‘భారత రాజ్యాంగాన్ని.. ప్రతి ఒక్కరు పరిరక్షించాలి’

‘భారత రాజ్యాంగాన్ని.. ప్రతి ఒక్కరు పరిరక్షించాలి’

వెల్దండ /నేటి ధాత్రి.

 

నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని చెదురుపల్లి, ఉబ్బలగట్టు తాండ, పోచమ్మ తాండలలో బుధవారం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్ అభియాన్ పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గాంధీజీ సత్య, అహింస సిద్ధాంతాలతో భారతదేశానికి స్వాతంత్రం సంపాదించారని, అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని గౌరవించి ప్రతి ఒక్కరు పరిరక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోతిలాల్ నాయక్, వెంకటయ్య గౌడ్ పుల్లయ్య, రషీద్, మీసాల అంజయ్య, రామచంద్రయ్య, కె. అంజయ్య, పర్వత్ రెడ్డి, అంజన్ యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, రమా, వెంకటయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.

‘భారత రాజ్యాంగాన్ని.. ప్రతి ఒక్కరు పరిరక్షించాలి’

‘భారత రాజ్యాంగాన్ని.. ప్రతి ఒక్కరు పరిరక్షించాలి’

వెల్దండ /నేటి ధాత్రి.

నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని చెదురుపల్లి, ఉబ్బలగట్టు తాండ, పోచమ్మ తాండలలో బుధవారం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్ అభియాన్ పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గాంధీజీ సత్య, అహింస సిద్ధాంతాలతో భారతదేశానికి స్వాతంత్రం సంపాదించారని, అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని గౌరవించి ప్రతి ఒక్కరు పరిరక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోతిలాల్ నాయక్, వెంకటయ్య గౌడ్ పుల్లయ్య, రషీద్, మీసాల అంజయ్య, రామచంద్రయ్య, కె. అంజయ్య, పర్వత్ రెడ్డి, అంజన్ యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, రమా, వెంకటయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదం లో ఇద్దరు మృతి.

రోడ్డు ప్రమాదం లో ఇద్దరు మృతి.

కల్వకుర్తి /నేటి దాత్రి :

 

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన జడ్చర్ల- కోదాడ రహదారిపై మంగళవారం రాత్రి చోటు చేసుకుంది.పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణానికి చెందిన కాసుల అరవింద్ చారీ (31)చీపుర కార్తీక్ చారీ (32)ద్విచక్ర వాహనంపై దేవరకొండ వెళ్లి స్వగ్రామానికి తిరిగి ప్రాణమయ్యారు. మార్గమధ్యంలో ఎర్రగుంటపల్లి గేట్ సమీపంలో జడ్చర్ల- కోదాడ ప్రధాన రహదారిపై ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడింది.

 

accident

 

ఈ ప్రమాదంలో అరవింద్ చారి, కార్తీక్ చారి లకు తలకు బలమైన గాయం తగలడం వల్ల అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ రాజు తెలిపారు.

సిఎంఆర్ఎఫ్ చెక్కుని అందజేసిన బి అర్ ఎస్ నాయకులు

సిఎంఆర్ఎఫ్ చెక్కుని అందజేసిన బి అర్ ఎస్ నాయకులు

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు గారి ఆదేశాల మేరకు ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఎమ్మెల్యే గారి కృషి తో మంజూరైన ₹54,000/- విలువ గల చెక్కును రంజోల్ గ్రామానికి చెందిన రాము గారికి అందజేసిన సీనియర్ నాయకులు నామ రవికిరణ్,సత్యం ముదిరాజ్ గార్లు .ఈ సంధర్బంగా ఎమ్మెల్యే గారికి,నాయకులకు లబ్ధిదారుడు కృతజ్ఞతలు తెలియజేశారు.

అధ్యక్షులు న్యాయవాది కిరణ్ కుమార్ కు సన్మానం

బార్ కౌన్సిల్ అధ్యక్షులు న్యాయవాది కిరణ్ కుమార్ కు ఘనoగా సన్మానం
వనపర్తి నేటిదాత్రి :

 

 పట్టవనపర్తిణంలో బార్ కౌన్సిల్ అధ్యక్షులు న్యాయవాది డి కిరణ్ కుమార్ నివాసంలో శాలువతో ఘనంగా సన్మానం చేశారు .ఈ కార్యక్రమంలో కలకొండ శ్రీనివాసులు గోకారం కృష్ణమూర్తి చిదేర వెంకటేశ్వర్లు గంధం రాజు వెంకటేష్ పరమేష్ సురేష్ బాబు బాస్కర్ సంబు వెంకట్ రమణ విజయ సన్మానము చేసిన వారిలో ఉన్నారు

అకాల వర్షం రైతన్నలు ఆగం

అకాల వర్షాలు రైతులను అతలాకుతలం చేశాయి

మల్లకపేట గ్రామాల్లో ఇళ్లపై భారీ చెట్లు కూలిపోయాయి

పరకాల నేటిధాత్రి

 

అకాల వర్షాల కారణంగా రైతులకు తీవ్ర నష్టం వాటిళ్లింది.చేతికి వచ్చిన పంట అకాల వర్షాల కారణంగా నేల రాలడంతో తమకు తీవ్ర నష్టం వాటిళ్లిందని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.హనుమకొండ జిల్లా పరకాల పట్టణ మరియు మండల పరిధిలో రాత్రికాల సమయంలో ఊహించని విధంగా తుఫాన్ ను తలపించేలాగా విపరీతమైన ఈదురుగాలులతో వర్షం బీభత్సం సృష్టించింది.

 

Farmers

 

దాదాపు ఒక గంటపాటు తీవ్రమైన ఉరుములు మెరుపులతో ఎడతెగని వడగండ్ల వాన కురిసింది.మండలంలోని మల్లక్కపేట గ్రామంలో ఈదురుగాలుల కారణంగా కొన్ని ఇండ్లపైన భారీ వృక్షాలు కూలి రాత్రంతా బిక్కు బిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది కల్లాలలో ఉన్న మిర్చి,మొక్కజొన్న పంటలు తడిచి ముద్దైన పరిస్థితి ఏర్పడింది.ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను కల్లాల్లో చూసుకుని ఇక తమ కష్టాలు తప్పుతాయని భావించిన కొద్దిసేపట్లోనే అకాల వర్షం రైతన్నల ఆశలను అడియాశలు చేసింది.ఏదైఏమైనా ఈ అకాలవర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించిందని చెప్పమల్లక్కపేటలో ఇళ్లపై భారీ చెట్లు కూలిపోయాయి.

అకాల వర్షం రైతన్నలు ఆగం

అకాల వర్షం రైతన్నలు ఆగం

మల్లక్కపేట గ్రామాల్లో ఇండ్లపైన కూలిన భారీ వృక్షాలు

పరకాల నేటిధాత

 

అకాల వర్షాల కారణంగా రైతులకు తీవ్ర నష్టం వాటిళ్లింది.చేతికి వచ్చిన పంట అకాల వర్షాల కారణంగా నేల రాలడంతో తమకు తీవ్ర నష్టం వాటిళ్లిందని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.హనుమకొండ జిల్లా పరకాల పట్టణ మరియు మండల పరిధిలో రాత్రికాల సమయంలో ఊహించని విధంగా తుఫాన్ ను తలపించేలాగా విపరీతమైన ఈదురుగాలులతో వర్షం బీభత్సం సృష్టించింది.దాదాపు ఒక గంటపాటు తీవ్రమైన ఉరుములు మెరుపులతో ఎడతెగని వడగండ్ల వాన కురిసింది

 

 

 

Farmers

మండలంలోని మల్లక్కపేట గ్రామంలో ఈదురుగాలుల కారణంగా కొన్ని ఇండ్లపైన భారీ వృక్షాలు కూలి రాత్రంతా బిక్కు బిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది కల్లాలలో ఉన్న మిర్చి,మొక్కజొన్న పంటలు తడిచి ముద్దైన పరిస్థితి ఏర్పడింది.ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను కల్లాల్లో చూసుకుని ఇక తమ కష్టాలు తప్పుతాయని భావించిన కొద్దిసేపట్లోనే అకాల వర్షం రైతన్నల ఆశలను అడియాశలు చేసింది.ఏదైఏమైనా ఈ అకాలవర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించిందని చెప్పవచ్చు

వేణుగోపాల్ రావుకు జర్నలిస్టుల శుభాకాంక్షలు.

