ములుగులో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందడి…..

 ములుగులో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందడి..

#తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఓటర్లు!

ములుగు, నేటిధాత్రి:

 

 

జిల్లా కేంద్రమైన ములుగులో తొలి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అత్యంత ఉత్సాహంగా ప్రారంభమైంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
ఉదయం నుండే ఎన్నికల అధికారులు పోలింగ్ ప్రక్రియను ప్రారంభించగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణం నెలకొంది.

మహిళలు, వృద్ధులు మరియు యువ ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు.
మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా పోలీస్ యంత్రాంగం భారీ భద్రతను ఏర్పాటు చేసింది.
మొదటి మున్సిపల్ ఎన్నికలు కావడంతో స్థానిక ప్రజల్లో భారీగా ఆసక్తి నెలకొంది.

33వ వార్డులో ఓటును వినియోగించుకున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎస్ ఎల్ ఎన్ మాధవి రమేష్…

33వ వార్డులో ఓటును వినియోగించుకున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎస్ ఎల్ ఎన్ మాధవి రమేష్

వనపర్తి నేటిధాత్రి .

వనపర్తి జిల్లా కేంద్రంలో 33 వ వార్డులో గౌతమి మోడల్ స్కూల్లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ బూత్ లో బుధవారం ఉదయం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి 33 వ వార్డు ఎస్ ఎల్ ఎన్ మాధవి రమేష్ తన ఓటు హక్కును వినియోగించుకొని ఆనందం వ్యక్తం చేశారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version