పశువుల ఆరోగ్యం రైతుల ఆర్థికాభివృద్ధికి ఎంతో కీలకం ఎమ్మెల్యే జీఎస్సార్
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలంలోని బుద్దారం గ్రామంలో పశువుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు చేపట్టారు.గణపురం మండలంలోని బుద్దారం గ్రామంలో పశువులకు సోకే గాలికుంట వ్యాధి నివారణకు టీకా కార్యక్రమాన్ని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన టీకా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి పశువులకు టీకాలు వేయించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పశువుల ఆరోగ్యం రైతుల ఆర్థికాభివృద్ధికి ఎంతో కీలకమని తెలిపారు. గాలికుంట వంటి వ్యాధులు వ్యాప్తి చెందకుండా ముందస్తుగా టీకాలు వేయించడం అవసరమని సూచించారు. ప్రభుత్వం రైతుల పశుసంపదను కాపాడేందుకు పలు చర్యలు తీసుకుంటోందని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ విడిదినేని శ్రీలత అశోక్, ఉపసర్పంచ్ మారబోయిన ఐలయ్య,ప్రజాప్రతినిధులు, పశుసంవర్ధక శాఖ అధికారులు, ఎమ్మార్వో, ఎంపీడీఓ గ్రామస్థులు పాల్గొన్నారు.
