ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అమలులో ప్రజాప్రతినిధుల పాత్ర కీలకం..

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అమలులో ప్రజాప్రతినిధుల పాత్ర కీలకం

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి:

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అమలులో ప్రజా ప్రతినిధుల పాత్ర కీలకమైనదని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.గురువారం జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలో గల అమ్మ గార్డెన్స్ లో గ్రామపంచాయతీ సర్పంచ్ లు, మున్సిపల్ కార్పొరేషన్/మున్సిపాలిటీ మేయర్/చైర్ పర్సన్ లు,డిప్యూటీ మేయర్/ వైస్ చైర్ పర్సన్ లు,కార్పొరేటర్లు/ కౌన్సిలర్లకు 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం పై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి డి సి పి ఎ.భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య,జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు,వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్థానిక సంస్థలు,మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడం జరిగిందని,ఈ క్రమంలో విధులు,అధికారాలపై గ్రామపంచాయతీల సర్పంచ్లకు శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగిందని,పంచాయితీ రాజ్ చట్టాలు వివరించడం జరిగిందని తెలిపారు.మార్చి 6 నుంచి జూన్ 12వ తేదీ వరకు 99 రోజుల పాటు ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు.గ్రామ,మండల, నియోజకవర్గ,జిల్లా,రాష్ట్రస్థాయి లలో కార్యచరణ అమలు చేయడం జరుగుతుందని తెలిపారు.మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలలో పారిశుధ్యం,ప్రభుత్వ కార్యాలయాలలో పెండింగ్ లో ఉన్న పైళ్ల క్లియరెన్స్ తదితర అంశాలపై కార్యాచరణ,సమాజ హిత అంశాలపై ప్రణాళికలు అమలు చేయడం జరుగుతుందని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు,అమలు చేయడంలో ప్రజా ప్రతినిధులు తీసుకోవలసిన చర్యల గురించి తెలుసుకోవాలని తెలిపారు.తెలంగాణ పంచాయతీరాజ్ & మున్సిపల్ యాక్ట్ ల గురించి ప్రజాప్రతినిధులకు సంక్షిప్తంగా వివరించడం జరుగుతుందని తెలిపారు.విద్యా రంగ అభివృద్ధి దిశగా అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల సౌకర్యార్థం మౌలిక వసతులు, విద్యుత్,త్రాగునీరు, మూత్రశాలలు,ప్రహరీ గోడ నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టడం జరిగిందని,ఇందులో భాగంగా ఉపాధి హామీ క్రింద పనులు చేయడం జరిగిందని తెలిపారు.స్వయం సహాయక సంఘాల మహిళలను అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ అభివృద్ధి పనులలో భాగస్వామ్యలను చేయడం జరిగిందని తెలిపారు.రేషన్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకున్నట్లయితే క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులైన లబ్ధిదారులకు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు.గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలలో నెలకొన్న సామాజిక సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని తెలిపారు.నిరుద్యోగ యువత భవిష్యత్తు దృష్ట్యా మాదకద్రవ్యాల నిరోధకం,మద్యం వినియోగంపై ప్రజా ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 2, 3 వార్డులలో 3, 4 రోజుల పాటు పారిశుధ్యం,త్రాగునీటి పైప్ లైన్ల మరమ్మత్తు,ఇతర పనులు చేపట్టడం జరుగుతుందని,ప్రజా ప్రతినిధులు కార్యక్రమాలలో పాల్గొని ప్రజలను భాగస్వామ్యులను చేయాలని తెలిపారు.పారిశుధ్య నిర్వహణలో భాగంగా ప్రతి రోజు ప్రతి ఇంటి నుండి చెత్త సేకరణ నిరంతరాయంగా కొనసాగించాలని తెలిపారు.ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలలో ఒకసారి లబ్ధి పొందిన వారిని గుర్తించాలని, మరల లబ్ధిదారుల జాబితాలో వారి వివరాలు లేకుండా జాగ్రత్త వహించాలని,తద్వారా అర్హత గల మిగిలిన లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుతుందని, ప్రభుత్వ లక్ష్యాలు విజయవంతం అవుతాయని తెలిపారు.రహదారి ప్రమాదాల నివారణలో భాగంగా ప్రతి ఒక్కరు రహదారి భద్రత నియమాలను పాటించే విధంగా ప్రజాప్రతినిధులు వారి పరిధిలో అవగాహన కల్పించాలని తెలిపారు.మున్సిపల్ పాలకవర్గం ఏర్పాటు చేయబడినందున మున్సిపల్ అభివృద్ధి కొరకు నిధులు మంజూరు అవుతాయని, ఈ నిధులను సక్రమంగా వినియోగిస్తూ ప్రజా ప్రయోజనకర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు.వేసవిలో ప్రజలకు నిరంతరం నీటిని సరఫరా చేసే విధంగా ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను ప్రజాప్రతినిధులు తమ పరిధిలో పకడ్బందీగా అమలు చేయాలని,నీటి వనరులను సమర్ధవంతంగా వినియోగించుకోవాలని తెలిపారు.విద్యుత్ దీపాల ఏర్పాటులో సౌర విద్యుత్ దీపాల ఏర్పాటుపై దృష్టి సారించాలని,తద్వారా విద్యుత్ వినియోగాన్ని నియంత్రించవచ్చని తెలిపారు.ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అమలులో ప్రజా ప్రతినిధుల విధులు, అధికారాలు తెలుసుకొని ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసి ప్రజాసంక్షేమం ఉందిగా కృషి చేయాలని తెలిపారు.ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం అమలులో ప్రజా ప్రతినిధుల పాత్ర కీలకమైనదని తెలిపారు.ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మాందారిపేట మహిళ గ్రామ కమిటీ ఎన్నిక

మాందారిపేట మహిళ గ్రామ కమిటీ ఎన్నిక

అర్హులైన నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలి

శాయంపేట నేటిధాత్రి:

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన నిరుపేదలకు అందేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు కాంగ్రెస్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాందారిపేట మహిళ గ్రామ కమిటీని ఎన్నుకున్నారు
గ్రామ కమిటీ అధ్యక్షురాలుగా కోరే లలిత ,ఉపాధ్యక్షురాలు మిద్దెపాక మాధవి, ప్రధాన కార్యదర్శి బడుగు సునీత
కోశాధికారి కూతురు నీలమ్మ
వల్లెపు శిరీషను సహాయ కార్యదర్శిగా ఎన్నుకున్నారు
ఈకార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు ప్రకాష్ రెడ్డి మారేపల్లిరవీందర్ ,కు మార స్వామి నిమ్మల రమేష్ కొమ్ముల భాస్కర్ ఉపసర్పంచ్ రావుల శ్రీను పైడి బడుగు అశోక్ కొమ్ముల విష్ణు పాల్గొ న్నారు.

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికపై అవగాహన సదస్సు

ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం – అవగాహన సదస్సు

ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక పై సంగారెడ్డి జిల్లా ప్రజా ప్రతినిధుల అవగాహన సదస్సు లో పాల్గొన్న కలెక్టర్ ప్రావీణ్య ,మంత్రి దామోదర్ రాజనర్సింహ, నారాయణఖేడ్ ఎమ్మెల్యే డా:సంజీవ రెడ్డి రాష్ట్ర చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి…

జహీరాబాద్ నేటి ధాత్రి:

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై సంగారెడ్డి జిల్లాలోని మున్సిపల్ చైర్‌పర్సన్లు, వైస్ చైర్‌పర్సన్లు, గ్రామ పంచాయతీల సర్పంచులు మరియు మున్సిపల్ వార్డ్ కౌన్సిలర్లకు ఒక రోజు అవగాహన సదస్సు గురువారం జరిగింది. కంది మండల కేంద్రం లోని ఎల్ఎన్ కన్వెన్షన్ లో జరిగిన ఈ అవగాహన సదస్సు కు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, నారాయణఖేడ్ MLA సంజీవ రెడ్డి టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి హాజరయ్యారు.రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల ద్వారా 06.03.2026 నుండి 12.06.2026 వరకు 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ప్రజాప్రతినిధులకు ఈ కార్యక్రమం లక్ష్యాలు, అమలు విధానం మరియు ప్రభుత్వ ఫ్లాగ్‌షిప్ పథకాలపై. ప్రజా ప్రతినిదులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజల ప్రభుత్వం అన్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందాలని, కాంగ్రెస్ ప్రజా పాలన గడప గడపకు చేరాల ని అందుకు ప్రజా ప్రతినిధులందరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతీ ప్రభుత్వ పథకం మహిళల పేరు మీదే మంజూరు అవుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సాధికారత కు పెద్ద పీట వేస్తున్నదని వివరించారు. ఈ కార్యక్రమంలో ఝారసంగం మండల సర్పంచులు మరియు నాయకులు పాల్గొన్నారు

గ్రామాల అభివృద్ధి విషయంలో సర్పంచుల పాత్ర కీలకం…

గ్రామాల అభివృద్ధి విషయంలో సర్పంచుల పాత్ర కీలకం.

#ప్రభుత్వ ఫలాలు నిజమైన లబ్ధిదారులకు అందే విధంగా
చోరువ చూపాలి.

#శిక్షణలో నేర్చుకున్న ప్రతి విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి.

#జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.

ములుగు జిల్లా, నేటిధాత్రి:

గ్రామాల అభివృద్ధి విషయంలో సర్పంచ్ ల పాత్ర ఎంతో కీలకమైనదని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు అర్హులైన లబ్ధిదారులకు అందచేయడానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో వైద్య సేవలు పొందడానికి జిల్లా ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యే వారని నేడు ములుగు జిల్లాకు మెడికల్ కళాశాల రావడమే కాకుండా నర్సింగ్ కళాశాల ఏర్పాటు జరిగిందని, 15 మంది ప్రత్యేక వైద్య నిపుణులచే వివిధ వ్యాధి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినీ విద్యార్థులు మంచి ఫలితాలను సాధించి ఇక్కడి కళాశాలలోనే వైద్య పట్టా పొందే అవకాశం దక్కిందని, ప్రతి ఒక్కరికి వైద్యం అనేది ఎంతో ముఖ్యమైనదని తెలిపారు. ప్రస్తుతం 60 శాతం కేసులను పరీక్షించి ఇక్కడే వైద్య సేవలు అందిస్తున్నారని, గత మూడు నెలల క్రితం ఏకంగా రెండు క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు శాస్త్ర చికిత్సలు చేసి విజయవంతం చేశారని హర్షం వ్యక్తం చేశారు.
దివ్యాంగులకు పెన్షన్ మంజూరు విషయంలో ప్రభుత్వం నూతన విధానాన్ని అమలులోకి తీసుకవచ్చిందని ధ్రువీకరణ పత్రం స్థానంలో యు డి ఐ డి కార్డును ప్రవేశపెట్టడం జరిగిందని, దివ్యాంగులు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే ముందు ఈ కార్డు తప్పనిసరిగా పొంది ఉండాలని అన్నారు.
యు డి ఐ డి కార్డు కోసం దివ్యాంగులు మీసేవ కేంద్రాల ద్వారా స్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ప్రతి గురువారం సామాజిక ఏరియా ఆసుపత్రిలో జరిగే సదరం క్యాంప్ కు వైద్య పరీక్షకు హాజరుకావాలని తెలిపారు. క్యాంపు ద్వారా వైద్య పరీక్షలు జరిగిన అనంతరం 30 రోజుల్లో యు డి ఐ డి కార్డు పోస్ట్ ద్వారా నేరుగా తమ చిరునామాకు చేరుతుందని అనంతరం పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజులలో భాగంగా ప్రతి పీహెచ్సీలో గ్రామీణ ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్య క్రమంలో అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హెచ్. మహేందర్ జి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ భానోత్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రేగ కళ్యాణి, మున్సిపల్ చైర్మెన్ చింతనిప్పుల చంద్ర కళ, ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డి, ఆర్డీఓ వెంకటేష్, జిల్లా అధికారులు, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచులు పాల్గొన్నారు.

భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర మీడియా పానలిస్ట్ డా. బొంగోని సురేష్ గౌడ్..

భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర మీడియా పానలిస్ట్ డా. బొంగోని సురేష్ గౌడ్

చేర్యాల నేటిధాత్రి

భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర మీడియా పానలిస్ట్ డా. బొంగోని సురేష్ గౌడ్ నియమించడం పట్ల ఎంతో ఆనందం మరియు గౌరవంగా భావిస్తున్నాను. అన్నారు ఈ బాధ్యతను నాపై ఉంచిన పార్టీ రాష్ట్ర నాయకత్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అన్నారు
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్న ఈ సమయంలో, పార్టీ సిద్ధాంతాలను మరియు కేంద్ర ప్రభుత్వ ప్రజాహిత కార్యక్రమాలను ప్రజలకు మీడియా ద్వారా మరింత సమర్థవంతంగా చేరవేయడానికి నా వంతు కృషి చేస్తాను. తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం, ప్రజల సమస్యలను సమాజం ముందుకు తీసుకురావడంలో నా వంతు పాత్ర పోషిస్తానని నాపై నమ్మకంతో పార్టీ అప్పగించిన బాధ్యతలు నెరవేరుస్తాను అన్నారు

భద్రాచల రామయ్య కోటి గోటి తలంబ్రాల శోభయాత్ర

భద్రాచల రామయ్య
కోటి గోటి తలబ్రాల శోభయాత్ర

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురంమండలంలోని ధర్మారావుపేట గ్రామంలో శ్రీ రామదాసు సేవ సమితి రామదాసు భజన మండలి ఆధ్వర్యంలో శ్రీ భద్రాచల సీతారాములా కల్యాణం కోటి గోటి తలంబ్రాల శోభయాత్ర అంగరంగ వైభావంగా శోభయమానంగా సాగిందని రామదాసు సేవ సమితి ఉమ్మడి జిల్లా బాద్యులు ఆకుల సుభాష్ ముదిరాజ్ మాట్లాడుతూ అధికారులు అనధికారులు పాలక వర్గ సభ్యులు ఆలయ కమిటీ గ్రామ పెద్దలు మహిళల మధ్యలో కన్నుల పండుగగా జరగడం మహిలల కోలాటల సందడితో రామ నామ స్మరణతో గ్రామ పుర విధులలో కుటుంబ సమేతంగా శోభయాత్ర వాహనానికి ఎదురువచ్చి మంగళ హరతులతో నీళ్లు ఆరగిస్తూ పూలు పండ్లతో స్వాగతం పలకడం భక్తి పారవశ్యంతో భక్తులు మొక్కలు చెల్లించడం జరిగిందని గత కొన్ని సంవత్సరాలనుండి ఈ గోటి తలంబ్రాల కార్యక్రమం జరుగుతుందని వారన్నారు భూపాలపల్లి జిల్లా తో పాటు హన్మకొండ ములుగు జిల్లా లో ఈ గోటి తలంబ్రాల కార్యక్రమం నిర్వహించడం ఆ సీతారాములా ఆశీస్సులతో నిర్వీరంగా సాగడం పూర్వజన్మ సుకృతగా భావిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పూజారి రాజేందర్ ఆలయ కమిటీ అధ్యక్షులు బాపని సాంబయ్య సేవ సమితి అధ్యక్షులు బెనికి రాజేందర్ భజన మండలి అధ్యక్షులు ఆకుల దామోదర్ ఉపాధ్యక్షులు దూలం శంకర్ పనికేలా శివకృష్ణ వార్డు సభ్యులు ఆరెందల లలిత శంకరయ్య గంపల కల్పన కుమార్ మహిళా సమితి అధ్యక్షులు పనికేల వసంత ఉపాధ్యక్షులు స్వర్ణలత మంతుర్తి భద్రయ్య ఆకుల రాజు తెలు రాంచందర్ తదితరులు పాల్గొన్నారు

