కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి రథోత్సవ ఏర్పాట్ల పరిశీలన..

కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి రథోత్సవ ఏర్పాట్ల పరిశీలన..

గీసుకొండ ఎంపీఓ పాక శ్రీనివాసులు

సుమారు నాలుగు లక్షల మంది భక్తుల దర్శనం

*నర్సంపేట/గీసుకొండ,నేటిధాత్రి:

 

వరంగల్ జిల్లా గీసుకొండ మండలం కొమ్మాల లక్ష్మీ నరసింహ స్వామి జాతర ఉత్సవాల్లో భాగంగా శనివారం అంగరంగ వైభవంగా రథోత్సవ కార్యక్రమం చేపట్టనున్న నేపథ్యంలో
గీసుకొండ ఎంపీఓ పాక శ్రీనివాసులు ఉత్సవ కమిటీ చైర్మన్ వీరాటి రవీందర్ రెడ్డితో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. రథోత్సవం జరిగే క్రమంలో భక్తులకు సౌకర్యాలు కలిగించాలని సూచించారు. జాతరలో పారిశుద్ధం లోపించకుండా జాగ్రత్తలు పడాలని తెలిపారు. ఆదివారం భక్తుల రద్దీనీ దృష్టిలో పెట్టుకొని మంచినీటి సౌకర్యం పట్ల సిబ్బందితో పర్యవేక్షించాలని పంచాయతీ కార్యదర్శి శంకర్ రావుకు సూచించారు.

శ్రీ కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి ఉత్సవ కమిటీ చైర్మన్ వీరాటి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటివరకు సుమారు నాలుగు లక్షల మంది భక్తులు లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారన్నారు. రథోత్సవం సందర్భంగా శనివారం రాత్రి ఆదివారం రోజుల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొమ్మాల సర్పంచ్ కన్నేబోయిన జమున ప్రవీణ్, దేవాలయ ప్రధాన అర్చకులు
రామాచార్యులు,ఉత్సవ కమిటీ సభ్యులు ప్రజా ప్రతినిధులు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version