నరేందర్ రెడ్డి కీ శుభాకాంక్షల వెల్లువ
#నెక్కొండ, నేటి ధాత్రి:
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా వేం నరేందర్ రెడ్డి ఎంపిక కావడం పట్ల నర్సంపేట ప్రాంతంలో ఆనందం వ్యక్తమవుతోంది. గతంలో అసెంబ్లీ డిలిమిటేషన్‌కు ముందు మానుకోట నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున శాసనసభ్యుడిగా సేవలందించిన వేం నరేందర్ రెడ్డి, నెక్కొండ మండల ప్రజలకు మరియు స్థానిక నాయకులకు సుపరిచితుడు.
ఈ సందర్భంగా నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి నేతృత్వంలో భూంపల్లి దేవేందర్ రావు, చల్ల శ్రీపాల్ రెడ్డి కలిసి వేం నరేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందించి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. రాజ్యసభలో తెలంగాణ సమస్యలను బలంగా ప్రస్తావిస్తూ ప్రజల ఆశయాలకు అనుగుణంగా సేవలందించాలని ఆకాంక్షించారు.
వేం నరేందర్ రెడ్డి రాజకీయ అనుభవం, ప్రజలతో ఉన్న అనుబంధం రాజ్యసభలో రాష్ట్రానికి మరింత ఉపయోగపడుతుందని నాయకులు పేర్కొన్నారు. ఆయన రాజకీయ ప్రస్థానం మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.
