కామ్రేడ్ జార్జి రెడ్డి 53వ వర్ధంతి.!

కామ్రేడ్ జార్జి రెడ్డి 53వ వర్ధంతి మహాసభలను విజయవంతం చేయాలి.

కస్తూర్బా బాలికల వసతి గృహంలో గోడ పత్రాలను విడుదల చేసిన పి డి ఎస్ యు నాయకులు

జైపూర్,నేటి ధాత్రి:

 

 

ఉస్మానియా అరుణతార, యువ మేధావి కామ్రేడ్ జార్జి రెడ్డి స్పూర్తితో విద్యారంగంలో మనువాద భావజాలానికి వ్యతిరేకంగా పోరాడాలని పి డి ఎస్ యు జిల్లా ఉపాధ్యక్షుడు సికిందర్ పేర్కొన్నారు.రాష్ట్రవ్యాప్తంగా కమిటీ పిలుపుమేరకు ఈ నెల 10 నుంచి 14 వరకు చేపట్టనున్న జార్జి రెడ్డి 53 వ వర్ధంతి మహాసభలను విజయవంతం చేయాలని సోమవారం పిలుపునిచ్చారు.జైపూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల వసతి గృహం విద్యార్థినిల ఆధ్వర్యంలో గోడపత్రాలను విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆహారం,దుస్తులు,వైద్యం లాంటి కనీస అవసరాలు అందరికీ సంపూర్ణంగా అందాలన్నదే జార్జిరెడ్డి ఆకాంక్ష అన్నారు.ఉస్మానియా విశ్వ విద్యాలయంలో అవినీతి, ర్యాగింగ్,గూండాల దాడులకు వ్యతిరేకంగా జార్జిరెడ్డి గళం విప్పి పోరాడిన విద్యార్థి నాయకుడన్నారు.మతోన్మాద చీకటి కోణాలను చీల్చి చెండాడి,ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చేందుకు జార్జిరెడ్డి పలు సభలు,సమావేశాలు నిర్వహించారన్నారు.ఉస్మానియా విద్యార్థి సంఘంతో మొదలైన జార్జిరెడ్డి విప్లవం.పిడిఎస్ గా నిర్మితమై,జార్జిరెడ్డి మరణానంతరం అది పీ డీ ఎస్ యూ గా మారిందని వివరించారు.కామ్రేడ్ జార్జిరెడ్డి ఆశయాల సాధనకై పోరాడాలని,అమరత్వాన్ని స్మరించుకుంటూ,జరుగు వర్ధంతి సభలను జయప్రదం చేయాలని విద్యార్థులను కోరారు.ఈ కార్యక్రమంలో అఖిల,రమ్య,కావ్య, మహేశ్వరి,ప్రసన్న,స్వప్న తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version