Category: తాజా వార్తలు
అంబేద్కర్ జ్ఞాన యాత్రను విజయవంతం చేయండి.
రైల్వే బ్రిడ్జి ప్రారంభోత్సవానికి తరలిరావాలి..
రైల్వే బ్రిడ్జి ప్రారంభోత్సవానికి ప్రజలు తరలిరావాలి…
పట్టణ కాంగ్రెస్ నాయకులు
రామకృష్ణాపూర్, నేటిధాత్రి
రామకృష్ణాపూర్ పట్టణం నుండి మంచిర్యాలకు వెళ్లేందుకు నిత్యం రైల్వే గేట్ సమస్యతో సతమతం అవుతున్న వాహనదారుల కష్టాలు తీరనున్నాయి. క్యాతనపల్లి వద్ద రైల్వేగేటుపై నిర్మించిన ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి. ఈ నెల 15 మంగళవారం రోజున పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి లు రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రారంభిస్తారని టిపిసిసి సెక్రటరీ రఘునాథరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఒడ్నాల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు పల్లె రాజు , సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్య లు తెలిపారు. అనంతరం వారు మాట్లాడారు.
ఈ రహదారి ద్వారా ప్రతిరోజూ వేలాది వాహనాలు రైల్వే ట్రాక్ దాటి వెళ్లేవని ఆ సమయంలో గేటువేయడంతో ఇరువైపులా వందలాది వాహనాలు నిలిచిపోయి, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడేవారని అన్నారు. రైలు వెళ్లిన అనంతరం వాహనాలు గేటు దాటడానికి అర గంటకుపైగా సమయం పట్టేదని, ఇదే సమయంలో రైళ్ల సంఖ్య కూడా పెరగడంతో తరచూ గేటువద్ద వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉండేవన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో బ్రిడ్జి ప్రారంభోత్సవం ఆలస్యం అయిందని, బ్రిడ్జికి పునాది వేసిన వివేక్ వెంకటస్వామి నే ప్రారంభిస్తుండడం సంతోషంగా ఉందని అన్నారు. బ్రిడ్జి ప్రారంభంతో ప్రజల కష్టాలు తీరనున్నాయని, రామకృష్ణాపూర్ పరిసర ప్రాంత ప్రజలు ఈనెల 15న బ్రిడ్జి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. బ్రిడ్జి ప్రారంభోత్సవ ప్రదేశాన్ని మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి, పట్టణ ఎస్ఐ రాజశేఖర్ పరిశీలించారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ పనాస రాజు, కాంగ్రెస్ నాయకులు నీలం శ్రీనివాస్ గౌడ్ లు పాల్గొన్నారు.
స్థానిక ఆహార పదార్థాల పైన అవగాహన కార్యక్రమం.
అల్లిపూర్ లో మహిళా శిశు సంక్షేమశాఖ అధర్యంలో చిరుధన్యాలు, స్థానిక ఆహార పదార్థాల పైన అవగాహన కార్యక్రమం
రాయికల్ నేటి ధాత్రి. . .
ఏప్రిల్ 12. జగిత్యాల ప్రాజెక్టు పరిధిలోని రాయికల్ మండలం, అల్లీపూర్ గ్రామంలో మహిళా శిశు సంక్షేమశాఖ జగిత్యాల ప్రాజెక్టు సిడిపిఓ మమత అధర్యంలో చిరుదాన్యాలు (కొర్రలు,రాగులు,ఉదలు,అరికెలు,సామలు,సజ్జలు,జొన్నలు,అండ్రుకొర్రలు, మొదలైనవి) స్థానిక ఆహార పదార్థాల పైన అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
పోషణ పక్షంలో భాగంగా ఈరోజు స్థానిక ఆహార పదార్థాలు, చిరుధన్యాలను ఉపయోగించి అనుబంధ ఆహార వంటకాలను తయారు చేయడం పై ప్రదర్శన కార్యక్రమాలు ఏర్పాటు చెయ్యాలని షెడ్యూల్ రావడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా సిడిపిఓ మమత గారు మాట్లాడుతూ స్థానికంగా దొరికే ఆహార పదార్థాలు, చిరుధన్యాలను ప్రత్యక్షంగా చూపించి వాటితో ఏ ఏ అనుబంధ ఆహార వంటకాలను తయారు చేయవచ్చునో ప్రత్యక్షంగా తయారు చేసి చూపించడం జరిగింది మరియు మనం ప్రతిరోజు ఆహారంలో తీసుకోవడం వలన కలిగే లాభాలను లబ్ధిదారులకు, గ్రామస్థులకు ఒక్కొక్క దాని గురించి అవగాహన కల్పించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో జగిత్యాల ప్రాజెక్టు సిడిపిఓ మమత, సెక్టార్ సూపర్వైజర్ రాధ, మెడికల్ ఆఫీసర్, జెండర్ స్పెషలిస్ట్ గౌతమి, సఖి కేంద్రం రజిత, అంగన్వాడీ టీచర్లు, గర్భిణిలు, బాలింతలు, పిల్లలు, గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.
డ్రాయింగ్ ఒలంపియాడ్ స్టేట్ లో గోల్డ్ మోడల్ సాధించిన.
ఇంటర్నేషనల్ డ్రాయింగ్ ఒలంపియాడ్ స్టేట్ లో గోల్డ్ మోడల్ సాధించిన గీతాన్విత..
రామాయంపేట ఏప్రిల్ 12 నేటి ధాత్రి (మెదక్)
రామాయంపేట పట్టణానికి చెందిన చింతల ఉష శ్రీనివాస్ దంపతుల కూతురు గీతాన్విత రామాయంపేట పట్టణంలోని వివేకనంద విద్యాలయం లో 5వ తరగతి చదువుతున్నది.
ఇంటర్నేషనల్ డ్రాయింగ్ ఒలంపియాడ్ పోటీలు నిర్వహించారు. రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంకు సాధించడం జరిగింది. ఉత్తమ ఫలితాలు సాధించి రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంకు సాధించినందుకు గోల్డ్ మెడల్ అందజేయడం జరిగింది.
రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించిన విద్యార్థిని గీతాన్వితను పాఠశాల ఉపాధ్యాయ బృందం, పట్టణవాసులు అభినందించారు.
రాష్ట మహాసభను విజయవంతం చేయండి.
ఎస్ఎఫ్ఐ ఐదవ రాష్ట మహాసభను విజయవంతం చేయండి
బొచ్చు కళ్యాణ్
జిల్లా ఉపాధ్యక్షులు
పరకాల నేటిధాత్రి
పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో భారతయ విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర ఐదవ మహాసభలను విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు కళ్యాణ్ అన్నారు.ఈనెల 25,26,27 నా మూడు రోజులపాటు జరగనున్నాయని తెలిపారు.ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు చేయాలి అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ గురుకుల హాస్టల్లకు సొంత భవనాలు నిర్మించాలని అదేవిధంగా ఖాళీగా ఉన్న టీచర్ లెక్చరర్ ఔట్సోర్సింగ్ పర్మనెంట్ పోస్టులను భర్తీ చేయాలి మూడు రోజులపాటు విద్యారంగ సమస్యలపై చర్చ జరనుంది విద్యార్థులు ఈ మహాసభను అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు మడికొండ ప్రశాంత్,పరకాల పట్టణ అధ్యక్షుడు బొచ్చు ఈశ్వర్,బన్నీ,అజయ్ కుమార్,ప్రణయ్,విజయ్,బంటి పాల్గొన్నారు.
సీతారాముల కళ్యాణ తలంబ్రాలు పంపిణీ.
సీతారాముల కళ్యాణ తలంబ్రాలు పంపిణీ
నర్సంపేట డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ
నర్సంపేట,నేటిధాత్రి:
భద్రాద్రి శ్రీ సీతారాములు కళ్యాణ తలంబ్రాలు ముందస్తుగా బుకింగ్ చేసుకున్న డిపో ఉద్యోగులు, సీతా రాముల భక్తులకు నర్సంపేట డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ శనివారం ఆర్టీసి డిపో వద్ద తలంబ్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిఎం మాట్లాడుతూ సీతా రాముల కళ్యాణం ప్రత్యక్షంగా చూడలేకపోయినా భక్తులకు తలంబ్రాలు, ముత్యాలు, బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించిన ఆర్టీసీ ఎం.డి సజ్జనార్ , దేవాదాయశాఖ ధన్యవాదములు తెలిపారు. పవిత్ర శుభాకార్యలకు ఈ తలంబ్రాలు అక్షింతలుగా ఉపయోగ పడతాయని పేర్కొన్నారు. బుకింగ్ ఏజెంట్లుగా చేసిన డిపో ఉద్యోగులు కార్గో మార్కెటింగ్ ఎగ్సిగీటివ్ నరేందర్,రవీందర్, రాంబాబు, పుష్పలీల, ఎడిసి నారాయణలను అభినందించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఇంజనీర్ ప్రభాకర్జ్ ఆఫీస్ స్టాఫ్ వెంకటరెడ్డి శ్రీను,కిషోర్, ఎస్డిఐ వెంకటేశ్వర్లు, బాబు, డిపో ఉద్యోగులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
దినపత్రికలో వచ్చిన వార్తకు స్పందిన.
