మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండలం పేరూర్ గ్రామ సభలో ఏఐసీసీ ఇంచార్జ్, తెలంగాణ ఇంచార్జ్ శ్రీ. విశ్వనాథన్ తో కలిసి పాల్గొన్న దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (జీఎంర్ ), టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ శ్రీ. అరవింద్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జియంఆర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన అప్పులకు మిత్తి కట్టుకుంటూ…ఒక్కొక్కటిగా ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని,
ఒక్క పేరూర్ గ్రామంలోనే రైతులకు 93 లక్షల 97594 రూపాయల రుణమాఫీ చేసాం. 259 ఇండ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 422 కుటుంబాలకు 500 లకే సబ్సిడీ సిలిండర్ ఇస్తున్నామన్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు అధికారం చేపట్టిన 2 రోజులకే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, 200 వందల యూనిట్ల ఉచిత విద్యుత్, 500 లకే గ్యాస్ సిలిండర్, 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ తదితర హామీలు నెరవేర్చమన్నారు.
రైతులకు 21 వేల కోట్లతో 25 లక్షల మంది రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేశాం.
26 రిపబ్లిక్ డే నాడు ఎకరానికి 6 వేల చొప్పున రైతు భరోసా వేస్తాం.
బిఆర్ఎస్ పదేళ్లు చేయలేనిది ఒక్క సంవత్సరం లో చేసి చూపించాం… అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే 60000 వేల ఉద్యోగాలు ఇచ్చాము.
జనవరి 26 నుండి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 4 పథకాలు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా విషయంలో ప్రజలు ఎవరు అందోళన చెందవద్దు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాల లబ్ధి జరుగుతుంది, ఎవరికైనా అర్హత ఉండి ప్రభుత్వ పథకాలు అందని వారు, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల కోసం గ్రామ సభలో అప్లికేషన్ లు పెట్టుకోవచ్చు.
గత పదేళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు, డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వలేదు.
గత పదేళ్లలో పేరూర్ గ్రామానికి చేసిందేమీ లేదు, పేరూర్ కు వచ్చిన రైతు వేదికను వేరే గ్రామానికి తరలించారు. పేరూర్ గ్రామంలో రైతు వేదిక నిర్మాణం కోసం అధికారులు ప్రపోజల్స్ తయారు చేయమని ఇప్పటికే అధికారులను ఆదేశించాము.
పేరూర్ లిఫ్ట్ ను బిఆర్ఎస్ ప్రభుత్వం మధ్యలో వదిలేస్తే, పేరూర్ లిఫ్ట్ గురించి ఇరిగేషన్ మంత్రి తో మాట్లాడి పేరూర్ లిఫ్ట్ పనులు ప్రారంభింపజేసాం. త్వరలో పేరూర్ లిఫ్ట్ పనులు పూర్తి చేసి ఈ వాన కాలం నాటికి లిఫ్ట్ ద్వారా గ్రామానికి సాగు నీళ్లు అందిస్తాం.
గత పదేళ్లలో శంకర సముద్రం రైట్ కెనాల్ నుండి పేరూర్ కు నీళ్లు తేలేకపోయారు. త్వరలో శంకర సముద్రం ఆర్ &ఆర్ ఇష్యూ పరిష్కరించి, శంకర సముద్రం నీటిని పేరూర్ కు అందిస్తాం.
బిఆర్ఎస్ ప్రభుత్వం వర్నే – ముత్యాలంపల్లి గ్రామంలో చిన్న సమస్యను పరిష్కరించలేక బ్రిడ్జి మధ్యలో వదిలేస్తే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యను పరిష్కరించి బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేశాం.
నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు పనిచేస్తున్నామని ఆశీర్వదించండి అని – మన ముఖ్యమంత్రి పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి కి అండగా ఉండండి అని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రైతులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.