యువజన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జన్మదిన వేడుకలు
కరీంనగర్, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గ శాసనసభ్యులు మేడిపల్లి సత్యం జన్మదిన సందర్భంగా రామడుగు మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అనుపురం పరుశురాం గౌడ్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దేశరాజుపల్లి గ్రామంలోని ప్రశాంతి భవన్ లో కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈకార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి శ్యాంసుందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జవాజి హరీష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పిండి సత్యం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాపురాజు, నేరేళ్ల మల్లేశం, చొప్పదండి అనిల్, మధు, సంతోష్ , అజయ్, మహేష్, సాయి, సాగర్, ఎండి. ముషూ, తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రివర్యులు, సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.ఎమ్మెల్యే మాణిక్ రావు కేక్ కట్ చేసిన అనంతరం గులాబీ శ్రేణులతో శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా శాసనసభ్యులు కొన్నింటి మాణిక్ రావు మాట్లాడుతూ ఉద్యమ నాయకుడు కేసీఆర్ వెన్నంటి నడిచిన నిజమైన గులాబీ సైనికుడు హరీష్ అని అన్నారు.పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారికి వెన్నుదన్నుగా నిలుస్తున్న గొప్ప నాయకుడు హరీష్ రావు గారని కొనియాడారు. భారత రాష్ట్ర సమితి పార్టీ పార్టీ వెన్నెముక, కష్టకాలంలో నిలుస్తూ.. ప్రజల తరపున పోరాడుతున్న యోధుడు హరీష్ రావుగారని అన్నారు. 14 ఏండ్ల సుదీర్ఘ పోరాటం, 10 ఏండ్ల ప్రభుత్వ పాలనలో నీటి పారుదల, ఆర్థిక మంత్రిగా వారు రాష్ట్రానికి ఎనలేని సేవలు చేశారు. చరిత్రలో నిలిచిపోయే కాళేశ్వర ప్రాజెక్టు సాకారంలో కేసీఆర్ గారితో పాటు హరీష్ గారు శ్రమ, కృషి మరువలేనిదని అన్నారు. హరీష్ రావు నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో , సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు, ముఖ్యమంత్రిగా తిరిగి కేసీఆర్ గారిని చేయడంలో హరీష్ రావు గారి నాయకత్వాన్ని తెలంగాణ కోరుకుంటోందని అన్నారు.కార్యక్రమంలో మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప ,మాజి మున్సిపల్ చైర్మన్ అల్లాడి నర్సింలు, జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి,సీనియర్ నాయకులు నామ రవికిరణ్,మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్,మాజి కౌన్సిలర్ అబ్దుల్లా, మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు హిరు రాథోడ్ ,యువ నాయకులు మిథున్ రాజ్ ,చిన్న రెడ్డి,వెంకట్, నర్సింహ రెడ్డి,ఇబ్రహీం,దేవదాస్,గణేష్,సురేష్ ,నరేష్ రెడ్డి,జాకీర్,అశోక్ రెడ్డి,ఇమ్రాన్ ,నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
ఘనం గా బీసీ ఉద్యమ నేత పర్ష హన్మాండ్లు జన్మదిన వేడుకలు
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్
సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)
తెలంగాణ సిరిసిల్ల జిల్లా బీసీ ఉద్యమ నేత పర్ష హన్మాండ్లు జన్మ దిన వేడుకలను బీసీ సంక్షేమ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యం లో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం లో మరియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యం లో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు,బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పర్శ హన్మాండ్లు ను శాలువా తో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు,ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీసీలు బానిసలు కాదు పాలకులు కావాలని ఉద్యమించుచున్న మహోన్నతమైన వ్యక్తి హన్మాండ్లు అన్నారు,ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. పర్శ హన్మాండ్లు జన్మదినం బీసీ లందరికి పండుగ దినం అని జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు,బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న పర్ష హన్మాండ్లు జన్మదిన వేడుకలు హైదరాబాదులో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. బీసీల హక్కుల సాధన కోసం జైలు జీవితాన్ని అనుభవించిన గొప్ప వ్యక్తి పర్ష హన్మాండ్లు అని అన్నారు. పర్ష హన్మాండ్లు మునుముందు ఎన్నో పదవులు అధిరోహించాలని జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పర్ష హన్మాండ్లు, మల్లేశం, తదితర బీసీ సంఘం నేతలు పాల్గొనడం జరిగినది.
