చిట్యాల,నేటిధాత్రి:
చిట్యాల మండల కేంద్రంలో ఉన్న ఆదర్శ పాఠశాల కళాశాలలో సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను పురస్కరించుకొని పాఠశాల కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్, నీలం రవీందర్ సమక్షంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ వాసాల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాలలతో ఘనంగా జయంతి వేడుకలను నిర్వహించారు
జయంతి వేడుకలు పురస్కరించుకొని ప్రోగ్రాం ఆఫీసర్ వాసల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర పోరాటంలో భాగంగా
ఆజాద్ హిందు పౌజ్* ఏర్పాటుచేసి తెల్ల దొరల వెన్నుల్లో వణుకు పుట్టించిన ధైర్యవంతుడు మాతృభూమి దాశ్య శృంకలాలను తెంపిన మహానుభావుడు దేశం కోసం జీవితాన్ని త్యాగం చేసిన సుభాష్ చంద్రబోస్ గొప్పతనాన్ని స్మరిస్తూ ఆయన అడుగుజాడల్లో నడవాలని అన్నారు,ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ధనలక్ష్మి,, ఆయేషా, జోష్ణ, రాజు, శివ వేల్పుల భాస్కర్, రాజేంద్రప్రసాద్, శ్రీలత, ప్రసన్న, ఎండి కలీం పాషా, శ్రీకాంత్, ఎండి షబిరుద్దీన్, అశోక్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.