మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలంలో గురువారం టీయూడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర కార్యదర్శి మధు గౌడ్ ఆదేశాల మేరకు జడ్చర్ల నియోజకవర్గ అధ్యక్షులు నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో నవాబుపేట మండల టీయూడబ్ల్యూజే (ఐజేయు) కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా నవతెలంగాణ రిపోర్టర్ కొంగళ్ల. కృష్ణయ్య, ఉపాధ్యక్షుడిగా జనం న్యూస్ రిపోర్టర్ శ్రీరామ్ వెంకటేష్, ప్రధాన కార్యదర్శిగా నేటి ధాత్రి రిపోర్టర్ కడ్మాన్ కల్లా.శేఖర్, గౌరవ అధ్యక్షులుగా వార్త రిపోర్టర్ కే.శేఖర్, కార్యదర్శిగా వాయిస్ టుడే రిపోర్టర్ బైండ్ల. గోపాల్, కోశాధికారిగా లోకల్ గైడ్ రిపోర్టర్ జెట్టి. రవికుమార్, సహాయ కార్యదర్శిగా క్యూ న్యూస్ రిపోర్టర్ అంకూరి. స్వామి, ఈసీ నెంబర్ గా ఆకుల. సిద్ధప్ప, జటావత్ శంకర్, ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు కొంగళ్ల. కృష్ణయ్య మాట్లాడుతూ.. అన్ని విధాలుగా అందరినీ కలుపుకొని ప్రతి కార్యక్రమంలో కమిటీ సలహాల ప్రకారం నడుచుకుంటానని అన్నారు. తనను మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.