గంగాధర నేటిధాత్రి :
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ గురువారం కాంగ్రెస్లో చేరారు. గంగాధర మండలం గర్శకుర్తి గ్రామ తాజా మాజీ సర్పంచ్ అలువాల నాగలక్ష్మీ- తిరుపతి బిఆర్ఎస్ పార్టీని వీడి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆద్వర్యంలో హస్తం పార్టీ లోకి వారిని ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ముత్యం శంకర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ముప్పిడి తిరుపతి రెడ్డి, తోట మల్లారెడ్డి మరియు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.