పొద్దంతా ఆనందం.. పొద్దుపోయాక విషాదం..

పొద్దంతా ఆనందం.. పొద్దుపోయాక విషాదం..

హైదరాబాద్ :నేటిధాత్రి

 

car accident

కన్నీళ్లు మిగిల్చిన జన్మదిన వేడుక కృష్ణా బ్యాక్వాటర్ వద్దకు వెళ్లి వస్తుండగా..
రోడ్డు ప్రమాదం ముగ్గురు అన్నదమ్ముల మృతి..
మరో నలుగురికి గాయాలు

 

యాచారం, న్యూస్టుడే: వారంతా స్నేహితులు.. పాతికేళ్లలోపు యువకులు.. వారిలో ఒకరి పుట్టినరోజు నేపథ్యంలో సరదాగా గడిపేందుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. మరో నలుగురు గాయాలపాలై కన్నవాళ్లకు కన్నీళ్లు మిగిల్చారు. పోలీసులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం గుడిబండ గ్రామానికి చెందిన వాసా సాయితేజ(23), వాసా పవన్ కుమార్(25), వాసా రాఘవేందర్ (24), వాసా శివకుమార్, ఇ. సాయికుమార్ వరసకు అన్నదమ్ములు. మూసాపేటలో నివాసం ఉండే ఎం.సందీప్, శివకుమార్ వారి మిత్రులు. వీరందరూ హైదరాబాద్లో వేర్వేరు చోట్ల ఉంటూ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వాసా శివకుమార్ జన్మదినం సందర్భంగా మంగళవారం ఉదయం అందరూ కలిసి నల్గొండ జిల్లా నేరేడుకొమ్మ మండలం వైజాగ్ కాలనీలోని కృష్ణా బ్యాక్వాటర్ వద్దకు వెళ్లారు. పొద్దుపోయే వరకూ అక్కడే ఆనందంగా గడిపారు. తిరుగు ప్రయాణంలో.. రాత్రి 2 గంటల ప్రాంతంలో రంగారెడ్డి జిల్లా యాచారం మాల్ పట్టణం దాటిన కొద్దిసేపటికి వీరు ప్రయాణిస్తున్న కారు..ఎదురుగా వస్తున్న ప్రైవేట్ బస్సు ఢీకొన్నాయి. ప్రమాదంలో కారు నుజ్జయింది. వాసా సాయితేజ, వాసా పవన్కుమార్, వాసా రాఘవేందర్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడగా.. పోలీసులు ఆసుపత్రికి తరలించారు. మృతుడు పవన్కుమార్కు మూడేళ్ల కుమార్తె ఉందని, ఆయన భార్య ప్రస్తుతం గర్భవతి అని పోలీసులు తెలిపారు. మిగిలిన వారంతా అవివాహితులని వెల్లడించారు.

మక్తల్ ఎమ్మెల్యే వాహనానికి ప్రమాదం.

మక్తల్ ఎమ్మెల్యే వాహనానికి ప్రమాదం

ఎమ్మెల్యే శ్రీహరి కారును ఢీకొన్న మరో కారు

తృటిలో తప్పిన ప్రమాదం

మహబూబ్ నగర్ /నేటి ధాత్రి

 

 

 

 

మహబూబ్ నగర్ జిల్లా మక్తల్
ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కు ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుండి మహబూబ్ నగర్ వైపుతో వెళ్తున్న TG 38. 6669 నెంబర్ గల ఇన్నోవా కారును పక్కన నుండి వస్తున్న ఐ 20 కారు వేగంగా ఢీకొట్టింది. షాద్ నగర్ రాయికల్ టోల్ ప్లాజా వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో ఎమ్మెల్యే కారుకు స్వల్పంగా ధ్వంసం కాగా ఎవ్వరికి ఎలాంటి గాయాలు కాలేదనీ ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

మండల కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం.

మండల కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం.