వేణుగోపాల్ రావుకు జర్నలిస్టుల శుభాకాంక్షలు

షాద్ నగర్ /నేటి ధాత్రి.

 

 

షాద్ నగర్ బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా ఇటీవలే ఎన్నికైన వేణుగోపాలరావును షాద్ నగర్ స్థానిక జర్నలిస్టులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక దేవి గ్రాండ్ హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో వేణుగోపాల్ రావును కలుసుకున్న జర్నలిస్టులు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు ఖాదర్ పాషా, కస్తూరి రంగనాథ్, రాఘవేందర్ గౌడ్, శేఖర్ రెడ్డి, నరేష్, నరసింహారెడ్డి, ఎ.అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం.!

‘వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం’

 

అలంపూర్ / నేటి ధాత్రి.

 

గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి మండలం కొండేరు స్టేజి దగ్గర వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు పండించే వరి ధాన్యం మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లపై ఎమ్మెల్యే ఆరా తీశారు. రైతులకు ఉపయోగకరంగా ఈ కొనుగోలు కేంద్రం ఉపయోగపడాలని కొనుగోలు కేంద్రం అధికారులను ఆదేశించారు. రైతులకు నష్టం వచ్చేలా కాకుండా,లాభాలు వచ్చేలా దానికి అనుగుణంగా అధికారులు రైతులను సమన్వయం చేసుకోవాలన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని తెలిపారు.

గల్లంతయిన రెండో వ్యక్తి.. మృతదేహం లభ్యం

బాలానగర్ : గల్లంతయిన రెండో వ్యక్తి.. మృతదేహం లభ్యం

బాలానగర్ : నేటి ధాత్రి

 

 

బాలానగర్ మండలంలోని గంగాధర్ పల్లి గ్రామంలో సోమవారం మధ్యాహ్నం చేపలు పట్టేందుకు వెళ్లి గ్రామానికి చెందిన రాములు, యాదయ్య గల్లంతైన సంఘటన తెలిసిందే. సోమవారం గాలింపు చేపట్టిన మృతదేహాలు లభించలేదు. మంగళవారం సాయంత్రం శివరాములు మృతదేహం లభ్యం అయింది. బుధవారం ఎస్ఐ లెనిన్ ఆధ్వర్యంలో మరోసారి గాలింపు చేపట్టగా.. యాదయ్య (25) మృతదేహం లభ్యమయ్యింది. పోస్టుమార్టం నిమిత్తం యాదయ్య మృతదేహాన్ని జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒకే ఊరికి చెందిన ఇద్దరు వ్యక్తులు మరణించడంతో.. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

ప్రజలు దైవచింతన అలవర్చుకోవాలి.

న్యాల్కల్: ప్రజలు దైవచింతన అలవర్చుకోవాలి.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

ప్రజలు దైవచింతన అలవర్చుకోవాలని మల్లయ్య గుట్ట పీఠాధిపతి డాక్టర్ బసవలింగ అవధూత గిరి మహారాజ్ చెప్పారు. న్యాల్కల్ మండలం మరియం పూర్ గ్రామంలో వీరభద్రేశ్వర స్వామి జాతర ఉత్సవాల్లో మంగళవారం ఆయన పాల్గొని మాట్లాడారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మనసుకు ప్రశాంతత కలుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

అగ్ని ప్రమాదాల నివారణ పై అవగాహన కార్యక్రమం.

అగ్ని ప్రమాదాల నివారణ పై అవగాహన కార్యక్రమం.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

సంగారెడ్డి జిల్లాలో శాసనసభ నియోజకవర్గ కేంద్రమైన జహీరాబాద్ పట్టణంలో గల రైల్వేస్టేషన్, బస్సు స్టేషన్ లో మంగళ వారం మధ్యాహ్నం అగ్ని మాపక శాఖ అధికారులు సిబ్బంది ప్రయాణీకులకు అగ్ని ప్రమాదాల నివారణ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

అడవికి ప్రమాదవశాత్తు నిప్పు..

అడవికి ప్రమాదవశాత్తు నిప్పు..

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

ఝరాసంగం : ప్రమాదవశాత్తు అడవికి నిప్పంటుకొని చెట్లు, ఆకులు పూర్తిగా కాలి బూడిదైన ఘటన ఝరాసంగం మండలంలోని బర్దిపూర్ లో చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం సమయంలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని దట్టంగా మంటలు వ్యాపించాయి. బర్దిపూర్ గ్రామానికి చెందిన బత్తిన పాండు అనే యువకుడు అటువైపుగా వెళ్తున్న క్రమంలో మంటలను గమనించి జహీరాబాద్ ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది గ్రామస్తుల సహాయంతో మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో పలు నీలగిరి చెట్లు దగ్ధమయ్యాయి. ఫైర్ సిబ్బందికి సమయం లో సమాచారం అందించిన యువకులను ఫైర్ సిబ్బంది అభినందించారు.

జలపాతం కాదు.. జలధార..!

జలపాతం కాదు.. జలధార..!

• భూమికి సమాంతరంగా గంగమ్మ!

• గుండాల చుట్టూ బండ నేలలు

• రామేశ్వరాలయాల వద్ద జలవింత

• అదే నీటితో శివుడికి భక్తుల పూజలు

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

 

ఝరాసంగం: ఎటు చూసినా బండ నేల రాళ్లు, దట్టమైన గట్టు ప్రాంతం గట్టుపైన జల ధార నీటి (గుండం) ఎండాకాలంలో సైతం ఎండిపోని నీరు. ఏళ్ల తరబడి ఇదే తంతు జలధార ఎటు నుంచి వస్తుందో అంతుచి క్కని రహస్యం. చుట్టూ బండ నేల ఉన్నప్పటికీ ఆ ప్రాంతంలో మాత్రం నేటికీ నీరు భూమికి సమాంతరంగా ఉంటుంది.
సంగారెడ్డి జిల్లా కొల్లూరు రామేశ్వర దేవాలయం వద్ద గల జలగుండం స్థితి ఇది. ఝరా సంగం మండలంలోని కొల్లూర్ గ్రామ శివారులోని ప్రఖ్యాత రామేశ్వర దేవాలయం సమీపంలో ఒక వింతైన జలగుండం ఎల్లప్పుడూ ప్రత్యేక ఆకర్ష ణగా నిలుస్తోంది. చుట్టూ బండరాళ్లు, ఎత్తైన గట్టు ప్రాంతంతో నిండి ఉన్నప్పటికీ, ఈ నీటి గుండం మాత్రం ఎండాకాలంలో సైతం ఎండిపోకుండా నీటితో కళకళలాడుతూ ఉండటం విశేషం. ఎటు చూసినా రాతి నేల ఉండగా, ఈ ప్రాంతంలో మాత్రం నేలకు సమాంతరంగా నీటితో నిండి ఉంటుంది. సంవత్సరాలు గడుస్తున్నా ఈ జలధార తన ఉనికిని కాపాడుకుంటూ వస్తోంది. అయితే ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందనే విషయం మాత్రం ఇప్పటికీ అంతుచిక్కని రహస్యంగానే ఉంది. సాధార ణంగా ఎండాకాలంలో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఎండిపోతుంటాయి.భూగర్భ జలాలు అడుగం టుతాయి. కానీ కొల్లూరు రామేశ్వర దేవాలయం వద్ద గల ఈ జలగుండం లోని నీరు ఏ మాత్రం తగ్గకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నిత్యము ఆ నీటిని పశువుల కాపరులు, వ్యవసాయదారులు, కూలీలు,నీటిని సేవిస్తారు.

ఎండకాలం కూడా బావిలో నీరు..

Rameshwaram temples.

