కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం భట్టుపల్లి గ్రామపంచాయితీ కార్యాలయంలో ప్రభుత్వ అధికారులు నిర్వహించిన ప్రజా పాలన గ్రామ సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసి గ్రామ సభను ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు ప్రజాపాలన గ్రామసభలను ఏర్పాటుచేసి ప్రతి పేద బడుగు బలహీన కుటుంబాలకు ఈనెల జనవరి 26 రిపబ్లిక్ డే నాడు ప్రతి పేద కుటుంబానికి అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఇందిరమ్మ ఇల్లు నిరంతర ప్రక్రియని అని లిస్టులో పేరు రాని వారు ఎవరు నిరుత్సాహ పడకూడదని ఈ నియోజకవర్గంలో సంవత్సరానికి 3500 వందల ఇల్లు నా కోటాలో వచ్చాయని ప్రతి ఇల్లు లేని నిరుపేద కుటుంబానికి అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కొత్తగా పెళ్లి అయిన వారికి రేషన్ కార్డ్స్ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందని ప్రజాపాలన గ్రామసభలో ప్రజలే అర్హులను గుర్తించాలని తెలియజేశారు. నా నియోజకవర్గంలో పేదవాడు అయితే చాలు పార్టీలకు అతీతంగా అన్ని ప్రభుత్వ పథకాలు అందిస్తామని తెలియజేసిన పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు
ఈ యొక్క కార్యక్రమానికి కరకగూడెం ఎమ్మార్వో నాగప్రసాద్ సీఐ వెంకటేశ్వర్లు , మండల అధికారులు,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇక్బల్ హుసేన్ , కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు,మహిళ నాయకులు, యువజన నాయకులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు