ఆదివాసీ సంక్షేమ పరిషత్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సనప విష్ణు
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
గుండాల మండలం లోని గ్రామపంచాయతీ కార్యాలయలలో నిర్వహించిన ప్రజా పాలన,గ్రామసభలో గతంలో ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించి ఇప్పటివరకు ఆ దరఖాస్తులు ఏమైనాయో చెప్పకుండా వాటికి సంబంధించిన డేటాని కూడా ప్రజల ముందు ఉంచకుండా ఎవరో ఒకరిద్దరూ కూర్చొని సెలెక్ట్ చేసిన కొంతమంది పేర్లను మాత్రమే లిస్టులో వచ్చేలాగా చేసి మళ్ళీ గ్రామసభ పేరుతో మరొక్కసారి ప్రజలను వంచించేందుకు లిస్టులో పేరు రానివారు దరఖాస్తు పెట్టుకోవాలని చెప్పడం కాంగ్రెస్ ప్రభుత్వ చేతకానితనానికి అద్దం పడుతుంది. అంతేకాకుండా ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు ఆ దరఖాస్తు ద్వారా సర్వే చేసిన వివరాలు ఆ సర్వే ద్వారా ఎంపికైన వారి వివరాలు గ్రామ సభలో పెట్టవలసింది పోయి ఆవిషయాలను గోప్యంగా ఉంచుతూ ఎందుకు ప్రజల పేర్లు అర్హుల జాబితాలో రాలేదో చెప్పకుండా మళ్లీ మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని చెప్పడం ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనం, అంతేకాకుండా సంవత్సర కాలంగా వంద రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారెంటీ అని చెప్పి ఇప్పటికీ దరఖాస్తుల పేరుతో సర్వేల పేరుతో మళ్లీ ఇప్పుడు దరఖాస్తుల పేరుతో కాలం గడుపుతూ రాబోయే స్థానిక పంచాయతీ ఎలక్షన్ల కోసం కొత్త,దొంగ నాటకానికి తెర తీశారని స్పష్టంగా అర్థం అవుతుంది అని సనప విష్ణు అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పూనెం రమణబాబు,మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పూనెం వసంత్, ఎట్టి రవికుమార్, తాటి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.