 

 

ఝరాసంగం మండలంలోని మాచునూర్ గ్రామ శివారులోని శ్రీ రామేశ్వర ఆలయం వద్దగల బావి నీరు ఎప్పుడూ తగ్గకుండా ఉండడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎండాకాలంలో సైతం ఈ బావిలో నీరు భూమికి సమాంతరంగా ఉండడం. విశేషం. చుట్టూ బండ నేల ఉన్నప్పటికీ, ఆయా బావిలోని నీరు ఎప్పుడూ తగ్గకపోవడం అంతుచి క్కని రహస్యంగా మారింది. బావిని సత్పురుషులైన రాందాస్ మహారాజ్, హనుమాన్ దాస్ మహారాజ్ కొన్ని ఏళ్ల క్రితం నిర్మించారని స్థానికులు కథనం. కొంతమంది భక్తులు బావి చుట్టూ సిమెంట్ గోడను నిర్మించారు. ప్రస్తుతం పూర్వపు బొక్కెన తాడు సహాయంతో భక్తులు, గ్రామస్తులు చేదుకొని స్నానాలు చేసి అక్కడే ఉన్న రామేశ్వర శివలింగానికి పూజలు నిర్వహిస్తారు. ఎండాకాలంలో సైతం నీరు తగ్గకుండా భూమికి సమాంతరంగానే ఉంటుంది. ఈ బావి లోతు సుమారుగా 20 ఫీట్లు ఉంటుందని గ్రామస్తుల కథనం. ఈ దేవాలయాల వద్ద మహాశివ రాత్రి. కార్తీక మాసం, పౌర్ణమి, అమావాస్య, శ్రావణ మాసం పండుగ సమయాలో జహీరాబాద్ ప్రాంతం నుంచి కర్ణాటకలోని బీదర్, చించోల్లు, కుంచారం, మన్నె కెళ్లి, తదితర ప్రాంతాల భక్తులు తరలివచ్చి పూజలు నిర్వహించి మొక్కలు చెల్లించుకుంటారు.

మహాబోధి ఆలయం అప్పగించాలంటూ బౌద్ధ సన్యాసుల ఆందోళన

ఆలయ వివాదంతో వార్తలకెక్కిన బుద్ధ గయ

మధ్య యుగాల్లో ముస్లిం చొరబాటుదార్ల చేతిలో పెద్దసంఖ్యలో మరణించిన బౌద్ధులు

దాడులో బతికిన బౌద్ధులు ఆలయాన్ని విడిచి పారిపోయారు

1590 నుంచి శైవ సన్యాసుల ఆధీనంతో ఆలయం

నిత్యం శైవ ఆరాధన, క్రతువుల నిర్వహణ

ఎప్పుడో పరిష్కారమైన సమస్యను కెలుగుతున్న రాజకీయ పార్టీలు

త్వరలో బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలే కారణం

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

బిహార్‌లోని బుద్ధ గయ అంటే తెలియనివారుండరు. ప్రపంచ వ్యాప్తంగా బౌద్ధులకు ఇది పవిత్ర పుణ్యక్షేత్రం. అయితే ఇక్కడ గత ఫిబ్రవరి నుంచి ఆల్‌ ఇండియా బుద్ధిస్ట్‌ ఫోరం (ఐఏబీఎఫ్‌) ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి. ఇంతకూ వీరి డిమాండ్‌ ఏంటంటే బుద్దగయ టెంపుల్‌ యాక్ట్‌`1949 (బీటీఏ)ను తక్షణం రద్దుచేయాలని. నిజానికి బుద్ధ గయలోని మహాబోధి లేదా మహా విహార ఆలయ నిర్వహణ బాధ్యతలు పూర్తిగా తమకే అప్పగించాలని బౌద్ధులు ఎన్నో ఏళ్లుగాడిమాండ్‌ చేస్తూ వస్తున్నారు. ఈ మహాబోధి మహావిహార దేవాలయ ప్రాంగణంలోని బోధి వృక్షం కిందనే గౌతమ బుద్ధుడికి జ్ఞానోదయమైందన్నది బౌద్ధుల విశ్వాసం. 

ఈ మహాబోధి దేవాలయాన్ని బౌద్ధం స్వీకరించిన తర్వాత అశోకచక్రవర్తి క్రీ.పూ.260లో నిర్మిం చాడు. భక్తియార్‌ ఖిల్జీ బారత్‌పై దండయాత్ర చేసేవరకు అంటే క్రీ.శ.13వ శతాబ్దం వరకు ఈ ఆలయం బౌద్ధుల నిర్వహణలోనే కొనసాగింది. తర్వాతి కాలంలో అంటే క్రీ.శ. 13వ శతాబ్దం చివరికాలం నుంచి 18వ శతాబ్దం వరకు ఈ ఆలయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. బ్రిటిష్‌ పాలన ప్రారంభమైన తర్వాత ఈ ఆలయానికి మరమ్మతులు చేపట్టారు. ప్రస్తుతం యునెస్కో ఈ ఆల యాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. 

ఆలయ వెబ్‌సైట్‌లోని సమాచారం ప్రకారం క్రీ.శ.1590లో ఘమండి గిరి అనే ఒక హిందూ శైవ సన్యాసి ఈ ఆలయానికి వచ్చి, ఇక్కడే నివాసం ఏర్పరచుకున్నాడు. ఇక్కడ ఆయన వివిధ క్ర తువులు నిర్వహించడమే కాకుండా, బుద్ధ గయ మఠాన్ని నెలకొల్పారు. అప్పటినుంచి ఈ ఆల య వ్యవహారాలను గిరి వంశస్థులే నిర్వహిస్తున్నారు. ఇదిలావుండగా దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రెండేళ్లకు బిహార్‌ ప్రభుత్వం బుద్ధ గయ ఆలయ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం ఆలయ నిర్వహణ బాధ్యతలను అప్పటివరకు నిర్వహిస్తున్న బుద్ధ గయ మఠం అధినేత నుంచి తప్పించి, ఎనిమిదిమందితో కూడిన కమిటీకి అప్పగించింది. బుద్ధ గయ టెంపుల్‌ యాక్ట్‌`1949 పేరుతో రూపొందించిన ఈ చట్టం ప్రకారం 1953లో బుద్ధగయ టెంపుల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ (బీటీ ఎంసీ) ఏర్పాటైంది. ఈ కమిటీలో నలుగురు బౌద్ధులు, నలుగురు హిందువులు సభ్యులుగా వుండే ఏర్పాటు జరిగింది. ఈ కమిటీనే ఇప్పటివరకు బుద్ధగయ లోని మహాబోధి ఆలయ నిర్వహణ బాధ్యతలను నిర్వస్తోంది.

ఈ చట్టం ప్రకారం బుద్ధగయ జిల్లా మెజిస్ట్రేట్‌ ఈ కమిటీకి ఎక్స్‌ాఅఫిసియో ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. మొదట్లో పొందుపరచిన నిబంధనల ప్రకారం ఎక్స్‌ాఅఫిసియో ఛైర్‌పర్సన్‌గా వ్యవహరించే డిస్ట్రిక్ట్‌ మెజిస్ట్రేట్‌ తప్పనిసరిగా హిందువై వుండాలి. అయితే 2013లో ఈ నిబంధనలో మార్పుచేసి, ఏ మతానికి చెందిన డిస్ట్రిక్ట్‌ మెజిస్ట్రేట్‌ అయినా ఎక్స్‌ అఫిసియో ఛైర్మన్‌గా వుండే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. అయితే ఈ చట్టాన్ని రద్దుచేయాలని డిమాండ్‌ చేస్తూగత ఫిబ్రవరి నుంచి వందమంది బౌద్ధ సన్యాసులు ఆలయ ప్రాంగణంలో నిరసనలు చేపట్టారు. ముఖ్యంగా ఫిబ్రవరి 12 నుంచి అన్ని బౌద్ధ గ్రూపులకు చెందిన సన్యాసులు ఆల్‌ ఇండియా బుద్ధిస్ట్‌ ఫోరం (ఎఐబిఎఫ్‌) అనే ఛత్రం కింద నిరాహారదీక్షలు కొనసాగిస్తున్నారు. ‘‘బౌద్ధులకు న్యా యం జరగాలి’’, ‘‘బీటీఎంసీలో అందరు సభ్యులు బౌద్ధులు మాత్రమే వుండాలి’’ అనేవి వీరు చే స్తున్న నినాదాలు.

