సీఐటీయూ జిల్లా జాయింట్ సెక్రెటరీ రమేష్
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి విద్యుత్ సర్కిల్ ఆఫీస్ వద్ద ఆర్టిజన్ కన్వర్షన్ జేఏసీ ఆధ్వర్యంలో 4వ రోజు రిలే నిరాహార దీక్షలు ప్రారంభమై అయ్యాయి సిఐటియు జిల్లా జాయింట్ సెక్రెటరీ ఆకుదారి రమేష్ ముఖ్యఅతిథిగా హాజరై పూలమాలలు వేసి నిరాహార దీక్షను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆకుదారి రమేష్ మాట్లాడుతూ ఆర్టిజన్ కార్మికుల న్యాయమైన డిమాండ్ కన్వర్షన్ ఒకే సంస్థలో ఒకే సర్వీస్ రూల్స్ ఉండాలని ఏపీఎస్ ఈ బీ రూల్స్ తో కన్వర్షన్ చేయాలని డిమాండ్ చేశారు కన్వర్షన్ చేయడం వలన సమస్త పై ఎలాంటి ఆర్థిక భారం పడదని తెలిపారు అసిస్టెంట్ ఇంజనీర్ కనకయ్య సార్ మద్దతు తెలపడం జరిగింది ఈ దీక్షలకు ప్రధాన సంఘాలు కూడా మద్దతు తెలిపాయి విద్యుత్ ఉద్యోగుల బీసీ సంఘం సర్కిల్ కమిటీ నాయకులు ఐఎన్టియుసి 327 జిల్లా ప్రెసిడెంట్ కట్ల సదయ్య గారు మద్దతు తెలిపారు అలాగే కట్ల సదయ్య మాట్లాడుతూ 18 సంవత్సరాలుగా డిపార్టుమెంటును నమ్ముకొని వర్క్ చేస్తున్న ఆర్టిజన్ కార్మికుల న్యాయమైన డిమాండ్ కన్వర్షన్ చేయాలని తెలిపారు టి ఆర్ వి కె ఎస్ జిల్లా నాయకులు రాధాకృష్ణ మద్దతు తెలపడం జరిగింది అలాగే రాధాకృష్ణ మాట్లాడుతూ కన్వర్షన్ అయ్యేంతవరకు టి ఆర్ వి కే ఎస్ సంఘం తరఫున మా పూర్తి సహకారం మద్దతు ఉంటుందని తెలిపారు టి ఆర్ వి కే సంఘం నుండి దేవేందర్ రెడ్డి శంకర్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సర్కిల్ జాయింట్ సెక్రెటరీ యాల్ల సురేందర్ రెడ్డి పడిదల విజేందర్ కృష్ణమూర్తి ఆకుల శ్రీకాంత్ సీత సతీష్ బుస్స అశోక్ చెలిక అశోక్ ఎస్ సతీష్ కుమార్ ములుగు డివిజన్ నుండి కన్వీనర్ జె సురేష్ సాయిబాబు కృష్ణమూర్తి ప్రశాంత్ రమేష్ పాపారావు అశోక్ నరేష్ మధుసూదన్ రెడ్డి రాంబాబు విజేందర్ రవి విజయ్ సుమారు 25 మంది ఆర్టిజన్ కార్మికులు పాల్గొన్నారు