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో భూపాలపల్లి పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ భగవంతుణ్ణి ఆశీర్వాదంతో నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటూ, ప్రజా క్షేత్రంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆ శ్రీ వేంకటేశ్వర స్వామి కృపాకటాక్షలు నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం మండలంలో షేక్ సోహెల్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల శివారులోని శ్రీ కితకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కార్యకర్తల మధ్య కేక్ కట్ చేశారు. ఝరాసంగం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఝరాసంగం జరిగిన వేడుకల్లో మండల అధ్యక్షులు వెంకటేశం మాజీ ఎంపీపీ బొగ్గుల సంగమేశ్వర్ ఫారూఖ్ పటేల్ పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా మాజీ మంత్రి హరీశ్‌రావు జన్మదిన వేడుకలు జహీరాబాద్ నేటి ధాత్రి:
మాజీ రాష్ట్ర ఆర్థిక మంత్రి, ట్రబుల్ షూటర్ హరీశ్ రావు పుట్టినరోజు సందర్భంగా ఝరాసంగం మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వెంకటేశం తమ మండల బృందంతో నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఆయన పది కాలాల పాటు ప్రజా సేవలో కొనసాగాలని, శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భగవంతుడు ఆయనకు శక్తిని ప్రసాదించాలని కోరుకున్నారు.
ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని, ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని మాజీ మంత్రి ఆకాంక్షించారు.
కేక్ కట్ చేసి ఒకరినొకరు కేక్ తినిపించుకొని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
Former Minister Harish Rao’s
అలాగే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి లో మండల మైనారిటీ యువనాయకులు షేక్ సోహైల్ మరియు పరమేశ్వర్ పాటిల్ శివశంకర్ పాటిల్ ఆధ్వర్యంలో పండ్లను అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బొగ్గుల సంగమేశ్వర్ పాటేల్ ఫారూఖ్ పటేల్ ప్రభు పటేల్.
గోపాల కృష్ణ పాటిల్.బస్వరాజ్ పాటిల్ శివశంకర్ పాటిల్ భాయ్ వెంకటరెడ్డి నాగేశ్సజ్జన్.
ఘనంగా సొసైటీ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి జన్మదిన వేడుకలు…
నేటి ధాత్రి – బయ్యారం :-
బయ్యారం సొసైటీ చైర్మెన్ మూల మధుకర్ రెడ్డి జన్మదిన వేడుకలను యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఘనంగా జరిపినారు.ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి తమ్మిశెట్టి వెంకటపతి మాట్లాడుతూ, ఎల్లప్పుడూ మండల అభివృద్ధి గురించి ఆలోచించించే మూల మధుకర్ రెడ్డి భవిష్యత్ లో మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు.బయ్యారం ఏజెన్సీ అభివృద్ధి కై పాటుపడుతున్న ప్రజా నాయకుడని కొనియాడారు.అనంతరం శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు నాగరాజు,నిరంజన్, రాకేష కార్తీక్,జాన్,ప్రసన్నకుమార్, సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
టేకుమట్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్.ఆధ్వర్యంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి,దుద్దిళ్ళ శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సతీష్ గౌడ్,కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సతీష్ గౌడ్ మాట్లాడుతూ,మృదుస్వభావి, తన తండ్రి ఆశయ సాధన కోసం పరితపించే నాయకుడు,కక్ష సాధింపు రాజకీయాలు చేయకుండా,ప్రజాసేవ లక్ష్యoగా కొన్ని దశాబ్దాలుగా ప్రజా సేవ చేస్తున్న దుదిల్ల కుటుంబం.మంత్రి శ్రీధర్ బాబు భవిష్యత్తులో తన సేవలను మరింత విస్తరింప చేస్తూ రాజకీయంగా ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షిస్తూ మనస్పూర్తిగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో.జిల్లా మండల నాయకులు యువజన కాంగ్రెస్ జిల్లా మండల నాయకులు.గ్రామ శాఖ అధ్యక్షులు.సోషల్ మీడియా కోఆర్డినేటర్.కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
వీణవంక మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జున్నుతుల మధుకర్ రెడ్డి 43వ జన్మదిన వేడుకలు వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎక్కటి రఘపాల్ రెడ్డి, ఎండీ సాహెబ్ హుస్సేన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్స్ పండ్లు పంపిణీ చేయడం జరిగింది అనంతరం మండల అధ్యక్షుడు రఘపాల్ రెడ్డి ఎండి సాహెబ్ హుస్సేన్ లు మాట్లాడుతూ, కార్యకర్త స్థాయి నుండి ధర్మ కర్త గా ఎదిగి ముందు ముందు మరెన్నో పదవులను పొందాలని వారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉంచాలని వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతున్నాము అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎక్కటి రఘపాల్ రెడ్డి, మాజీ అధ్యక్షులు ఎండీ సాహెబ్ హుస్సేన్,గంగాడి రాజిరెడ్డి, మాజీ సర్పంచ్ లు చిన్నాల అయిలయ్య, మార్కెట్ డైరెక్టర్ మాదాసు సునీల్,కర్ర తిరుపతి రెడ్డి, నాయకులు ఈదునూరి పైడి కుమార్,ఒరేం శ్రీనివాస్, ఉయ్యాల నాగరాజు,కర్ర గురు,మర్రి సమ్మయ్య తదితరులు పాలుగోన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహేష్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు.
పరకాల నేటిధాత్రి
https://youtu.be/dr-t8K7F4T0?si=Eu3RDNJ4v15WH_Br
పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం రోజున టిపిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ 59వ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి,విజయ డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి తో కలిసి హాజరై కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి,పరకాల,నడికూడా మండల అధ్యక్షులు కట్కూరి దేవేందర్ రెడ్డి,బుర్ర దేవేందర్ గౌడ్,కుంకుమేశ్వర స్వామి ఆలయకమిటీ చైర్మన్ కొలుగూరి రాజేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ పరకాల పట్టణ కమిటీ మరియు సమన్వయకమిటి సభ్యులు చిన్నల గొనాద్,మంద రాంచెందర్,బొచ్చు చెందర్,చందుపట్ల రాఘవరెడ్డి,పంచగిరి జయమ్మ, మార్క రఘుపతి గౌడ్,పసుల రమేష్,మడికొండ సంపత్ కుమార్,మాజీ జెడ్పిటిసి పాడి కల్పన దేవి ప్రతాపరెడ్డి దుబాసి వెంకట స్వామి,అనిల్,పోరండ్ల వేణు,ఒంటెరు శ్రవణ్, మంద నాగరాజు,దార్న వేణుగోపాల్,గడ్డం శివ,లక్కమ్ వసంత,బొమ్మకంటి చంద్రమోలి,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
శాయంపేట మండలంలోని భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు కొత్తపెల్లి సాయిగీత- శ్రీకాంత్ దంపతుల పుత్రుడు హనీష్ వర్ధన్ మొదటి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ పుట్టినరోజు వేడుకకు రాష్ట్ర,మండల బిజెపి నాయకులు పాల్గొని ఆశీర్వ ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సి లింగ్ మెంబర్ రాయరాకుల మొగిలి,మండల అధ్యక్షులు నరహరిశెట్టి రామకృష్ణ, సోషల్ మీడియా కన్వీనర్ ఎర్ర రాకేష్ రెడ్డి, బూత్ అధ్యక్షులు సుమన్ చంద్రమొగిలి, నవీన్, రవి, మురళి పాల్గొన్నారు.