ఆర్యవైశ్య వైకుంఠ రథానికి ఉచితంగా బ్యాటరీ ఇచ్చిన దాత
నేటిదాత్రి దినపత్రికలో వచ్చిన వార్తకు స్పందిన
వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి పట్టణంలో గత కొన్ని సంవత్సరాలుగా చిట్యాల రోడ్ లో ఆర్యవైశ్య వైకుంఠ రథానికి బ్యాటరీ లేనందువల్ల వైకుంఠ రథం ఉపయోగంలోకి రావడం లేదని దహన కమిటీ మాజీ చైర్మన్ పాలాది శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు .ఈ సందర్భంగా పాలాది శ్రీనివాసులు తన సొంత ఖర్చు లతో శనివారం నాడు వైకుంఠ రథానికి బ్యాటరీ కొనుగోలు చేసి డ్రైవర్ కు అప్పగించారు ఈకార్యక్రమంలో పెంట్లవెల్లి విశ్వనాథం డ్రైవర్ వెంకటేష్ పాల్గొన్నారు ఈమేరకు పట్టణ ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు బచ్చు వెంకటేష్ విలేకరులు వేముల రాజి శెట్టి బొమ్మ వెంకటస్వామి అ వొ ప .పట్టణ అధ్యక్షులు కలకొండ శ్రీనివాసులు పొలిశెట్టి మురళి లారీ చే బా ర నరసింహ చవ్వ పండరయ్య తాడిపర్తి వెంకటస్వామి వేముల శంకరయ్యశెట్టి వేముల వెంకటస్వామి వేముల రాజు ఒక ప్రకటన లో హర్షం వ్యక్తం చేశారు. జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఇటుకూరు బుచ్చయ్య శెట్టి పట్టణ ఆర్యవైశ్య సంఘం కన్వీనర్ పూరి బాలరాజ్ శెట్టిఆర్యవైశ్య వైకుంఠ రథం బ్యాటరీ కొనుగోలు చేసి ఇచ్చినందుకు ఒక ప్రకటనలో పోలాది శ్రీనివాసులు కు హర్షం వ్యక్తం చేశారు రాష్ట్ర ఆర్యవైశ్య నేతలు ఆర్యవైశ్య అనుబంధ సంఘాలు వనపర్తి ఆర్యవైశ్య సంఘానికి చెందిన వైకుంఠ రథం పట్టణ ఆర్యవైశ్యులకు ప్రజలకు ఉపయోగపడే విధంగా చిట్యాల రోడ్డులో ఉన్న వైకుంఠ రథం బయటకి తీసుకురావాలని ఆర్యవైశ్యులు వేడుకుంటున్నారు
అప్పుడే అడ్మిషన్ల గోల!
అప్పుడే అడ్మిషన్ల గోల!
• అడ్మిషన్లు తెస్తేనే ఉద్యోగం
• లేకుంటే ఇంటికి వెళ్లాల్సిందే
• ప్రైవేటు ఉపాధ్యాయుల మెడపై కత్తి
• అడ్మిషన్ల కోసం రోడ్డునపడ్డ టీచర్లు
• బోధనేతర సిబ్బందికీ ఇవే కష్టాలు
కార్పొరేట్ కాలేజీల ముందస్తు లాబీయింగ్
• టెన్త్ విద్యార్థుల ఇళ్ల చుట్టూ పీఆర్వోల ప్రదక్షిణ
• ఫీజులో ప్రత్యేక రాయితీలంటూ వల
జహీరాబాద్. నేటి ధాత్రి:
ఈ ఏడాదికి సంబంధించి పదో తరగతి పరీక్షలు ఈ నెల 21 నుండి ప్రారంభమైనాయి, కానీ ఈ విద్యార్థుల వచ్చే ఏడాది ఇంటర్ అడ్మిష న్లపై మాత్రం కాలేజీల యాజమాన్యాలు అప్పుడే వేట మొదలెట్టాయి. ఇది ఏ స్థాయిలో ఉందంటే కార్పొరేట్ కాలేజీల పీఆర్వోలు విద్యా ర్థుల తల్లిదండ్రులకు నిత్యం ఫోన్లు చేయడం, వీలైతే ఇళ్ల వద్దకే వెళ్లి కలవడం వరకు వచ్చింది. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా అన్ని కళాశాలలో ఇదే పరిస్థితి ఉంది. ముక్యంగా జిల్లా కేంద్రమైన సంగారెడ్డి, పటాన్చెరు, రామచంద్రాపురం, జహీరాబాద్, నారాయణఖేడ్ పట్టణాలలో ఈ తతంగం నడుస్తున్నట్లు తెలుస్తుంది.
కార్పొరేట్ కాలేజీల పాఠశాలలు ఇష్టారాజ్యం
‘సార్, మేము ఫలానా కాలేజీ నుంచి మాట్లాడుతున్నాం… మీ పిల్లాడిని మా కాలేజీలో చేర్పించండి. ఫీజులో రాయితీలు ఇస్తాం… పదవ తరగతి పరీక్షల్లో మంచి గ్రేడ్ పాయింట్లు వస్తే ఫీజు మరింత తగ్గిస్తాం’.. అంటూ కార్పొరేట్ కాలేజీల నుంచి ఫోన్లు ప్రారంభమయ్యాయి. కర్నూలు వెంకటరమణ కాలనీకి చెందిన ప్రభుత్వ స్కూల్ టీచర్ కూతురు ఓ ప్రముఖ విద్యా సంస్థలో 10వ తరగతి చదువుతోంది. కార్పొరేట్ కాలేజీల పీఆర్ ఓల నుంచి తనకు రోజుకు మూడు, నాలుగు ఫోన్కాల్స్ వస్తున్నట్లు ఆయన తెలిపారు. పదో తరగతి విద్యా ర్థుల తల్లిదండ్రులంద రిదీ ఇదే పరిస్థితి. ఆడ్మి షన్ ఇంటి దగ్గర చేయిస్తామంటే దగ్గరకే వస్తామని మరీ చెబు తున్నారు. వచ్చే ఏడాది జూన్ లొ మొదలయ్యే ఇంట ర్మీడియట్ అడ్మిష న్లకు ఇప్పటి నుంచే ఇలా ఒత్తిడి పెడుతుండ డంపై విద్యార్థుల తల్లి దండ్రులు విస్తుపోతున్నారు. ఇంటర్ విద్యపై అధికారుల పర్యవేక్షణ కొరవడడం,కార్పొరేట్ కాలేజీలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండ డమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
ప్రతిభావంతులపైనే దృష్టి
వివిధ యాజమాన్యాల పరిధిలోని ఉన్నత పాఠశాలల విద్యార్థుల్లో ప్రతిభావంతులుగా ఉన్న విద్యార్థులను గుర్తించి వారిపైనే కార్పొరేట్ కాలేజీల ప్రతినిధులు దృష్టి సారిస్తున్నారు. పాఠశాల స్థాయి పరీక్షల్లో వచ్చిన మార్కులతోపాటు క్లాస్ టీచర్ తో మాట్లాడి విద్యార్థు లను ఎంపిక చేసుకుని వారి వివరాలు సేకరిస్తున్నారు. ఆ తరు వాత నుంచి విద్యార్థుల తల్లిదండ్రు లకు ఫోన్లు చేయడం, నేరుగా కలిసి అడ్మిషన్లు చేయిం చుకోవాలని కోరడం చేస్తున్నారు..
ఫీజు రాయితీ పేరుతో వల
కార్పొరేట్ విద్యా సంస్థలైతే ఆయా ప్రభుత్వ, ప్రేవేటు పాఠశాలల ఉపాధ్యాయులతో టచ్ లొ ఉంది పేరెంట్స్ మీటింగ్ లొ పాల్గొని తమ పిల్లలను తమ కాలేజ్ లో చేర్పించాలని వల వేస్తున్నారు. ‘ఇంటర్ కు మీ పిల్లలను మా కాలేజీలోనే చేర్పించండి. ముందుగానే అడ్మిషన్ తీసుకుంటే ఫీజులో రాయితీ ఇస్తాం’ అని చెబుతున్నారు. మరికొందరైతే ‘మా కాలేజీలో హాస్టల్ వసతితో కలిపి ఫీజు రూ.85 వేల నుంచి రూ.1.25 లక్షలు. డేస్కాలర్ అయితే రూ.60వేల నుంచి రూ.90 వేలు ఉంది. ఇదే ఫీజుతో నీట్ కోచింగ్ కూడా ఇస్తాం. అడ్మిషన్ కావాలంటే రూ.10 వేలు చెల్లించి సీటు రిజర్వు చేసుకోండి’ అని ఒత్తిడి తెస్తున్నారు. గత నెల నుంచి కాలేజీల పీఆర్ ఓలు స్కూళ్లు, ఇళ్ల చుట్టు తిరుగుతున్నారు. అడ్మిషన్లు చేయించకుంటే మీ స్థానంలో మరొకరు వస్తారంటూ పీఆర్వోలను కాలేజీ యాజమాన్యాలు పరోక్షంగా బెదిరిస్తున్నట్లు ఓ ప్రముఖ కార్పొరేట్ కాలేజీ పీఆర్ పేర్కొన్నారు.
