శిశువుకు ఆరు నెలల వరకు తల్లిపాలు పట్టించాలి.

శిశువుకు ఆరు నెలల వరకు తల్లిపాలు పట్టించాలి.

చిట్యాల నేటి ధాత్రి :

 

 

 

చిట్యాల మండలం లోని చల్లగిరిగే నాలుగు 5వ కేంద్రం తనిఖీ చేసి ఏడవ నెల నుండి మూడు సంవత్సరాల పిల్లలకు ఇవ్వవలసిన అదనపు ఆహారము వ్యాధినిరోధక టీకాలు వ్యక్తిగత శుభ్రత పిల్లలకి ఇవ్వాల్సిన మంచినీరు బయట తినుబండారాలు తినిపించరాదని తల్లులకు వారి అత్తలకు కౌన్సిలింగ్ ఇచ్చి బరువులు తీసి వయసులవారిగా ఉండాల్సిన బరువు ఎత్తు గురించి వివరించి రెండు నెలల బాలింత ఇంటికి గృహ సందర్శన చేసి బాలింతకు ఇవ్వాల్సిన ఆహారము శుభ్రత పాపకు కేవలం తల్లి పాలు తాగించాలని ఇతర పానీయాలు తాగించవద్దని కాటన్ బట్టలు ధరించాలని బాలింత మొబైల్ వాడకుండా ఎటువంటి టెన్షన్ లేకుండా సమతల హారము భుజిస్తూ ఆరు నెలల వరకు తల్లి పాలే తాగించాలని కుటుంబ సభ్యులందరికీ అవగాహన కల్పించనైనది అంగన్వాడీ టీచర్సు కరుణ కవిత ఆయా హాజరైనారు.

గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన తిరుపతి.

గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన తిరుపతి ఎల్బీనగర్ కు చెందిన అరవ కీర్తన ఆలైవ్.

తిరుపతి(నేటి ధాత్రి)మే22:

హలెల్ మ్యూజిక్ స్కూల్ ఫౌండర్ ఆగష్టిన్ ఆధ్వర్యంలో 2024 డిసెంబర్ 1న నిర్వహించిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో దాదాపు 18 దేశములలో నుండి 1500 మంది విద్యార్థులు పాల్గొని ఒక గంట పాటు కీబోర్డ్ ప్లే చేయడం జరిగినది. అందులో తిరుపతి జిల్లా ఎల్బీనగర్ కు చెందిన విజయబాబు శైలజ కుమార్తె 6వ తరగతి చదువు తున్న అరవ కీర్తన ఆలివ్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించినది.గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన తిరుపతి ఎల్బీనగర్ కు చెందిన అరవ కీర్తన ఆలైవ్.
హలెల్ మ్యూజిక్ స్కూల్ ఫౌండర్ ఆగష్టిన్ ఆధ్వర్యంలో 2024 డిసెంబర్ 1న నిర్వహించిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో దాదాపు18 దేశములలో నుండి 1500 మంది విద్యార్థులు పాల్గొని ఒక గంట పాటు కీబోర్డ్ ప్లే చేయడం జరిగినది. అందులో తిరుపతి జిల్లా ఎల్బీనగర్ కు చెందిన విజయబాబు శైలజ కుమార్తె 6వ తరగతి చదువు తున్న అరవ కీర్తన ఆలివ్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించినది..

మందమర్రిలోఎలక్ట్రిసిటీ పోల్స్ స్ట్రీట్ లైట్లు పరిశీలించిన.

మందమర్రిలోఎలక్ట్రిసిటీ పోల్స్ స్ట్రీట్ లైట్లు పరిశీలించిన

మందమర్రి నేటిధాత్రి

 

 

మందమర్రి పట్టణం
శ్రీపతి నగర్ 15 వ వార్డ్
ఎలక్ట్రిసిటీ పోల్స్ స్ట్రీట్ లైట్లు పరిశీలించిన ఏఈ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు.
గౌరవ చెన్నూర్ శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గత రెండు రోజుల క్రితం శ్రీపతి నగర్ లో పర్యటించిన సందర్భంగా వార్డు ప్రజలు కరెంట్ ఫోల్స్ – వీడి దీపాలు- కరెంటు – సమస్య ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది.
వెంటనే వివేక్ స్పందించి ఎలక్ట్రికల్ ఏఈ శ్రీనివాస్ నీ ఆదేశించిన సందర్భంలో
ఈ రోజు శ్రీపతి నగర్ లో ఏఈ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ వార్డు బాధ్యులు పైడిమల్ల నర్సింగ్ శ్రీపతి నగర్ లో పర్యటించి ప్రజల వద్దకు వెళ్లి కరెంట్ సమస్యలను ఎన్ని ఫోన్స్ అవసరం ఉంటాయి. స్ట్రీట్ లైట్లు ఎన్ని అవసరం ఉంటాయి. ఎన్ని సార్లు కరెంటు పోతుందని. తెలుసుకొని ఎమ్మెల్యే వివేక్ గారి సహకారంతో తొందరలోనే ప్రజల కరెంటు కష్టాలు తీరుస్తామని తెలియజేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో
ఏఈ గారితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు.
మంద తిరుమలరెడ్డి.
ఎద్దు వెంకటాద్రి.
భోగి వెంకటేశ్వర్లు.
రామస్వామి సోమయ్య. సురేందర్..
కుండే రామకృష్ణ.
శనిగారపు చంద్రయ్య తో పాటు మరికొంతమంది ముఖ్య నేతలు పాల్గొన్నారు

కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.

కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు

నేటిధాత్రి చర్ల:

చర్ల మండలంలోని ఎమ్మార్వో ఆఫీస్ వద్ద 29 కుటుంబాలకు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం సందర్భంగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు మండలంలోని 29 కుటుంబాలకు 33 లక్షల 64 వేల రూపాయలను కళ్యాణ లక్ష్మి చెక్కులను మండల అధికారులు మరియు మండల నాయకులు సమన్వయంతో లబ్ధిదారులకు ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు చేతుల మీదుగా అందజేయడం జరిగింది.

Lakshmi

ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో శ్రీనివాస్ డిప్యూటీ తాసిల్దార్ ముద్దరాజు చర్ల ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ పరుచూరి రవి చర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ ఇర్ప శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోలిన లంకరాజు చీమలమర్రి మురళి మరియు సీనియర్ నాయకులు మండల నాయకులు కార్యకర్తలు మాజీ ప్రజా ప్రతినిధులు యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

మనస్థాపం తో వ్యక్తి ఆత్మహత్య.

— మనస్థాపం తో వ్యక్తి ఆత్మహత్య

నిజాంపేట: నేటి ధాత్రి

 

 

ఆర్థిక భారం తో మనస్థాపనికి గురై ఓ వ్యక్తి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘన నిజాంపేట మండలం చల్మెడ లో చోటుచేసుకుంది. పోలీస్ ల వివరాలు.. గ్రామానికి చెందిన కంపే పరుశురాములు (34) అను వ్యక్తి ట్రాక్టర్ కొని దానికి కిస్తీలు బాకీ పడి మనస్తాపంతో ఇంట్లోనే దులానికి చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నిజాంపేట ఇంచార్జ్ ఎస్సై సృజన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

కాలానికి అనుగుణంగా వృత్తి నైపుణ్యం పెంపొందించుకోవాలి.

కాలానికి అనుగుణంగా వృత్తి నైపుణ్యం పెంపొందించుకోవాలి

ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాన్ని పరిశీలించిన ఎంపిడిఓ

పరకాల నేటిధాత్రి

 

 

మండల విద్యాశాఖ అధికారి రమాదేవి అధ్యక్షతన చైతన్య మోడల్ స్కూల్ లో జరుగుతున్న ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాన్ని ఎంపిడిఓ పెద్ది ఆంజనేయులు సందర్శించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ “మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధ్యాలు తమ నైపుణ్యాలను పెంచుకోవాలని,ఆధునిక విద్యా విధానాలను పాటిస్తూ విద్యార్థులకు భోదించాలని అన్నారు.ప్రభుత్వం ఉచిత పుస్తకాలు,దుస్తులు, రుచికరమైన మధ్యాహ్న భోజనం,నోటు బుక్స్ తో పాటు అన్ని రకాల సౌకర్యాలను విద్యార్థులకు కల్పిస్తుందని ఉపాధ్యాయులు ఈ విషయాలు ప్రచారం చేసి పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచాలన్నారు.ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులకు విధ్యాభోదనలో నూతన మెలకువల పై స్టేట్ రిసోర్స్ పర్సన్ శ్రీధర్,యం.ఆర్.పి లు బిక్షపతి,రామన్న,మోహన్, ఆజాం,బాబు,లత,కీరవాణి తదితరులు ఉన్నారు.

కాలం చెల్లిన వస్తువులను విక్రయిస్తే దుకాణాలు సీజ్ చేస్తాం.