శాయంపేట మండలకేంద్రం లోని ప్రభుత్వ ఆసుపత్రిలో నందమూరి తారకరామా రావు(జూనియర్ ఎన్టీఆర్) జన్మదినాన్ని పురస్కరిం చుకుని దాసరి నరేష్ ఆధ్వర్యంలో ఘనంగా పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు.అనంతరం రోగులకు అరటిపండ్ల పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్ర మంలో అమ్మ అశోక్,,దాసరి విష్ణు,ప్రణయ్, నవీన్, అఖి ల్,మోహన్,పవన్,సుమంత్ కిరణ్,తేజ తదితరులు పాల్గొన్నారు.
హనుమంతరావు పటేల్ ను జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ‘ కాంగ్రెస్ పార్టీ నాయకులు’
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మండల అధ్యక్షులు హనుమంతరావు పటేల్ జన్మదినం సందర్బంగా,శాలువా పూలమాలలతో సన్మానించి, కేక్ కట్ చేసి స్వీట్ తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన,కాంగ్రెస్ యువ సీనియర్ నాయకులు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ యువ నాయకులు ఉదయ్ శంకర్ పటేల్ శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థాన మెంబర్లు మల్లన్న పటేల్ నవాజ్ రెడ్డి మరియు గ్రామ మాజీ సర్పంచ్ రుద్రప్ప పటేల్ కాంగ్రెస్ మైనారిటీ యువ నాయకుడు మొహమ్మద్ ఫక్రుద్దీన్ సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని తిరుమలగిరి మాజీ ఎంపీటీసీ నేనావత్ వెంకట్ రాము కూతురు నేనావత్ వందన జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. కేక్ కట్ చేసి వందనాకు తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వందన ఉన్నత విద్యలు చదివి తిరుమలగిరి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శంకర్ నాయక్, వెంకటేశ్వర రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తాండవాసులు పాల్గొన్నారు.
పలు సంఘాల ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు..మజ్జిక పంపిణీ.
వరంగల్/నర్సంపేట నేటిధాత్రి:
గీసుకొండ గ్రామ శ్రీమంతుడు పెగళ్ళపాటి లక్ష్మీనారాయణ వజ్రోత్సవ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.వరంగల్ జిల్లా గీసుకొండ మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ స్టేట్ బ్యాంక్ మేనేజర్ పెగళ్ళపాటి లక్ష్మీనారాయణ 75 వ జన్మదినం సందర్భంగా గీసుకొండ సోషల్ సర్వీస్ టీం,స్థానిక గీతా లక్ష్మీనారాయణ మహిళా పరపతి సంఘం ఆధ్వర్యంలో కొనాయమాకుల బస్ స్టాండ్ లో ప్రయాణీకులు ఉచితంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నర్సంపేట బస్ డిపో ఎంఎఫ్ ప్రభాకర్, ఏఈ నరేందర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సరస్వతీ పుష్కరాల సందర్భంగా మండుటెండల్లో విధులు నిర్వహించనున్న బస్ డ్రైవర్లు, కండక్టర్లకు 100 మందికి తెల్ల రుమాళ్లను కూడా లక్ష్మీనారాయణ సౌజన్యంతో పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో గీసుకొండ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం చైర్మన్ ఏనుగుల సాంబరెడ్డి, మాజీ చైర్మన్ రామా కుమారస్వామి, ఆర్టీసీ ఉద్యోగి వంగల రాంబాబు,గీసుకొండ సోషల్ సర్వీస్ టీం సభ్యులు కర్ణకంటి రాంమూర్తి, ముల్క సత్యనారాయణ, మహ్మద్ సోనీ,యాదగిరి కుమారస్వామి,పసుల సంపత్, వటుకుల రవికుమార్, గీతా లక్ష్మీనారాయణ మహిళా పరపతి సంఘం అధ్యక్ష కోశాధికారులు కర్ణకంటి రజిత, కత్తి హేమలత, గౌరవ సలహాదారులు కక్కెర్ల సుజాత, వీరగొని హేమలత,పసుల సునిత తదితరులు పాల్గొన్నారు.
