మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం.
ఆమనగల్/ నేటి ధాత్రి:
ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు విటాయిపల్లికి చెందిన వెంకటయ్య ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ప్రముఖ సంఘ సేవకులు, 5వ వార్డు కౌన్సిలర్ పాపిశెట్టి రాము మంగళవారం వెంకటయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి మనోధైర్యం కల్పించారు. తనవంతు సహాయంగా 3 వేల రూపాయలు కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మంచుకొండ జగదీష్, గ్రామ అధ్యక్షుడు శంకర్ నాయక్, చంద్రు నాయక్, మాజీ సర్పంచ్ సాలయ్య, పాపయ్య, కిషోర్ నాయక్, వెంకటేశ్వర్ రెడ్డి, నరేందర్, శ్రీను తదితరులు ఉన్నారు.