అడ్మిషన్లు తెస్తేనే ఉద్యోగం
ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ప్రతి సంవత్సరం ప్రవేశాల కోసం బోదన, బోధనేతర సిబ్బందికి అప్పగిస్తున్నారు. ప్రతి ఆపాధ్యాయుడికి కొంత మంది పిల్ల లను పాఠశాలలో చేర్చే బాధ్యతను యాజమాన్యాలు అప్పగిస్తున్నాయి. కేటాయించిన లక్ష్యాలను అధిగమిస్తేనే వచ్చే విద్య సంవత్సరంలో కొలువుల్లో ఉంచారని, లేదంటే ఉద్యోగాలు ఊడుతాయని యాజమాన్యాలు హుకుం జారీ చేస్తున్నారు. ఉద్యోగాలను కాపాడుకోవడానికి ఉపాధ్యా యులు సిబ్బంది పట్టణ, పల్లెల వీధుల్లో ఇంటింటికి వెళ్లి వివరాలను సేకరిస్తూ తమ పిల్లలను పలానా విద్యాసం స్థల్లో చేర్చాలని ప్రాధేయపడుతున్నారు. మరి కొంత మంచి ఉద్యోగులు మరొక అడుగు ముందుకు చేసి. విద్యా సంస్థల్లో ఉన్నవి, లేనివి కల్పితాలు సృష్టించి విద్యాసం స్థల్లో చేర్చే పనిలో నిమగ్నమయ్యారు. ఫీజులో రాయితీ ఇప్పిస్తామని, లేదా ఉచితంగా ట్రాన్స్ పోర్ట్ ఏర్పాటు చేస్తామని పిల్లలను తల్లిదండ్రులను బుట్ట లో వేసుకుంటునానరు. ముక్కుసూటి వ్యక్తిత్వం గల వారు యాజమాన్యాలు పెట్టి పరతులకు లోబడి పనిచేయలేక ఉద్యోగం మానేస్తున్నారని తెలుస్తోంది.
గురుకుల పాఠశాలలో ఏడుగురు బాలికలకు అస్వస్థత.
గురుకుల పాఠశాలలో ఏడుగురు బాలికలకు అస్వస్థత
జహీరాబాద్. నేటి ధాత్రి:
జహీరాబాద్ మండలం హోతి(కె) బాలికల గురుకులంలో ఏడుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. నైట్ స్టడీ తర్వాత విద్యార్థినులు తీవ్రమైన దగ్గు, ఆయాసంతో అస్వస్థతకు గురవడంతో వారిని హాస్టల్ సిబ్బంది జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి వారు ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర.
జై బాపు. జై భీమ్. జై సంవిధాన్ . భాగంగా. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ ఇందిరమ్మ. కాలనీ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. జై బాపూ. జై భీమ్. జై సంవిధాన్. కార్యక్రమాన్ని నిర్వహించారు ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్పులు తెచ్చే విధంగా కేంద్రంలో బిజెపి ప్రభుత్వం కుట్ర పన్నుతుందు అని. కులాల మతాల మధ్య విభేదాలు సృష్టించి పబ్బం గడుపుకోవడానికి బిజెపి విధానమని. కేంద్రం కుట్రలను ప్రజలకు వివరించేందుకు రాహుల్ గాంధీ గ్రామ గ్రామాన పాదయాత్ర చేపట్టారని రాజ్యాంగాన్ని మార్చాలన్న బిజెపి కుట్రలను రాహుల్ గాంధీ భారత్ జూడో యాత్రలో దేశంలో ప్రజలందరికీ వివరించారని గత బి ఆర్ ఎస్ ప్రభుత్వాన్ని కాదని ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టారని ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తూ రేవంత్ రెడ్డి జనరంజక పాలన అందిస్తున్నారని 50 వేల ఉద్యోగులను భర్తీ చేయడమే కాకుండా నిరుద్యోగ యువకులకు రాజీవ్ వికాస్ పథకం ద్వారా స్వయం ఉపాధి చూసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని గత ప్రభుత్వం రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పుల్లో ముంచిన ఈ ప్రభుత్వం.అభివృద్ధి ఎక్కడ ఆపలేదని ఒక్కొక్క హామీలు నెరవేస్తూ. ప్రజాపాలన సాగుతుందని మత కుల ద్వేషాలు రెచ్చగొట్టాలని బిజెపి కుట్రలను తిప్పి కొట్టడానికి రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు భారత్ జూడో యాత్ర కొనసాగించాలని బిజెపి కుట్రలను రాహుల్ గాంధీ ప్రజలకు తెలియజేశారని రాహుల్ గాంధీ యాత్రలో బిజెపి పార్టీ 200 సీట్లకే పరిమితమైందని సన్న బియ్యం పథకంతో మీ కంచంలో అన్నమై వచ్చిండు అని దానికి కారణం ఇచ్చిన మాట ప్రకారం రాహుల్ గాంధీ.రేవంత్ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వతంత్రాన్ని పోరాటాల ద్వారా సాధించిందని ప్రభుత్వ పాలకులు గత బి ఆర్ ఎస్ ప్రభుత్వ భూములను దోచుకుని తిన్నారు అని తెలంగాణ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పిన అవినీతి అక్రమార్కులు కేసీఆర్ కుటుంబం నెంబర్ వన్ అందుకే సీటు దించి ప్రజలు చీ వా ట్లుపెట్టారని గత ప్రభుత్వంలో ఈ ప్రాంతం ఎంత దోపిడీ గురైందో అందరికీ తెలుసు అని ప్రజా జం జకా పరిపాలన అందిస్తున్న రేవంత్ రెడ్డికి అండగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేశారు రాష్ట్ర ప్రజలు అందరూ ఈ ప్రభుత్వానికిఅండగా ఉండాలని తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
హనుమాన్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న.
హనుమాన్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న మండల బిజెపి అధ్యక్షులు…
తంగళ్ళపల్లి నేటి దాత్రి…
తంగళ్ళపల్లి మండలం పాపాయిపల్లి గ్రామంలో హనుమాన్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న మండల బిజెపి అధ్యక్షులు వెన్నమనేని శ్రీధర్ రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జరిగే హనుమాన్ జయంతి ఉత్సవాల్లో పాల్గొని అలాగే ఆంజనేయ స్వాములు మాల ధారణ చేసి 41 రోజు గానీ. 21 రోజు గానీ. 11 రోజులు గాని. మాల దారణ చేసి పిల్ల పాపలకు కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ భక్తిశ్రద్ధలతో హనుమాన్ మాలధారణ పూర్తి చేసుకోవడం జరుగుతుందని ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని వారు పిల్లాపాపలతో ఆయు ఆరోగ్యాలతో సుఖసంతోత్సంగా కలకాలం చల్లగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఏ రెడ్డి వెంకట్ రెడ్డి ఉప సర్పంచ్ చెన్నమనేని పరశురాములు ఏ రెడ్డి రాజు రెడ్డి కొ స్ని. శ్రీనివాస్ వర్కులు అంజయ్య వర్కుడు చంద్రయ్య బొజ్జ రాజేంద్రప్రసాద్ వివేక్ గ్రామ యువకులు మహిళలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు
ఐదో క్లాసులో స్టేట్ ర్యాంక్ సాధించిన గీతాన్విత.
ఐదో క్లాసులో స్టేట్ ర్యాంక్ సాధించిన గీతాన్విత..
రామాయంపేట ఏప్రిల్ 12 నేటి ధాత్రి (మెదక్)
రామాయంపేట పట్టణానికి చెందిన చింతల ఉష శ్రీనివాస్ దంపతుల కూతురు గీతాన్విత రామాయంపేట పట్టణంలోని వివేకనంద విద్యాలయం లో 5వ తరగతి చదువుతున్నది.
ఐదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంకు సాధించడం జరిగింది. ఉత్తమ ఫలితాలు సాధించి రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంకు సాధించినందుకు గోల్డ్ మెడల్ ప్రభుత్వం అందజేయడం జరిగింది.
రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించిన విద్యార్థిని గీతాన్వితను పాఠశాల ఉపాధ్యాయ బృందం, పట్టణవాసులు అభినందించారు.
బొమ్మాపూర్ క్వారీల్లో మైనింగ్ అధికారులు.
“నేటిధాత్రి” ఎఫెక్ట్,
బొమ్మాపూర్ క్వారీల్లో మైనింగ్ అధికారులు.
విజిలెన్స్ మైనింగ్ ఏడి ల విచారణ.
“నేటిధాత్రి” కథనానికి స్పందించిన అధికారులు.