చిట్యాల నేటిధాత్రి:

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం కేంద్రంలోని
ఎంపీడీవో ఆఫీస్ సమీపంలో గల ఎస్సీ కాలనీలో షార్ట్ సర్క్యూట్ వల్ల ఇల్లు దగ్ధం అయినట్లు సమాచారం అలాగే సమీపాన ఉన్న స్థానిక చర్చిలో షార్ట్ సర్క్యూట్ తో చర్చిలోని వస్తువులన్నీ కాలిపోయాయి అలాగే స్థానిక రైతు వేదికలో షార్ట్ సర్క్యూట్ ఫ్యాన్లు కంప్యూటర్లు కాలిపోయినాయి, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫార్మర్స్ కార్డు ఆన్లైన్ కోసం వచ్చిన రైతులు రైతు వేదికలో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగడంతో రైతులందరూ ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకుని బయటికి పరుగులు తీశారు ఇంత జరిగినా కూడా విద్యుత్ శాఖ అధికారులు అటువైపు రాకపోవడం గమనార్హం, ఎంపీడీవో ఆఫీస్ సమీపంలో షార్ట్ సర్క్యూట్తో పరిసర ప్రాంతాలలో ప్రమాదాలు జరుగుతున్నాయి కనుక వెంటనే విద్యుత్ అధికారులు స్పందించి షార్ట్ సర్క్యూట్ గల కారణాలను తెలుసుకొని పరిష్కరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు, రైతు వేదికలో కూడా అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ జరగడంతో బయటికి పరిగెత్తారు అనంతరం రైతులు రైతు వేదిక ముందు గల ప్రదేశంలో అగ్రికల్చర్ అధికారి మొబైల్ ఫోన్లో రైతుల ఆధార్ కార్డులు ఆన్లైన్ చేసుకుంటున్నారు, కాబట్టి రైతుల బాధలు స్థానిక ప్రజల బాధలు అర్థం చేసుకొని రైతు వేదికలో విద్యుత్ సమస్యను తొందరగా పరిష్కరించి పరిష్కరించి రైతుల కు సహకరించాలని అన్నారు ఏది ఏమైనా ఎంపీడీవో పరిసర ప్రాంతాల్లో గల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు కావున వెంటనే విద్యుత్ అధికారులు సమస్యను పరిష్కరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

ఈద్గా మైదానంలో తృటిలో తప్పిన పెను ప్రమాదం.

ఈద్గా మైదానంలో తృటిలో తప్పిన పెను ప్రమాదం..

గాయపడ్డ క్షతగాత్రులను పరామర్శించిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ..

◆ ఎంపీ. సురేష్ కుమార్ షెట్కార్

◆ ఎంఐఎం కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మోహియోద్దీన్

◆ తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి

◆ -కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం ఉజ్వల్ రెడ్డి

◆ జహీరాబాద్ మాజీ మంత్రివర్యులు డా౹౹ఎ. చంద్రశేఖర్..*

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణంలోని ఈద్గా మైదానంలో పార్లమెంట్ అమోదించిన “వక్స్ చట్టానికి వ్యతిరేకంగా బహిరంగ సభ ఏర్పాట్లు జరుగుతున్న సందర్భంగా విద్యుత్-దీపాల కమాన్ కూలిపోవడంతో కింద కూర్చున్న 8 మందిపై పడి గాయాలయ్యాయి.తీవ్రంగా గాయపడిన వారికి హైదరాబాద్ తరలించారు.విద్యుత్ సరఫరా అవడంతో వెంటనే అధికారులు విద్యుత్ సరఫరాలను నిలిపివేశారు.దీంతో పెను ప్రమాదం తప్పింది.గాయపడి చికిత్స పొందుతున్న వారిని స్థానిక సన్ రోహి ఆసుపత్రిలో ఆదివారం మహమ్మద్ షబ్బీర్ అలీ ఎంపీ. సురేష్ కుమార్ షెట్కార్ ఎంఐఎం కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మోహియోద్దీన్ డా౹౹ఎ. చంద్రశేఖర్,మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి,రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి పరామర్శించారు.వారు వైద్యులతో మాట్లాడి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఆదేశించారు.వారితో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ మంకాల్ సుభాష్,మండల కాంగ్రెస్ అధ్యక్షులు పి.నర్సింహారెడ్డి,యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు పి.నాగిరెడ్డి,సీనియర్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి,రాష్ట్ర యూత్ కాంగ్రెస్ కార్యదర్శి హర్షవర్ధన్ రెడ్డి,అక్తర్,హర్షద్ పటేల్,అక్బర్, జుబేర్,జహంగీర్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల కు గురై కోలుకున్న.

రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల కు గురై కోలుకున్న సీనియర్ జర్నలిస్ట్ దూరదర్శన్ ప్రతినిధి మల్యాల బాలస్వామి

వనపర్తి నేటిధాత్రి :

 

వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన దూరదర్శన్ ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ మలియాల బాలస్వామి గత నెల 25 న వనపర్తి గోశాల దగ్గర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు . ఈ మేరకు సీనియర్ జర్నలిస్ట్ బాలస్వామి హైదరాబాదులో ఆర్థోపెడిక్ కేర్ హాస్పిటల్ డాక్టర్ తో చికిత్స చేయించుకున్నారు.ఈ విషయం తెలుసుకున్న నేటి దాత్రి దినపత్రిక జిల్లా విలేకరి పోలిశెట్టి సురేష్ బుధవారం నాడు నాగవరంలో జర్నలిస్ట్ బాలస్వామి నివాసానికి వెళ్లి పరామర్శించి ఆరోగ్య స్థితిగతులపై అడిగి తెలుసుకున్నారు .జర్నలిస్ట్ బాలస్వామి త్వరగా కోలుకొని జర్నలిస్ట్ విధుల్లో చేరాలని పొలిశెట్టి సురేష్ ఆకాంక్షించారు

కోటి రూపాయల ఎస్బిఐ ప్రమాద భీమా అందజేత.

కోటి రూపాయల ఎస్బిఐ ప్రమాద భీమా అందజేత

రామకృష్ణాపూర్ నేటిధాత్రి:

రామకృష్ణాపూర్ పట్టణానికి చెందిన కొమిశెట్టి కిరణ్ కుమార్ ఇటీవల రోడ్డు ప్రమాదం లో మృతి చెందగా, మృతుడు కాశీపేట 2 గని లో విధులు నిర్వర్తించేవాడు.సింగరేణి సంస్థకు ఎస్బిఐ బ్యాంక్ సంస్థకు మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం ఎస్బిఐ సాలరీ అకౌంట్ ఎస్బిఐ లొ మెయింటైన్ చేసినందుకు గాను కోటి రూపాయల భీమా ఎస్బిఐ బ్యాంక్ మంజూరు చేసింది. ఇట్టి కోటి రూపాయల చెక్కును నామిని అయిన మృతుని భార్య కొమిశెట్టి కోమల కు శనివారం రామకృష్ణపూర్ ఎస్బిఐ బ్యాంక్ ఆవరణలో మంచిర్యాల ఎస్బిఐ రీజినల్ మేనేజర్ రితేష్ కుమార్ గుప్త, ఆర్బీవో సివిఈ చీఫ్ మేనేజర్ శ్రీనివాస్ మూర్తి లు మృతుని కుటుంబానికి అందించారు. ఈ కార్యక్రమం లో బ్రాంచ్ మేనేజర్ గుగులోత్ గోపాల్, బ్యాంక్ స్టాఫ్ ప్రశాంత్,రామ కార్తిక్, వెంకటేశ్. రాజేంద్ర ప్రసాద్ , చందు, రమాదేవి లు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలైన సంఘటన సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల పరిధిలోని కప్పాడ్ రాయికోడ్ మధ్య అనుసంధానమైన రోడ్డుపై కప్పాడ్ గ్రామ శివారులో సాయంత్రం సుమారు 6 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రోడ్డు ప్రక్కనున్న ద్విచక్ర వాహనాన్ని ఏరేటిగా కారు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలైనట్లు గాయపడినటువంటి వ్యక్తులు రేగోడు మండలం జగిర్యాల్ గ్రామానికి చెందిన వారని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రమాదవశాత్తు గాయపడిన నాయకుడిని.

ప్రమాదవశాత్తు గాయపడిన నాయకుడిని.

పరామర్శించిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి:

తంగళ్ళపల్లి మండల కేంద్రానికి చెందిన బి ఆర్ ఎస్ పార్టీ నాయకుడు కొన్ని రోజుల క్రితం ప్రమాదవశాస్తు గాయపడగా ఆయన ను పరామర్శించిన. బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు. ఈ సందర్భంగా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జంగా పెళ్లి బిక్షపతి కొన్ని రోజుల క్రితం గాయపడగా ఈరోజు వారి ఇంటికి వెళ్లి. పరామర్శించి. వారికి మనో ధైర్యం చెప్పి అండగా ఉంటామని పార్టీ పరంగా గాని ప్రభుత్వపరంగా కానీ తగిన సహాయం అందించేలా కృషి చేస్తామని ఈ విషయాన్ని టిఆర్ఎస్ పార్టీ. వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీ రామారావు దృష్టికి తీసుకెళ్లి గాయపడిన బిక్షపతికి కుటుంబానికి సహాయ సహకారాలు అందించే విధంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. బి ఆర్ ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య. బి ఆర్ ఎస్ పార్టీ. తంగళ్ళపల్లి మండల అధ్యక్షుడు గజ భీంకర్ రాజన్న. పాక్స్. వైస్ చైర్మన్. ఎగుమామిడి వెంకట రమణారెడ్డి. పార్టీ సీనియర్ నాయకులు. పడిగల రాజు. గ్రామ శాఖ అధ్యక్షులు బండి జగన్. జాగృతి మండల అధ్యక్షులు కందుకూరి రామ గౌడ్. కేటీఆర్ సేన మండల అధ్యక్షుడు నందగిరి భాస్కర్ గౌడ్. తంగళ్ళపల్లి టౌన్ బి ఆర్ ఎస్ నాయకులు క్యారం జగత్ కుమార్. భాను. మూర్తి. నేరెళ్ల అనిల్. బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు

ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా రైతు మృతి.

ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా.. రైతు మృతి

 

తిమ్మాజీపేట/నేటి ధాత్రి :

 

నాగర్ కర్నూల్ జిల్లా బావాజీ పల్లి గ్రామంలో బుధవారం ట్రాక్టర్ బోల్తాపడి రైతు మృతి చెందిన సంఘటన గ్రామంలో విషాదం నిలిపింది. గ్రామస్తులకు వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బత్తుల బాలస్వామి (55) సొంత పొలంలో ట్రాక్టర్ సహాయంతో పనులు చేస్తుండగా.. ప్రమాదవశాత్తు బోల్తా పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య ఓ కూతురు ఓ కుమారుడు ఉన్నారు. గ్రామంలో విషాదం నెలకొంది.

నాయకుని పరామర్శించిన బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు.!

ప్రమాదవశాత్తు గాయపడిన నాయకుని పరామర్శించిన బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి :

 

 

తంగళ్ళపల్లి మండలానికి చెందిన టౌన్ బిఆర్ఎస్ పార్టీ. సీనియర్ నాయకులు జంగపల్లి. బిక్షపతి గత కొన్ని రోజుల క్రితం ప్రమాదవశాత్తు గాయపడం జరిగింది. ఈరోజు టిఆర్ఎస్ పార్టీ. సీనియర్ నాయకులు . బొ ల్లి. రామ్మోహన్. పార్టీ నాయకులు కార్యకర్తలు . ఆయన. ఇంటికి వెళ్లి. పరామర్శించి మనోధైర్యం చెప్పి. బిఆర్ఎస్ పార్టీ తరఫున అండగా ఉంటామని ధైర్యం చెప్పి. సంబంధిత విషయాన్ని మాజీ మంత్రి కేటీ రామారావు దృష్టికి తీసుకెళ్లి తమకు అండగా ఉంటామని పార్టీ పరంగా ఆదుకుంటామని ఈ సందర్భంగా తెలియజేశారు . పరామర్శించిన వారిలో తంగళ్ళపల్లి టౌన్ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు యూత్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

రోడ్డు ప్రమాదంలో గాయపడి మృతి చెందిన రాజా గౌడ్.!

రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన

ముదిగుంట మాజీ సర్పంచ్ రాజా గౌడ్

జైపూర్,నేటి ధాత్రి:

 

 

 

జైపూర్ మండలం ముదిగుంట గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మొగిలి పాక రాజా గౌడ్ రోడ్డు ప్రమాదంలో గాయపడి మరణించారు. వివరాల్లోకి వెళితే కొన్ని రోజులుగా మంచిర్యాలలో నివాసం ఉంటూ పని నిమిత్తం ఇంటి నుంచి నడుచుకుంటూ బయటికి వెళ్తున్న సమయంలో మంచిర్యాల ఓవర్ బ్రిడ్జ్ సమీపంలో టూ వీలర్ పై వచ్చిన వ్యక్తి వెనుక నుంచి ఢీకొనగా మొగిలి పాక రాజా గౌడ్ తలకి త్రీవ గాయాలైనట్లు స్థానికులు తెలిపారు.విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మంచిర్యాలలోని ఆస్పత్రి తరలించగా మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ తీసుకెళ్లాలని ఇక్కడి వైద్యులు సూచించగా కుటుంబ సభ్యులు హుటాహుటిన కరీంనగర్ లోని వజ్ర హాస్పిటల్ తరలించగా అక్కడి వైద్యులు వెంటనే గుర్తించి తలకు శాస్త్ర చికిత్స చేయాలని తెలిపారు. వెంటనే వైద్యుల సూచనలు మేరకు శాస్త్ర చికిత్స చేపించినప్పటికీ కూడా 20 రోజులుగా చికిత్స పోదుతూ శనివారం తెల్లవారుజామున మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.సర్పంచి పదవి కాలంలో గ్రామానికి చేసిన సేవలను గ్రామస్తులు స్మరించుకుంటూ కన్నీటి పర్వతం అయ్యారు.

