జహీరాబాద్ ఆస్తి, వాణిజ్య పన్నులు: 31వ తేదీలోపు చెల్లించకపోతే కఠిన చర్యలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఆస్తి, వాణిజ్య పన్నులను ఈ నెల 31వ తేదీలోపు చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ జైత్ రామ్ బుధవారం సూచించారు. పన్ను వసూలు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మున్సిపల్ కార్యాలయంలో లేదా ఇంటికి వచ్చే బిల్ కలెక్టర్లకు పన్నులు చెల్లించవచ్చు.
గడువులోగా పన్నులు చెల్లించకపోతే తెలంగాణ మున్సిపల్ చట్టం-2019 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సూచన సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ నియోజకవర్గానికి వర్తిస్తుంది.
