ఓటు హక్కు ప్రతిఒక్కరి బాధ్యత…

ఓటు హక్కు ప్రతిఒక్కరి బాధ్యత

ఓటు హక్కు వినియోగించిన దేవస్థాన మాజీ ఛైర్మెన్ గందే వెంకన్న

పరకాల,నేటిధాత్రి

బుధవారం మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో 17వార్డులో గల జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన 34వ బూత్ నంబర్లో గల తమ ఓట్లను పరకాల పట్టణ కుంకుమేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మెన్ గందే వెంకటేశ్వర్లు తన కుటుంబంతో కలిసి వినియోగించుకున్నారు.ఉదయం నుంచే పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఆయన ఓటర్లతో కలిసి క్యూలో నిలబడి తన ఓటు వేశారు. అనంతరం మాట్లాడిన ఆయన ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని పేర్కొన్నారు. ప్రతి పౌరుడు తమ ఓటును తప్పనిసరిగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు.17వ వార్డులో ఉదయం నుంచే ఓటర్ల రాకపోకలు కొనసాగాయి.యువత, మహిళలు,వృద్ధులు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల సిబ్బంది శాంతియుతంగా పోలింగ్ నిర్వహించారని అన్నారు.

ఓటు హక్కు వినియోగించిన మహిళ కన్వీనర్ కడారి జ్యోతి…

ఓటు హక్కు వినియోగించిన మహిళ కన్వీనర్ కడారి జ్యోతి

పరకాల,నేటిధాత్రి

 

పట్టణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బుధవారం మేదరివాడలోని 13వ వార్డులో గల ప్రాధమిక పాఠశాలలో 26వ బూత్ నంబర్లో గల తమ ఓటు హక్కును పరకాల పట్టణ బీఆర్ఎస్ పార్టీ మహిళ కన్వీనర్ కడారి జ్యోతి వినియోగించుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటు పౌరుని యొక్క బాధ్యతని వేసిన ఓటు సమాజానికి ఉపయోగపడలని పట్టణాలను అభివృద్ధి పరిచే నాయకులకు ఓటువేయాలని అన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version