పునః ప్రారంభమైన స్థానిక చక్కెర పరిశ్రమ…

పునః ప్రారంభమైన స్థానిక చక్కెర పరిశ్రమ

◆-: రైతులకు మంచి మద్దత్తు ధర కల్పిస్తాం

◆-: సాగర్ బత్రే ఓంకార్ చక్కర పరిశ్రమ యజమాని

◆- సంతోషం వ్యక్తం చేసిన రైతులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్, మార్చి 12: జహీరాబాద్ ప్రాంత రైతులకు ముఖ్య ఆధారంగా ఉన్న చక్కెర కర్మాగారం మళ్లీ ప్రారంభం కానుండడంతో స్థానిక రైతులు సంతోషం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూరు బి గ్రామంలో ఉన్న చక్కెర పరిశ్రమలో మరమత్తులు చేసి గురువారం పూజలు నిర్వహించారు. ఓంకార్ సాఖర్ కార్ఖాన ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్ నంబర్ 17 పేరుతో పరిశ్రమ యజమానులు గ్రామ సర్పంచ్ ప్రతినిధి మల్లికార్జున్, గ్రామ కార్యదర్శి సంగారెడ్డి, గ్రామ ఆయా పార్టీల నాయకులు, నర్సింహారెడ్డి, ధర్మేందర్, బాబు, రైతులు పాల్గొని పూజలు చేశారు. అనంతరం ఎద్దుల బండ్లపై తెచ్చిన చేరుకును క్రసింగ్ కొరకు ట్రయల్ చేశారు. పరిశ్రమ ప్రాంగణంలో రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో యజమాని బోత్రే సాగర్ మాట్లాడుతూ చక్కెర కర్మాగారానికి పూర్వ వైభవం తీసుకువచ్చి, స్థానిక జహీరాబాద్ ప్రాంతంలో పండించే చేరుకును రైతుల మద్దతుతో మొత్తం క్రసింగ్ చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. మిగతా చక్కెర పరిశ్రమలు ఇచ్చే చెరుకు మద్దతు ధర కంటే అధికంగా ఇచ్చి రైతుల ను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అనంతరం కొందరు రైతులు మాట్లాడుతూ, మూతపడ్డ చెరుకు పరిశ్రమ మళ్ళీ గానుగ ఆడించడానికి సిద్ధం కావడంతో తమ గుండెల్లో ఆనందం నిండిందని అన్నారు. చెరుకు పరిశ్రమ మళ్ళీ ప్రారంభం కావడంతో ఇక్కడి ప్రాంతానికి కళ వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పరిశ్రమ వైస్ చైర్మన్ సాగర్ మార్తాండే, ఆఫ్రోజ్ పటేల్, కొత్తూరు సర్పంచ్ ప్రతినిధి మల్లికార్జున్, దిడిగి సర్పంచ్ ప్రతినిధి సోమప్ప, ఉప సర్పంచ్ సురేష్, మాజీ సర్పంచ్ నర్సింలు, సిడిసి సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం.
చందుర్తి, నేటిధాత్రి:

చందుర్తి మండలం మల్యాల గ్రామంలో ఇటీవల మరణించిన దేశవేని రామవ్వ కుటుంబానికి ఆర్థిక సాయం అందివ్వాలని ఒక మంచి ఉద్దేశ్యం తో 12వ వార్డు గ్రూప్ సభ్యులు ఈ విషయo పై త్వరితగతిన స్పందించి వాడకట్టులో తలకొన్ని డబ్బులు జమ చేసి (రూ/- 4600) నాలుగు వేల అరువందల రూపాయలు మృతురాలి కుటుంబానికి 12వ వార్డు మెంబర్ పిట్ల మనోహర్ సమక్షంలో అందజేశారు, మరియు ఇటువంటి విషయాలే కాకుండా వార్డులో ఇంకేం సమస్యలున్న ఇలాగే కలిసి కట్టుగా స్పందించి సమస్యలను తీర్చుకోడానికి ప్రయత్నం చేయాలని ఈ సందర్బంగా పిట్ల మనోహర్ తెలియజేసారు,
ఇట్టి కార్యక్రమం లో 12 వార్డు మెంబర్ పిట్ల మనోహర్, వార్డు సభ్యులు కల్లెడ రవీందర్, గండ్ర వెంకటేష్, దొప్పల ఉదయ్, కళ్ళెడ నరేష్, వార్డ్ ప్రజలు మరియు వార్డు సభ్యులు పాల్గొన్నారు.

పిల్లల భద్రత డ్రగ్స్ కు అడ్డుకట్ట…

పిల్లల భద్రత డ్రగ్స్ కు అడ్డుకట్ట

గుండాల,నేటిధాత్రి :

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పిల్లల భద్రత డ్రగ్స్ కు అడ్డుకట్టఅనే అంశంపై నర్సాపురం తండా గుండాల పంచాయతీ కార్యాలయం గురుకులం స్కూల్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఈగల్ టీం సీఐ గుండాల సీఐ తిరుపతి, గుండాల ఎస్సై రాహుఫ్,ఏం ఆర్ఓ , ఎక్సైజ్ శాఖ అధికారులు, చైల్డ్ సూపరింటెండెంట్, ఏంఈఓ పంచాయతీ కార్యదర్శులు, గ్రామ సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు,విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం గురించి ఈగల్ టీం సీఐ మాట్లాడుతూ
డ్రగ్స్ వాడకం వల్ల ఆరోగ్యం, భవిష్యత్తు, కుటుంబ జీవితం పై వచ్చే ప్రమాదాలు గురించి వివరించారు. అలాగే యువత, పిల్లలు డ్రగ్స్ కు దూరంగా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు.గుండాల సీఐ రహూఫ్ ఈ కార్యక్రమం లో
తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వివరించారు.అనుమానాస్పద వ్యక్తులతో లేదా చెడు స్నేహితులతో కలవకుండా ఉండాలి అని ఎవరు ఇచ్చినా తెలియని మాత్రలు లేదా పదార్థాలు తీసుకోకూడదు అని చదువు, క్రీడలు మంచి కార్యకలాపాలపై దృష్టి పెట్టాలి.డ్రగ్స్ ఉపయోగం కనిపిస్తే వెంటనే తల్లిదండ్రులు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలి అని తెలియజేశారు. గుండాల ఎస్సై మాట్లాడుతూ పిల్లలు యువత సోషల్ మీడియా ప్రభావానికి లోనుకాకుండా జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులు పిల్లల ప్రవర్తనపై దృష్టి పెట్టి వారికి సరైన మార్గదర్శనం చేయాలి అని ఈ కార్యక్రమం ద్వారా పిల్లల భద్రత మరియు డ్రగ్స్ నివారణపై సమాజంలో అవగాహన పెంపొందించటం ప్రధాన ఉద్దేశ్యంగా నిర్వహించబడింది అని చెప్పటం జరిగింది.అన్ని డిపార్ట్మెంట్ వారు ఈ కార్యక్రమం లో హాజరై తమ సూచనలు తెలియజేశారు.

