గ్రామాల అభివృద్ధి విషయంలో సర్పంచుల పాత్ర కీలకం…

గ్రామాల అభివృద్ధి విషయంలో సర్పంచుల పాత్ర కీలకం.

#ప్రభుత్వ ఫలాలు నిజమైన లబ్ధిదారులకు అందే విధంగా
చోరువ చూపాలి.

#శిక్షణలో నేర్చుకున్న ప్రతి విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి.

#జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.

ములుగు జిల్లా, నేటిధాత్రి:

గ్రామాల అభివృద్ధి విషయంలో సర్పంచ్ ల పాత్ర ఎంతో కీలకమైనదని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు అర్హులైన లబ్ధిదారులకు అందచేయడానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో వైద్య సేవలు పొందడానికి జిల్లా ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యే వారని నేడు ములుగు జిల్లాకు మెడికల్ కళాశాల రావడమే కాకుండా నర్సింగ్ కళాశాల ఏర్పాటు జరిగిందని, 15 మంది ప్రత్యేక వైద్య నిపుణులచే వివిధ వ్యాధి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినీ విద్యార్థులు మంచి ఫలితాలను సాధించి ఇక్కడి కళాశాలలోనే వైద్య పట్టా పొందే అవకాశం దక్కిందని, ప్రతి ఒక్కరికి వైద్యం అనేది ఎంతో ముఖ్యమైనదని తెలిపారు. ప్రస్తుతం 60 శాతం కేసులను పరీక్షించి ఇక్కడే వైద్య సేవలు అందిస్తున్నారని, గత మూడు నెలల క్రితం ఏకంగా రెండు క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు శాస్త్ర చికిత్సలు చేసి విజయవంతం చేశారని హర్షం వ్యక్తం చేశారు.
దివ్యాంగులకు పెన్షన్ మంజూరు విషయంలో ప్రభుత్వం నూతన విధానాన్ని అమలులోకి తీసుకవచ్చిందని ధ్రువీకరణ పత్రం స్థానంలో యు డి ఐ డి కార్డును ప్రవేశపెట్టడం జరిగిందని, దివ్యాంగులు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే ముందు ఈ కార్డు తప్పనిసరిగా పొంది ఉండాలని అన్నారు.
యు డి ఐ డి కార్డు కోసం దివ్యాంగులు మీసేవ కేంద్రాల ద్వారా స్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ప్రతి గురువారం సామాజిక ఏరియా ఆసుపత్రిలో జరిగే సదరం క్యాంప్ కు వైద్య పరీక్షకు హాజరుకావాలని తెలిపారు. క్యాంపు ద్వారా వైద్య పరీక్షలు జరిగిన అనంతరం 30 రోజుల్లో యు డి ఐ డి కార్డు పోస్ట్ ద్వారా నేరుగా తమ చిరునామాకు చేరుతుందని అనంతరం పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజులలో భాగంగా ప్రతి పీహెచ్సీలో గ్రామీణ ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్య క్రమంలో అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హెచ్. మహేందర్ జి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ భానోత్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రేగ కళ్యాణి, మున్సిపల్ చైర్మెన్ చింతనిప్పుల చంద్ర కళ, ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డి, ఆర్డీఓ వెంకటేష్, జిల్లా అధికారులు, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version