కాలం చెల్లిన వస్తువులను విక్రయిస్తే దుకాణాలు సీజ్ చేస్తాం…

మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు

కిరాణా షాపుల్లో వస్తువుల చివరి తేదీ చూసుకొని కొనుక్కోండి…

కాంగ్రెస్ నాయకులు గోపతి భానేష్

రామకృష్ణాపూర్ నేటిధాత్రి:

క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అమ్మ గార్డెన్ ఏరియాలో కిరాణా దుకాణాలు విచ్చలవిడిగా ఏర్పడిన నేపథ్యంలో కిరణా షాప్ యజమానులు కాలం చెల్లిన వస్తువులను, గడువు ముగిసిన తినుబండారాలను విక్రయిస్తున్నారని అమ్మ గార్డెన్ ఏరియా కాంగ్రెస్ నాయకులు గోపతి బానేష్ మున్సిపల్ కమిషనర్ గద్దె రాజుకు ఫిర్యాదు చేశారు. కమిషనర్ స్పందించి శానిటరీ ఇన్స్పెక్టర్ సునీల్, సంతోష్ లను గద్దె రాగడి ఏరియాలోని కిరాణా దుకాణాలకు వెళ్లి తనిఖీలు చేయాలని ఆదేశించారు.33 వ రోడ్ నంబర్ షాపుల్లో తనిఖీలు చేస్తుండగా కనకదుర్గ కిరాణా షాప్ లో కాలం చెల్లిన వస్తువులు.

shops

బ్రెడ్ లాంటి తినుబండారాలు విక్రయిస్తున్నారని నిర్ధారించుకొని అట్టి కిరణా షాప్ ను సీజ్ చేశారు. కాలం చెల్లిన వస్తువులను, తినుబండారాలను విక్రయిస్తే దుకాణాలను సీజ్ చేస్తామని, అధిక ధరలకు అమ్మితే షాప్ లైసెన్స్ రద్దు చేసి చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపల్ పరిధిలోని దుకాణాల యజమానులు మున్సిపాలిటీ టాక్స్, లైసెన్స్, ఫుడ్ సెక్యూరిటీ లైసెన్స్ లు తప్పనిసరిగా తీసుకోవాలని, లైసెన్సు లు లేకుంటే షాపులను సీజ్ చేస్తామని అన్నారు.

జీవజాతి పరిరక్షణకు పాటుపడాలి.

జీవజాతి పరిరక్షణకు పాటుపడాలి

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

అంతరించిపోతున్న జీవజాతి పరిరక్షణకు సమాజంలోని ప్రతీ ఒక్కరు పాటుపడాలని ఆర్డీఓ
ఉమారాణి పిలుపునిచ్చారు.
అంతర్జాతీయ జీవ వైవిధ్య పరిరక్షణ దినోత్సవం సందర్బంగా స్థానిక స్వచ్చంధ సంస్థల ఆధ్వర్యంలో ఆర్డివో ఉమారాణి చేతుల మీదుగా జీవ వైవిధ్య పరిరక్షణ వాల్ పోస్టర్లు ఆర్డిఓ కార్యాలయంలో ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా ఆర్డీఓ మాట్లాడుతూ
పర్యావరణాన్ని పరిరక్షిస్తూ జీవ వైవిద్యాన్ని కాపాడుకుందామన్నారు. సృష్టిలోని ప్రతీ జీవరాశిని బతుకనిద్దాం వాటిని కాపాడుకుందాం అని అన్నారు.ప్రతిభా సంస్థ నిర్వాహకులు గిరగాని సుదర్శన్ గౌడ్ మాట్లాడుతూ ప్రకృతితో సామరస్యం, స్థిరమైన అభివృద్ధి అనే ఇతివృత్తంతో జరుపుతున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట తహసీల్దార్ రవిచంద్రా రెడ్డి, స్వయంకృషి సంస్థ నిర్వాహకులు బెజ్జంకి ప్రభాకర్, ఏ.ఎస్.ఆర్. సంస్థ నిర్వాహకులు ఎర్రబోయిన రాజశేఖర్,వాలంటీర్ కాసుల వెంకటాచారి, వెంకన్న ఆఫీస్ ఇంచార్జి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

ఈటెల రాజేందర్ కు ఘన స్వాగతం.

ఈటెల రాజేందర్ కు ఘన స్వాగతం

స్వాగతం పలికిన మండల బిజెపి నాయకులు

శాయంపేట నేటిధాత్రి:

 

