అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు….
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్…
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువ చేసేందుకే ప్రజాపాలన వార్డ్ సభలు నిర్వహించడం జరుగుతుందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం క్యాతనపల్లి మునిసిపాలిటీ పరిధిలోని తొమ్మిదవ వార్డ్ గద్దెరాగడి లో ప్రజా పాలన వార్డు సభ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మందమర్రి ఎమ్మార్వో సతీష్ , మున్సిపాలిటీ కమిషనర్ జి రాజు లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వ్యవసాయ సాగు భూములకే రైతు భరోసా వస్తుందని అన్నారు. వార్డు సభల్లో కొత్తగా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలన్నారు. ఎవరైనా కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తు చేసుకోకుండా ఉంటే ఇప్పుడు ఈ వార్డ్ సభలలో చేసుకోవచ్చునని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ విద్యాసాగర్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్ పారుపల్లి తిరుపతి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు, కాంగ్రెస్ నాయకులు గోపతి బానేష్, మున్సిపాలిటీ సిబ్బంది వార్డు ప్రజలు పాల్గొన్నారు.