సిససా ఆధ్వర్యంలో 17న ఉగాది కవి సమ్మేళనం
సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని పరాభవనామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని సిరిసిల్ల సాహితీ సమితి ఆధ్వర్యంలో కవి సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు సమితి గౌరవ అధ్యక్షులు పోరండ్ల మురళి ధర్ తెలిపారు.బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఈనెల 17న గాంధీ నగర్ లోని శ్రీ భక్త ఆంజనేయ ఆలయంలో ఉదయం 10 గంటలకు నిర్వహించే కవి సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి, సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్ర చారి హాజరు కానున్నారు.ఈ కవి సమ్మేళనంలో పాల్గొనే కవులకు రచయితలకు, ఉగాది పురస్కారంతో పాటు సన్మానం చేయడం జరుగుతుందన్నారు.
ఈ ఉగాది కవి సమ్మేళనంలో కవులు,రచయితలు పాల్గొని విజయ వంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో మానేరు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు చింతోజు భాస్కర్, రచయితలు నేరోజీ రమేష్, సి.సా. స ప్రధాన కార్యదర్శి వెంగళ లక్ష్మణ్ లు
పాల్గొన్నారు.