ప్రధాని మోడీ ప్రారంభించిన వరంగల్ రైల్వే స్టేషన్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొని కాళే శ్వరం సరస్వతి పుష్కరాలకు వెళ్తున్న ఎంపీ ఈటల రాజేందర్ శాయంపేట మండ లం మందారిపేట స్టేజివద్ద , బీజేపీ మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో పూల గుచ్చం ఇచ్చి శాలువతో సన్మానం చేసి ఘన స్వాగతం పలకడం జరిగింది ఈ కార్య క్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాయరాకుల మొగిలి, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటికొండ రవికిరణ్, జిల్లా కౌన్సిల్ మెంబర్ కానుగుల నాగరాజ్, శాయంపేట మాజీ ఉపసర్పంచ్ కోడెపాక స్వరూప, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పు రాజు,యువ మోర్చా జిల్లా కార్యదర్శి లాడే శివ, సీనియర్ నాయకులు గంగుల రమణారెడ్డి, మోత్కూరి సత్యనారాయణ,మామిడి విజయ్, భూతం తిరుపతి, మేకల సుమన్, కోమటి రాజశేఖర్, కొప్పుల పెద్దమ్మ తల్లి గుడి చైర్మన్, మూడేళ్ల పైడి, ముదిరాజ్ కుల పెద్ద మనిషి దేవు పైడి, తేనేటి రామకృష్ణ, కుక్కల మహేష్, పోల్ మహేందర్, కుక్కల రమేషు, నిమ్మల రాజకుమార్, ఎర్ర రాకేష్ రెడ్డి, బూత్ అధ్యక్షులు భాసని నవీన్, కన్నెబోయిన రమేష్, మంద మధు, బత్తుల రాజేష్, చెక్క దినేష్, నూనె వెంకటేష్, యువమోర్చా నాయకులు మూడేళ్ల రాంప్రసాద్ తది తరులు పాల్గొన్నారు.

మహిళా భవన్లో జీలుగు విత్తనాల పంపిణీ కేంద్రం.

మహిళా భవన్లో జీలుగు విత్తనాల పంపిణీ కేంద్రం…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో నీ. మహిళ భవన్లో ఐకెపి. మహిళ సంఘాల. ఆధ్వర్యంలో సబ్సిడీ జీలుగు విత్తనాల పంపిణీ.కేంద్రాన్ని ప్రారంభించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుమల స్వరూప తిరుపతిరెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ విత్తనాలు ఎరుగుల రూపంగా ఉపయోగపడి పంట దిగుబడి పెరుగుతుందని ప్రజా పాలనలో రైతులకు ఈ విత్తనాలు సబ్సిడీ అందడం జరుగుతుందని రైతులు వినియోగించుకోవాలని కోరడం జరుగుతూ మండలంలోని ప్రతి గ్రామ రైతులు వ్యవసాయంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి. అధిక దిగుబడులు.వచ్చే విధంగా రైతులు సలహాలు. సూచనలు తీసుకోవాలని. ప్రభుత్వం అందజేస్తున్న సబ్సిడీ జీలుగు విత్తనాలు రైతులు అధిక దిగుబడి రావడానికి వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు నేరెళ్ల నరసింహ గౌడ్ తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ ఏపిఎం చంద్రయ్య శ్రీకాంత్ గౌడ్. మహేందర్. కవిత. శోభ. సంబంధిత అధికారులు నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు

తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ గా కొనుగోలు చేయాలి

తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ గా కొనుగోలు చేయాలి

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరిన ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి

నర్సంపేట నేటిధాత్రి:

అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ గా పరిగణించి ప్రభుత్వం కొనుగోలు చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి కోరారు.రాష్ట్ర ఆహార,పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని గురువారం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హైదారాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిశారు.నియోజకవర్గంలో అకాల వర్షంతో దాదాపు 4 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసిందని ఆ ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ గా పరిగణించి ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో సానుకూలంగా స్పందించిన మంత్రి బాయిల్డ్ రైస్ పరిగణలోకి తీసుకొని కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే దొంతి తెలిపారు. ఈ
కార్యక్రమంలో నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్,వరంగల్ జిల్లా కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు బొంపెల్లి దేవేందర్ రావు పాల్గొన్నారు.

నూతన వస్త్రధారణ కార్యక్రమంలో పాల్గొన్న.

నూతన వస్త్రధారణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం చర్చ్ లో జరిగిన విల్లాస్ గారి కుమారులు
నూతన వస్త్రధారణ కార్యక్రమంలో పాల్గొని చిన్నారులను ఆశీర్వదించిన శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు ,మాజి మండల పార్టీ అధ్యక్షులు బొగ్గుల సంగమేశ్వర్ ,యువ నాయకులు మిథున్ రాజ్ ,పట్టణ అధ్యక్షులు ఏజాస్ బాబా, నాగేశ్వర్,సంతోష్ మాలి పటేల్, బొగ్గుల నాగన్న, సమేల్, బాల్ రాజ్ ,గాల్ అప్ప,అనిల్ , విజయ్ తదితరులు.

ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు.

ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

కాశిబుగ్గ నేటిధాత్రి:

కాశిబుగ్గ 19వ డివిజన్ వివేకానంద కాలనీ రోడ్డు నెంబర్ 2 లో కోతి విగ్రహం వద్ద హనుమాన్ జయంతి వేడుకలు రంగ వైభవంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 19వ డివిజన్ కార్పొరేటర్ ఓని స్వర్ణ భాస్కర్ మరియు మాజీ కార్పొరేటర్ బయ్య స్వామి చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు నిర్వహించి అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గోరంట్ల మనోహర్, కొరవి పరమేష్, చిలువేరు శ్రీనివాస్,వేముల నాగరాజు,ములుక సురేష్,క్యాతం రంజిత్, చిలువేరు పవన్, బాల మోహన్,కత్తెరశాల భరత్, బొప్పరాతి నగేష్, బానోతు కిరణ్, గణిపాక సుధాకర్,దేవర ప్రసాద్,చిలగాని రమేష్,మార్త భాస్కర్,గుజ్జుల రాకేష్ రెడ్డి,సిలువేరు రాజు,క్యాతం రాజు, బాల రామ్మోహన్, కలివేలు శేషు, ఊరుగొండ రవీందర్,సిలువేరు రాజేష్,చిలువేరు సన్నీ, కుసుమ సారంగపాణి,వంగరి రాంప్రసాద్,వంగరి రవి, సాంబారి మల్లేశం,గోరంట్ల వరుణ్,కాశిబుగ్గ మిత్ర బృందం మరియు లక్ష్మీ గణపతి సహకార పరపతి సంఘం కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ముద్ద చర్మ వ్యాధి.

ముద్ద చర్మ వ్యాధి (Lumpy Skin Disease)

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జంతువులలో చర్మంపై గడ్డలు లేదా ముద్దలు కనబడడం, జ్వరం, శోషరస కణుపులు పెరగడం మరియు కొన్నిసార్లు కుంటితనం వంటివి.

ముద్ద చర్మ వ్యాధి (Lumpy Skin Disease) లక్షణాలు:

చర్మంపై గడ్డలు: చర్మంపై 2-5 cm వ్యాసం గల గడ్డలు లేదా ముద్దలు కనబడతాయి.

జ్వరం: జంతువులకు జ్వరం వస్తుంది.

శోషరస కణుపులు పెరగడం: శోషరస కణుపులు పెద్దవిగా మారుతాయి.

కుంటితనం: కొన్నిసార్లు జంతువులు కుంటితనం ప్రదర్శిస్తాయి.

శ్వాసకోశ మరియు జీర్ణశయాంతర ప్రేగులలో మార్పులు: కొన్ని సందర్భాలలో, శ్వాసకోశ మరియు జీర్ణశయాంతర ప్రేగులలో కూడా మార్పులు కనబడతాయి.

చర్మం మరియు శ్లేష్మ పొరలపై నాడ్యూల్స్: చర్మం మరియు శ్లేష్మ పొరలపై బహుళ నాడ్యూల్స్ కనబడతాయి.

వాపు: అవయవాలలో వాపు వస్తుంది.

జ్వరం: జంతువులకు జ్వరం వస్తుంది.

Lumpy skin disease

 

శోషరస కణుపులు పెరగడం: శోషరస కణుపులు పెద్దవిగా మారుతాయి.

కుంటితనం: కొన్నిసార్లు జంతువులు కుంటితనం ప్రదర్శిస్తాయి.

శ్వాసకోశ మరియు జీర్ణశయాంతర ప్రేగులలో మార్పులు: కొన్ని సందర్భాలలో, శ్వాసకోశ మరియు జీర్ణశయాంతర ప్రేగులలో కూడా మార్పులు కనబడతాయి.
చర్మం మరియు శ్లేష్మ పొరలపై నాడ్యూల్స్: చర్మం మరియు శ్లేష్మ పొరలపై బహుళ నాడ్యూల్స్ కనబడతాయి.

వాపు: అవయవాలలో వాపు వస్తుంది.

ఈ వ్యాధి పాక్స్విరిడే కుటుంబం మరియు కాప్రిపాక్స్ వైరస్ జాతికి చెందిన వైరస్ ద్వారా వస్తుంది. ఇది పశువులలో చర్మంలో గడ్డలతో తీవ్రమైన వ్యాధిని కలిగిస్తుంది.ముద్ద చర్మ వ్యాధి సలహాల గురించి మండల వైద్యాధికారి సంప్రదించగలరు.

◆ ఝరాసంగం మండల పశు వైద్య అధికారి డాక్టర్ హర్షవర్ధన్ రెడ్డి.

కాశీబుగ్గలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు.

కాశీబుగ్గలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు.

కాశీబుగ్గ నేటిధాత్రి:

వరంగల్ తూర్పు, కాశిబుగ్గ 19వ డివిజన్ వివేకానంద కాలనీ రోడ్డు నెంబర్ 2 లో ఉన్న, కోతి విగ్రహం వద్ద హనుమాన్ జయంతి వేడుకలు రంగ వైభవంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా 19వ డివిజన్ కార్పొరేటర్ఓని స్వర్ణ భాస్కర్, మాజీ కార్పొరేటర్ బయ్య స్వామి చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు నిర్వహించి అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టినారు.

