సోతుకు.ప్రవీణ్ కుమార్ సిపిఐ పట్టణ కార్యదర్శి
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సర్వేనెంబర్ 280లో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో భూ పోరాటం నిర్వహించడం జరుగుతుందని సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా సోతుకు.ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ భగత్ సింగ్ కాలనీ రెండో ఆవిర్భావ వేడుకల ను పురస్కరించుకొని ఈ నెల 24వ తేదీనా భగత్ సింగ్ కాలనీ లో బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ యొక్క బహిరంగ సభకు సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, భూపాలపల్లి శాసన సభ్యులు గండ సత్యనారాయణ రావు, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాస్ రావు, సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ లు ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారని తెలిపారు.
ఇండ్లు లేని నిరుపేదలు సుమారు 1500 మంది గుడిసెలు వేసుకొని నివసించడం జరుగుతుందని తెలిపారు. భగత్ సింగ్ కాలనీలో రోడ్లు, సైడ్ డ్రైనేజ్, ఇంటి నెంబర్లను వెంటనే అధికారులు కేటాయించాలని కోరారు. గుడిసె వాసుల మంచి నీళ్ల కోసం సుమారు రెండు లక్షల నిధులతో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు బోర్ ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ యొక్క బోర్ ని బహిరంగ సభ రోజున ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు క్యాతరాజు సతీష్,నేరెళ్ల జోసెఫ్, వేముల శ్రీకాంత్, తిరుపతి, రవి, సింహాద్రి, రమేష్, యాకుబ్ తదితరులు పాల్గొన్నారు.