మహాదేవపూర్ -నేటిధాత్రి:
తిమ్మాపూర్ ఎలికేశ్వరం తోపాటు మహాదేవపూర్ పుసుక్పల్లి, క్వారీల్లో అక్రమ వసూళ్లు ఝాట్కా బకెట్ వ్యవహారం నేటి ధాత్రి వరుస కథనాలు ప్రచురించడం జరిగింది. ఇసుక క్వారీల అక్రమాలు దౌర్జన్యాలను తిర పైకి తీసుకువస్తూ నేడు “నేటి ధాత్రిలో”‘ పైసా వసూల్” కథనాన్ని ప్రచురించడం జరిగింది. నేటి ధాత్రి వరుస కథనాల పై స్పందించిన అధికారులు, మైనింగ్ శాఖ ఏడి, విజిలెన్స్ అధికారులు, క్వారీ వద్ద చేరుకొని విచారణ కొనసాగించడం జరుగుతుంది. టిఎస్ఎండిసి జనరల్ మేనేజర్ కూడా అక్రమ వ్యవహారం కొనసాగిస్తున్న ఇసుక క్వారీల తనిఖీలకు రాలినట్లు తెలుస్తుంది.
బార్ ఎలక్షన్ లో హోరాహోరీ పోటీ.
హన్మకొండ జిల్లా బార్ అసోసియేషన్ ఎలక్షన్ లో హోరాహోరీ పోటీ:-
స్వల్ప మెజారిటీతో గట్టెక్కేనా పులి సత్యనారాయణ:-
హన్మకొండ, నేటిధాత్రి (లీగల్):-
హన్మకొండ జిల్లా బార్ అసోసియేషన్ ఎలక్షన్స్ శుక్రవారం రోజున రసవత్తరంగా ముగిసాయి. అధ్యక్షునిగా తన గెలుపు నల్లేరు మీద నడకే అని భావించిన పులి సత్యనారాయణను తన ప్రత్యర్థి మొలుగూరి రంజిత్ ముప్పుతిప్పలు పెట్టాడు, కేవలం 26 ఓట్ల మెజారిటీ తో పులి సత్యనారాయణ హన్మకొండ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా గెలుపొందారు.
హన్మకొండ బార్ అసోసియేషన్ లో 867 ఓట్లకు గాను 752 మంది న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు, ఇందులో పులి సత్యనారాయణకు 336 ఓట్లు రాగా తన సమీప అభ్యర్తి మొలుగూరి రంజిత్ కు 310 ఓట్లు వచ్చాయి. అలాగే ప్రధాన కార్యదర్శి గా కొత్త రవి ఎన్నికయ్యారు. ఇతను తన సమీప అభ్యర్థి అయిన వి. నరేందర్ పై 109 ఓట్ల మెజారీతో గెలుపొందారు. అలాగే ఉపాధ్యక్షులుగా చిర్ర రమేష్ బాబు గెలుపొందారు. సంయుక్త కార్యదర్శిగా అంబేద్కర్, లైబ్రరీ సెక్రటరీ గా వెంకటేష్, స్పోర్ట్స్ సెక్రటరీ గా మల్లేష్, ట్రెస్సరర్ గా సాంబశివ రావు, 30 సంవత్సరాల ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా రాజేశ్వర్, 20 సంవత్సరాల ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ అశీర్వాదం, మరియు మహిళా సంయుక్త కార్యదర్శిగా నాగేంద్ర, ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ గా శివకుమార్, సునీల్ కుమార్, కమలాకర్, నిఖిల్, మరియు మహిళా ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ గా వేద, స్వాతి గెలుపొందారు. కొత్తగా ఎన్నికైన వారికి పలువురు న్యాయవాదులు శుభాకాంక్షలు తెలిపారు.
వరంగల్
————–
అలాగే వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా వలస సుదీర్ మరియు ప్రధాన కార్యదర్శిగా డి.రమాకాంత్ ఎన్నికైనారు, వీరిని వరంగల్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు ఘనంగా సత్కరించి తమ శుభాకాంక్షలు తెలిపారు.
రజతోత్సవ సభను జయప్రదం చేయాలి.
రజతోత్సవ సభను జయప్రదం చేయాలి
నర్సంపేట,నేటిధాత్రి:
ఈనెల 27న వరంగల్ జిల్లాలో జరిగే బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను జయప్రదం చేయాలని పార్టీ క్లస్టర్ ఇంఛార్జి, న్యాయవాది మోటురి రవి కోరారు. అందుకు సంబంధించిన గోడ పత్రికలను నర్సంపేట మండలలోని జి.జి.ఆర్ పల్లె(గుర్రాల గండి రాజపల్లి)గ్రామంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మోటురి రవి మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వములో పార్టిని స్థాపించి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవ సభను ఏర్పాటు చేస్తుందన్నారు.తెలంగాణ సాధించిన 10 ఏళ్లలో రాష్ట్ర అభిృద్ధికి పాటుపడిన పార్టీ బిఆర్ఎస్ అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తుత్తురు కోమల – రమేశ్,మాజీ ఎంపీటీసీ బండారి శ్రీలత – రమేశ్,గ్రామ పార్టి ప్రధాన కార్యదర్శి పురాణి రవీందర్,మండల పార్టీ ఉపధ్యక్షుడు అల్లి రవి,యాదవ సంఘం అధ్యక్షుడు తుత్తురు సాంబయ్య,మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు పత్రీ కుమారస్వామి,మండల నాయకుడు కత్తుల కుమారస్వామి,గురిజాల గౌడ సంఘం అధ్యక్షుడు మంచిక దేవేందర్,దుగ్గొండి మండల యూత్ నాయకుడు బాణోత్ జై కుమార్,గురిజాల ఎస్ఎంసి మాజీ ఛైర్మన్ కొమ్మ రవి,తుత్తురు వెంకటేష్,గుంటూర్ పల్లి గ్రామ ఇన్చార్జి సంగెం శ్రీకాంత్,తుత్తురు దేవేందర్,మూలం రాజు,జక్కుల అనిల్,మంద బాలయ్య,బర్ల కుమారస్వామి,జక్కుల కనకయ్య,పురాని ఎల్లయ్య,మూలం ఐలయ్య తదితరులు ఉన్నారు.
వరంగల్ సభను విజయవంతం చేద్దాం.
వరంగల్ సభను విజయవంతం చేద్దాం…
– వరంగల్ సభ పోస్టర్ ఆవిష్కరించిన…
– నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత రెడ్డి….
కొల్చారం,( మెదక్) నేటిధాత్రి :-
ఏప్రిల్ 27వ తేదీన వరంగల్ జిల్లా ఎలకతుర్ధిలో జరగనున్న బి ఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభను విజయవంతం చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని కొల్చారం మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాంపల్లి గౌరీ శంకర్ తాజా మాజీ ఎంపీపీ మంజుల నాయకులతో కలిసి గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2001 వ సంవత్సరంలో గులాబీ పార్టీ జెండా పట్టి 14 సంవత్సరాలు పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించి తెలంగాణలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి దేశంలోనే తెలంగాణను నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కుతుందన్నారు. ఏప్రిల్ 27వ తేదీన ప్రతి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించి వరంగల్ భారీ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు బయలుదేరాలని విజ్ఞప్తి చేశారు. వరంగల్ లో జరిగే భారీ బహిరంగ సభకు పార్టీ తరపున వాహనాలు ఏర్పాటు చేస్తామన్నారు. బహిరంగ సభ విజయవంతం చేయడానికి పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే సునీత రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో సంగాయిపేట రైతు సంఘం అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి, తుంకులపల్లి సంతోష్ రావు , మోత్కు మల్లేశం, వేమారెడ్డి, పరిగి రమేష్ కుమార్ , బిఆర్ఎస్ మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మమత కోటలో విభేదాల బీటలు
పార్టీపై మమతా బెనర్జీ పట్టు కోల్పోతున్నారా?
