పారిశుధ్యంలో మున్సిపాలిటీ కి మంచి పేరు తేవాలి…

పారిశుధ్యంలో మున్సిపాలిటీ కి మంచి పేరు తేవాలి

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

పారిశుధ్యంలో మున్సిపాలిటీ కి మంచి పేరు తీసుకు రావాలని చైర్మన్ కంఠం శిరీష కృష్ణ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చైర్మన్ కంఠం శిరీష కృష్ణ రెడ్డి మున్సిపల్ కార్యాలయంలో మహిళ పారిశుధ్య సిబ్బందికి సన్మానం చేసి , వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ కంఠం శిరీష కృష్ణ రెడ్డి మాట్లాడుతూ మహిళా సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేస్తూ పారిశుధ్య కార్యక్రమాలు మంచిగా చేసి, మున్సిపాలిటీ కి మంచి పేరు తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమీషనర్ చంద్ర శేఖర్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

భద్రాచల రామయ్యకు గోటి తలంబ్రాలు అందచేసిన శ్రీ రామదాసు సేవ సమితి…

భద్రాచల రామయ్యకు గోటి తలంబ్రాలు అందచేసిన శ్రీ రామదాసు సేవ సమితి

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలం ధర్మారావుపేట నుండి శుక్రవారం భద్రాచలం గోటి తలంబ్రాలను తీసుకెళ్లిన శ్రీ రామదాసు సేవ సమితి ఆకుల సుభాష్ ఆధ్వర్యంలో ఆలయ ఏ ఈ ఓ శ్రవణ్ కుమార్ కి అందించడం జరిగిందని.భూపాలపల్లి జిల్లా తో పాటు హన్మకొండ ములుగు జిల్లా సేవ సమితి సభ్యులు సుమారు 150 మంది ఈ తలంబ్రాల అప్పగింత కార్యక్రమంలో పాల్గొన్నారని ఉమ్మడి జిల్లా బాద్యులు ఆకుల సుభాష్ ముదిరాజ్ తెలిపారు.
తనీషా మందిరం నుండి భద్రాచలం పుర విధులలో రామ నామ స్మరణ తో శోభయాత్రగా వెళ్లి ఆలయం చుట్టూ ప్రదక్షిణ సీతమ్మకు చీర సారే పూలు పండ్లు రామయ్యకు పట్టువస్త్రాలు సమర్పించారన్నారు ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా బాద్యులు బెనికి రాజేందర్ ఆకుల దామోదర్ కురిమిళ్ల తిరుపతి దూలం శంకర్ పనికేల వసంత జీడీ స్వర్ణలత కేశెట్టి స్వామి ములుగు జిల్లా బాద్యులు సకినాల వజ్ర రఘు ఆవుల సుశీల హన్మకొండ జిల్లా బాద్యులు నాయిని సుమలత నాగరాజు నిలబోయిన రజిత శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

భద్రాచల రామయ్య కోటి గోటి తలంబ్రాల శోభయాత్ర

భద్రాచల రామయ్య
కోటి గోటి తలబ్రాల శోభయాత్ర

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురంమండలంలోని ధర్మారావుపేట గ్రామంలో శ్రీ రామదాసు సేవ సమితి రామదాసు భజన మండలి ఆధ్వర్యంలో శ్రీ భద్రాచల సీతారాములా కల్యాణం కోటి గోటి తలంబ్రాల శోభయాత్ర అంగరంగ వైభావంగా శోభయమానంగా సాగిందని రామదాసు సేవ సమితి ఉమ్మడి జిల్లా బాద్యులు ఆకుల సుభాష్ ముదిరాజ్ మాట్లాడుతూ అధికారులు అనధికారులు పాలక వర్గ సభ్యులు ఆలయ కమిటీ గ్రామ పెద్దలు మహిళల మధ్యలో కన్నుల పండుగగా జరగడం మహిలల కోలాటల సందడితో రామ నామ స్మరణతో గ్రామ పుర విధులలో కుటుంబ సమేతంగా శోభయాత్ర వాహనానికి ఎదురువచ్చి మంగళ హరతులతో నీళ్లు ఆరగిస్తూ పూలు పండ్లతో స్వాగతం పలకడం భక్తి పారవశ్యంతో భక్తులు మొక్కలు చెల్లించడం జరిగిందని గత కొన్ని సంవత్సరాలనుండి ఈ గోటి తలంబ్రాల కార్యక్రమం జరుగుతుందని వారన్నారు భూపాలపల్లి జిల్లా తో పాటు హన్మకొండ ములుగు జిల్లా లో ఈ గోటి తలంబ్రాల కార్యక్రమం నిర్వహించడం ఆ సీతారాములా ఆశీస్సులతో నిర్వీరంగా సాగడం పూర్వజన్మ సుకృతగా భావిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పూజారి రాజేందర్ ఆలయ కమిటీ అధ్యక్షులు బాపని సాంబయ్య సేవ సమితి అధ్యక్షులు బెనికి రాజేందర్ భజన మండలి అధ్యక్షులు ఆకుల దామోదర్ ఉపాధ్యక్షులు దూలం శంకర్ పనికేలా శివకృష్ణ వార్డు సభ్యులు ఆరెందల లలిత శంకరయ్య గంపల కల్పన కుమార్ మహిళా సమితి అధ్యక్షులు పనికేల వసంత ఉపాధ్యక్షులు స్వర్ణలత మంతుర్తి భద్రయ్య ఆకుల రాజు తెలు రాంచందర్ తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version