మొదట్లో ఈ నిరసనలు మహాబోధి ఆలయంలోనే జరిగాయి. ఇక్కడ నిరాహారదీక్ష చేస్తున్న రెండుడజన్ల మంది బౌద్ధ సన్యాసులను ఫిబ్రవరి 27న బిహార్‌ పోలీసులు ఆలయ ప్రాంగణం నుంచి తొలగించడంతో, వారు ఆలయం వెలుపల తమ నిరసనలను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం వున్నఆలయ కమిటీని రద్దుచేసిన పూర్తిగా ఎనిమిదిమంది బౌద్ధులతోనే కొత్త కమిటీ ఏర్పాటు చేయా లని వీరు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ నిరసనలు ఆల్‌ ఇండియా బుద్ధిస్ట్‌ ఫోరం (ఐఐబీఎఫ్‌) అధ్యక్షుడు జంబు లామా, కార్యదర్శి ఆకాష్‌ లామా నేతృత్వంలో జరుగుతున్నాయి. ఇదిలా వుండగా ఛత్తీస్‌గఢ్‌ నుంచి బుద్ధగయ చేరుకున్న అభిషేక్‌ బుద్ధ అనే సన్యాసి, ‘దేశంలోని అన్ని మతాలు తమ ప్రార్థనా స్థలాలను నిర్వహిస్తున్నాయి. అటువంటప్పుడు ఈ మహాబోధి ఆలయ నిర్వహణ బాధ్యతలు బౌద్ధులకే అప్పగించడం న్యాయం’ అని అన్నారు. బౌద్ధుల మతపరమైన ప్రదే శంలో ఇంతమంది హిందువులు వుండటం అవసరమా? అని ఆయన ప్రశ్నించారు. ఇక్కడ బౌద్ధులు జరుపుతున్న నిరసనలకు మద్దతుగా ఢల్లీి, ముంబయి, మైసూరు, అమెరికాలోని బౌద్ధులు ఆందోళనలు నిర్వహించారు. రాజ్యాంగం ప్రసాదిస్తున్న మతస్వేచ్ఛ హక్కుకు బీటీఏ పూర్తి విరు ద్ధమని బౌద్ధ సన్యాసులు వాదిస్తున్నారు. ఆలయంలో హిందూ సన్యాసులు వైదిక క్రతువులు నిర్వహిస్తున్నారని, బౌద్ధ మత సిద్ధాంతాలకు ఇది పూర్తి విరుద్ధమని వారు వాదిస్తున్నారు. 

ఇదొక శైవమఠం

ఇదిలావుండగా ఈ బుద్ధగయ మఠం, గత కొన్ని శతాబ్దాలుగా శైవమఠంగా కొనసాగుతూ, ఇక్కడ శైవ సాంప్రదాయ క్రతువులను పాటిస్తూ వస్తోంది. ఈ ఆలయాన్ని కొన్ని శతాబ్దాలుగా కాపాడుతూ వస్తున్నది కూడా వీరే. ఈ నేపథ్యంలో మార్చి 25న ఆలయ కమిటీ బాధ్యులు విలేకర్లతో మాట్లాడుతూ, బౌద్ధ సన్యాసులు చేస్తున్న ఆందోళన కేవలం రాజకీయ ప్రేరేపితమైందని ఆరోపించారు. బౌద్ధ సన్యాసులు చేస్తున్న వాదనలను కమిటీ కొట్టిపారేసింది. మఠం అధినేత వివేకానందగిరి మాట్లాడుతూ కొందరు రాజకీయ నాయకుల ప్రమేయంతో ఈ ఆందోళన కొనసాగుతోందని. మఠంలో కొనసాగుతున్న ప్రశాంతతను భగ్నం చేయడానికే ‘మహాబోధి మందిర్‌ ముక్తి ఆందోళన్‌’ పేరుతో ఆందోళనలు కొనసాగిస్తున్నారని ఆరో పించారు. ఈరకంగా సామాజిక అశాంతిని సృష్టించడం ఈ వర్గాల ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు. కేవలం బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరుగనున్న తరుణంలో రాజకీయ లబ్దికోస మే కొన్ని పార్టీలు ఈరకమైన వివాదాలను రెచ్చగొడుతున్నాయని ఆయన అన్నారు. ‘మా మఠ సంప్రదాయం ప్రకారం బుద్ధుడిని శ్రీమహావిష్ణువు పదవ అవతారంగా పరిగణిస్తాం. బౌద్ధులను మా సహోదరులుగా భావిస్తాం’ అని ఆ యన అన్నారు. ఎన్నో ఏళ్లుగా బౌద్ధ భక్తులు ప్రశాంతంగా ఇక్కడ ప్రార్థనలు చేసుకుంటున్నారు. మేం ఎన్నడూ వారికి అడ్డు చెప్పలేదు. విదేశాలనుంచి కూడా బౌద్ధులు ఇక్కడకు వచ్చి తమ ప్రార్థనలు కొనసాగిస్తున్న సంగతిని ఆయన గుర్తు చేశారు. 

అసలు చరిత్ర

నిజానికి ఇక్కడి సమస్య కొన్ని దశాబ్దాల క్రితమే పరిష్కృతమైంది. 1192లో ముస్లింల దండయా త్రల సందర్భంగా ఇక్కడి ఎంతోమంది బౌద్ధ సన్యాసులను దారుణంగా హతమార్చారు. దీంతో మిగిలినవారు ఈ ఆలయాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు. తర్వాత 1590 నుంచి ఈ ఆలయాన్ని శైవ సన్యాసులు తమ ఆధీనంలోకి తీసుకొని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు. 1894లో అప్పటి బర్మారాజు ఈ ఆలయ భవనాన్ని బౌద్ధ ప్రార్థనా మందిరంగా నిర్మిస్తానని చేసిన ప్రతిపాదనకు శైవ సన్యాసులు అంగీకరించారు. అయితే అప్పట్లో వచ్చిన ఆంగ్లో`బర్మా యుద్ధం, వివిధ దేశాల శకుని పాత్ర కారణంగా ఈ ప్రాజెక్టు నిలిచిపోయింది. 1890`92 మధ్యకాలంలో ‘ది లైట్‌ ఆఫ్‌ ఆసియా’ పుస్తక రచయిత ఎడ్విన్‌ ఆర్నాల్డ్‌ ఈ ఆలయాన్ని బౌద్ధులకు అప్పగించాలని నాటి బ్రిటిష్‌`ఇండియా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు. అంతేకాదు జపాన్‌కు వెళ్లి తన డిమాండ్‌కు దౌత్యపరమైన మద్దతివ్వాలని కూడా అక్కడి ప్రభుత్వాన్ని కోరాడు. దీనిపై కోర్టులో కేసు దాఖలు కాగా, కోర్టు బౌద్ధులకు వ్యతిరేకంగా తీర్పు చెప్పింది. తర్వాత 1901లో స్వామి వివేకానంద, 1935లో హిందూ మహాసభ నాయకుడు భాయి పరమానంద వంటి వారు ఈ ఆలయం విష యంలో ఎన్నో చర్చలు జరిపారు. ఎట్టకేలకు 1924లో బాబూ రాజేంద్రప్రసాద్‌ నేతృత్వంలో ఒక రాజీ ప్రతిపాదన ముందుకు తెచ్చారు. దీనికి అనేక అడ్డంకులు కల్పించినప్పటికీ, చివరకు ఈ ప్రతిపాదనే 1949లో చట్టంగా రూపొందింది. దీని ప్రకారం హిందువుల, బౌద్ధులకు ఇక్కడ ప్రార్థనలు జరుపుకునేందుకు సమాన హక్కులుంటాయి. మేనేజ్‌మెంట్‌ కమిటీలో కూడా రెండువర్గాలకు సమాన ప్రాతినిధ్యాన్ని ఈ చట్టం కల్పించింది. ఇదిలావుండగా ప్రస్తుత బౌద్ధుల ఆందోళనను హిందువులు మరోలా పరిగణిస్తున్నారు. ముస్లింల దాడులతో బౌద్ద సన్యాసులు పారిపో యిన తర్వాత ఆలయాన్ని పరిరక్షిస్తూ, దాని ఉనికిని కాపాడుతూ వచ్చిన తమకు కృతజ్ఞత చెప్పాల్సింది పోయి, బౌద్ధులు కృతఘ్నులుగా వ్యవహరిస్తున్నారని భావిస్తున్నారు. 