అగ్ని ప్రమాదంలో మొక్కజొన్న పంట చేను దగ్ధం.

అగ్ని ప్రమాదంలో మొక్కజొన్న పంట చేను దగ్ధం.

చిట్యాల, నేటి ధాత్రి :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం లోని శాంతినగర్ గ్రామంలో కత్తుల ఓదెలు అనే రైతుకి సంబంధించిన రెండు ఎకరాలలో మక్క పంట పండించడం జరిగింది బుధవారం మధ్యాహ్నం సుమారు 3: 20 నిమిషాలు అధిక ఎండపాతం ఉండడంవల్ల పంటలో చేను లో అనుకోకుండా మంటలు వ్యాపించి రెండు ఎకరాల షేను పూర్తిస్థాయిలో దగ్ధం కావడం జరిగిందిని, రైతు ఆవేదన చెందడం జరిగింది, మొక్కజొన్న పంట సుమారు 100 కింటాల మక్కలు ఉన్నట్టుగా రైతు ఓదెలు తెలియజేయడం జరిగింది, అప్పుచేసి పంటకు పెట్టుబడి పెట్టి చేతి కి అందే టైంలో మంటలో కాలిపోవడంతో రైతు కన్నీరు మున్నీరు అయ్యారు. ప్రభుత్వం నుండి సాయం అందించాలని అధికారులను కోరారు.

విద్యుత్ ప్రమాదంతో వృద్ధురాలు మృతి…

విద్యుత్ ప్రమాదంతో వృద్ధురాలు మృతి…

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

స్నానం చేసి శౌచాలయం (బాత్ రూమ్) లోంచి బయటకు వస్తుండగా విద్యుత్ ప్రమాదానికి గురై ఓ వృద్ధురాలు మృతి చెందిన సంఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. కుటుంబీకులు, హద్దునూరు ఎస్పై చెల్లా రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. న్యాల్కల్ మండలంలోని హుస్సేన్ నగర్ గ్రామానికి చెందిన వడగామ సిద్ధమ్మ (56) ఆదివారం ఉదయం స్నానం, కాళ కృత్యాలు చేసేందుకు శౌచాలయంలోకి వెళ్ళింది. స్నానం అనంతరం బయటకు వస్తుండగా ఓ ఇనుప రాడ్డును పట్టుకోవడంతో విద్యుత్ ప్రమాదం చోటు చేసుకుంది. అపస్మారక స్థితిలో ఉన్న సిద్ధమ్మ (56)ను గుర్తించిన సమీప స్థానికులు వెను వెంటనే బీదర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతి చెందిన సిద్ధమ్మకు ఓ కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. మృతురాలి సోదరి కుమారుడు సంజీవ్ కుమార్ (31) ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్పై చెల్లా రాజశేఖర్ కేసు నమోదు చేసి. శివ పంచనామ, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడిన.!

రోడ్డు ప్రమాదంలో గాయపడిన సీనియర్ జర్నలిస్ట్ మల్యాల బాలస్వామి ని ఫోన్ లో పరామర్శిస్తున్న ఎమ్మెల్యే తూడి
వనపర్తి నేటిదాత్రి :

వనపర్తి జిల్లా కేంద్రంలో రాజనగరం గోశాల దగ్గర రోడ్డు ప్రమాదానికి గురైన సీనియర్ జర్నలిస్ట్ నాగవరం మల్యాల బాలస్వామిని ఫోన్ లో వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డి పరామర్శించి గాయాలపై ఆరా తీశారు .. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెగా రెడ్డి మాట్లాడుతూ మెరుగైన వైద్యం చేయించుకుని త్వరగా కోలుకోవాలని సీనియర్ జర్నలిస్ట్ బాలస్వామిని కోరారు.

కార్ యాక్సిడెంట్ జరిగిందా.!

కార్ యాక్సిడెంట్ జరిగిందా? డోంట్ వర్రీ- వెంటనే ఈ 10 పనులు చేస్తే అంతా సేఫ్​!