నిర్భయంగా ప్రశాంతంగా పరీక్షలు రాయాలి

ఎలాంటి భయాలు లేకుండా నిర్భయంగా ప్రశాంతంగా పరీక్షలు రాయాలి

ఒత్తిడి నీ అధిగామించి పరీక్షలకు సిద్ధం కావాలి : డీసీపీ బి.రామ్ రెడ్డి ఐపీఎస్

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

 

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పిల్లల భద్రత డ్రగ్స్ మరియు సైబర్ నేరాలపై అవగాహన సదస్సు మరియు పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ లో భాగంగా పోత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ ఆధ్వర్యంలో ఓదెల మండలంలోని పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థినీ- విద్యార్థులకు అవగాహన సదస్సు, ప్యాడ్స్, జామెంట్రీ బాక్స్, పెన్స్ పంపిణి కార్యక్రమం ను ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు పోత్కపల్లి పోలీస్ ఆధ్వర్యంలో ఓదెల మోడల్ స్కూల్లో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పెద్దపల్లి డీసీపీ బి.రామ్ రెడ్డి ఐపీఎస్ హాజరై విద్యార్థుల ను ఉద్దేశించి మాట్లాడ్లడడం జరిగింది. పరీక్ష సామగ్రి పరీక్ష ప్యాడ్స్, కంపాస్ బాక్స్, పెన్స్ ను డిసిపి వి బి రామ్ రెడ్డి ఐపీఎస్,పెద్దపల్లి ఎసిపి జి.కృష్ణ చేతుల మీదుగా అందజేశారు.ఈసందర్బంగా డీసీపీ మాట్లాడుతూ పరీక్షల సమయం దగ్గర పడే కొద్ది విద్యార్థులలో ఆందోళన ఉంటుందని భయం ఆందోళన విడి ఆత్మవిశ్వాసం ఉంటే అంతిమ విజయం మీ సొంతం అని డి సి పి విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు నిర్భయంగా ఎలాంటి భయాలకు, ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంత వాతావరణంలో వార్షిక పరీక్షలు రాయాలని సూచించారు.ఒత్తిడిని అధిగమించి ముందుకు సాగాలని సూచించారు. దాదాపుగా ప్రజలందరూ వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబాలకు సంబంధించిన విద్యార్థులే ఉంటారువారందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలోనే విద్యను అభ్యసిస్తారు కాబట్టి వారికి సహకారంగా పరీక్ష ప్యాడ్లు పంపిణీ చేసి రాబోయే వార్షిక పరీక్షలలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలన్నారు. పదవ తరగతి అనేది జీవితంలో ఒక మొదటి మెట్టుగా భావించి చదువు చెప్పిన గురువులకు కన్న తల్లిదండ్రులకు మనం పుట్టి పెరిగిన గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని,విద్యార్థులు చిన్న విషయాలకు ఆవేద నకు గురికాకూడదని మంచి ఆలోచనతో చదువుకోవాలని డీసీపీ సూచించారు.తదనంతరం డిసిపి,ఏసిపి ఇతర పోలీసు అధికారులు అందరూ విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.ఈ కార్యక్రమంలో పెద్దపెల్లి ఏసిపి జి కృష్ణ, సుల్తానాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారెడ్డి, పోత్కపల్లి ఎస్సై ధీకొండ రమేష్, సిబ్బంది, వై రమేష్ ఎంఈఓ,, మోటివేషన్ స్పీకర్ నరసింహా రెడ్డి ,పద్మ హెచ్ఎం జెడ్ పి హెచ్ ఎస్ ఓదెల, బి సాంబయ్య జిహెచ్ఎంపిహెచ్ఎస్ పోత్కపల్లి, ఎన్ ఏసుదాసు జిహెచ్ఎం జడ్.పి.హెచ్.ఎస్ కొలనూరు, వై రమేష్ జిహెచ్ఎం జడ్పిహెచ్ఎస్ కనగర్తి, జి శ్రీనివాస్ ప్రిన్సిపల్ మోడల్ స్కూల్, కే జ్యోతి కేజీబీవీ స్కూల్ ఓదెల, మరియు టీచర్స్ తదితరులు పాల్గొన్నారు

హమాలి మహా గర్జన విజయవంతం చేయాలి

హమాలి మహా గర్జనను విజయవంతం చేయండి.

తెలంగాణ హమాలి వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు ఎం.ఏ. కలీం, వర్కింగ్ ప్రెసిడెంట్ శివన్న

“నేటిధాత్రి”, హైదరాబాద్.

తెలంగాణ హమాలి వర్కర్స్ యూనియన్ దశమ వార్షికోత్సవ మహాసభను ఘనంగా, విజయవంతంగా నిర్వహించాలని యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ శివన్న పిలుపునిచ్చారు.
సోమవారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో “హమాలి మహా గర్జన” కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను యూనియన్ గౌరవ అధ్యక్షులు ఎం.ఏ. కలీం నాయకులతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా శివన్న మాట్లాడుతూ రాష్ట్రంలో హమాలీలు అనేక కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొంటూ జీవనం సాగిస్తున్నారని అన్నారు. పగలు – రాత్రి తేడా లేకుండా శ్రమించి సమాజానికి సేవలు అందిస్తున్న హమాలీలకు ఇప్పటికీ సరైన గుర్తింపు, సామాజిక భద్రత అందకపోవడం బాధాకరమని పేర్కొన్నారు.ఎన్నికల సమయంలో ప్రభుత్వం హమాలి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీ అమలు కాకపోవడం హమాలీలకు తీవ్ర నిరాశ కలిగించిందన్నారు. వెంటనే హమాలి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి హమాలీల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు పది లక్షల మంది హమాలీలు వివిధ మార్కెట్లు, గోదాములు, రవాణా కేంద్రాలు, వ్యవసాయ మార్కెట్ యార్డులు మరియు ప్రైవేట్ సంస్థల్లో కష్టపడి పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు.
కనీస భద్రతా పథకాలు, ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, వృద్ధాప్య పెన్షన్, పిల్లల విద్యకు సహాయం వంటి సంక్షేమ పథకాలు సరైన స్థాయిలో అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.హమాలీలు రోజువారీ కూలీలుగా పనిచేసే క్రమంలో ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, అలాంటి సందర్భాల్లో వారికి ఎటువంటి భరోసా లేకుండా పోతుందని అన్నారు. కాబట్టి హమాలి వెల్ఫేర్ బోర్డు ద్వారా ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, వృద్ధాప్య పెన్షన్, పిల్లల విద్యా సహాయం వంటి సంక్షేమ పథకాలను అమలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.హమాలీల హక్కులు, సంక్షేమం కోసం ఈ నెల 15వ తేదీన హన్మకొండలోని హయగ్రీవాచారి మైదానంలో తెలంగాణ హమాలి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న “హమాలి మహా గర్జన” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శివన్న పిలుపునిచ్చారు.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో హమాలీలు, కార్మిక సంఘాల నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.ఈ విలేకరుల సమావేశంలో యూనియన్ నాయకులు రవికుమార్ (మూసాపేట రైల్వే గూడ్స్ షెడ్ అధ్యక్షులు), ఉగ్రం యాదవ్ (బోయినపల్లి మార్కెట్ అధ్యక్షులు), సంఘం సలహదారులు ఆవాల హరిబాబు తదితరులు పాల్గొన్నారు.