ఈ మహాబోధి ఆలయ విముక్తి ఉద్యమాన్ని ప్రారంభించింది జపాన్‌కు చెందిన భదంత్‌ ఆర్య నాగార్జున సురై ససాయ్‌. నిజం చెప్పాలంటే బౌద్ధం చైనా, టిబెట్‌, ఉత్తరకొరియా, వియత్నాంలలో కమ్యూనిస్టుల చేతులో దారుణంగా అణచివేతకు గురైంది. దక్షిణకొరియాలో బౌద్ధాన్ని, క్రైస్తవం పూర్తిగా కప్పేసింది. బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌ కొండల్లోని చక్మా తెగ ప్రజలు బౌద్ధాన్ని పాటిసా ్తరు. ముస్లిం సెటిలర్లు వీరిని తరిమివేశారు. ఈ జపాన్‌ సన్యాసి ససాయ్‌ ఆయా దేశాల్లో ఇక్కడి మాదిరిగానే ఆందోళన చేపడితే ఆయన పరిస్థితి ఎలావుండేదో ఊహించుకోవచ్చు. మనది మితిమీరిన స్వేచ్ఛ కలిగిన ప్రజాస్వామ్యం కనుక ఎటువంటి ఆందోళనకైనా మద్దతు లభిస్తుంది. న్యాయాన్యాయాలతో పనిలేదు. నిజం చెప్పాలంటే మహాబోధి ఆలయాన్ని బాగా అభివృద్ధి చేసింది శైవుడైన ఒక బ్రాహ్మణమంత్రి. ఇది కమిటీ సభ్యులు కూడా కాదనలేని సత్యం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బౌద్ధ సన్యాసుల ఆందోళన వెనుక కొన్ని రాజకీయ శక్తుల పాత్రను కొట్టిపారేయడానికి వీల్లేదు. కులాలు మతాల మధ్య విభేదాలు సృష్టించి ఓట్లను దండుకునే వ్యూహంలోనే ఇది భాగం కావచ్చు. మరి ఈ ఆందోళనకు ఎప్పుడు పరిష్కారం లభిస్తుందో కాలమే నిర్ణయించాలి.

‘‘బిఆర్‌ఎస్‌’’ రజతోత్సవాలు.. తెలంగాణ భవిష్యత్తుకు బంగారు బాటలు.’’బి.వినోద్‌ కుమార్‌

‘‘బీఆర్‌ఎస్‌’’ రజతోత్సవాలు అంటే పార్టీ పండుగ మాత్రమే కాదు… ప్రజల పండుగ…అంటున్న బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు ‘‘బి. వినోద్‌ కుమార్‌’’, నేటిధాత్రి ఎడిటర్‌ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’తో పంచుకున్న ఉద్యమ స్మృతులు, పార్టీ ప్రస్థానంపై పంచుకున్న విషయాలు, విశేషాలు ఆయన మాటల్లోనే..

https://youtu.be/cwZB9cR80Oo

`మరో వందేళ్ల బీఆర్‌ఎస్‌ కు పడనున్న అడుగులు

`తెలంగాణ వున్నంత వరుకు బిఆర్‌ఎస్‌ వుంటుంది

`బీఆర్‌ఎస్‌ తెలంగాణ ప్రజల గుండెల్లో ఎప్పుడూ వుంటుంది

`తెలంగాణ తెచ్చిన పార్టీగా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది

`తెలంగాణ తలరాత మార్చిన పార్టీగా మనుగడలోనే వుంటుంది

`బీఆర్‌ఎస్‌ రాజకీయ ఉద్యమ పోరాటం నిండిన పార్టీ

`వ్యక్తిగత రాజకీయాల కోసం పుట్టిన పార్టీ కాదు

`సిద్ధాంతాలు లేని పార్టీలు బీఆర్‌ఎస్‌కు ఎప్పుడూ పోటీ కాదు

`ప్రపంచ చరిత్రలోనే ఈతరం ప్రజల కోసం పుట్టిన పార్టీ బీఆర్‌ఎస్‌

`తెలంగాణ సంకెళ్లు తెగించి కొట్లాడి తెంపిన పార్టీ

`తెలంగాణకు స్వేచ్ఛా వాయువులు ప్రసాదించిన పార్టీ

`తెలంగాణ ఆత్మ గౌరవం నింపిన పార్టీ

`తెలంగాణ చైతన్య రథాలు కదిలించిన పార్టీ బీఆర్‌ఎస్‌

`తెలంగాణలో చైతన్య కిరణాలు నింపిన పార్టీ బీఆర్‌ఎస్‌

`తెలంగాణ నే ఒక ఉద్యమ ప్రవాహంగా మార్చిన పార్టీ బీఆర్‌ఎస్‌

`తెలంగాణ పోరులావా పొంగించిన పార్టీ బీఆర్‌ఎస్‌

`బీఆర్‌ఎస్‌ లేకుంటే జై తెలంగాణ నినాదమే లేదు

`కేసీఆర్‌ లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదు

`కేసీఆర్‌ అనే పదమే విశ్వజనీనం

`బీఆర్‌ఎస్‌ అనే పార్టీయే ఉద్యమ సోపానం

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

బిఆర్‌ఎస్‌ పార్టీ రజతోత్సవాలంటే ఒక్క పార్టీ పండుగనే కాదు. అది తెలంగాణ ప్రజల పండుగ. తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ పండుగ. తెలంగాణ ప్రజల గుండె చప్పుడు బిఆర్‌ఎస్‌. కేసిఆర్‌ మది నుంచి జాలు వారిన ఆశయాలు, ఆలోచనలు నుంచి పురుడు పోసుకున్న పార్టీ బిఆర్‌ఎస్‌. బిఆర్‌ఎస్‌ ఏర్పాటు చేసి 25 సంవత్సరాలు పూర్తవుతున్న శుభవేళ జరుపుకుంటున్న ప్రజా సంబురాలు. పార్టీ వేడుకనే కాదు, ప్రేజా వేడుకలు. తెలంగాణ ఉద్యమాన్ని ఉరకలెత్తించిన పార్టీ. ప్రజా ప్రవాహాన్ని పోరుబాటగా మలిచిన పార్టీ. ప్రజా సేవలో, ఉద్యమ స్వరూపాన్ని నింపిన పార్టీ. తెలంగాణ అభివృద్ది ప్రాంత హక్కు..తెలంగాణ రాష్ట్ర జన్మ హక్కు అని నినాదం నుంచి పుట్టిన పార్టీ. తెలంగాణ ఆత్మగౌరవం నింపుకొని, తెలంగాణ ఆత్మాభిమానం చాటి చెప్పిన పార్టీ. ఒక వ్యక్తి రాజకీయం కోసం పుట్టిన పార్టీ కాదు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల నుంచి పుట్టిన పార్టీ. తెలంగాణ ఆత్మగౌరవం నుంచి పుట్టినపార్టీ. తెలంగాణకోసం కేసిఆర్‌ చేసిన త్యాగం నుంచి ఉద్భవించినపార్టీ. 60 సంవత్సరాల తెలంగాణ గోసను నుంచి విముక్తికోసం పుట్టిన పార్టీ. పద్నాలుగేళ్లపాటు అలుపెరగని పోరాటం చేసి, తెలంగాణ సాదించిన పార్టీ. తెలంగాణ తెచ్చిన కేసిఆర్‌ చేతుల మీదుగా బంగారు తెలంగాణ ఆవిష్కారం చేసిన పార్టీ. మోడువారిని పల్లెను చిగురించిన పార్టీ. చుక్క నీటి కోసం తల్లడిల్లిన పల్లెలో గోదారి పరవళ్లు తొక్కించిన పార్టీ. ఇంటింటికీ గోదారి నీళ్లందించిన పార్టీ. సాగు లేక, సాగు చేయలేక రైతు కన్నీటి వ్యవసాయం నుంచి, గోదారి గలగలలు వింటూ రైతు కన్నీళ్లు తుడిచిన పార్టీ. ఒకప్పుడు తొండలు కూడా గుడ్లు పెట్టవంటూ వెటకారం చేసిన వాళ్లు కోట్ల రూపాయల ధరలు పలికేలా తెలంగాణను తీర్చిదిద్దిన పార్టీ. అందుకే బిఆర్‌ఎస్‌ అంటే తెలంగాణ ఇంటి పార్టీ. తెలంగాణ కుటుంబ పార్టీ. తెలంగాణ గుండెల్లో చిరస్ధాయిగా నిలిచిపోయే పార్టీ. మరో వెయ్యేల్లయినా చెరిగిపోని, తరిగిపోని చరిత్ర బిఆర్‌ఎస్‌ పార్టీది. తెలంగాణ ఉనికి వున్నంత వరకు నిలిచిపోయే పార్టీ. తెలంగాణ అస్ధిత్వాన్ని తన భుజాల మీద మోసే ఏకైక పార్టీ బిఆర్‌ఎస్‌ పార్టీ. ఎన్ని తరాలు మారినా తరగని చిరునామా లాగా శాశ్వతంగా తెలంగాణ గుండెల్లో నిండిన పార్టీ అంటున్న బిఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, ఉద్యమకారుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు బోయిన పల్లి వినోద్‌ కుమార్‌, నేటిధాత్రి ఎటిటర్‌ కట్టా రాఘవేంద్రరావుతో ఉద్యమ కాలం నాటి అనుభవాలు, బిఆర్‌ఎస్‌ పుట్టు పూర్వత్తరాలపై పంచుకున్న ఆసక్తికరమైన అంశాలు…ఆయన మాటల్లోనే..