విభేదాలతో ఓటర్ ఐ.డి. సమస్య తెరమరుగు
అందరూ ఫైర్ బ్రాండ్‌లే…ఎవరూ తగ్గేదే లేదు
క్రమశిక్షణా సంఘం సమావేశం వాయిదా పార్టీలో అనిశ్చితికి సంకేతం
బీజేపీలో నెలకొన్న జోష్
వక్ఫ్‌బిల్లు ఆమోదంతో కొన్ని ముస్లిం వర్గాల్లో తృణమూల్ పట్ల ఆగ్రహం
తృణమూల్‌లో బట్టబయలైన విభేదాలు
హైదరాబాద్,నేటిధాత్రి
ఒక చిన్న అగ్గిపుల్ల చాలు పెద్ద దావానలం సృష్టించడానికి…అన్న సామెత తృణమూల్ కాంగ్రెస్ విషయంలో ఇప్పుడు నిజం కావడం వర్తమాన ఆశ్చర్యకర పరిణామం. బెంగాల్ టైగర్‌నంటూ చెప్పుకొని, ప్రత్యర్థులను నోరెత్తనీయకుండా ఏక ఛత్రాధిపత్యంగా బెంగాల్‌ను ఏలుతున్న మమతాబెనర్జీ ఇప్పుడు బయల్పడిన తన పార్టీలోని అంతర్గత విభేదాల కారణంగా నోరెళ్లబెట్టే పరిస్థితి దా పురించడం వర్తమాన చరిత్ర! 34సంవత్సరాలు ఏకబిగిన ఉడుంపట్టుతో బెంగాల్‌ను ఏలిన వా మపక్ష కంచుకోటను కుప్పకూల్చి అధికారాన్ని చేపట్టిన మమతమ్మకు ఇప్పుడు తానొక అగ్నిపర్వ తంపై కూర్చునానన్న సంగతి స్పష్టమైవుంటుంది. ఇంతకూ జరిగిందేమంటే ఏప్రిల్ 4న, రాష్ట్రం లో డూప్లికేట్ ఓటర్ ఐ.డి. నెంబర్ల విషయంలో ఢల్లీిలోని ఎన్నికల కమిషన్‌కు ఒక పత్రాన్ని ఇ వ్వాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. అయితే వెళ్లేముందు పార్టీ ఎంపీలు సమావేశమై ఒక నిర్ణయం తీసుకొని మరీ ఎన్నికల సంఘాన్ని కలవాలని కోరింది. అయితే పార్టీ ఎం.పి. కళ్యాణ్ బెనర్జీతో పాటు ఎన్నికల సంఘాన్ని కలిసే పార్టీ ఎంపీల జాబితాలో కృష్ణనగర్ ఎంపీ మహువా మొయిత్రా పేరు లేదు. ఆయనే నేరుగా ఎన్నికల సంఘాన్ని కలవడానికి యత్నించారు. దీంతో ఎన్నికల సంఘం ఆఫీసుకు వచ్చిన ఈమె తన పేరు జాబితాలో లేకపోవడంతో కళ్యాణ్ బెనర్జీని ప్రశ్నించినప్పుడు ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఒకదశలో మొయిత్రా ఆగ్రహంతో అక్కడి సి.ఐ.ఎస్.ఎఫ్ జవాన్లను ఏకంగా బెనర్జీని అరెస్ట్ చేయమని కోరడం వరకు వెళ్లింది. అంతేకాదు ఆమె విలపిస్తూ, ఎంపీల వాట్సాప్ గ్రూపు నుంచి కూడా తప్పుకోవడం అనంతర పరిణామం.
‘‘నాకు నాలుగు దశాబ్దాల రాజకీయానుభవం వుంది. కాంగ్రెస్, బీజేపీ, లెఫ్ట్ పార్టీలకు వ్యతిరే కంగా పోరాడిన రాజకీయానుభవం వుంది. ఈ మహిళా ఎంపీకి కేవలం ఆదానీ, నరేంద్రమోదీ తప్ప మరో సమస్యే కనిపించదు. పార్లమెంట్‌లో తనకు ఇష్టంవచ్చినంతసేపు మాట్లాడాలి. నా కుమార్తెపై కూడా ఈమె కొన్ని కామెంట్లు చేసింది. నేను వక్ఫ్‌బిల్లుపై పార్లమెంట్‌లో మాట్లాడిన దగ్గరినుంచి ఆమెకు నాపై కోపం’’ అంటూ కళ్యాణ్ బెనర్జీ రెచ్చిపోయారు. ఇక విలేకర్ల సమావే శంలో మాట్లాడుతూ మరో ఎంపీ సౌగత్‌రాయ్‌పై కూడా ఆయన కొన్ని ఆరోపణలు చేశారు. ‘‘నారదా స్కామ్‌లో సౌగత్‌రాయ్ లంచాలు తీసుకోవడం వల్లనే కదా పార్టీ పరువు గంగలో కలిసింది.ఒకళ్లపై మరొకరిని రెచ్చగొట్టడం, గోతులు తీయడమే ఆయన పని. ఒకవేళ దీదీ కోరితే రాజీనామా చేస్తాను’’ అని కళ్యాణ్ బెనర్జీ అన్నారు.
దీనిపై సౌగత్‌రాయ్ స్పందస్తూ, ‘‘మొహువా మెయిత్రా ఏడుస్తూ వెళ్లిపోయింది. బెనర్జీని పార్లమెంట్‌లో ఛీఫ్ విప్ పదవినుంచి తొలగించాలి’’ అంటూ డిమాండ్ చేశారు. అంతేకాదు కళ్యాణ్ బెనర్జీ ఒక ‘అనాగరిక వ్యక్తి’ వక్ఫ్‌బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశంలో కూడా గ్లాసును పగులగొట్టి ఛైర్మన్ ప్యానల్‌పై విసిరేయడం ఎంతవరకు సమంజసమంటూ’ ఆయన ప్రశ్నిం చారు.
ఈ బాగోతానికి చెందిన వీడియో షార్ట్స్‌ను బీజేపీ ప్రతినిధి, ఐ.టి.సెల్ చీఫ్ అమిత్ మాలవ్యా ఎక్స్‌లో పోస్ట్ చేయడంతో పార్టీలో విభేదాలు ఒక్కసారిగా బట్టబయలయ్యాయి. ఆ వీడియోలో క ళ్యాణ్‌జీ గట్టిగా అరుస్తున్నట్టు రికార్డయింది. దీని తర్వాత ఏప్రిల్ 8న సీరామ్‌పూర్ ఎం.పి. కళ్యాణ్ బెనర్జీ, బర్ద్వాన్`దుర్గాపూర్ ఎం.పి. కీర్తి అజాద్‌మధ్య మాటలయుద్ధం జరిగింది. ఈ సంద ర్భంగా కళ్యాణ్‌జీ ‘‘ఇటువంటి రాజకీయాలు నెరపినందుకే బీజేపీనుంచి గెంటేశారని’’ ఆగ్రహం తో ఊగిపోయారు. ఇక ఆజాద్ ‘‘పదేపదే నేరాలకు పాల్పడే చిన్న పిల్లల మాదిరిగా ప్రవర్తించవద్దంటూ’’ ఎదురుదాడికి దిగడంతో మరింత రచ్చ అయింది. ఇక్కడ ఆజాద్ మొహువా మెయిత్రాకు మద్దతుగా నిలవడం గమనార్హం. కళ్యాణ్ బెనర్జీ ఈ సందర్భంగా ‘‘ఆ మహిళా ఎంపీ దురు సు స్వభావం కలది మాత్రమేకాదు, నాగరికత లేనిదంటూ’’ విమర్శించారు. కేవలం తన పేరులేదన్న కారణంగా నాపై విరుచుకుపడిరదంటూ ఆయన ఆరోపించారు. అంతకుముందు బెనర్జీ ‘‘కీర్తీ ఆజాద్, సీ.ఆర్.పార్క్‌లోని పార్లమెంట్ క్యాంటీన్‌లో ‘షోందేష్’ పేరుతో ఒక స్వీట్ షాపు తెరవడానికి స్పీకర్ అనుమతికోసం ఎంపిల సంతకాలు సేకరిస్తున్నారు. నాకీ విషయం తెలిసి దీన్ని వ్యతిరేకించాను. ఫలితంగా ఈ లేఖను స్పీకర్‌కు సమర్పించలేకపోయారు. దీనివెనుక ఏ డీల్స్ వున్నాయో? దీంతో కక్షను పెంచుకొని నాపై విమర్శల దాడికి దిగుతున్నారంటూ’’ ఆరోపించారు.
ఇప్పుడు బీజేపీ విడుదల చేసిన వీడియోలు, ఎంపీల మధ్య విభేదాలను వెల్లడిరచినప్పటికీ, ఈ స్పర్థలు కేవలం ఇప్పటివి కావని ఎప్పటినుంచో పార్టీలో నివరుగప్పిన నిప్పులా వున్నాయన్నది తెలుస్తోంది. గతంలో పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా మొహువా మెయిత్రా, శత్రుఘ్నసిన్హా, కీర్తీ ఆజాద్‌లు కొన్ని కామెంట్స్ చేశారు.
2022లో పార్టీ ఎంపీ శతృఘ్నసిన్నా పార్టీ నాయకత్వ పనితీరుపై తన అసంతృప్తిని నేరుగా వ్య క్తం చేశారు. 2019లో భాజపాను వీడి టీఎంసీలో చేరినప్పటినుంచి తన సేవలను పార్టీ నాయ కత్వం గుర్తించడంలేదన్నారు. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడం పట్ల ఆయన ఇ ప్పటికీ తీవ్ర అసంతృప్తితో వున్నారు. అదేవిధంగా పార్టీ తీసుకునే నిర్ణయాల్లో పారదర్శకత లేదంటూ, టీఎంసీ పనితీరును కీర్తీ ఆజాద్ తప్పు పట్టారు. ఇక మొహువా మెయిత్రా కూడా పార్టీ అధిష్టానంపై సమయం వచ్చినప్పుడల్లా విమర్శలు గుప్పిస్తూనే వుంటారు. ఆమె మమతాబెనర్జీకి విధేయంగా వున్నప్పటికీ, పార్టీ అనుసరిస్తున్న రాజకీయ వ్యూహాలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటారు. 2021లో ఆమె జాతీయ రాజకీయాలపై పశ్చిమబెంగాల్ వ్యవహారశైలిని తప్పుపట్టారు. మమ తా బెనర్జీ కోటరీ అనుసరిస్తున్న కేంద్రీకృత వ్యవహారశైలిని ఆమె విమర్శించారు కూడా. స్థానికంగా పార్టీ అనుసరిస్తున్న రాజకీయ వ్యవహారశైలిని ఆమె కొన్ని సందర్భాల్లో విభేదించారు. అయితేపార్టీలో ఆరోగ్యకరమైన చర్చ జరగడానికే తానీ విమర్శలు చేస్తున్నట్టు సమర్థించుకున్నారు. ఇక2023లో సౌగత్‌రాయ్, కళ్యాణ్ బెనర్జీల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. బెనర్జీ వ్యవహారశైలివల్ల పార్టీ ఇమేజీ దెబ్బతింటున్నదని సౌగత్ రాయ్ విమర్శించడంతో, పార్టీలో ఫ్యాక్షన్ రాజకీయాలు బయటకు పొక్కాయి.