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

మన దేశంలో ప్రతీ గంటకు 53 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతీ నాలుగు నిమిషాలకు ఒక మరణం సంభవిస్తోంది. ప్రపంచ బ్యాంక్ గతంలో విడుదల చేసిన ఓ నివేదికలోని వివరాలు ఇవి. మొత్తం మీద ఇది భారత్‌లోని రోడ్లపై డ్రైవింగ్ అనేది పెద్ద సవాలుతో కూడిన విషయమని స్పష్టం చేసింది. నిత్యం ఎన్నో కార్లు రోడ్డు ప్రమాదాల బారిన పడుతుంటాయి. ఒకవేళ మీ కారు ఇలాంటి ప్రమాదం బారినపడితే వెంటనే చేయాల్సిన 10 విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

కారును ఆపండి :

రోడ్డు ప్రమాదం ఎక్కడైతే జరిగిందో, అక్కడే మీ కారును ఆపేయండి. దీనివల్ల మీకు ఆ కేసులో లీగల్ చిక్కులు రావు. ప్రమాదం చిన్నదే అయినా అక్కడి నుంచి కారుతో పరార్ కావద్దు. ప్రమాదం జరిగిన చోట ఎవరితోనూ గొడవకు దిగవద్దు.

గాయాలపాలైన వారికి సాయం చేయండి :

రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన వారికి వీలైనంత త్వరగా చికిత్స అందేలా ఏర్పాట్లు చేయండి. అంతకంటే ముందు మీకు అయిన గాయాలను చెక్ చేసుకోండి. వేగంగా సమీపంలోని ఆస్పత్రికి చేరుకోండి. మీ వాహనం వల్ల ఇతరులకు గాయాలైతే థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ స్కీమ్​ ద్వారా దానికి సంబంధించిన క్లెయిమ్ చేయండి.

వైద్య సాయం పొందండి :

రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే మీ కారులోని ప్రథమ చికిత్స పెట్టెను వాడుకోండి. గాయపడిన వారికి అందులోని సామగ్రితో ప్రథమ చికిత్స చేయండి. మీకు గాయాలైతే మీరు కూడా ఫస్ట్ ఎయిడ్ చేసుకోండి. ఇదే సమయంలో తప్పకుండా అంబులెన్సుకు కబురుపెట్టండి. మీ ప్రాథమిక చికిత్స ప్రక్రియ పూర్తయ్యేలోగా అంబులెన్సు వస్తుంది. దానిలో ఆస్పత్రికి చేరుకోవచ్చు.

బీమా కంపెనీకి సమాచారం ఇవ్వండి :

Car Insurance

 

 

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారందరికీ చికిత్స చేయించిన వెంటనే, బీమా కంపెనీకి ఈ ప్రమాదంపై సమాచారాన్ని అందించండి. తద్వారా ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రక్రియ త్వరగా మొదలవుతుంది. మీకు అయిన గాయాలు, ఇతరులకు అయిన గాయాలు, వాహనం దెబ్బతిన్న తీరు వంటి వివరాలన్నీ బీమా కంపెనీకి అందించండి. తప్పుడు సమాచారం అందిస్తే క్లెయిమ్ తిరస్కరణకు గురవుతుంది.

పోలీస్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయండి :

ఆ రోడ్డు ప్రమాదానికి సంబంధించి న్యాయపరమైన చిక్కులు ఎదురు కాకూడదంటే, మీరు వెంటనే సమీపంలోని పోలీసు స్టేషనుకు వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు చేయించండి. థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్ కావాలంటే ఎఫ్ఐఆర్ కాపీని బీమా కంపెనీ అడుగుతుంది.

ఫొటోలు తీయండి :

రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే సంఘటనా స్థలం ఫొటోలన్నీ తీయండి. గాయపడిన వారి ఫొటోలు, దెబ్బతిన్న కారు భాగాల ఫొటోలు తీయాలి. ఈ ఫొటోలు క్లియర్‌గా కనిపించేలా ఉండాలి. అన్ని యాంగిల్స్‌లో ఫొటోలు తీయండి. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్ కావడంలో ఈ ఫొటోలు కీలక పాత్ర పోషిస్తాయి.

డాక్యుమెంట్లు సమర్పించండి :

రోడ్డు ప్రమాదం విషయాన్ని బీమా కంపెనీకి తెలియజేసిన వెంటనే, మీరు కొన్ని డాక్యుమెంట్లను సమర్పించాలి. ఆ జాబితాలో డ్రైవింగ్ లైసెన్సు, పోలీస్ ఎఫ్ఐఆర్ కాపీ, కారు ఆర్‌సీ, కారు బీమా పత్రాలు, రిపేర్ అంచనా నివేదికలు ఉండాలి. ఇవన్నీ ఇచ్చాక థర్డ్ పార్టీ కార్ ఇన్సూరెన్స్‌ను సెటిల్ చేసే ప్రక్రియ వేగవంతం అవుతుంది.