బిఆర్‌ఎస్‌ పార్టీ రజతోత్స సంబురాలు అంటే పార్టీ పండుగ మాత్రమే కాదు…అవి ప్రజల జరుపుకునే పండుగ. తెలంగాణ కోసమే పుట్టి, అలుపెరుగని పోరాటం చేసి, తెలంగాణ తెచ్చిన పార్టీ. ఈ సంబురాల వేళ మరో వెయ్యేళ్ల ప్రయాణం సాగాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే బిఆర్‌ఎస్‌ అనేది తెలంగాణ ప్రజల పార్టీ. మా పార్టీ బిఆర్‌ఎస్‌ అని ప్రజలు గర్వంగా చెప్పుకునేపార్టీ. త్యాగాల నుంచి పుట్టి, తెలంగాణ పొలికేకలు పెట్టి, గులాబీ జెండాను పట్టి, పిడికిలెత్తి జై తెలంగాణ అని నినదించిన ఏకైక పార్టీ. అసలు తెలంగాణ అనడానికి తెలంగాణ నాయకులకే నోరు రాని రోజులవి. తెలంగాణ అంటే ఎక్కడ తమ పదవులు పోతాయో అని భయపడిపోయిన రోజులు. వెనుకబడిన ప్రాంతం అని తెలంగాణ నాయకుల చేత సమైక్య పాలకులు చెప్పించిన కాలం. కష్టమొచ్చిన చెప్పొదు. కాలం కాకపోయినా ఏడువొద్దు. తెలంగాణ కోసం ఏది అడిగినా గొంతెమ్మ కోరికలంటూ సమ్యై వాదులు హేళన చేసిన రోజుల నుంచి జై తెలంగాణ అని దిక్కులు పిక్కటిల్లేలా గర్జించిన కేసిఆర్‌ ఉక్కు సంకల్పం నుంచి ఉద్భవించిన గులాబి సింహస్వప్నం బిఆర్‌ఎస్‌ పార్టీ. ఆ మాటలు చెబుతుంటేనే రక్తం మరుగుతుంది. బిఆర్‌ఎస్‌ అని పలుకుతుంటేనే రక్తం ఉప్పెనై పొంగుతుంది. అంతటి శక్తి వంతమైన పదం బిఆర్‌ఎస్‌. గులాబీ జెండను చూస్తేనే ఉద్యమం ఉరకలెత్తేది. ప్రజలు జెండా పట్టుకొని ఉద్యమ రంగంలోకి దింకేలా చేసింది. అంత గొప్పది. అందుకే టిఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణ వున్నంత వరకు వుంటుంది. తెలంగాణ గుండెల్లో ఎప్పుడూ చిరంజీవిగా చిరస్ధాయిగా నిలిచిపోతుంది. తెలంగాణ గుండెలో గులాబీ రెపరెపలాడుతూ వుంటుంది. తెలంగాణ తలరాత మార్చిన పార్టీగా రాజకీయ మనుగడలో ముందు వరుసలోనే వుంటుంది. బిఆర్‌ఎస్‌ అని పలుకుతున్న ప్రతి సందర్భంలోనూ కేసిర్‌, కేసిఆర్‌ అని ప్రకృతి నుంచిధ్వని వినిపిస్తుంది. తెలంగాణ మూల సిద్దాంతంగా, తెలంగాణ వాదమే సూత్రంగా పుట్టిన పార్టీ. సిద్దాంతాలు లేని ఏ రాజకీయ పార్టీ బిఆర్‌ఎస్‌కు పోటీ కాదు. రాలేదు. తెలంగాణ సంకెళ్లను తెంచడానికి తెగించి కొట్లాడిన పార్టీ బిఆర్‌ఎస్‌. తెలంగాణలో అణువణువూ నిండిన పార్టీ. తెలంగాణ వాదానికే కాదు, తెలంగాణకే స్వేచ్చా వాయువులు ప్రసరింపజేసి పార్టీ. ఉద్యమానికి ఊపిరి పోసి, తెలంగాణ చైతన్య రథ చక్రాలు కదిలించిన పార్టీ. తెలంగాణలో చైతన్య కిరణాలు పంచిన పార్టీ. తెలంగాణనే ఒక ఉద్యమ ప్రవాహంగా మార్చిన పార్టీ. తెలంగాణ పోరు లావా పొంగించిన పార్టీ. ఎందుకంటే బిఆర్‌ఎస్‌ లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదు. అందుకే కేసిఆర్‌ అనే మూడక్షరాల పదం విశ్వజననీం…సర్వాంతర్యామి స్వరూపం. బిఆర్‌ఎస్‌ పార్టీయే ఉద్యమ సోపానం. తెలంగాణ కోసం కేసిఆర్‌ తొలి అడుగు వేసిన నాడు ఎటు చూసినా ఎడారి పరిస్ధితులు. ఒక్కడుగా అడుగులు మొదలు పెట్టాడు. ఒక్కడే సింహమై గర్జించాడు. ఒక్కడే జై తెలంగాణ అని పిడికిలెత్తి నినదించాడు. ఒక్కడే అసెంబ్లీలో తన గళం వినిపించాడు. ఒక్కడే అసెంబ్లీలో తెలంగాణ సమస్యలపై ఏకరువు పెట్టారు. కేసిఆర్‌ నోరు నొక్కేందుకు ఎంతో ప్రయత్నం చేశారు. తెలంగాణ కోసం తొలి రాజీనామా చేసినప్పుడు, తెలంగాణ వాదాన్ని సమూలంగా అణచివేయాలని చూశారు. ఎక్కడికక్కడ అప్పటి ఉమ్మడి పాలకపక్షంతో పాటు, అప్పటి ప్రతిపక్షం కూడా చేతులు కలిపి, కేసిఆర్‌ను ఓడిరచాలని విశ్వ ప్రయత్నం చేశారు. ఎందుకంటే కేసిఆర్‌ నాయకత్వం ఎలాంటిదో అప్పటికే ఉమ్మడి పాలకులకు తెలుసు. కేసిఆర్‌ ఎంతటి పట్టుదల వున్న నాయకుడో తెలుసు. కేసిఆర్‌ ఎంతటి విజ్ఞానవంతుడో తెలుసు. ఎంతటి వాగ్ధాటి కల్గిన నాయకుడో తెలుసు. తెలంగాణపై కేసిఆర్‌కు వున్నంత అవగాహన మరే నాయకుడికి లేదని తెలుసు. అందుకే అడుగడుగునా కేసిఆర్‌ను అవమానపర్చాలని చూశారు. కేసిఆర్‌ అదే తీరులో స్పందించి సింహస్పప్నమైన వారి విమర్శలకు తెలంగాణ నిజాలు చెప్పి నోరు మూపించేవారు. అలా ప్రజలందరికీ తెలంగాణ కావాలని వున్నా,కేవలం పదవుల కోసం ఉమ్మడి పాలకులకు మోచేతి నీళ్లు తాగే నాయకులు కేసిఆర్‌ను పలుచన చేయాలని అనేక మార్లు ప్రయత్నం చేశారు. కాని ధర్మం, న్యాయం కేసిఆర్‌ వైపు నిలించింది. కేసిఆర్‌ మీద నమ్మకంతో తెలంగాణ అంతా కదిలింది. తొలి గులాబీ జెండా ఎగిరింది. అది తెలంగాణ అంతటా రెపరెపలాడిరది. దేశ దిగంతాలు దాటి ప్రపంచంలో తెలంగాణ వాదులున్న అన్ని దేశాలలో గులాబీ జెండా ఎగిరింది. నిజానికి రాజకీయ పార్టీ నపడం అంటే సామాన్యమైన విషయం కాదు. పైగా ఉద్యమ పార్టీ నిర్వహణ అనేది మరింత అసాద్యం. అటు ఉద్యమాన్ని రంగరించి, ఇటు రాజకీయానికి చాణక్యాన్ని జోడిరచి కేసిఆర్‌ సాగించిన ప్రయాణం ప్రపంచంలోనే ఎక్కడా, ఎవ్వరూ నిర్వహించి వుండరు. తెలంగాణ కోసం కేసిఆర్‌ చేసిన సాహసం అంతా ఇంతా కాదు. కేవలం ఆమరణ దీక్ష సమయంలోనే ,కాదు అడుగుడుగునా ఆయన తన ప్రాణాలను లెక్క చేయకుండా ఉద్యమాన్ని కొనసాగించారు. పార్టీని నడిపించారు. ప్రజలను చైతన్యం నింపారు. పసిపాప నుంచి మొదలు పండు ముసలివరకు జై తెలంగాణ అని నినదించేలా కోట్లాది మంది తెలంగాణ వాదులను తయారు చేశారు. ఒక్క కేసిఆర్‌ గొంతు కోట్ల గొంతుకలై జై తెలంగాణ అని గర్జిస్తుంటే దిక్కులు మారుమ్రోగిపోయాయి. అదీ కేసిఆర్‌ అంటే..అలాంటి కేసిఆర్‌ పెట్టిన బిఆర్‌ఎస్‌ పార్టీ ఆచంద్ర తారార్కం వెలుగుతుందని చెప్పడంలో సందేహంలేదు. తెలంగాణ వున్నంత వరకు, తెలంగాణ ఉనికి వున్నంత వరకే కాదు, ఎన్ని వేల సంవత్సరాలైనా సరే ఆయన నడిచిన అడుగులు చరిత్ర పుటల్లో సజీవంగా వుంటాయి. అందుకే బిఆర్‌ఎస్‌ రజతోత్సవాలను ప్రజలే జరుపుకునేందుకు వరంగల్‌ వస్తారు. ప్రజలే ఆ పండుగను ఆశీర్వదిస్తారు. మహా సింహగర్జనను మించిన సభను నిర్వహించి, తెలంగాణ వాదం ఎంత బలమైందో, కేసిఆర్‌ నాయకత్వం ఎంత గొప్పదో చూస్తారు. కేసిఆర్‌ పిలుపు ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టిస్తుందో వరంగల్‌ రజతోత్సవ సభతో మరోసారి తెలుసుకుంటారు. కేసిఆర్‌తోపాటు తొలి నుంచి ఇప్పటి దాకా తెలంగాణ కోసం పునరంకితమైనందుకు నా జన్మ కూడా ధన్యమైందనే అనుకుంటాను. తెలంగాణ ఉద్యమంలో నేను కీలకమైన పాత్ర పోషించాను. కరుడుగట్టిన బిఆర్‌ఎస్‌ సైనికుడిగా పార్టీకోసం పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నాను.