జమ్మికుంట లో పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి అన్నదాన కార్యక్రమం బొమ్మల గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన దేశిని కోటి సుంకరి రమేష్ ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తాలో కేక్ కటింగ్ మొక్కలు నాటిన యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బొడిగ శ్రీకాంత్ జమ్మికుంట :నేటిధాత్రి
హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఒడితల ప్రణవ్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మరియు రవాణా శాఖ మంత్రి ప్రభాకర్58వ పుట్టినరోజు సందర్భంగా దేశిని కోటి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జమ్మికుంట బొమ్మల గుడి శివాలయంలో పొన్నం ప్రభాకర్ పేరున ప్రత్యేకమైన పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది .
Ponnam Prabhakar’s birthday
అలాగే పట్టణంలోని గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుంకరి రమేష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది * జమ్మికుంట మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బుడిగే శ్రీకాంత్ ఆధ్వర్యంలో జమ్మికుంట పట్టణంలోని స్థానిక మోత్కల గూడెం ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటి యువజన కాంగ్రెస్ జమ్మికుంట మండల పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు వీరందరూ మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ విద్యార్థి దశలోనే రాజకీయ ప్రవేశం చేసి NSUI రాష్ట్ర అధ్యక్షులుగా కరీంనగర్ పార్లమెంటు సభ్యులుగా ప్రజలకు ఎన్నో రకాల సేవలు అందించారని కొనియాడారు ఈ కార్యక్రమాలలో ఎర్రబెల్లి రాజేశ్వరరావు సుంకరి రమేష్ సాయిన్ రవి జమ్మికుంట మాజీ కౌన్సిలర్ బొంగుని వీరన్న మారపల్లి బిక్షపతి ఎలగందుల స్వరూపా శ్రీహరి పిట్టల శ్వేతా రమేష్ పానుగంటి సారంగం దిడ్డి రామ్మోహన్ కు దాడి రాజన్న గొల్లి పూలమ్మ మొగిలి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట స్వప్న కాంగ్రెస్ నాయకులు పూదరి శివ మరి రామ్ రెడ్డి పందాల అజయ్ ముద్దమల్ల రవి పోతుల శ్రీనివాస్ అశోక్ రాజ్కుమార్ శ్రీను యూత్ కాంగ్రెస్ నాయకులు పార్లపల్లి నాగరాజు ఎండి సజ్జు పాతకాల రమేష్ రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు మండల కార్యదర్శులు రవి అజయ్ సేవాదళ్ నియోజకవర్గం అధ్యక్షులు వినోద్ రెడ్డి వార్డుల అధ్యక్షులు నరికే సుమన్ బుల్లి రమేష్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాజ పొనగంటి కుమార్ పొన్నగంటి రాజు గాంధీ యువజన నాయకులు శ్రీకాంత్ శ్రీనివాస్ పాల్గొన్నారు
మండేపల్లి ప్రభుత్వ వృద్ధాశ్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ బర్త్డే వేడుకలు…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి మండలం మండపల్లి ప్రభుత్వ వృద్ధాశ్రమంలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గడ్డం మధుకర్ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ బర్త్డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండేపల్లి ప్రభుత్వ వయో ముద్దుల సమక్షంలో రాష్ట్ర రవాణా. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ బర్త్డే వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ వృద్ధులచే కేక్ కటింగ్ చేయించి వారికి పండ్లు పంపిణీ చేయడం జరిగిందని సోషల్ మీడియా కోఆర్డినేటర్ తెలిపారు భవిష్యత్తులో అన్ని రంగాలపై దృష్టి సారించి మంత్రి పొన్నం ప్రభాకర్ పనిచేస్తున్నారని రాష్ట్ర అభివృద్ధికి అవిశ్రాంతంగా పనిచేస్తున్న ఆయన పనితీరు ప్రశంసనీయమని కొనియాడుతూ పొన్నం ప్రభాకర్ కి దీర్ఘాయుష్ ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రసాదించాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నామని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎగుర్ల ప్రశాంత్. నరేష్. శ్యామ్. వేణు. శ్రీకాంత్. జ్యోతి. మౌనిక. అనిత. జ్యోతి . కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు
గంగుల కమలాకర్ జన్మదినం సందర్భంగా రాజీవ్ గృహకల్ప సైటులో మొక్కలు నాటిన నాయకులు
కరీంనగర్, నేటిధాత్రి:
కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ జన్మదినాన్ని పురస్కరించుకొని బిఆర్ఎస్ పార్టీ మండల సీనియర్ నాయకులు చేట్టిపెళ్లి నరేందర్ ఆధ్వర్యంలో గురువారం రాజీవ్ గృహకల్ప సముదాయంలో మొక్కలు నాటడం జరిగినది. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ కరీంనగర్ నగరాన్ని అభివృద్ధి పరిచిన అభివృద్ధి ప్రదాత గంగుల కమలాకర్ అని నిరుపేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటూ ప్రజా సంక్షేమమే అభివృద్ధిగా ప్రజల సమస్యల పరిష్కరిస్తూ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన నాయకులని కొనియాడారు. కరీంనగర్ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలోనే అభివృద్ధి పథంలో ముందుంచిన నాయకులని వారు చేసిన సేవలు, చేస్తున్న పనులు కరీంనగర్ నియోజకవర్గం ప్రజలు మర్చిపోలేరని, వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని, రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అవరోధించాలని ఆభగవంతున్ని ప్రార్థిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది. ఈకార్యక్రమంలో కొత్తపల్లి మండల మాజీ వైస్ ఎంపీపీ తిరుపతి నాయక్, యువజన విభాగం మండల అధ్యక్షులు గుర్రాల ప్రకాష్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి రేణిగుంట రాజు, మైనార్టీ విభాగం అధ్యక్షులు చాంద్ పాషా, మహిళా విభాగం మండల నాయకురాలు స్వప్న, వరలక్ష్మి, లత, బిఆర్ఎస్ నాయకులు రవీందర్, కనకచారి, సలీం, వాజీత్, సూర్యనారాయణ, శశి, ఆకాష్ రెడ్డి, మహేష్, చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి లో కన్యకా పరమేశ్వరి మాతదేవాలయం లో వైశాఖ శుద్ధ దశమి బుధవారం రోజున వాసవి మాత జన్మదిన సందర్భంగా దేవాలయం ఫౌండర్ ట్రస్ట్రీ చైర్మన్ జూలూరి రమేష్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగినది. అందులో భాగంగా ఉదయం 6 గంటలకు అభిషేకం, మహిళలు చే కుంకుమార్చనలు పూజలు, వాసవి మాత పారాయణం, విష్ణు సహస్రనామాలు, భగవద్గీత పారాయణం, హనుమాన్ చాలీసా అమ్మవారికి పల్లవి సేవ డోలారోహణం, కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఆర్య వైశ్యులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం తీర్థ ప్రసాదాలు భోజనప్రసాదాలు వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య పట్టణ నాయకులు, మండల నాయకులు,వాసవి క్లబ్ వనిత క్లబ్,ఆవోప సంఘాలు నాయకులు పాల్గొన్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి లో కన్యకా పరమేశ్వరి మాతదేవాలయం లో వైశాఖ శుద్ధ దశమి బుధవారం రోజున వాసవి మాత జన్మదిన సందర్భంగా దేవాలయం ఫౌండర్ ట్రస్ట్రీ చైర్మన్ జూలూరి రమేష్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగినది. అందులో భాగంగా ఉదయం 6 గంటలకు అభిషేకం, మహిళలు చే కుంకుమార్చనలు పూజలు, వాసవి మాత పారాయణం, విష్ణు సహస్రనామాలు, భగవద్గీత పారాయణం, హనుమాన్ చాలీసా అమ్మవారికి పల్లవి సేవ డోలారోహణం, కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఆర్య వైశ్యులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం తీర్థ ప్రసాదాలు భోజనప్రసాదాలు వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య పట్టణ నాయకులు, మండల నాయకులు,వాసవి క్లబ్ వనిత క్లబ్,ఆవోప సంఘాలు నాయకులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.