కారును రిపేర్ చేయించుకోండి :

రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే కారును రిపేర్ చేయించవద్దు. బీమా కంపెనీ ఒక సర్వేయర్‌ను పంపుతుంది. అతడు వచ్చి కారుకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి, నమోదు చేసుకుంటాడు. మరమ్మతులకు అయ్యే ఖర్చులను సర్వేయర్ అంచనా వేస్తాడు. ఆ నివేదికను అతడు బీమా కంపెనీకి అందజేస్తాడు. ఈ ప్రాసెస్ ముగిశాక మనం కారుకు మరమ్మతులు చేయించుకోవచ్చు. కారును మెకానిక్ షెడ్ వరకు తీసుకెళ్లే సౌకర్యాన్ని సైతం బీమా కంపెనీ కల్పిస్తుంది. ఆ బీమా కంపెనీ పరిధిలో లేని మెకానిక్ వద్ద కూడా కారును రిపేర్ చేయించుకోవచ్చు. మెకానిక్ నుంచి పొందిన బిల్లులను ఇన్సూరెన్స్ కంపెనీకి అందించి, రీయింబర్స్‌మెంట్‌ను పొందవచ్చు.

కారు ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్మెంట్ :

బీమా కంపెనీ నెట్‌వర్క్‌లో కొన్ని కార్ గ్యారేజీలు ఉంటాయి. వాటిలో మీరు కారును రిపేర్ చేయించుకుంటే, నేరుగా ఆ గ్యారేజీకే బీమా కంపెనీ పేమెంట్ చేస్తుంది. ఒకవేళ మీరు నెట్‌వర్క్‌లో లేని గ్యారేజీలో కారును రిపేర్ చేయించుకుంటే, మీకు అంత మొత్తాన్ని బీమా కంపెనీ చెల్లిస్తుంది.

సదా అప్రమత్తంగా ఉండండి :

రోడ్డు ప్రమాదం అనేది చెప్పిరాదు. అది అకస్మాత్తుగా జరుగుతుంది. అందుకే మనం నిత్యం అలర్ట్‌గా ఉండాలి. అవగాహనతో ఉండాలి. ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ, తక్కువ వేగంతో కారును డ్రైవ్ చేయాలి. మద్యం మత్తులో వాహనం నడపకూడదు. బీమా పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ వంటి పత్రాలన్నీ కారులో సిద్ధంగా ఉంచుకోండి.

రోడ్డు ప్రమాదం లో ఇద్దరు మృతి.

రోడ్డు ప్రమాదం లో ఇద్దరు మృతి.

కల్వకుర్తి /నేటి దాత్రి :

 

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన జడ్చర్ల- కోదాడ రహదారిపై మంగళవారం రాత్రి చోటు చేసుకుంది.పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణానికి చెందిన కాసుల అరవింద్ చారీ (31)చీపుర కార్తీక్ చారీ (32)ద్విచక్ర వాహనంపై దేవరకొండ వెళ్లి స్వగ్రామానికి తిరిగి ప్రాణమయ్యారు. మార్గమధ్యంలో ఎర్రగుంటపల్లి గేట్ సమీపంలో జడ్చర్ల- కోదాడ ప్రధాన రహదారిపై ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడింది.

 

accident

 

ఈ ప్రమాదంలో అరవింద్ చారి, కార్తీక్ చారి లకు తలకు బలమైన గాయం తగలడం వల్ల అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ రాజు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి.

రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని పస్తాపూర్ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం లో వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు, పోలీసులు తెలిపారు. వారు తెలిపిన వివరాలు ప్రకారం ఝరాసంగం మండలం చిలేపల్లి గ్రామానికి చెందిన బోయిని నర్సింలు తన పని ముగించుకొని రాత్రి ఆటోలో జహీరాబాద్ నుండి తన స్వగ్రామమైన చిలేపల్లి కి వస్తున్న క్రమంలో పస్తాపూర్ గ్రామ సమీపంలో గల బ్రిడ్జి వద్ద ఆటో ఎదురుగ వస్తున్న డీసీఎం తో ఆటో అదుపు తప్పి ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని తెలిపారు.

Road accident

 

ఈ దూర్ఘటనలో చిలేపల్లి గ్రామానికి చెందిన బోయిని నర్సింలు తీవ్రంగా గాయపడి సంఘటన స్థలలోనే మృతి చెందాగా, డ్రైవర్‌ కు గాయాలు కావడతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదం జరిగిందన్న సమాచారం తెలుసుకున్న జహీరాబాద్ రూరల్‌ పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకొని పరిస్థితుల్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన నర్సింలు కు, సింధు (5), స్వాతి (3) సంవత్సరల ఇద్దరు కూతుర్లు ఉన్నట్లు తెలిపారు.