సీకేఎం డిగ్రీ కళాశాల ఎఫ్ఎసి ప్రిన్సిపాల్.!

సీకేఎం డిగ్రీ కళాశాల ఎఫ్ఎసి ప్రిన్సిపాల్ గా డాక్టర్ ఏ.ధర్మారెడ్డి. 

వరంగల్, నేటిధాత్రి

 

 

దేశాయిపేటలోని సికేఎం ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల ఎఫ్ఎసి (ఫుల్ అడిషనల్ ఛార్జీ) ప్రిన్సిపాల్ గా డాక్టర్ ఏ. ధర్మారెడ్డి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. మార్చ్ 31వ తేదీన సికేఎం డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గా డాక్టర్ జి .శశిధర్ రావు పదవి విరమణ పొందడంతో ఆ స్థానంలో కళాశాలలో కెమిస్ట్రీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ ఏ ధర్మారెడ్డికి ఇంచార్జ్ ప్రిన్సిపాల్ గా వ్యవహరించారు. అనంతరం కళాశాల విద్య కమిషనర్ ఉత్తర్వుల ఆదేశానుసారం తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకు సీకేఎం డిగ్రీ కళాశాలకు ఫుల్ అడిషనల్ చార్జ్ ప్రిన్సిపాల్ గా వ్యవహరించాలని కమిషనర్ ఆఫ్ ఎడ్యుకేషన్ దేవసేన ఐఏఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు మంగళవారం డాక్టర్ ఏ .ధర్మారెడ్డి ఎఫ్ ఎ సి ప్రిన్సిపాల్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది డాక్టర్ ధర్మారెడ్డికి పుష్పగుచ్చాలు అందించి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా తనను ఎఫ్ఎసి ప్రిన్సిపాల్ గా నియమించినందుకు సిసిఈ ఉన్నతాధికారులకు, సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిసిఈ సూపరిండెంట్ కృష్ణారెడ్డి, సీనియర్ అసిస్టెంట్ భరత్ చారి, కళాశాల పూర్వ ప్రిన్సిపాల్ డాక్టర్ జీ. శశిధర్ రావు, అధ్యాపకులు డాక్టర్ కే ఎల్ వి. వరప్రసాదరావు, కెప్టెన్ డాక్టర్ పి. సతీష్ కుమార్, లైబ్రరియన్ ఎస్ .అనిల్ కుమార్, సూపరిండెంట్ జి .శ్రీనివాస్, గెస్ట్ అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఏసిబి వలలో అవినీతి అధికారి..

ఏసిబి వలలో అవినీతి అధికారి.
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ శేరిలింగంపల్లి జోనల్ అర్బన్ బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్

ఏసీబీ రైడ్స్ తో మిగతా విభాగాల అధికారులు పరారు…

శేరిలింగంపల్లి, నేటి,ధాత్రి :-

 

ఏసీబీ వలలో మరో అవినీతి తిమింగలం పట్టుబడింది. శేరిలింగంపల్లి జోనల్ జీహెచ్ఎంసీ అర్బన్ బయోడైవర్సిటి డిప్యూటీ డైరెక్టర్ రూ. 70 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు మంగళవారం మధ్యాహ్నం శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో ఏసీబీ డి.ఎస్.పి శ్రీధర్ ఆధ్వర్యంలో సోదాలు చేపట్టింది. అర్బన్ బయోడైవర్సిటి డిప్యూటీ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ గత కొంతకాలంగా చాంద్రాయణ గుట్ట సర్కిల్ లో అర్బన్ బయోడైవర్సిటి విభాగం ఇంచార్జ్ గా వ్యవహరిస్తున్నారు.

https://youtu.be/_tzxsiCQ0C0?si=eQjpA5cVA-A1Qq30

చాంద్రాయణ గుట్ట సర్కిల్ పనికి సంబంధించి ఓ కాంట్రాక్టర్ వద్ద రూ. 2 లక్షల 20 వేలు లంచం డిమాండ్ చేశాడు. కాగా ఇదివరకే రూ. 1 లక్ష 50 వేలు పలు దఫాలుగా తీసుకున్నాడు. ఒప్పందం ప్రకారం మిగతా రూ. 50 వేలు ఇచ్చేందుకు శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయానికి రావాలని సూచించాడు. దీంతో కాంట్రాక్టర్ శ్రీనివాస్ తెలిపిన విధంగా శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలోని ఛాంబార్ కు వచ్చాడు. కాంట్రాక్టర్ నుంచి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు శ్రీనివాసుని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ డి.ఎస్.పి శ్రీధర్ తెలిపారు.