గ్రామాల అభివృద్ధికి బాధ్యతాయుత పాలన అవసరం

గ్రామాల సమగ్రాభివృద్ధికి బాధ్యతాయుతంగా పనిచేయాలి:

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక విజయవంతానికి అందరూ భాగస్వాములు కావాలి

రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ

నర్సంపేట/గీసుగొండ::

గ్రామాల అభివృద్ధే రాష్ట్ర ప్రగతికి పునాదని, గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా పనిచేయాలని
రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు.గురువారం వరంగల్ జిల్లాలోని గీసుగొండ మండలం మరియాపురం గ్రామంలోని ఎస్‌.ఎస్‌. ఫంక్షన్ హాల్‌లో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికపై జిల్లాలోని ప్రజాప్రతినిధులకు నిర్వహించిన ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని,నగర మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద లతో కలసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మార్చి 6 నుండి జూన్ 12 వరకు అమలు చేస్తున్న 99 రోజుల కార్యక్రమంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. సర్పంచ్ నుంచి మంత్రి వరకు ప్రతి ఒక్కరూ స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు.సీఎం రేవంత్ రెడ్డి దార్శనికతకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని, సంక్షేమ పథకాలు, ప్రజా సేవలను ప్రజల్లోకి వేగంగా తీసుకెళ్లాలని ఆదేశించారు. 

ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం, పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను క్లియర్ చేయడం, గ్రామాలు మరియు పట్టణాల్లో పరిశుభ్రత కార్యక్రమాలను ప్రత్యేకంగా చేపట్టడం, ప్రభుత్వ సేవలను ప్రజలకు సులభతరం చేయడం
ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే మన పనితీరుకు ప్రధాన ధ్యేయంగా ఉండాలని అన్నారు.ఈ 99 రోజుల ప్రణాళిక ద్వారా పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడం ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యమని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు.గత రెండు సంవత్సరాల్లో రైతు రుణమాఫీ, రైతు భరోసా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, నూతన రేషన్ కార్డులు, సన్న బియ్యం సరఫరా వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.ప్రభుత్వం అందించిన అవకాశాన్ని వినియోగించుకుని ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని మంత్రి సూచించారు. గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని,

ప్రజల భాగస్వామ్యంతో గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని అన్నారు.గ్రామాలు, పట్టణాల అభివృద్ధిలో పారిశుధ్యం అత్యంత కీలకమని తెలిపారు. పారిశుధ్య కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తూ పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. పరిశుభ్రతను పాటించడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని, ప్రజల ఆరోగ్యం కాపాడటంలో శానిటేషన్ ముఖ్య పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు గ్రామాలు, పట్టణాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను నియంత్రిస్తూ పర్యావరణానికి హాని కలిగించని ప్రత్యామ్నాయాలను ఉపయోగించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ విధంగా పారిశుధ్యం, పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేస్తే గ్రామాలు, పట్టణాలు మరింత శుభ్రంగా, ఆరోగ్యకరంగా మారుతాయని మంత్రి తెలిపారు.గ్రామాల్లో పర్యావరణ పరిరక్షణ కోసం విస్తృతంగా మొక్కలను నాటి వాటిని సంరక్షించడం అత్యంత అవసరమని తెలిపారు. మొక్కలు పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయని, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మరియు ప్రకృతి విపత్తులను తగ్గించడంలో చెట్లు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. గ్రామపంచాయతీలు అవసరమైన మొక్కల కోసం ఇండెంట్ పంపితే సంబంధిత శాఖ ద్వారా సరఫరా చేస్తామని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో పచ్చదనం పెంపొందించేందుకు ప్రజాప్రతినిధులు ముందడుగు వేయాలని మంత్రి పిలుపునిచ్చారు.గ్రామాల అభివృద్ధికి కృషి చేసిన మహానుభావుల సేవలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు.అభివృద్ధికి ఆదర్శంగా నిలిచిన గ్రామాలను సందర్శించి అక్కడ అమలు చేసిన విధానాలను తెలుసుకుంటే ప్రజాప్రతినిధులకు పరిపాలనలో ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. శిక్షణ కార్యక్రమాల్లో నేర్చుకున్న విషయాలను ఆచరణలో పెట్టి ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ వారి విశ్వాసాన్ని పొందాలని సూచించారు.పదవులు శాశ్వతం కావని, కానీ ప్రజలకు చేసిన సేవలు మాత్రం చిరస్థాయిగా నిలుస్తాయని పేర్కొంటూ ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా పనిచేసి ప్రజల మనసులను గెలుచుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.నగర మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమం, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా వినూత్న సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నాయని పేర్కొన్నారు. ప్రగతి బాటలో సకల జన హితం లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 10 థీమ్లపై 99 రోజులపాటు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్లు చెప్పారు.ప్రజాప్రతినిధులుగా ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా చూడటం, ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం మన బాధ్యత అని మేయర్ తెలిపారు. ఈ శిక్షణ ద్వారా పొందిన అవగాహనను తమ ప్రాంతాల్లో అమలు చేసి అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని ప్రజాప్రతినిధులకు సూచించారు.

ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యాలు సాధించేందుకు అందరూ సమన్వయంతో పనిచేయాలని మేయర్ తెలిపారు.జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద* ప్రభుత్వం చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక”లో భాగంగా జిల్లాలో అమలు చేస్తున్న 99 రోజుల కార్యాచరణపై పవర్ పాయింట్ ప్రెసెంటిషన్ ద్వారా ప్రజాప్రతినిధులకు సమగ్రంగా వివరించారు. గ్రామాలు, పట్టణాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం గుర్తించిన 10 కీలక అంశాలపై ప్రత్యేక కార్యాచరణను అమలు చేయనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమాన్ని ఐదు దశల్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఏప్రిల్ 2న గ్రామ స్థాయిలో గ్రామ సభలు, ఏప్రిల్ 16న మండల స్థాయి కార్యక్రమాలు, మే 2న నియోజకవర్గ స్థాయి కార్యక్రమాలు, మే 22న జిల్లా స్థాయి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యక్రమాలు ముగుస్తాయని తెలిపారు.99 రోజుల కార్యాచరణలో భాగంగా పరిసరాల పరిశుభ్రత, ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్, ప్రజల ఆరోగ్యం, రోడ్డు భద్రత (అరైవ్-అలైవ్), సంక్షేమ పథకాల అమలు, పిల్లల భద్రత మరియు డ్రగ్స్‌కు అడ్డుకట్ట, రైతు సంక్షేమం మరియు వ్యవసాయం అభివృద్ధి, విద్యా రంగం, యువత మరియు క్రీడలు, మహిళల సాధికారత, పర్యావరణ పరిరక్షణ వంటి 10 ముఖ్య అంశాలపై దృష్టి సారిసస్తున్నట్లు తెలిపారు.ప్రజల సమస్యలను గుర్తించి త్వరితగతిన పరిష్కరించడం, పెండింగ్ సమస్యలను పరిష్కరించడం, పారిశుధ్యం మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం ప్రతి నియోజకవర్గం, మండలం, గ్రామ స్థాయిలో ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పనిచేసి ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికను విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమానికి ముందు ఇటీవల మరణించిన గంగదేవిపల్లి మాజీ సర్పంచ్ కూసం రాజమౌళికి సంతాపం తెలిపారు.కార్యక్రమంలో భాగంగా మంత్రి చేతుల మీదుగా నూతనంగా ఎన్నికైన సర్పంచులు, కౌన్సిలర్లకు, ప్రజాప్రతినిధులకు ఐడెంటిటీ కార్డులు అందజేశారు.అనంతరం డీఆర్‌డీఏ, ఉద్యానవన శాఖ, స్వయం సహాయక సంఘాలు, పునరుత్పాదక ఇంధన
తదితర శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను మంత్రి ప్రారంభించి, ప్రదర్శించిన ఉత్పత్తులను పరిశీలించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలోని
అంశాలపై వివిధ శాఖల ద్వారా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను మంత్రి , మేయర్, కలెక్టర్ లు తిలకించారు.ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట, నర్సంపేట చైర్పర్సన్ లు సారంగపాణి, పెండెం లక్ష్మీ రామానంద్, డిసిపి అంకిత్ కుమార్ , డిఎఫ్ ఓ అనుజ్ అగర్వాల్, ఆదనవు కలెక్టర్లు సంధ్యారాణి, వై వి గణేష్, జెడ్పి సీఈఓ రామ్ రెడ్డి, డిపిఓ కల్పన, జిల్లాలోని సర్పంచులు, కౌన్సిలర్లు మరియు జి.డబ్ల్యూ.ఎం.సి పరిధిలోని కార్పొరేటర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ప్రజాసేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలి…