ఆపరేటివ్ బ్యాంక్ ప్రమాద బీమా చెక్కు పంపిణి.

గాయత్రి కో-ఆపరేటివ్ బ్యాంక్ ప్రమాద బీమా చెక్కు పంపిణి

జమ్మికుంట :నేటిధాత్రి

జమ్మికుంట మండలంలోని ది గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఖాతాదారుడు బిజిగిరి షరీఫ్ గ్రామ సుడైనటువంటి ముడతనపల్లి రాజు తండ్రి మల్లయ్య ప్రమాదవశాత్తు మరణించగా ఇతనికి గాయత్రి బ్యాంకులో నిర్భయ సేవింగ్ ఖాతాపై ప్రమాద బీమా సౌకర్యం ఉంది ప్రమాదంలో చనిపోవడం వల్ల అతని తల్లి అయిన ముడతనపల్లి సుశీలకు లక్ష రూపాయల చెక్కును జమ్మికుంట అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ అయిన శ్రీమతి పుల్లూరి స్వప్న సదానందం చేతుల మీదుగా బ్యాంకు మేనేజర్ వోద్దుల మహేందర్ పొల్లు ప్రవీణ్ కుమార్ గార్ల ఆధ్వర్యంలో చెక్కు పంపిణీ చేయడం జరిగింది.

కల్బేమల్ లో విద్యుత్ ప్రమాదం…

కల్బేమల్ లో విద్యుత్ ప్రమాదం…

• కుటుంబ సభ్యులకు తృటిలో తప్పిన పెను ప్రమాదం

జహీరాబాద్. నేటి ధాత్రి:

న్యాల్కల్ మండలంలోని కల్బేమల్ గ్రామంలోని దళిత
వాడలో శనివారం రాత్రి విద్యుత్ ప్రమాదం చోటు చేసుకుంది. బాధిత కుటుంబీకులు, కాలనీవాసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత రెండు రోజులుగా ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కురుస్తున్న వర్షాలతో.. కాలనీలోని మాజీ ఎంపీటీసీ సభ్యుడు మాణిక్, శిరోమణిలకు చెందిన ఇండ్ల సమీపం వద్ద శనివారం రాత్రి 10 గంటల సమయంలో ఉన్నట్టుండి విద్యుత్ తీగలు నేల వారాయి. ఇంటి పైకప్పు కు సమీపంలో ఉన్న ఇనుప కడ్డీలకు ఎర్తింగ్ విద్యుత్ తీగ తగలడంతో ఒక్కసారిగా మంటలు ఏర్పడ్డాయి. దీంతో మాణిక్ స్వగృహంలో పంటలు ఏర్పడ్డాయి. అట్టి సమయంలో మాణిక్ మినహా కుటుంబ సభ్యులందరూ ప్రార్థనలు చేసేందుకు చర్చికి వెళ్లడంతో కుటుంబ సభ్యులందరికీ తృటిలో ప్రాణాపాయం తప్పింది. మంటలు ఆర్పేందుకు అగ్నిమాకపాక యంత్రం సకాలంలో రాకపోవడం, అందుబాటులో లేని కారణంగా తీవ్రంగా నష్టం వాటిల్లిందని బాధితులు మాణిక్, శిరోమణిలు వాపోయారు. ఈ మేరకు బాధితులు స్థానిక హదునూర్ పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు.

రోడ్డు ప్రమాదం లో బి ఆర్ ఎస్ గ్రామ అధ్యక్షులు.!

రోడ్డు ప్రమాదం లో బి ఆర్ ఎస్ గ్రామ అధ్యక్షులు రా చన్న పటేల్ మృతి.

జహీరాబాద్ నేటి ధాత్రి:

Ra Channa Patel

ఝరాసంగం మండల పరిధిలోని కప్పాడ్ గ్రామ బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు రాచన్న పటేల్ కప్పా డ్ గ్రామంలో రోడ్డు ప్రమాదం లో మృతి చెందారు. సాయకాలం వాకింగ్ కోసం వెళ్లి వస్తుండగా ఈ సంఘంటానా జరిగింది అని స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకోన్న డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్,బి ఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకటేశం, కేతకి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ నర్సింహా గౌడ్ లు ఆస్పత్రి కి వెళ్లి పరామర్శించారు. అయన మృతి చెందడంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version