వరంగల్, నేటిధాత్రి
గురువారం రోజున వరంగల్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తీగల జీవన్ గౌడ్ చేతుల మీదుగా “నేటిధాత్రి” పత్రిక ఆధ్వర్యంలో రూపొందించిన 2025వ సంవత్సరం నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం హనుమకొండ లోని జిల్లా కోర్టు ప్రాంగణంలో పలువురు సీనియర్ న్యాయవాదుల సమక్షంలో జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు అంబరీష్ రావు, గుడిమల్ల రవికుమార్, ఏలుకుర్తి ఆనంద్ మోహన్, విజయకుమార్, పోషిని రవీందర్, హేమసుందర్ రెడ్డి, మహేందర్, ముకేష్, పలువురు సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.