నడికూడ,నేటిధాత్రి:
మండల కేంద్రంలో రసాభసగా సాగిన గ్రామసభ అర్హులకు కాకుండా అనర్హులకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించారని గ్రామ సభలో వాగ్వాదం చోటుచేసుకుంది. ఇన్చార్జ్ ఎంపీడీవో చేతన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన గ్రామసభకు మండల స్పెషల్ ఆఫీసర్ నవీన్ కుమార్ హాజరయ్యారు.ఇందిరమ్మ ఇండ్లు అర్హులకు కాకుండా అనర్హులకు ఇల్లు కేటాయించారని గ్రామ సభలో ప్రజలు గొడవపడ్డారు. పరకాల సిఐ క్రాంతికుమార్ వెంటనే స్పందించి శాంతిభద్రతలను కల్పించారు. అనంతరం మాట్లాడుతూ ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే అధికారులకు వినతిపత్రం అందించాలన్నారు.