ఒకపక్క కళ్యాణ్ బెనర్జీ, సౌగత్ రాయ్, మొహువా మెయిత్రా, కీర్తీ ఆజాద్‌ల కారణంగా తృణమూల్ కాంగ్రెస్‌లో వాతావరణం హాట్‌హాట్‌గా మారిన తరుణంలోనే, తృణమూల్ కాంగ్రెస్ క్రమశిక్షణా సంఘం సమావేశం ఆకస్మికంగా వాయిదాపడటం పార్టీ అంతర్గత వ్యవహారాల విషయంలో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా గత అసెంబ్లీ బడ్జెట్ సమావేశానికి 30మంది పార్టీ ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడంపై ఈ క్రమశిక్షణా సంఘం ఏప్రిల్ 8న సమావేశం కావాల్సివుంది. కానీ ఇప్పుడీ సమావేశం నిరవధికంగా వాయిదాపడిరది. ఈ క్రమశిక్షణాసంఘానికి పార్లమెంట రీ వ్యవహారాల మంత్రి సోబందేవ్ చటోపాధ్యాయ నేతృత్వం వహిస్తున్నారు. ఈ సమావేశం వా యిదాపడటంపై ఆయన ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం. ఈ కమిటీ సభ్యుడు నిర్మల్ ఘోష్‌ఈ సమావేశం ప్రస్తుతానికి వాయిదాపడిరదని, ఎప్పుడు జరిగేదీ మళ్లీ తెలియజేస్తామని విలేకర్ల కు చెప్పారు. ఇదిలావుండగా ఒక సీనియర్ మంత్రి మాట్లాడుతూ, ‘‘సౌగత్‌రాయ్, కళ్యాణ్ బెనర్జీ ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో ఉన్న విభేదాల కారణంగానే ఈ సమావేశం వాయిదా పడిరదని’ చెప్పడం గమనార్హం. నిజానికి గత మార్చి 20న బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా క్రీడా శాఖ సహాయ మంత్రి మనోజ్ తివారీ సహా 30మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి గైర్హాజర య్యారు. ఈ క్రమశిక్షణా సంఘం సమావేశంలో వారిని సంజాయిషీ కోరాల్సి వుంది. బడ్జెట్ సమావేశానికి హాజరుకావాలంటూ పార్టీ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు పార్టీ జారీచేసిన విప్‌ను వీరు ధిక్కరించినట్లయింది.
తృణమూల్ కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలు బీజేపీలో జోష్ పెంచడం సహజమే. పార్టీ ప్రతినిధి, ఐ.టి.సెల్ ఛీఫ్ మాలవ్యా ఏప్రిల్ 8న మరో షార్ట్ వీడియోను ఎక్స్‌లో విడుదల చేశారు. అందులో కళ్యాణ్ బెనర్జీ ‘‘అసలు మమతా బెనర్జీదే తప్పు. కావాలంటే రాజీనామా చేసి రాజకీయాలనుంచి తక్షణమే తప్పుకుంటా’’ అని వుంది. ఈయనకు వెనుక దన్నుగా ఎవరున్నారంటూ మాలవ్యా ప్రశ్నించడం కీలకం! తృణమూల్ కాంగ్రెస్‌లో నెలకొన్న విభేదాలు బయటకు రావడంతో, పార్టీలో క్రమశిక్షణ డొల్ల అనేది స్పష్టమైంది. ఇప్పటికే ఆర్జీకర్ ఆసుపత్రి సంఘటన దగ్గరి నుంచి పార్టీ ప్రతిష్ట గణనీయంగా దిగజారింది. గతంలో నారదా స్కామ్‌లు, అవినీతి ఆరోపణలు, శాంతిభద్రతల సమస్యలు మమతను కదల్చలేకపోయినా, ఆర్జీకర్ సంఘటన పార్టీని కుదిపేసింది. దీనికి తోడు వక్ఫ్ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందడం, మంగళవారం నుంచి అమల్లోకి రావడంతో, ఏ ముస్లిం ఓట్లను నమ్ముకొని అధికారంలో వున్నదో, ఆ వర్గాల్లోనే చాలామంది పార్టీనాయకత్వంపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. అంటే కేరళలో కాంగ్రెస్ పరిస్థితి ఏవిధంగా వుందో, తృణమూల్ పరిస్థితి కూడా అందుకు భిన్నంగా లేదు. హిందువుల్లో ఇప్పటికే నెలకొన్న వ్యతిరేకత, వక్ఫ్‌బిల్లు పుణ్యమాని ముస్లింలలో కొందరు దూరమయ్యే పరిస్థితి నెలకొనడం మమతా బెనర్జీని ఊపిరి సలపనీయడలేదు.
తానే ఒక ఫైర్ బ్రాండ్ అనుకుంటే పార్టీలో ఉన్న ఫైర్‌బ్రాండ్లన్నీ ఇప్పుడు, సొంత కొంపకే నిప్పు పెట్టే స్థితికి చేరుకోవడంతో, మమతా బెనర్జీ ఒక్కసారిగా ‘కూల్’గా, ‘సైలెంట్’గా మారక తప్పలే దు. ప్రస్తుతం పార్టీలో నెలకొన్న వర్గపోరు, ఆమె నియంత్రణాపరిధిని దాటిపోయినట్టు తెలుస్తోం ది. ఏ చర్య తీసుకున్నా మొత్తం పార్టీ పుట్టిమునగడం ఖాయమన్నది స్పష్టమైంది. ఇప్పటికే తృణ మూల్‌కు సవాల్ విసురుతున్న భాజపాకు ఈ పరిణామాలన్నీ సానుకూల సంకేతాలిస్తూ, వచ్చే ఎన్నికల్లో అధికారం దగ్గడం ఖాయమన్న విశ్వాసం పెరుగుతోంది. దీంతో రాష్ట్రంలోని బీజేపీ నా యకత్వంలో జోష్ నెలకొంది. తన ‘నోరు బలం’తో నెట్టుకొస్తున్న మమతా బెనర్జీ ఇప్పుడు సైలెంట్ కాక తప్పడంలేదు. అవసాన దశలో అల్లావుద్దీన్ ఖిల్జీ తన సామ్రాజ్యం ముక్కలు కావడాన్ని వీక్షించి విపరీతంగా బాధపడిన చందంగా, ఇప్పుడు మమతా బెనర్జీకూడా విభేదాలతో కుప్పకూలి పోతున్న పార్టీని నిస్సహాయంగా చూడక తప్పదా? అన్న సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. పార్టీలో ఉన్నవారిలో అధికసంఖ్యాకులు అవినీతి అక్రమాలకు పాల్పడేవారే గనక, తమకిక్కడ రక్షణ లేదనుకుంటే నిర్దాక్షిణ్యంగా పార్టీని వీడటం ఖాయం. అన్నింటికంటే విచిత్రమేమంటే ఈ విభేదాల దెబ్బకు, ఓటర్ ఐ.డి.కార్డుల బాగోతం తెరమరుగైపోయింది. దీన్నెవరూ పట్టించుకోవడంలేదు. సామ్రాజ్యమే కుప్పకూలిపోయేటప్పుడు, దాన్ని నిలబెట్టుకోవడమే ప్రధానం కానీ, ఎదురుదాడికి సమయం కాదు. ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ పరిస్థితి ఇదే!
అటు ఒత్తిళ్లు..ఇటు బెదిరింపులు!
`ఉద్యోగాలు చేయలేకపోతున్నాం
`కాదని కుర్చీలో కూర్చోలేకపోతున్నాం
`పని చేయడం కష్టంగా వుంది
`సబ్ రిజిస్ట్రార్ల ఆవేదన, ఆందోళన
`తప్పు చేస్తే సహించకండి
`మాతో తప్పులు చేయించకండి
`అక్రమాలు ఎప్పుడూ సక్రమం కావు
`ప్రజా ప్రతినిధుల టార్గెట్లు సరైంది కాదు
`ప్రభుత్వ ఆదేశాలు పాటించాలా!
`ఎమ్మెల్సేల హుకూం భరించాలా?
`అయోమయ స్థితిలో పని చేస్తున్నాం
`భయపెట్టి పనులు చేయిస్తే బాధ్యులమౌతున్నాం
`ప్రజల దృష్టిలో చులకనౌతున్నాం
`అవినీతి పరులుగా ఆరోపణలెదుర్కొంటున్నాం
`అందరూ బెదిరించే వాళ్లే తయారౌతున్నారు
`స్వేచ్ఛగా పనులు చేయలేకపోతున్నాం
`ఎమ్మెల్యేలు మా ఆదేశాలే పాటించాలంటున్నారు
`మేమే బాస్‌లమని బెదిరిస్తున్నారు
`మంత్రి మాకన్నా సీనియర్ కాదని కొందరు ఎమ్మెల్యేలంటున్నారు
`చెప్పిన పని చేస్తారా? లేదా! అని ఇబ్బంది పెడుతున్నారు
`చెప్పిన పని చేయకపోతే మీడియాలో లేనిపోనివి రాయిస్తున్నారు
`సబ్ రిజిస్ట్రార్లను అవినీతి పరులుగా ముద్రలు వేస్తున్నారు
`గత ప్రభుత్వ హయాంలో విన్నట్లే ఇప్పుడూ వినాలంటున్నారు
`ఎమ్మెల్యేలను దిక్కరిస్తే శంకరగిరి మాణ్యాలు పట్టిస్తామంటున్నారు
హైదరాబాద్,నేటిధాత్రి:
కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం. సబ్ రిజిస్ట్రార్ల జీవితాలు ఇందుకు బాగా అద్దం పుడుతున్నాయి. ప్రతి ఒక్కరూ బెదిరించేవాళ్లే..ప్రతి ఒక్కరూ నిందలేసేవాళ్లే. ప్రతి ఒక్కరూ నిలదీసేవాళ్లే..ప్రతి ఒక్కరూ నీ సంగతి చూస్తా? అని భయపెట్టేవాళ్లే? అసలు ఏం జరుగుతుతందో అర్ధం కాని త్రిశంకు స్వర్గంలో సబ్ రిజిస్ట్రార్లున్నారు. ఇంకా కొందరైతే భయపెట్టి పని చేయించుకోవాలని చూస్తున్నప్పుడు వాళ్ల పని వాళ్లు ఎలా చేసుకోగలరు. ప్రజలు న్యాయం ఎలా చేయగలరు. మరో వైపు సమాజం నుంచి నిందలు, అపనిందలు, చీత్కారాలు ఎదుర్కొంటూ, ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చేశాఖలో కొలువులు. అయినా సరే అందరీ సమాదానం చెప్పాలి. లేకుంటే భయపడుతూ బతకాలి. నిత్యం అంటు ఒత్తిళ్లు, ఇటు బెదిరింపులతో కాలం గడపాలి. సామాన్యుల నుంచి వచ్చే ఇబ్బందేమీ లేదు. కాని నాయకుల మూలంగా ఇటీవల కాలంలో సబ్ రిజిస్ట్రార్లు పని చేయలేకపోతున్నారు. అందరూ నాయకులే. అందరూ రిజిస్ట్రార్ల మీద పెత్తనం చేసేవారే. మేం చెప్పినపని చేయాలని హుకూం జారీ చేసేవాళ్లే..ఇంత మంది బెదిరింపుల మధ్య పని ఎలా చేయాలన్న దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. వాళ్లు చెప్పే అక్రమ పనులు చేయలేమంటే ఒక తంటా? చేస్తే జనం నుంచి మరో తంటా? ఇలాంటి సందిగ్ధావస్తలో పని చేయలేకపోతున్నాం మహా ప్రభో అని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. మాపై నాయకుల ఒత్తిళ్లు లేకుండా చూడాలంటూ వేడుకుంటున్నారు. ఎందుకంటే నాయకులను కాదని కుర్చీలో కూర్చోలేకపోతున్నారు. పని చేయడం కష్టంగా వుందని భోరు మంటున్నారు. ఇదీ తెలంగాణ రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ల ఆందోళన, ఆవేదన. ఇటీవల సబ్ రిజిస్ట్రార్లంతా ముక్త కంఠంతో ఒకటే మాట చెబుతున్నారు. మేం తప్పు చేస్తే సహించకండి. అది ప్రభుత్వమైనా, ఇంకెవరైనా? కాని తమతో తప్పుడు పనులు చేయించకండి? అని వేడుకుంటున్నారు. నాయకల ఒత్తిళ్లతో తీవ్ర మనోవేదనే కాకుండా, ఉద్యోగాలు పోతాయేమో? అని భయపడుతున్నారు. పనులు చేయించుకునే నాయకులు బాగానే వుంటారు. కాని కొలువులు పోతే తమ జీవితాలు వీదిన పడతాయని భయపడుతున్నారు. కనిపించిన ప్రతి భూమిని మా పరం చేయమని, మా పేరున రిజిస్ట్రేషన్ చేయమని ఒత్తిడిచేస్తున్ననాయకులు మరీ ఎక్కువౌతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాయకులు ఒత్తిడి చేసి బెదిరించి పనులు చేయించుకున్నా అది సక్రమం కాదు. దాని వల్ల వివాదాలపాలు సబ్ రిజిస్ట్రార్లే అవుతున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మీడియాలో వార్తలౌతున్నారు. తప్పు చేసే వాళ్లే కాదు..చేయించిన వాళ్లు కూడా నేరానికి పాల్పడినట్లే. కాని వాళ్లు తెరమీదకు రారు. తప్పులు సబ్ రిజిస్ట్రార్ల మీద తోసేసి చేతులు దులుపుకుంటారు. పైగా నెల నెల మేం అడిగింది ఇవ్వాలి. మేం చెప్పినలెక్క ముట్ట జెప్పాలంటే ఎక్కడి నుంచి తేవాలి. వారికి కప్పం ఎలా కట్టాలి. గత పాలకులకు ఎలా సహకరించారో మాకు అలాగే సహకరించాలంటారు. గతంలో ఏం జరిగిందో మాకు ఎలా తెలుస్తుంది. గతంలో ఏం చేయించుకున్నారో మాకు అవసరమేముంది? అక్రమ పనులు చేయించమని బెదిరిస్తే కొంత మంది సబ్ రిజిస్ట్రార్లు సెలవులపై వెళ్లిపోతున్నారు. ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకమైన రిజిస్ట్రేషన్ విధానాన్ని తీసుకొస్తోంది. ప్రజలకు మేలు చేయాలనిచూస్తోంది. ఎక్కడా చిన్న పొరపాటు జరగకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసేలా నూతన పద్దతులు తెచ్చిపెడుతోంది. మాకు చాలా వరకు సులభరతమైన పని రానుంది. ఒక రోజులో మరిన్ని రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకునే వెసులుబాటు కానున్నది. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజలు ఎక్కువ కాలం రిజిస్ట్రేషన్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణాలు చేయాల్సిన అవసరం లేకుండా సరికొత్త విధానం అందుబాటులోకి వస్తోంది. ఇక్కడ ఏ చిన్న పొరపాటు జరగడానికి వీలుండదు. మధ్య వర్తులు అసలే వుండరు. ప్రజలు నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు అందుబాటులోకి వస్తోంది. పైగా సబ్‌రిజిస్ట్రార్లు ఏ చిన్న తప్పు చేసినా ఉపేక్షించే పరిస్దితి వుండదని ప్రభుత్వం హెచ్చరిస్తూనే వుంది. ఎక్కడ పట్టిద్దామా? అన్నట్లు మీడియా డేగ కన్నులేసుకొని చూస్తోంది. ఇలాంటి సమయంలో కొంత మంది ఎమ్మెల్యేలు సబ్ రిజిస్ట్రార్లపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఏకంగా ఆ ఎమ్మెల్యే నేను చెప్పింది వింటావా? లేదా? నేను చేయమన్న రిజిస్ట్రేషన్ చేస్తావా? లేదా? అంటూ భయపెడుతున్నాడట. ఈ నియోజకవర్గానికి నేనే బాస్. నేను చెప్పిందే నవ్వు వినాలని ఆర్డర్ వేస్తున్నాడట. మీరు చెప్పమన్నవన్నీ చేస్తే నా ఉద్యోగం పోతుందని సబ్ రిజిస్ట్రార్లు అంటుంటే, మీ ఉద్యోగాలకు నేనే భరోసా ఇస్తాను. నేను చెప్పిన పని చేయకుంటే నేరుగా ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని శంకరగిరి మాణ్యాలు పట్టిస్తానని బెదిరిస్తున్నారట. దాంతో సబ్ రిజిస్ట్రార్లకు ఏంచేయాలో అర్దం కాకుండాపోతోందిన వాపోతుందన్నారు. ప్రభుత్వమే ఎలాంటి తప్పులు జరగకూడదని నూతన ఆవిష్కరణలు తెచ్చి,సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తే, అదే ప్రభుత్వంతో చెప్పి మీ అంతు చూస్తామంటూ ఎమ్మెల్యేలు బెదిరిస్తుంటే ఎవరికి చెప్పుకుంటారు? కాపాడమని ఎవరిని వేడుకుంటారు? సంబంధిత శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి ఓ జిల్లాకు ఇన్‌చార్జి మంత్రి. మంత్రి రిజిస్ట్రేషన్ల విషయంలో చిన్న తప్పును కూడా సహించేది లేదని ఇప్పటికే ప్రకటనలుచేస్తున్నారు. అలాంటి మంత్రి ఇన్‌చార్జిగా వున్న జిల్లాలో ఓ ఎమ్మెల్యే నేను మంత్రికన్నా సీనియర్‌ని. మంత్రి నాకు చెప్పేదేమిటి? నేను వినేదేమిటి? నేనే నీకు బాస్..