ఈ కార్యక్రమంలో గణిపాక సుధాకర్, చిలువేరు శ్రీనివాస్, వేముల నాగరాజు, సిలువేరు రాజు, ములుక సురేష్, క్యాతం రంజిత్, చిలువేరు పవన్, బాల మోహన్, కత్తెరశాల భరత్, బొప్పరాతి నగేష్, బానోతు కిరణ్. దేవర ప్రసాద్, చిలగాని రమేష్, మార్త భాస్కర్, గుజ్జుల రాకేష్ రెడ్డి, , క్యాతం రాజు, బాల రామ్మోహన్, కలివేలు శేషు, ఊరుగొండ రవీందర్, సిలువేరు రాజేష్, చిలువేరు సన్నీ, కుసుమ సారంగపాణి, వంగరి రాంప్రసాద్, వంగరి రవి, సాంబారి మల్లేశం, గోరంట్ల వరుణ్, కాశిబుగ్గ మిత్ర బృందం మరియు లక్ష్మీ గణపతి సహకార పరపతి సంఘం కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Hanuman

నర్సింహారామయ్య ప్రతివాదేహానికి నివాళులు అర్పించిన.

నర్సింహారామయ్య ప్రతివాదేహానికి నివాళులు అర్పించిన మడికొండ బ్రదర్స్

పరకాల నేటిధాత్రి

 

 

పరకాల మున్సిపల్ పరిధిలోని 12 వ వార్డులో మొలుగురి నర్సింహా రామయ్య అకాలమరణం చెందగా వారి పార్దివదేహాన్ని సందర్శించి, పూలమాలలువేసి,నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు మడికొండ బ్రదర్స్.ఈ కార్యక్రమంలో బొచ్చు భాస్కర్,బొచ్చు బాబు,ఎండీ.నయీమ్ పాషా,కందుకూరి సాగర్,బొచ్చు సతీష్ తదితరులు పాల్గొన్నారు.

మండలంలో అధికారులు నాయకుల.!

మండలంలో అధికారులు నాయకుల చే. ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజ….

తంగళ్ళపల్లి నేటీ ధాత్రి:

తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామంలో. ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల. నిర్మాణానికి మొదటిగా సారిగా మండలంలోని సారం పెళ్లి గ్రామంలో అధికారులచే నాయకులచే భూమి పూజ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ. అర్హులైన నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందించడం ప్రజా ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత ఇంటిని కలిగి ఉండాలని కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కల అన్నారు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నిజం చేస్తుందని. మండలంలో మొట్టమొదటిసారిగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారంచుట్టిందని అలాగే ఇంటి నిర్మాణంలో పూర్తి సహకారం ప్రభుత్వం అందిస్తుందని నిర్మాణాలకు ఇసుకను ఉచితంగా సరఫరా చేస్తుందనినిర్మాణంలో నిధులు మంజూరుకు లబ్ధిదారులు అధికారులను. దళారులను ఆశ్రయించవద్దని లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణం చేపట్టి పనులు వేగవతం చేసి ఇందిరమ్మ ఇంటి కల సాకారం చేసుకోవాలని గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్ రూమ్ల దోపిడీకి తెర లేపారని ప్రజా ప్రభుత్వంలో అటువంటి వాటికి తావు లేదని ఇందిరమ్మ ఇండ్ల పనుల్లో ప్రభుత్వం విడు
త ల. వారీగా రుణాలు మంజూరు చేస్తారని.ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసిన జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ . సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి . చిత్రపటాలకు లబ్ధిదారుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మునిగల.రాజు ఆధ్వర్యంలో మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం చేసినారు. ఇట్టి కార్యక్రమంలో . పంచాయతీ సెక్రెటరీ మానవ హక్కుల యువజన విభాగం జిల్లా అధ్యక్షులు గుగ్గిళ్ళ భరత్ గౌడ్. ఏఎంసీ డైరెక్టర్ గుగ్గిల. రాములు. ఎండి హనీ. గడ్డమీది శ్రీనివాస్. సుంచుల కిషన్. సిరిసిల్ల దేవదాస్. బాలరాజు. అంజయ్య. పురుషోత్తం. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

మాదకద్రవ్యాలు నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు.

మాదకద్రవ్యాలు నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు

మండల స్థాయిలో డ్రగ్స్ నియంత్రణ పై సమావేశాలు నిర్వహించాలి

గ్రామాలలో గంజాయి పై సమాచారం అందితే వెంటనే పోలీసులకు తెలియజేయాలి

డ్రగ్స్ నియంత్రణ పై జిల్లా స్థాయి నార్కో సమన్వయ సమావేశం నిర్వహించిన కలెక్టర్

సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి

 

 

 

 

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మాదకద్రవ్యాలు (డ్రగ్స్) నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సంబంధిత అధికారులను ఆదేశించారు.

