మద్రాస్ రబ్బర్ లిమిటెడ్ కంపెనీలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలుసిఐ రాజువర్మ

మద్రాస్ రబ్బర్ లిమిటెడ్ కంపెనీలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలుసిఐ రాజువర్మ

నేటిదాత్రి చర్ల

 

భద్రాద్రి కొత్తగూడెం చర్ల మండలంలోని యువతకు సువర్ణ అవకాశం ప్రముఖ కంపెనీలైన మద్రాస్ రబ్బర్ (ఎంఆర్ ఎఫ్ ) రేన్( మద్రాసు)లిమిటెడ్ కంపెనీలో 120 పొస్టులకు గాను శిక్షణ మరియు ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ నెల10న ఖమ్మం కలెక్టరేట్ లో జరిగే ఎంపికకు అర్హత కలిగిన అభ్యర్ధులు నేరుగా పాల్గొనాలని తెలిపారు వయస్సు 18సంవత్సరాల నుండి 28 సంవత్సరాల వయస్సు కలిగిఉండాలని అర్హత 10 తరగతి ఇంటర్ ఐటిఐ చేసిన ( పురుషులు) నిరుద్యోలకు సువర్ణ అవకాశం అని అన్నారు శిక్ణణ కాలం 2 సంవత్సరాలు ఉంటుందని పని సయమం ఎనిమిది గంటలు ఉంటుందని శిక్షణ సమయంలో మంచి జీతం ఇవ్వటంతోపాటు భోజనం వసతి కల్పించడం జరుగుతుందని తెలిపారు ఆసక్తి గల నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు మరింత సమాచారం కొరకు స్ధానిక పొలీస్ స్టేషన్లో సంప్రదించాలని సి ఐ రాజువర్మ నిరుద్యోగ యువతకు పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు

దుగ్గొండి కేజీబీవి కుక్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం….

దుగ్గొండి కేజీబీవి కుక్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

హెడ్ కుక్ -1,అసిస్టెంట్ కుక్ – పోస్ట్..

ఈ నెల 25 న దరఖాస్తుల చివరితేదీ

మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు

నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి:

 

దుగ్గొండి మండలం పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయంలో కుక్కు పోస్టుల దరఖాస్తుల ఆహ్వానం పలుకుతున్నట్లు మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు.
దుగ్గొండి మండలంలోని మల్లంపల్లి గ్రామంలో గల కేజీబీవి పాఠశాలలో హెడ్ కుక్ పోస్టు, అసిస్టెంట్ కుక్ రెండు పోస్టులు ఖాళీగా ఉన్న నేపథ్యంలో అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుతున్నామని పేర్కొన్నారు. ఈ రెండు పోస్టులకు 18 నుండి 45 సంవత్సరాలులోపు మహిళలు అర్హులని,సామూహిక వంటలో అనుభవం కల్గిఉండాలన్నారు.హెడ్ కుక్ పోస్టు కోసం పదో తరగతి పాస్ అయ్యి,స్థానిక మండలం వారు కావాలని తెలిపారు.అసిస్టెంట్ కుక్ పోస్టు కోసం స్థానిక దుగ్గొండి మండల వాసి అయ్యి ఏడవ తరగతి పాస్ అయి ఉండాలని వివరించారు. హెడ్ కుక్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థురాలు పదవ తరగతి మెమో, అసిస్టెంట్ కుక్ ఏడో తరగతి మెమో, కుల,నివాస ధ్రువీకరణ పత్రాలు, స్టడీ, ఆధార్, వంటల అనుభవం ధృవీకరణ పత్రం, పాస్ ఫొటోస్ తో సంబంధిత దరఖాస్తు ఫామ్ కు జతపరిచి ఈనెల 25 సాయంత్రం 4 గంటల లోపు మల్లంపల్లి లో గల కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం పాఠశాల ప్రత్యేక అధికారినికి అందజేయాలని మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు తెలియజేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version