ఆగిన రోడ్డు మరమ్మతులు.

ఆగిన రోడ్డు మరమ్మతులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

ఝరాసంగం : గత మూడేళ్ల క్రితం రోడ్డు మరమ్మతు కోసం నిధులు మంజూరు కాగా ఇటీవలే పనులు ప్రారం భమైనప్పటికీ తిరిగి నిలిచిపోవడంతో గిరిజనులు అవస్థలు పడుతు న్నారు.

దేవుడు వరమిచ్చిన పూజారి కనికరించనట్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలోనే నిధులు మంజూరు జరిగిన కాంట్రాక్టర్ మా త్రం పనులు వెంటనే ప్రారంభించ లేదు.

ఇటీవలే పనులు ప్రారంభమై నప్పటికీ కొన్ని నెలల్లోనే అర్ధాంతరంగా పనులను నిలిపివేశారు.

ఇందుకుసంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఝరాసంగం మండలంలోని కక్కర్ వాడ గ్రామం నుండి పూర్యానాయక్ తండా వైపు 3.50 కిలోమీటర్ల మేర రోడ్డును మరమ్మతులు చేసేందుకు 2022 సంవత్సరంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.2.38 కోట్లు మంజూరు చేయడం జరిగింది.

ఇట్టి పనులను పర్యవేక్షించేందుకై ప్రభుత్వం రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగానికి నియమించింది.

దీంతో ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ విభాగం టెండర్లు పిలిచి ఇట్టి పనిని చేసేందుకు కాంట్రాక్టర్కు అప్పగించింది.

అయితే కాంట్రాక్టర్ గత మూడు సంవత్సరాలు పాటు ఎలాంటి రోడ్డు మర మ్మతు పనులను ప్రారంభించకపోవడంతో గిరిజనుల ఆశలు సన్నగిల్లాయి.

 

BRS Government.

 

గత కొన్ని ఏళ్లుగా గిరిజనులు కంకర తేలి గుంతలపడ్డ రో డ్డుపైనే ప్రయాణం కొనసాగిస్తున్నారు.

ద్విచక్ర వాహనాల మాట అటు ఉంచితే కనీసం కాలినడకన వెళ్లాలన్న ఈ రోడ్డు అనువుగా లేక పోవడంతో గిరిజనులు నానా అవస్థలు పడుతున్నారు.

ఈ తరు ణంలోనే గత రెండు నెలల క్రితం కాంట్రాక్టర్ ఈ రోడ్డు మరమ్మతు పనులు ప్రారంభించడంతో గిరిజనుల ఆశలు తిరిగి రేకెత్తిన్నాయి.

కాగా ఇప్పటి వరకు ఈ రోడ్డుపై పలుచోట్ల కల్వర్టులు నిర్మించారు.

అలాగే రోడ్డుకు ఇరువైపులా ఉన్న రేగడి మట్టిని తవ్వి సైడ్ వైన్దింగ్ పనులను చేపట్టారు.

అదే విధంగా మొరం కాకుండా చెడేతో కూడు కున్న మట్టిని రోడ్డుపై వేసి చదును చేశారు.

తదుపరి కంకర వేయ కుం డా రోడ్డు మరమ్మతు పనులను అర్ధాంతరంగా వదిలిపెట్టారు.

దీంతో ప్రస్తుతం ఈ రోడ్డు చిరుజల్లుతే చిత్తడిగా మారి ప్రయాణం చేయ డా నికి తీవ్ర అవస్థలు పడాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆయా తండాలో గిరి జనులు ఆందోళన వ్యక్తం చేశారు.

పలువురు వాహనదారులు జారి పడి ప్రమాదాన్ని గురైనట్లు వారు వివరించారు. ఇప్పటికైనా సం బంధిత అధికారులు

ఈ రోడ్డుపై కంకర వేసి బీటీ రోడ్డుగా మార్చడా నికి తగిన చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు.

బాలకృష్ణతో మరోసారి 

బాలకృష్ణతో మరోసారి 

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్‌ మలినేని ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు గోపీచంద్‌ మలినేని ఎక్స్‌ వేదికగా పంచుకున్నారు…

 

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్‌ మలినేని ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు గోపీచంద్‌ మలినేని ఎక్స్‌ వేదికగా పంచుకున్నారు. ‘‘గాడ్‌ ఆఫ్‌ మాసెస్‌ బాలకృష్ణతో మరోసారి సినిమా చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సినిమాతో మా కాంబో చేసే గర్జన మరింత ఎక్కువగా ఉండబోతోంది. చరిత్రలో నిలిచిపోయే చిత్రమిది’’ అని పేర్కొన్నారు. మంగళవారం బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రారంభించనున్నారు. ఇది ఆయన నటించనున్న 111వ చిత్రం. వెంకట్‌ సతీష్‌ కిలారు నిర్మించనున్నారు. కాగా, బాలకృష్ణ, గోపీచంద్‌ మలినేని కలయికలో ‘వీరసింహా రెడ్డి’ అనే చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే.