గురువారం వారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో జిల్లా స్థాయి నార్కో సమన్వయ సమావేశాన్ని ఎస్పీ మహేష్ బి గీతే, ఇతర అధికారులతో కలిసి నిర్వహించారు.

జిల్లాలో నమోదవుతున్న ఎన్.డి.పి.ఎస్ కేసులు, గంజాయి సాగు నివారణ చర్యలు, మాధక ద్రవ్యాల వాడకం నియంత్రణ చర్యలు, మాదక ద్రవ్యాల నివారణ కోసం శాఖల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టాల గురించి చేయాల్సిన విస్తృత ప్రచారం వంటి పలు అంశాలను సుదీర్ఘంగా చర్చించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ, పాఠశాలలో పరిసరాల్లో ఉన్న పాన్ షాప్ వంటి వాటి పై నిఘా పెట్టాలని అన్నారు.

పాఠశాలలు మరియు కళాశాలలు పునఃప్రారంభం జరిగిన తర్వాత డ్రగ్స్ నియంత్రణ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు.

జిల్లాలో ఎక్కడా కూడా ఓపెన్ డ్రింకింగ్ జరగకుండా చూడాలని అన్నారు. ప్రతి మండలంలో తహసిల్దార్, ఎంపిడిఓ, పోలీస్, మండల వ్యవసాయ అధికారి వైద్య అధికారులు పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించి డ్రగ్స్ నియంత్రణ చర్యలు తీసుకోవాలని అన్నారు.

జిల్లాలో ఎక్కడైనా గంజాయి సాగు జరుగుతుందో పరిశీలించి దాని నివారణకు చర్యలు తీసుకోవాలని అన్నారు.

జిల్లాలో ఉన్న బార్, వైన్ షాప్ ప్రభుత్వ నిర్దేశిత సమయపాలన పాటించేలా చూడాలని అన్నారు.

జిల్లాలో ఉన్న సినిమా థియేటర్ల పరిసరాలను రాత్రి సమయంలో ఆకస్మికంగా తనిఖీలు చేయాలని, జిల్లాలో ఉన్న రైస్ మిల్లులు, ఇట్టుక బట్టీల వద్ద అసిస్టెంట్ లేబర్ అధికారి ఆధ్వర్యంలో డ్రగ్స్ నియంత్రణ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వీటిలో డ్రగ్స్, గంజాయి వల్ల కలిగే నష్టాలు వివరించే వీడియోలను, పోస్టర్లను ప్రదర్శించాలని అన్నారు.

డ్రగ్స్ పరీక్షల నిర్వహణకు అవసరమైన యూరిన్ కిట్లను పోలీసు, ఎక్సెస్ శాఖ అధికారుల వద్ద అవసరమైన మేర అందుబాటులో ఉంచాలని కలెక్టర్ వైద్యారోగశాఖ అధికారికి సూచించారు.

కళాశాలలో సడన్ గా వింతగా ప్రవర్తించే విద్యార్థులను గుర్తించాలని, ఎవరైనా డ్రగ్స్ గంజాయి తీసుకుంటున్నట్లు తెలిస్తే వారికి అవసరమైన కౌన్సిలింగ్ అందజేయాలని అన్నారు.

డ్రగ్స్ వల్ల కలిగే విపరీత పరిణామాల పై అవగాహన వివరిస్తూనే సమాంతరంగా వాటి నియంత్రణకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని, మాదక ద్రవ్యాల రవాణా, సాగు, వినియోగం నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని అన్నారు.

గ్రామ స్థాయి నుంచి డ్రగ్స్, గంజాయి అలవాటు ఉన్నట్లు ఏదైనా అనుమానం కలిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.

ఈ సమావేశంలో కలెక్టరేట్ సెక్షన్ సూపర్డెంట్ ప్రవీణ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జలీ బేగం, అసిస్టెంట్ లేబర్ అధికారి నాజర్ అహ్మద్, డ్రగ్ ఇన్స్పెక్టర్ భవాని, వేములవాడ మున్సిపల్ కమిషనర్ అన్వేష్, ఫుడ్ సేఫ్టీ అధికారి అనూష, ఎక్సైజ్ విద్య శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

పోలీస్ కార్యాలయంలో భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలు.

జిల్లా పోలీస్ కార్యాలయంలో భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలు

సిరిసిల్ల టౌన్: ( నేటిధాత్రి )

 

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలో దళిత వైతాళికులు,సంఘ సంస్కర్తగా ప్రఖ్యాతులైన భాగ్యారెడ్డి వర్మ జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన భాగ్యరెడ్డి వర్మ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపిఎస్.ఈసందర్భంగా ఎస్పి మాట్లాడుతూ
భాగ్యరెడ్డి వర్మ ఒక గొప్ప సంఘ సంస్కర్త, దళిత వైతాళికుడు అని కొనియాడారు.
స్వాతంత్ర్యంకు ముందు దళితుల హక్కులు, సమానత్వం కోసం పోరాడిన గొప్ప వ్యక్తి అని, హైదరాబాద్‌ సంస్థానంలో అనేక దళిత బాలికల పాఠశాలలను స్థాపించి, వేల మంది విద్యార్థులకు విద్య అందించి వారి అభ్యున్నతికి గట్టి పునాదులు వేశాడని కొనియాడారు.