ప్రజాసేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలి.

గ్రామ సభలు నిర్వహించి నిధులను ఖర్చు చేయాలి.

ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు చేపట్టాలి.

దేశంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చడానికి కృషి చేయాలి.

గ్రామ ప్రజలను కుటుంబ సభ్యులుగా భావించాలి.

99 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.

రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క.

ములుగు జిల్లా, నేటిధాత్రి:

గ్రామాల్లోని సర్పంచులు, వార్డు కౌన్సిలర్లు గ్రామ ప్రజలను తమ కుటుంబ సభ్యులుగా భావిస్తూ ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు.
గురువారం ములుగు మండలం ఇంచర్ల గ్రామం లోని ఎం.ఆర్. ఫంక్షన్ హాల్ లో జిల్లా స్థాయిలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమములో భాగంగా నూతనంగా ఎన్నికైన ములుగు జిల్లాలోని గ్రామ సర్పంచులకు, మున్సిపల్ కౌన్సిలర్లకు మహిళా, శిశు సంక్షేమ, సెర్ప్, వైద్య ఆరోగ్య, విద్యా మరియు సంక్షేమ శాఖలు, పర్యావరణ, వ్యవసాయ, ఉద్యానవన, పశు సంవర్ధక, మార్కెటింగ్, సహకార, పౌర సరఫరాల, మున్సిపల్ (పురపాలక), పంచాయతీ రాజ్, పోలీస్ రవాణా, గృహ నిర్మాణ, విద్యుత్, యువజన మరియు క్రీడా శాఖల పై శిక్షణ తరగతులు నిర్వహించగా మహిళా, శిశు సంక్షేమం, వైద్యం పై శిక్షణ కార్యక్రమాన్ని ఉదయం జిల్లా కలెక్టర్ దివాకర టి. ఎస్. ప్రారంభించారు.
జిల్లాలోని గ్రామ సర్పంచులకు, మున్సిపల్ కౌన్సిలర్లకు 12 శాఖలపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి మధ్యాహ్నం మంత్రి సీతక్క హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీతక్క మాట్లాడుతూ
దేశంలోనే ఆదర్శ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దడానికి ప్రతి సర్పంచ్ కృషి చేయాలని అన్నారు. దేశానికి పట్టుకొమ్మలే గ్రామాలను గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ప్రతి సర్పంచ్ తమ గ్రామాన్ని సొంత ఇంటిలో భావించుకోవాలని, ప్రజా ప్రతినిధులు స్వార్థం కోసం పనిచేయకుండా ప్రజాసేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. ప్రతి ప్రజా ప్రతినిధి ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలని, పూర్తిస్థాయిలో సేవలు అందించినప్పుడే ప్రజల గుర్తింపు లభిస్తుందని అన్నారు. గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం 6 వందల కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీలకు కేటాయించిందని, మరో 12 వందల కోట్ల రూపాయలు రావాల్సి ఉన్నాయని ఆ నిధులను తీసుకోరావడానికి ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. గత రెండు సంవత్సరాలుగా గ్రామాలలో ప్రజా ప్రతినిధుల ప్రాతినిద్యం లేకపోయినప్పటికీ గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులు చేయడానికి రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం ఒక వెయ్యి మూడు కోట్ల రూపాయలను కేటాయించిందని, ఆనాడు చేసిన పనులకు కొంత మేరకు బిల్లులు చెల్లించగా ప్రస్తుతం 50 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని అన్నారు. ఇటీవల సర్పంచులకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినప్పటికీ నేడు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 దృష్టిలో ఉంచుకొని సర్పంచులకు, పురపాలక కౌన్సిలర్లకు 12 శాఖలపై అవగాహన కల్పించడానికి ఈ శిక్షణను ఏర్పాటు చేశామని, శిక్షణలో అవగాహన చేసుకున్న ప్రజాప్రతినిధులు తూచా తప్పకుండా పాటించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఉత్తమ గ్రామ పంచాయతీలుగా గుర్తించడానికి తొమ్మిది రకాల అంశాలను పొందుపరచిందని, వాటిని అవగాహన చేసుకుని ఉత్తమ గ్రామ పంచాయతీలుగా గుర్తింపు పొందడానికి కృషి చేయాలని అన్నారు. ఉత్తమ గ్రామపంచాయతీ కోటి రూపాయలు, మరో రెండు గ్రామపంచాయతీలకు అదనంగా నిధులు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుందని వివరించారు. మారుమూల గ్రామాలు వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతుందని సీతక్క తెలిపారు.

అంబేద్కర్ విగ్రహానికి భూమి పూజ

అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన కొరకు భూమి పూజ

ఆహ్వానిస్తున్న అంబేద్కర్ యువజన సంఘం

కేసముద్రం/ నేటి ధాత్రి

కేసముద్రం మండలం
కాట్రపల్లి గ్రామంలోని అంబేద్కర్ యువజన సంఘం వారి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టించేందుకు భూమి పూజ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి అధికారులు ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని అంబేద్కర్ యువజన సంఘం వారు తెలిపారు.

రేపటి భావితరాల యువత యువకులు విద్యావంతులు మేధావులు అందరూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను స్ఫూర్తిగా ఆదర్శంగా తీసుకోవాలని యువత వారి ఉన్నతమైన భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని వారి ఆశయ సాధనలో ముందుకు పోవాలని, ముఖ్య ఉద్దేశంతో అందరి సహాయ సహకారాలతో,

2026, మార్చ్13 శుక్రవారం ఉదయం 10 గంటలకు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన కొరకు భూమి పూజ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ఆహ్వానించడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమానికి , కేసముద్రం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఎం ఆర్ ఓ ఎంపీడీవో, నూతన ప్రజా ప్రతినిధులు కేసముద్రం మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్లు కౌన్సిలర్లు–
కేసముద్రం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ మరియు డైరెక్టర్లు
సింగిల్ విండో చైర్మన్ మరియు డైరెక్టర్లు మరియు
కేసముద్రం మండల పోలీసు అధికారులు మాజీ ప్రజా ప్రతినిధులు

అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు కేసముద్రం మండల నాయకులు అన్ని పార్టీల పెద్దలు నాయకులు అన్ని ప్రజా సంఘాల నాయకులు పెద్దలు విద్యార్థి సంఘాల నాయకులు అన్ని కుల సంఘాల నాయకులు ఎంఆర్పిఎస్ ఎంఎస్పి మాల మహానాడు లంబాడి హక్కుల పోరాట సమితి పెద్దలు నాయకులు విద్యావంతులు మేధావులు కవులు కళాకారులు ఉద్యమకారులు అంబేద్కర్ వాదులు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు.

ఇంటర్ నేషనల్ వండర్ బుక్ రికార్డ్ లో స్థానం పొందిన మానస..

ఇంటర్ నేషనల్ వండర్ బుక్ రికార్డ్ లో స్థానం పొందిన మానస

తాండూర్ (నేటి ధాత్రి):

బెల్లంపల్లి పట్టణం లోని వేముల మానస శ్రీనివాస్ 2800 (రెండు వేల ఎనిమిది వందల) శ్లోకాలను 150 నిమిషాలలో ఆగకుండా పాడి ఇంటర్ నేషనల్ వండర్ బుక్ రికార్డ్ లో స్థానం సంపాదించిన పొందారు.అలాగే శ్రీ సత్యమేవ జయతే సేవ సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది.ఈ సందర్భంగా ఆసం అశోక్ మాట్లాడుతూ
మన జిల్లా నుండి ఇంతటి ప్రతిష్టాత్మక అవార్డు లో స్థానం కలగడం అంటే స్ర్తీ శక్తి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పడమే అని అన్నారు.మహిళలందరూ మన సంస్కృతి పట్ల అవగాహన కలిగి ఆధ్యాత్మికత కలిగిన జీవితం ఎంతో స్పూర్తిని ఇస్తుందని జీవన విధానంలో కూడా మంచి విలువలతో,సంప్రదాయాలతో ముందుకు వెళ్తే ఏదైనా సాధించవచ్చు అని తెలిపారు.ఈ కార్యక్రమంలో సత్యమేవ జయతే జిల్లా కో ఆర్డినేటర్ ఆసం అశోక్,రెవెల్లి రాజలింగు,శనిగారపు స్వామి,సాయి,రజిత, మమత తదితరులు పాల్గొన్నారు.

గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలి

సర్పంచులు మున్సిపల్ చైర్మన్ లో కౌన్సిలర్లు పారిశోద్య కార్యక్రమాలు చేయించాలి

ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి ఆదేశాలు
వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి జిల్లాలో నియోజకవర్గంలో వనపర్తి పట్టణంలో అన్ని గ్రామాలలో సర్పంచులు మున్సిపల్ చైర్మన్ లు కౌన్సిలర్లు పారిశోధ్య కార్యక్రమాలు చెయంచాలని రాష్ట్ర ప్రణాళిక బోర్డ్ వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి సూచించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి పాలన 99 రోజుల కార్యాచరణ సందర్భంగా వనపర్తి లో కళ్యాణ సాయి ఫంక్షన్ హాల్ లో ఒక రోజు శిక్షణ కార్యక్రమానికి వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొత్త కాపు శివసేనారెడ్డి జిల్లా ఎస్పీ సునీత రెడ్డి మున్సిపల్ చైర్మన్ లు వనపర్తి మీడిదొడ్డి మాధవి పెబ్బేర్ శ్రీనివాస్ గౌడ్ కొత్తకోట అరుణ ఆత్మకూర్ నాగమణి మున్సిపల్ కమిషనర్లు అధికారులు సర్పంచులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి మాట్లాడుతూ పట్టణాలలోవనపర్తి పట్టణంలో జిల్లాలోని నియోజకవర్గంలో అన్ని గ్రామాలలో మురికి కాలువలు పేరుక పోయిన సందర్భంగా మున్సిపల్ చైర్మన్లు కౌన్సిలర్లు సర్పంచులు 99 రోజుల ప్రజా పాలన ప్రగతి పాలన సందర్భంగా శుభ్రం చేయించాలని ఆదేశించారు అదేవిధంగా వర్షాకాలం కంటే ముందు సాగునీటి కాలువలలో మట్టి పేరుకుపోయిందని మట్టిని తీసి వేయించాలని గ్రామాల సర్పంచ్లకు అధికారులను వీఆర్వోలను ఆదేశించారు ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఉచిత విద్యుత్ మహిళలకు ఉచిత బస్ రవాణా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం సీసీ రోడ్స్ నిర్మాణాలు పేద ప్రజలకు రేషన్ షాపుల ద్వారా సోన మసూరి బియ్యం సరఫరా ఇంకా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి మున్సిపల్ చైర్మన్లు మున్సిపల్ కౌన్సిలర్లు సర్పంచ్ లు ప్రజలకు వివరించాలని కోరారు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో వనపర్తి పట్టణంలో ప్రజలకు సంబంధించి పెండింగ్ ఫైళ్ళ క్లియరెన్స్ ఫిర్యాదులకు ప్రజలకు సమాచారం తెలపాలని అధికారులను ఆదేశించారు ఫైల్స్ పెండింగ్ లేకుండా క్లియరెన్స్ చేయాలని అధికారులకు సూచించారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు వివరించాలని ప్రగతి ప్రణాళిక కార్యాచరణ వారీగా విభజించి అమలు చేస్తున్నామని తెలిపారు వనపర్తి పట్టణంలో వనపర్తి జిల్లాల్లో ఇక్కడ కూడా పారిశ్రాధ్య లోపం చెత్త చెదారం మురికి కాలువలు జామ్ కాకుండా మట్టిని తొలగించాలని మున్సిపల్ అధికారులను కోరా రు ఆరోగ్యం డ్రగ్స్ వాడకుండా అడ్డుకట్టు వేయాలని ఎక్సైజ్ పోలీస్ అధికారులను ఆదేశించారు ఈ శిక్షణ శిబిరం సమావేశంలో జిల్లా లోకల్ బాడీ అదనపు కలెక్టర్ భీమ్య నాయక్ డి పి ఆర్ ఓ సీతారాం జిల్లా ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు

పరిశోధనలో డాక్టర్ నీలం ఇంజెటికి పీహెచ్.డీ….

పరిశోధనలో డాక్టర్ నీలం ఇంజెటికి పీహెచ్.డీ.

నేటి ధాత్రి, పఠాన్ చేరు :

ఫార్మాస్యూటికల్ పరిశోధనను విజయవంతంగా పూర్తిచేసిన హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ పరిశోధక విద్యార్థిని నీలం ఇంజెటిని డాక్టరేట్ వరించింది. ‘ప్రయోగాత్మక జంతువులలో నాడీ సంబంధిత రుగ్మతలకు వ్యతిరేకంగా సంభావ్య మూలికల యొక్క న్యూరోప్రొటెక్టివ్ ప్రభావం’ అనే అంశంపై ఆమె అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న ఫార్మసీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.శివకుమార్ గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.ఈ పరిశోధన అల్జీమర్స్ వ్యాధిని పరిష్కరించడంలో ఔషధ మొక్కల యొక్క న్యూరోప్రొటెక్టివ్ సామర్థ్యాన్ని అన్వేషించినట్టు తెలియజేశారు. సాంప్రదాయకంగా మూలికా వైద్యంలో ఉపయోగించే మొక్కలైన ఇండిగోఫెరా ప్రోస్ట్రాటా, లాంటానా కమారా యొక్క ఫైటోకెమికల్, చికిత్సా లక్షణాలపై ఈ అధ్యయనం దృష్టి సారించిందన్నారు.
సిలికో మాలిక్యులర్ డాకింగ్, జీసీ-ఎంఎస్ విశ్లేషణ, ప్రయోగాత్మక జంతు అధ్యయనాలలో అధునాతనమైన పురోగతి ద్వారా, పరిశోధన అమిలాయిడ్-బీటా, ఎసిటైల్ కోలినెస్టెరేస్ తో సహా కీలకమైన అల్జీమర్స్ వ్యాధి లక్షణాలతో మొక్కల నుంచి ఉత్పన్నమైన సమ్మేళనాల యొక్క ఆశాజనక పరస్పర చర్యలను ప్రదర్శించినట్టు వివరించారు. ప్రయోగాత్మక నమూనాలలో గణనీయమైన యాంటీఆక్సిడెంట్ కార్యకలాపాలు, జ్జాపకశక్తి, అభ్యాసంలో మెరుగుదల కూడా ఈ పరిశోధన ఫలితాలు తేల్చాయని, ఇది మొక్కల బలమైన న్యూరోప్రొటెక్టివ్ సామర్థ్యాన్ని వెల్లడిస్తోందన్నారు.ఈ మూలికా వనరులు అల్జీమర్స్ వ్యాధికి కొత్త చికిత్సా విధానాల అభివృద్ధికి దోహదపడతాయని, తదుపరి క్లినికల్ పరిశోధనలను ప్రోత్సహిస్తాయని అధ్యయనం సూచిస్తున్నట్టు తెలిపారు.డాక్టర్ నీలం సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచ్.డీ. పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం, హైదరాబాద్ అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, పలు విభాగాల అధిపతులు, సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ

*ప్రతిఒక్క విద్యార్ధి జీవితంలో టెన్త్ పరీక్షలు కీలకం *…
*పదవ తరగతి విద్యార్థులకు, వంగ ఫౌండేషన్” ఆధ్వర్యంలో పరీక్ష ప్యాడ్స్ పంపిణీ *…
మొగుళ్లపల్లి నేటి దాత్రి

 

భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని మొట్లపల్లి పాఠశాలలో పదవ తరగతి ఎగ్జామ్ నేషనరీ అందించిన వంగ ఫౌండేషన్ చైర్మన్ వంగ మహేష్ మాట్లాడుతూ ప్రతిఒక్క విద్యార్థి కస్టపడి ఉన్నత చదువులు అభ్యసించి చదివి పాఠశాలకు, కన్న తల్లిదండ్రులకు, స్వంత ఊరుకు, దేశానికి, సేవ చేసే ప్రతిభవంతులుగా ఎదగాలని, విద్యావంతుడు ప్రపంచంలో ఎక్కడఉన్నా పూజింప బడుతాడని, ప్రతిఒక్కరూ ఉన్నత చదువులు చదివి మంచి స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. పదవ తరగతి విద్యార్థులకు పదవ తరగతి కీలక దశఅని, ఈ సమయంలో సరైన స్టడీ మెటీరియల్, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో నడుచుకోవడం ఏoతో అవసరమని, విద్యార్థులు కస్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని కోరినారు.

మొగుళ్లపల్లి పోలీస్ స్టేషన్‌కు నూతన ఎస్సైగా ఎం. సురేష్

శాంతిభద్రతలను కాపాడేందుకు కట్టుబడి పనిచేస్తా..!

సబ్ ఇన్ స్పెక్టర్. ఎం. సురేష్

మొగుళ్ళపల్లి నేటిదాత్రి :

 

మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌కు నూతన ఎస్సైగా ఎం. సురేష్ గురువారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. మొగుళ్లపల్లి పోలీస్ స్టేషన్లో గతంలో ఎస్సైగా విధులు నిర్వహించిన ఎస్సై బొరగల అశోక్ గణపురం పోలీస్ స్టేషన్ కు బదిలీ కాగా ఆయన స్థానంలో. ములుగు విఆర్ ఎస్సైగా పని చేసిన ఎం సురేష్ మొగుళ్లపల్లి పోలీస్ స్టేషన్లో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మొగుళ్ళపల్లి మండలంలో నేరాలను నియంత్రించడంలో ప్రత్యేక కృషి చేస్తానని ఎస్సై సురేష్ అన్నారు. చట్టం శాంతి భద్రతలను కాపాడేందుకు కట్టుబడి పనిచేస్తానని తెలిపారు. ప్రజలు పోలీస్ శాఖపై విశ్వాసం ఉంచాలని, ఏవైనా సమస్యలు ఉన్నా నేరుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి తెలియజేయాలని. నేరాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

తీర్మానం లేకుండానే జి పి నిధుల డ్రా…

తీర్మానం లేకుండానే జి పి నిధుల డ్రా…?

ఎంపీడీవో కార్యాలయంలో ఫిర్యాదు చేసిన వార్డు సభ్యులు గ్రామ ప్రజలు

గెలిసి మూడు నెలలు అయిందో లేదో 10 లక్షల నిధులు విడుదల

గ్రామ సభ తీర్మానాలు ఉన్నాయా…! లేదా అనేది ప్రశ్న…!?

ఉప్పరపల్లి గ్రామ సర్పంచ్ చేతివాటమా…?

కేసముద్రం/ నేటి ధాత్రి

https://youtu.be/l0AynUdkDb8?si=0HJaxNEgaq7J2t7t

ఎలాంటి తీర్మానం లేకుండా రికార్డ్ లేకుండా నిధులు దురర్వినియోగం చేశారని గురువారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పరపల్లి గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు ఆ గ్రామ ప్రజలు ఫిర్యాదు చేయడం జరిగింది. జిపి లోని నిధులు ఎలాంటి తీర్మానం లేకుండా గ్రామసభ నిర్వహించకుండా నిధులు ఎలా తీస్తారని ఆ గ్రామ సర్పంచిని ఇదేంటి అని వార్డ్ సభ్యులు ప్రశ్నిస్తే మాకు తీసే అధికారం ఉంది అని సమాధానం దాటవేస్తూ బెదిరిస్తున్నారని వార్డు సభ్యులు ఆరోపిస్తున్నారు. గెలిచి వచ్చి మూడు నెలలు గడవ కా ముందే సుమారు 10 లక్షల రూపాయలు గ్రామ పంచాయతీ నిధుల నుండి ఎలాంటి గ్రామసభ లేకుండా వార్డు సభ్యుల తీర్మానం లేకుండా నిధులు డ్రా చేయడం జరిగిందని వార్డు సభ్యులు ఉప్పరపల్లి గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. చేసిన పనులకే ఇన్నాళ్లు పైసా దిగ్గు లేదని చేయని పనులకు చేసినట్టు గా రికార్డ్ లు చూపించి నిధులు తీసుకోవడం జరిగిందని ఎంపీడీవో కార్యాలయం అధికారికి వివరించడం జరిగింది. ఎలాంటి తీర్మానం లేకుండా జిపి నిధుల దుర్వినియోగం చేసిన సర్పంచ్ పై చట్టరీత్య పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలని ఇలాంటి వారి పట్ల జిల్లా కలెక్టర్ మండల పరిషత్ కార్యాలయ అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని వార్డు సభ్యులు ఆ గ్రామ ప్రజలు జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగింది.

error: Content is protected !!
Exit mobile version