ఆర్థిక సహాయం అందజేసిన సర్పంచ్
నిజాంపేట, నేటి ధాత్రి
మండల కేంద్రంలో గత నాలుగు రోజుల క్రితం బండారి రాజవ్వ (80)అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. గ్రామ సర్పంచ్ చల్మేటి నరేందర్ 5000 రూపాయల ఆర్థిక సహాయాన్ని వారి కుటుంబ సభ్యులకు దశదినకర్మ నిమిత్తం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గేరిగంటి బాబు, పప్పుల సిద్ధరాంరెడ్డి, ఆముద రాజు, కొమ్మాట సుధాకర్, తాడెం మల్లేశం, తాళ్లపల్లి కిషోర్, బండారి కుమార్, తదితరులు పాల్గొన్నారు.
