట్టణంలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇందిరమ్మ పథకం కింద పూర్తి చేసి అర్హులైన నిరుపేదలకు ఇవ్వాలని అన్నారు.
ప్రజా సమస్యల మీద మాల మహానాడు ఎప్పుడు పోరాటం చేస్తుందని, ప్రతి పేద కుటుంబానికి భూమి, విద్య, ఉద్యోగం, కలిగి ఉండాలని అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని ఆయన తెలియజేశారు. గత ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ ,బీసీ, మైనార్టీలకి న్యాయం జరుగుతుందని అనుకుంటే అన్యాయం జరిగిందని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని అనుకుంటే ఆశ నిరాశగా మిగిలిందని ఆవేదన వ్యక్తపరిచారు. భద్రాచల పట్టణంలో సొంత ఇల్లు లేక అనేకమంది నిరుపేదలు దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారని, భద్రాచల పట్టణంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఇందిరమ్మ ఇల్లులుగా కేటాయించి నిరుపేదలకు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. అద్దె ఇళ్లలో ఉంటూ రోజువారి కూలికి వెళ్తూ దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారని, కరెంటు చార్జీలు కట్టలేక ఇంటి అద్దెలు కట్టలేక సతమతం అవుతున్నారని అన్నారు. భారతదేశం స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్న ప్రజలు మరింత పేదలగానే మిగిలిపోతున్నారని, ప్రభుత్వాలు మారిన,పేదల బతుకులు మారడం లేదని ఆవేదన వ్యక్తపరిచారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ కలలు సహకారం చేయాలనుకుంటే ముందుగా అర్హులైన పేదలకు సొంతింటి కలను నెరవేర్చి చూపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో గుంట.కిషోర్, నాని, గుండు.జిమ్మీ, కిట్టు , మింటు, ఏసుబాబు, శాంతి రాజు, వంశీ, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version