మంత్రి చెప్పినట్లు కాదు..నువ్వు కొలువులో వుండాలంటే నేను చెప్పిందే చేయాలి. నేను చెప్పినట్లే చేయాలంటూ ఎమ్మెల్యే బెదిరింపులమీద బెదిరింపులు సాగిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. పార్టీలో మేం సీనియర్లం. నిన్నగాక మొన్న వచ్చిన వ్యక్తిమంత్రి అయినంత మాత్రాన మాకన్నా తోపు కాదు..మాపై ఆయన పెత్తనం సాగనివ్వం. మా జిల్లాలో ఇన్‌చార్జి మంత్రి పెత్తనానికి స్ధానం లేదు. ఆయనకు మా జిల్లాలో ఎలాంటి ప్రాదాన్యత లేదు. అర్దమౌతుందా? అని కొంత మంది సబ్ రిజిస్ట్రార్లను పిలిపించుకొని ఓ ఎమ్మెల్యే తన పటాటోపం చూపించనట్లు తెలుస్తోంది. దాంతో తాము ప్రజలకు సేవ చేయడానికి వున్నామో..నాయకులకు ఊడిగం చేయడానికి కొలువులు చేయాలో అర్దం కావడం లేదని సబ్ రిజిస్ట్రార్లు మధన పడుతున్నారు.. ఇటీవల ఆ ఎమ్మెల్యే సబ్ రిజిస్ట్రార్లను పిలిచి చెప్పిన పనులు చేయకపోవడంతో, ఆ రిజిస్ట్రార్లు పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నట్లు మీడియాలో వార్తలు రాయించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వార్తలు ఎందుకొస్తున్నాయని మిగతా మీడియా ప్రతినిదులు సబ్‌రిజిస్ల్రార్లను ప్రశ్నించారు. చూస్తున్నారు… ఎమ్మెల్యే వ్యక్తిగత కక్షతో ఇలాంటి వార్తలు రాయిస్తుంటే నేనెలా భాధ్యుడినౌతానంటూ ఆ సబ్‌రిజిస్ట్రార్ తన భాధను వెలుబుచ్చారు. అయినా తాము తప్పు చేస్తే శిక్షించేస్ధాయిలో వున్న ఎమ్మెల్యేలు మాపై తప్పుడు కథనాలు రాయిస్తే మేంఎవరికి చెప్పుకోవాలి? ఎవరికి మా గోడు విన్నవించుకోవాలని సబ్ రిజిస్ట్రార్లు ఆవేదన చెందుతున్నారు. ఇకపై రిజిస్ట్రేషన్ల శాకపై ఒక్క మచ్చ కూడా పడకూడదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఎంతో సీరియస్‌గా వ్యవస్ధను గాడిలో పెట్టాలని చూస్తున్నారు. అందుకోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. అటు రెవిన్యూ, ఇటు రిజిస్ట్రేషన్ శాఖలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. రిజిస్ట్రేషన్ శాఖలకు సొంత భవనాలు వుండాలనుకుంటున్నాడు. తెలంగాణలో వున్న 144 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు ప్రభుత్వ భవనాలు నిర్మాణం తన హయాంలోనే జరగాలనికోరుకుంటున్నాడు. తాను మంత్రిగా వున్నంత కాలం రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి అన్న పదం వినిపించకుండా వుండాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ కోసం వచ్చే ప్రజలకు ఇప్పటి వరకు వున్నట్లు కాకుండా ఎంతో మర్యాదగా వ్యవహరించాలని ఆదేశాలు జారి చేస్తున్నారు. ప్రజలకు కార్యాలయంలో కనీస సౌకర్యాలు కల్పించాలని చెబుతున్నారు. పారదర్శకమైన రిజిస్ట్రేషన్లు మాత్రమే జరగాలని అంటున్నారు. ఇలాంటి తరుణంలో ఎమ్మెల్యేలు మా నెత్తి మీద తాండవం చేయాలని చూస్తున్నారు. ఈ ఒత్తిడి భరించలేక ఉద్యోగాలు వదులుకొని వెళ్లాలనుకుంటున్నామని కొంత మంది తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ స్వర్ణయుగం.
పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ స్వర్ణయుగం
ఉద్యమ పార్టీకి 25ఏళ్ళు పూర్తి.
తెలంగాణా ప్రజల గుండెల్లో కేసీఆర్
తెలంగాణలో భవిష్యత్ బిఆర్ఎస్ పార్టీదే
రజతోత్సవ సభ సంబురాలు అంబారాన్ని అంటాలి.
బిఆర్‌ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయండి.
నర్సంపేట నియోజకవర్గo నుండి 25000 మంది కార్యకర్తలు తరలి రావాలి
బిఆర్ఎస్ నాయకులతో కలసి రజతోత్సవ సభ పోస్టర్ ఆవిష్కరణ
నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి
నర్సంపేట,నేటిధాత్రి:
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఆవిర్భవించిన టిఆర్ఎస్ ఉద్యమ పార్టీకి 25 యేండ్లు పూర్తి కానున్నదని తెలంగాణ ఉద్యమనేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర సాధన అనంతరం కెసిఆర్ పాలన స్వర్ణయుగంగా ఉన్న తరుణంలో నేడు కాంగ్రెస్ పాలన రాక్షస పాలనగా మారిందని ఆరోపించారు. గత 15 నెలల కాంగ్రెస్ పాలన సాగుతున్న క్రమంలో ప్రజల గుండెల్లో నేటికీ కేసీఆరే ఉన్నారని తెలిపారు. రజతోత్సవ సభ సంబురాలు అంబారాన్ని అంటాలని పిలుపునిచ్చారు.తెలంగాణలో రాబోయే భవిష్యత్తు బిఆర్ఎస్ పార్టీదే అని తేల్చి చెప్పారు. ఈనెల 27న వరంగల్ జిల్లాలో చేపట్టబోయే భారత రాష్ట్ర సమితి రజితోత్సవాల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నియోజకవర్గ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రజితోత్సవ సంబరాల గోడ పత్రికలను పెద్ది ఆవిష్కరించారు.ఈ సంధర్భంగా మాట్లాడుతూ ప్రపంచ చరిత్రలో నిలిచిపోయే సభలు నిర్వహించిన సత్తా బిఆర్ఎస్ పార్టీదే అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పనితీరును గత కేసిఆర్ ప్రభుత్వ పనితీరు పట్ల గ్రామాల స్థాయి నుండి మండలాల వరకు ప్రజలతో చర్చ మొదలు పెట్టాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన పట్ల విసుకు చెందుతున్న ప్రజలు కేసీఆర్ నాయకత్వంతోనే తెలంగాణ అభివృద్ధి సాధిస్తుందని గుర్తుకు చేసుకుంటున్నారని తెలిపారు. పార్టీ కోసం గత ఎన్నికల్లో కష్టపడ్డ వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పించి మెజారిటీ స్థానాలను గెలిపించే బాధ్యత నాది అని పెద్ది హామీ ఇచ్చారు. రాజకీయంలో గెలిచినా ఓడిన ప్రజల మధ్యలో బతికేవాడే నిజమైన నాయకుడని అదే స్థాయిలో నిత్యం ప్రజల్లో ఉంటున్నానని గుర్తుకు చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే కంటే నా హాయంలోనే అన్ని గ్రామాల్లో 10 రేట్ల పనులు ఎక్కువ పనిచేశామని అధికార పార్టీ వాళ్లు అంటున్నారని పేర్కొన్నారు. 27 న సభ విజయవంతం చేసే క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో నర్సంపేట నియోజకవర్గం నుండి 25 వేల మంది కార్యకర్తలను తరలించి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ వద్ద నర్సంపేట పౌరుషం చూపించాలని,రజతోత్సవ సభ సంబురాలు అంబారాన్ని అంటాలని ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి నియోజకవర్గ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ఎండల తీవ్రత ఎక్కువగా ఉందడం వలన అధిక సంఖ్యలో పురుషులు హాజరవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ రాయిడి రవీందర్ రెడ్డి, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, పట్టణ పార్టీ అధ్యక్షులు వెంకటనారాయణ గౌడ్,అన్ని మండల పార్టీ అధ్యక్షులు, మాజీ సొసైటీ చైర్మన్ లు , మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పిటిసిలు, నియోజకవర్గ నాయకులు, క్లస్టర్ బాధ్యులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.