కమిషనర్ కు శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ సిబ్బంది
నేటిధాత్రి, వరంగల్ మున్సిపల్ కమిషనర్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన అశ్విని తానాజీ వాకడేను బల్లియాకు చెందిన ఆఫీస్ సబార్డినేట్స్ కార్యవర్గ సభ్యులు గురువారం ప్రధాన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ కు శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో అధ్యక్షులు నవీన్, ప్రధాన కార్యదర్శి మోరే రమేష్, సురేష్, రాజు తదితరులు ఉన్నారు.