శాంతిభద్రతలను కాపాడేందుకు కట్టుబడి పనిచేస్తా..!
సబ్ ఇన్ స్పెక్టర్. ఎం. సురేష్
మొగుళ్ళపల్లి నేటిదాత్రి :
మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్కు నూతన ఎస్సైగా ఎం. సురేష్ గురువారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. మొగుళ్లపల్లి పోలీస్ స్టేషన్లో గతంలో ఎస్సైగా విధులు నిర్వహించిన ఎస్సై బొరగల అశోక్ గణపురం పోలీస్ స్టేషన్ కు బదిలీ కాగా ఆయన స్థానంలో. ములుగు విఆర్ ఎస్సైగా పని చేసిన ఎం సురేష్ మొగుళ్లపల్లి పోలీస్ స్టేషన్లో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మొగుళ్ళపల్లి మండలంలో నేరాలను నియంత్రించడంలో ప్రత్యేక కృషి చేస్తానని ఎస్సై సురేష్ అన్నారు. చట్టం శాంతి భద్రతలను కాపాడేందుకు కట్టుబడి పనిచేస్తానని తెలిపారు. ప్రజలు పోలీస్ శాఖపై విశ్వాసం ఉంచాలని, ఏవైనా సమస్యలు ఉన్నా నేరుగా పోలీస్ స్టేషన్కు వచ్చి తెలియజేయాలని. నేరాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