అఖండ 2 టీజర్‌ వచ్చేస్తోంది

హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబో హ్యాట్రిక్‌ కొట్టిన సంగతి తెలిసిందే. వారి కలయికలో నాలుగోసారి తెరకెక్కుతోన్న సినిమా ‘అఖండ 2: తాండవం’. ఈ సినిమా టీజర్‌ను నేడు విడుదల చేయనున్నారు మేకర్స్‌.

ముస్లింను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

ముస్లింను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గుర్తించండి..

◆ తెలంగాణ ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న కాంగ్రెస్ పార్టీ…..

◆ ఆరోపించిన ఝరాసంగం మండల ఎంఐఎం పార్టీ అధ్యక్షులు షేక్ రబ్బాని……

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

 

ఝరాసంగం మండల ఎంఐఎం పార్టీ అధ్యక్షులు షేక్ రబ్బాని మాట్లాడుతూ అయ్యో, కాంగ్రెస్ పార్టీలో ముస్లింలకు ప్రాముఖ్యత లేదు … ఒక్క ముస్లింను కూడా మంత్రివర్గంలోకి తీసుకోలేదు. ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీని మంత్రివర్గంలోకి తీసుకున్నారు, అందులో ముగ్గురు కొత్త మంత్రులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అత్యున్నత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఒక ముస్లింను చేర్చుకుంటారని తెలంగాణ ముస్లింలు ఆశించారు. మంత్రివర్గంలో ఒక్క ముస్లింను కూడా చేర్చకపోవడం విచారకరం. తెలంగాణలో ముస్లింల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. ముస్లింల ఓట్లు అందుకు అనుకూలంగా మారాయి. కాంగ్రెస్ పార్టీలో ముస్లింలకు ప్రాముఖ్యత లేదు. ముస్లింలు అసూయపడే మంత్రి లేరు. కాంగ్రెస్ పార్టీ లౌకిక పార్టీ. అవును,కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముస్లింలను మంత్రివర్గంలోకి తీసుకున్నారు,కానీ బిజెపి మరియు మోడీ ప్రభుత్వాల మాదిరిగానే సిఎం రేవంత్ రెడ్డి తెలంగాణను పాలిస్తున్నారు. తదుపరి ఎన్నికల్లో ముస్లింలు కాంగ్రెస్ పార్టీ సిఎం రేవంత్ రెడ్డికి అందరూ మంచి గుణపాఠం నేర్పించాలని కోరారు. ముస్లింలను ఓటు బ్యాంకు రాజకీయంగా వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు వచ్చే గ్రామ పంచాయతీ జడ్పిటిసి ఎంపిటిసి ఎలక్షన్లలో ముస్లింలందరూ కలిసి కాంగ్రెస్ పార్టీని గుణపాఠం నేర్పించాలని కోరారు.

అఖిల్‌, జైనబ్ రిసెప్ష‌న్‌..

అఖిల్‌, జైనబ్ రిసెప్ష‌న్‌.. త‌ర‌లివ‌చ్చిన తారాలోకం

 

అక్కినేని వార‌సుడు అఖిల్‌, జైనాబ్‌ల వివాహాం రెండు రోజుల క్రితం అంగ‌రంగ వైభవంగా జ‌రిగిన విష‌యం తెలిసిందే.

అక్కినేని వార‌సుడు అఖిల్‌ (Akhil), జైనాబ్‌ (Zainab)ల వివాహాం రెండు రోజుల క్రితం అంగ‌రంగ వైభవంగా జ‌రిగిన విష‌యం తెలిసిందే. అయితే మొన్న కేవ‌లం అతి కొద్దిమంది స‌మ‌క్షంలోనే ఈ పెళ్లి జ‌రుగ‌గా సినీ ఇండ‌స్ట్రీ నుంచి కొద్దిమంది అతిథులు మాత్ర‌మే హ‌జ‌ర‌య్యారు.

తాజాగా వీరి నిశ్చితార్ధం హైద‌రాబాద్‌లో క‌నుల‌పండువ‌గా జ‌రిగింది. ఈ వేడుక‌కు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు భారీ ఎత్తున హ‌జ‌ర‌య్యారు.

ముఖ్యంగా సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు (Mahesh Babu), సూర్య‌, వెంకి అట్లూరి ఈ రిసెప్ష‌న్‌కు హ‌జ‌రైన ఫొటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. మీరూ వాటిపై ఓ లుక్ వేయండి.

రామ్‌చ‌ర‌ణ్, ఉపాస‌న‌, అల్ల‌రి న‌రేశ్‌, నాని, నిఖిల్, క‌న్న‌డ స్టార్ య‌శ్‌ దంప‌తుల‌తో పాటు సుధీర్‌బాబు, ద‌ర్శ‌కుడు సుకుమార్ దంప‌తులు, బుచ్చిబాబు సాన‌, నిర్మాత‌లు దిల్ రాజు, అశ్వినీ ద‌త్‌, బీవీ ప్ర‌సాద్‌, కేఎల్ నారాయ‌ణ‌ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

రాజ‌కీయ నాయ‌కులు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు భ‌ట్టి విక్ర‌మార్క‌, కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డిలు సైతం ఈ వేడుక‌కు హాజ‌ర‌య్యారు.