Bhagya Reddy Varma Jayanti

 

స్వాతంత్య్ర రాక ముందే సమాజంలో నెలకొని ఉన్న అనేక సామాజిక వివక్షత లు,అసమానతలు,మూడ నమ్మకాలపై గళమెత్తి పోరాటం చేశారని కొనియాడారు.జోగిని,దేవదాసి వ్యవస్థలపై పోరాటం చేశారని అన్నారు.ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేషన్ అధికారి పద్మ, ఆర్.ఐ యాదగిరి,ఆర్.ఎస్.ఐ జునైద్,కార్యాలయా సిబ్బంది, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

నాయకులఅండదండలతో అన్యాయంగా మాపై దౌర్జన్యం.

నాయకులఅండదండలతో అన్యాయంగా మాపై దౌర్జన్యం…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి:

తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల గ్రామానికి చెందిన. మి రుపాల నర్సింగరావు. తండ్రి. వెంకట్రావు. గ్రామం నేరెళ్ల మండలం తంగళ్ళపల్లి. జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా. అను నేను మాకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాం. ఈ సందర్భంగా విషయం ఏమనగా నేరెళ్ల గ్రామ మాజీ సర్పంచి బొబ్బల మంజుల మల్లేశం గార్లకు ఎలాంటి ప్రమేయం లేదు ఈరోజు మేము మా కుటుంబం. గత రెండు నెలలుగా కరీంనగర్లోని హాస్పిటల్ లో అడ్మిట్ అయి ఉండడం చూసిన సదురు రైతు అయినటువంటి మాజీ ఉపసర్పంచి మీరు పాల మానస జగదీశ్వర్ అనేవారు కేసీఆర్ గారి మేనల్లుడు అయిన అటువంటి పోతుగల్ చందు రావు గారి సడ్డకుడు వారి అండదండలతో బీద వాళ్ళు అయినటువంటి అయినటువంటి మమ్మల్ని చులకనగా చూసి ఇబ్బందులకు గురి చేస్తున్నాడు మేము వారి నాటు వేసుకున్న కానీ మాకు నష్టం జరిగిన కానీ ఆ చల్లని చెట్టు కొమ్మలి గత 18 సంవత్సరాల నుంచి నరికి వేయలేదు కావాలని నేరెళ్ల గ్రామానికి లీడర్ని అని విర్రవీగుతూ పైసల బలంతో ఎవడినైనా ఏమైనా చేయగలను అనే అహంకారంతో ఊరిలో రాజ్యమేలుతున్నారు నేను మొదటిగా పెట్టిన మెసేజ్ తో సెస్.ఏఈ .గారు ఎంక్వయిరీ కి వచ్చారు నేను అందుబాటులో లేను కనుక ఫోన్లో సంప్రదించగా నాకు.ఏ లాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మేము లేనిది చూసి దొంగగా కబ్జా కొరులుగా లైన్మెన్ లతో కుమ్మక్వై ఎలా నా చెట్టుకొమ్మలని కొట్టేస్తారు కరెంటు స్తంభాలు పాతుతారు అని ప్రశ్నించాను. దానికి సెస్ ఏఈ గారికి సమాధానం రేపు మాకు అంటూ నాకు జరిగిన అన్యాయాన్ని . దాటవేస్తున్నారు ఇట్టి విషయమై సెస్. చైర్మన్ అయినటువంటి చిక్కాల రామారావు గారిని వేడుకుంటూ బాధ్యులపై చర్యలు తీసుకుంటూ నాకు న్యాయం చేస్తారని ఆశిస్తూ దీనిపై.తగు విచారణ చేసి బాధ్యులైన వారిపై తగు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ విషయమై మేము ఎటువంటి పొరపాటు చేసిన దానికి నేనే మేము మా కుటుంబ సభ్యులు బాధ్యులమని తెలియజేశారు. లేని ఎడల. ఆ కరెంటు స్తంభాలకే నా ప్రాణమే సైతం లెక్కచేయకుండా వదలడానికి సిద్ధంగా ఉన్నానని తెలుపుతున్నాను ఇట్టి విషయమై సంబంధిత అధికారులు తగ్గు విచారణలు చేపట్టి బాధ్యులుఎవరైనా నేనైనా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మాకు తగు న్యాయం చేయాలని ఈ సందర్భంగా వేడుకుంటున్నాం.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version