పశువులకు గాలి కుంట టీకాలు వేయించాలి…

పశువులకు గాలి కుంట టీకాలు వేయించాలి

మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య గౌడ్

భూపాలపల్లి నేటిధాత్రి

మున్సిపాలిటీ పరిధిలోని జంగేడులో జాతీయ పశువ్యాధుల నివారణ ఉచిత గాలికుంటువ్యాధి నిరోధక టీకాల కార్యక్రమానికి ముఖ్యఅతిగా మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య పశువర్ధక డాక్టర్ తిరుపతి హాజరైనారు ఈ సందర్భంగా పశువులకు గాలికుంట టీకా వ్యాధులు వేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
పశువులలో కాళ్ళలో పుండ్లు ఏర్పడి నడవలేకపోవడం
నోటిలో పుండ్లు ఏర్పడి మేత మేయకపోవడం ఈ వ్యాధి వలన తీవ్రమైన జ్వరం, పాడి పశువులలో పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గడం, పునరుత్పత్తి సామర్థ్యం పని సామర్థ్యం తగ్గడం వల్ల రైతుకు అపారమైన ఆర్థిక నష్టం కలుగుతుంది. వారు అన్నారు
3 నెలలు పైబడిన అన్ని గోజాతి మరియు గేదెజాతి పశువులకు ఈ టీకాలు వేయించండి.
ఈ టీకాలు చూడి పశువులకు కూడా సురక్షితమైనవి.
టీకాలు వేసిన ప్రతి పశువుకు గుర్తింపు చెవిపోగు వేసి వాటి వివరాలు, పశుపోషకుల వివరాలు భారత్ పశు దాన యాప్ లో నమోదు చేయించండి.
రైతులు, పశుపోషకులు అందరూ తప్పక మీ పశువులన్నింటికీ టీకాలు ఇప్పించుకుని మీ విలువైన పశుసంపదను గాలికుంటు వ్యాధి నుండి రక్షించుకోగలరు.
గాలికుంటు వ్యాధి రహిత రాష్ట్రంగా గుర్తింపు సాధిద్దాం- పశు ఉత్పత్తులకు విలువను పెంచుదాం వారు అన్నారు ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు

వరిలో సస్య రక్షణపై రైతులకు అవగాహన

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం బృంద చర్చ…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండలం లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో సమగ్ర సత్య రక్షణ అనే అంశంపై చర్చ. సందర్భంగా రామ్ వ్యవసాయ కళాశాల యొక్క దత్తత గ్రామమైన రాళ్లపేట రైతులకు వ్యవసాయ కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ .వెంకట్రామ్. శ్రీ యశస్విని. రైతులకు వరిలో సమగ్ర సస్యరక్షణ అంశంపై చర్చ నిర్వహించారు. రైతులు తము తమ పొలాలలో పాటిస్తున్న సస్య రక్షణ చర్యలు తమ ఎదుర్కొంటున్న పంట సమస్యల వారిని వివరించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలని దానిపై శాస్త్రవేత్తలతో చర్చించారు. తర్వాత .రాళ్లపేటలోని పాలు వరి పొలాలను సందర్శించి. ప్రస్తుత పరిస్థితుల్లో వరి అగ్గి తెగులు ఆశించే అవకాశం ఉంటుందని దాని నివారణకు తొలి దశలో ఐసో ప్రోతాయో లేన్.1.5మి.లీ. లేదా ట్రై సైక్లోజల్+మ్యామ్ కోజబ్.2.5గ్రా. లేదా కాసు గా మైసిన్.2.5మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలని తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో రాళ్లపేట గ్రామ సర్పంచ్ పరిషరాములు రైతులు నాగరాజు ఎల్లయ్య తదితరులు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు తదితరులు పాల్గొన్నారు

గొర్రెలు–మేకల నట్టల నివారణ కార్యక్రమం

గొర్రెలు–మేకల నట్టల నివారణ కార్యక్రమం
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో తేదీ 31-12-2025 నాడు గొర్రెలు–మేకల నట్టల నివారణ కార్యక్రమం మండలంలోని వివిధ గ్రామాలలో విజయవంతంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో
•దేవరంపల్లి గ్రామంలో సర్పంచ్ శ్రీ పాట్లోల రవికుమార్ గారు మరియు గ్రామ పెద్దలు,
•ఈదులపల్లి గ్రామంలో గ్రామ పెద్దలు శ్రీ పడమటి నాగేశ్వర్ గారు మరియు ఇతర గ్రామ పెద్దలు,
•మెదపల్లి గ్రామంలో గ్రామ పెద్దలు శ్రీ కొల్లూరు నరేందర్ రెడ్డి గారు మరియు ఇతర గ్రామ పెద్దలు
పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ నట్టల నివారణ కార్యక్రమం ద్వారా నేటి రోజున
•మొత్తం 490 గొర్రెలకు,
•మొత్తం 850 మేకలకు
నట్టల నివారణ మందులు వేయడం జరిగింది.
ఈ సందర్భంగా పశుసంవర్ధక శాఖ అధికారులు మరియు సిబ్బంది పశుపాలక రైతులకు నట్టల నివారణ కార్యక్రమం వల్ల పశువుల ఆరోగ్యం మెరుగుపడటం, ఉత్పాదకత పెరగడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
గ్రామాల పశుపాలక రైతులు మరియు గ్రామ పెద్దలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని, మండల పశుసంవర్ధక శాఖకు కృతజ్ఞతలు తెలిపారు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version