నిజాంపేట, నేటి ధాత్రి
నస్కల్ కు రోడ్డు వేయాలని 13 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోవడం బాధాకరమని నస్కల్ గ్రామస్తులు మండిపడ్డారు. ప్రభుత్వము స్పందించని ఎడల ధర్నాలు రాస్తారోకోలు, వంటావార్పు , తెలంగాణ కోసం ఏ విధంగా కొట్లాడినామో ఆ విధంగానే కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఇంకా వినూత్న రీతిలో కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తీగల శ్రీనివాస్ గౌడ్ ,శాల రాజు ,చాకలి శ్రీనివాస్,దేశెట్టి చంద్రయ్య, యాదవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు