పిల్లల భద్రత డ్రగ్స్ కు అడ్డుకట్ట…

పిల్లల భద్రత డ్రగ్స్ కు అడ్డుకట్ట

గుండాల,నేటిధాత్రి :

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పిల్లల భద్రత డ్రగ్స్ కు అడ్డుకట్టఅనే అంశంపై నర్సాపురం తండా గుండాల పంచాయతీ కార్యాలయం గురుకులం స్కూల్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఈగల్ టీం సీఐ గుండాల సీఐ తిరుపతి, గుండాల ఎస్సై రాహుఫ్,ఏం ఆర్ఓ , ఎక్సైజ్ శాఖ అధికారులు, చైల్డ్ సూపరింటెండెంట్, ఏంఈఓ పంచాయతీ కార్యదర్శులు, గ్రామ సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు,విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం గురించి ఈగల్ టీం సీఐ మాట్లాడుతూ
డ్రగ్స్ వాడకం వల్ల ఆరోగ్యం, భవిష్యత్తు, కుటుంబ జీవితం పై వచ్చే ప్రమాదాలు గురించి వివరించారు. అలాగే యువత, పిల్లలు డ్రగ్స్ కు దూరంగా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు.గుండాల సీఐ రహూఫ్ ఈ కార్యక్రమం లో
తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వివరించారు.అనుమానాస్పద వ్యక్తులతో లేదా చెడు స్నేహితులతో కలవకుండా ఉండాలి అని ఎవరు ఇచ్చినా తెలియని మాత్రలు లేదా పదార్థాలు తీసుకోకూడదు అని చదువు, క్రీడలు మంచి కార్యకలాపాలపై దృష్టి పెట్టాలి.డ్రగ్స్ ఉపయోగం కనిపిస్తే వెంటనే తల్లిదండ్రులు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలి అని తెలియజేశారు. గుండాల ఎస్సై మాట్లాడుతూ పిల్లలు యువత సోషల్ మీడియా ప్రభావానికి లోనుకాకుండా జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులు పిల్లల ప్రవర్తనపై దృష్టి పెట్టి వారికి సరైన మార్గదర్శనం చేయాలి అని ఈ కార్యక్రమం ద్వారా పిల్లల భద్రత మరియు డ్రగ్స్ నివారణపై సమాజంలో అవగాహన పెంపొందించటం ప్రధాన ఉద్దేశ్యంగా నిర్వహించబడింది అని చెప్పటం జరిగింది.అన్ని డిపార్ట్మెంట్ వారు ఈ కార్యక్రమం లో హాజరై తమ సూచనలు తెలియజేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version