https://youtu.be/_tzxsiCQ0C0?si=eQjpA5cVA-A1Qq30

 

ఏసీబీ రైడ్స్ తో మిగతా విభాగాల అధికారులు పరారు…
శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలోని అర్బన్ బయోడైవర్సిటీ విభాగం అధికారి పై ఏసీబీ రైట్స్ జరగడంతో, జోనల్ కార్యాలయంలోని మిగతా విభాగాల అధికారులు పరారయ్యారు. ఉదయం 12 గంటల నుంచి అన్ని విభాగాల అధికారులు కార్యాలయంలో లేకపోవడంతో కుర్చీలు కాలిగా దర్శనమిచ్చాయి. అధికారులు అందుబాటులో లేకపోవడంతో పనుల పైన విచ్చేసిన ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఏదో ఒక అధికారిపై ఏసీబీ దాడులు జరిగితే మిగతా అందరూ వీధిల నుంచి తప్పించుకుని వెళ్లడంపై సర్వత్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ఏసీబీ దాడులకు భయపడే అధికారులు పారిపోయారంటూ పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి.

 

https://youtu.be/_tzxsiCQ0C0?si=eQjpA5cVA-A1Qq30

మట్టి దొంగల చేతిలో ధ్వంసం అవుతున్న ఆస్తులు

మట్టి దొంగల చేతిలో ధ్వంసం అవుతున్న ప్రభుత్వ ఆస్తులు

గుడ్లప్పగిచ్చి చూస్తున్న అధికారులు

నాకు రాజకీయ పలుకుబడి ఉంది

ఆనాడు పెట్టుబడి పెట్టా.. ఇప్పుడు సంపాదించుకోవడం తప్పా?

కరీంనగర్, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం షానగర్ గ్రామంలోని ఎల్లమ్మ చెరువులో మట్టి తరలింపునకు ఇరిగేషన్ శాఖ అధికారులు ఒక వెయ్యి క్యూబిక్ మీటర్లు తరలింపునకు కోమండ్లపల్లి గ్రామం సుల్తానాబాద్ మండలం పెద్దపల్లి జిల్లాకు చెందిన వ్యక్తికి నాలుగు లారీల ద్వారా పరిమిషన్ ఇచ్చియున్నారు. దీనిని ఆసరాగా చేసుకున్న సంబంధిత కాంట్రాక్టర్ పదుల సంఖ్యలో వాహనాల ద్వారా మట్టిని తరలించడమే కాకుండా విద్యుత్ శాఖకు సంబంధించిన ఒక ట్రాన్స్ఫార్మర్, మూడు విద్యుత్ పోలను విరగగొట్టి మట్టిని తరలించుచున్నారు.

 

Goervnment

ఈవిషయమై సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శిని వివరణ కోరగా గ్రామానికి చెందిన ముగ్గురు రైతులకు పర్మిషన్ ఇచ్చామని తెలిపారు. పరిమిషన్ రైతులకు ఇచ్చినట్లయితే సంబంధిత చెరువులో పదుల సంఖ్యలో ర్యాలీలు గ్రామపంచాయతీ ముందు నుండి ఎలాంటి పర్మిషన్ లేకుండా మట్టిని తరలిస్తుంటే సంబంధిత గ్రామపంచాయతీ కార్యదర్శి కళ్ళున్న గుడ్డివాడి లాగా ప్రవర్తించడం మండలంలోని ప్రజలను విష్మయానికి గురిచేస్తుంది. విద్యుత్ పోల్లు మరియు ట్రాన్స్ఫార్మర్ ధ్వంసం విషయమై సంబంధిత విద్యుత్ శాఖ ఏఈ కమలేష్ ను వివరణ కోరగా సంబంధిత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని పోలీస్ శాఖ వారు వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని తెలిపారు.

 

Goervnment

ఇరిగేషన్ శాఖ ఏఈ రఘురాంను వివరణ కోరగా సమాచారం అందించిన పిదప మేము వర్క్ ఇన్స్పెక్టర్ మల్లయ్యను మోఖాపై పంపి రెండు ఎక్సావేటర్ లను సంబంధిత టిప్పరులను నిలిపివేయడం జరిపామని సంబందిత ఫోటోలు పంపడం జరిగినది. ఒక అధికారి ఎంతవరకైతే మార్కింగ్ ఇచ్చారో అంతవరకు మాత్రమే మట్టి తరలింపునకు ఆస్కారం ఉంటుంది. అలాంటిది సంబంధంలేని వెహికల్ ద్వారా ఇష్టానుసారంగా పరిమితికి మించి మట్టిని తరలిస్తున్న సంబంధిత ఏఈ రఘురాం మోఖాపై వెళ్లి పరిశీలించకుండా నిమ్మకు నీరేత్తినట్లు ఉండడం చూస్తుంటే వారిచ్చిన అమ్యామ్యాలకు తలోగ్గి నిమ్మకు నీరెత్తి ఉన్నట్లు గ్రామ, మండల ప్రజలు చర్చించుకుంటున్నారు.

 

Goervnment

ఇప్పటికైనా సంబంధిత అధికారులు మేల్కొని మార్కింగ్ ఇచ్చిన స్థలంపై కాకుండా ఇంకా ఎన్నాచోట్ల నుండి మట్టిని తోలగించారో పూర్తి విచారణ జరిపడంతో పాటు ఎన్ని వాహనాల ద్వారా మట్టి తరలింపు జరిగిందో ఎన్ని క్యూబిక్ మీటర్లు తరలించారో లెక్కగట్టి ఒక్క క్యూబిక్ మీటర్ ఎక్కువ తరలించిన సంబంధిత కాంట్రాక్టర్ పై శాఖపరమైన చర్యలు తీసుకొని పరిమిషన్ లేకుండా మట్టి తరలిస్తున్న వాహనాలను సీజ్ చేయవలసిందిగా మండల ప్రజలు అధికారులను పత్రికా ముఖముగా కోరుకుంటున్నారు. ఈవిషయమై పలుమార్లు ఫోన్ ద్వారా వివరణ ఇవ్వాలని కోరగా మంగళవారం సంబంధిత ఏఈ రఘురాం మోకాపై వచ్చినప్పుడు మోకాపై నుండి వాహనాలను వెళ్ళగొట్టామని తెలియపరిచారు. ఏఈ మోఖాపై ఉన్నప్పుడు పదుల సంఖ్యలో వాహనాలు ఉన్న ఎందుకు సీజ్ చేయకపోవడం లేదో చూస్తుంటే కళ్ళున్న గుడ్డివాళ్ళ లాగా అధికారులు నటిస్తున్నారని మండలంలోని ప్రజలు బహుబాటంగానే చర్చించుకుంటున్నారు

‘రాబోయేది బీజేపీ.. ప్రభుత్వం’.

‘రాబోయేది బీజేపీ.. ప్రభుత్వం’. 

తల్లోజు ఆచారి.

కల్వకుర్తి/నేటి ధాత్రి:

 

 

కల్వకుర్తి పట్టణంలోని బిజెపి కార్యాలయంలో మంగళవారం బీజేపీ క్రియాశీలక సభ్యుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ జాతీయ బీసీ కమిషన్ నెంబర్ తల్లోజు ఆచారి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో జరగబోయే ప్రతి ఎన్నికలలో బిజెపి విజయ దుందుభి మోగిస్తుందని ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని రాష్ట్రంలో దాదాపు సగం బీజేపీ ఎంపీల పాలనలో ఉందని వచ్చే ఎన్నికల్లో పూర్తిగా తెలంగాణ రాష్ట్రం బీజేపీ వశం అవుతుందని భవిష్యత్తు బీజేపీ దేనని.. దానికి అనుగుణంగా కృషి చేయాలని కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

error: Content is protected !!
Exit mobile version