వెంకటేశ్వర స్వామి ఆలయంలో పంచగవ్యాల ఉత్పత్తుల శిక్షణ.

దేవుని తిరుమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో పంచగవ్యాల ఉత్పత్తుల శిక్షణ

వనపర్తి నేటిధాత్రి

 

 

 

కొల్లాపూర్ నియోజక వర్గం పెద్దకొత్తపల్లి మండలం దేవుని తిరుమలాపురం గ్రామంలో భూనీలాసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పంచగవ్య శిక్షణ ఉత్పత్తుల తయారీ కేంద్రం ఏర్పాటు చేశామని ఆలయ పురోహితులు చంద్రశేఖర్ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు .

ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ గోశాల ఆవుల పరిరక్షణ నిమిత్తం పోషణకై దాతల వస్తూ రూపములో వచ్చిన వాటితో కొంతమంది ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.

గవ్య ఉత్పత్తులను తయారుచేసి వాటిని విక్రయించగా వచ్చిన డబ్బులతో ఆవువుల ను రక్షించడానికి వాటికి అయ్యే ఖర్చు ఈ ఉత్పత్తుల ద్వారా ఆదాయం వస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఉత్పత్తులను తిరుమలాపురము ఆలయంలో తయారు చేయడం జరుగుతుందని ఆలయ పూజారి చంద్రశేఖర్ శర్మ తెలిపారు.

 

Lord Venkateswara Swamy Temple, Tirumalapuram.

 

పంచగవ్య ఉత్పత్తుల ఉత్పత్తుల ద్వారా దూప్ స్టిక్స్ దోమల అగర్బత్తీలు క్లీన్ ఆయిల్ ఇంకా సోప్స్ హోలీ పండుగకు ప్రత్యేకంగా పూర్ణిమ సందర్భంగా ఎటువంటి కెమికల్స్ రసాయన ద్రవ్యాలు కలుషితం లేకుండా పూలతో చెట్ల దినుసులతో రంగులు తయారు చేస్తున్నామని ప్రజలు రంగులు వాడిన ఎలాంటి అనారోగ్యాలకు గురికాకుండా చర్మవ్యాధులు లేకుండా ఉంటాయని ఆయన తెలిపారు తల వెంట్రుకలకు సంబంధించి ఆయిల్స్ కూడా తయారవుతాయని ప్రజలు ఆయిల్స్ ధూప్ స్టిక్స్ ప్లాస్టిక్ పేపర్ ప్లేట్స్ గ్లాసులు వాడడం వల్ల క్యాన్సర్ ఇతర వ్యాధులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని ఇది కాకుండా పురాతన కాలంలో మోత్కాకుతో ఇస్తరాకులో ఉండేవి అదే ఆకులతో పేపర్ ప్లేట్లు కూడా యంత్రాలతో భవిష్యత్తులో తయారు చేయించి సరఫరా చేస్తామని ఆయన తెలిపారు ఇది బాగుంది కంగ్రాట్స్ ఈ పేపర్ ప్రింట్ గాని గిలాసలు గాని తిడతాడు గ్లాసులు మొత్తం 15 వస్తువులు తయారవుతాయని ఆయన తెలిపారు

ఈ వారం ఓటీటీ సినిమాలివే.!

 ఈ వారం ఓటీటీ సినిమాలివే.. అన్నీ అదిరిపోయే బొమ్మ‌లే

 

నేటిధాత్రి:

 

 

 

 

 

 

ఈవారం ఓటీటీ () ప్రేక్ష‌కుల చెంత‌కు అదిరిపోయే కంటెంట్ అందుబాటులోకి రానుంది.

ఈవారం ఓటీటీ () ప్రేక్ష‌కుల‌కు అదిరిపోయే కంటెంట్ అందుబాటులోకి రానుంది. ఎప్ప‌టిలానే ఈ వీకెండ్ కూడా 100కు పైనే సినిమాలు, సిరీస్‌లు డిజిట‌ల్ స్ట్రీమింగుకు వ‌స్తుండ‌గా వాటిలో చాలా వ‌ర‌కు ప్ర‌ధాన కంటెంట్‌ తెలుగులోనూ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అయితే వీటిలో అధిక శాతం మూవీస్‌ కేవ‌లం అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌ల‌లోనే వ‌స్తుండ‌డం విశేషం.

వీటిలో ముఖ్యంగా హీరోయిన్ స‌మంత నిర్మాత‌గా మారి మొట్ట మొద‌టి సారి నిర్మించిన శుభం, మ‌ల‌యాళ యువ నటుడు, ప్రేమ‌లు హీరో న‌టించిన అల‌ప్పుజ జింఖానా, న‌వీన్ చంద్ర ఇన్వెస్టిగేష‌న్‌ థ్రిల్ల‌ర్ ఎలెవ‌న్ చిత్రాల‌తో పాటు రానా నాయుడు వెబ్ సిరీస్‌, బాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కేస‌రి2, త‌మిళ చిత్రాలు మామ‌న్‌, డీడీ నెక్స్ట్ లెవ‌ల్ వంటి కొత్త చిత్రాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వ‌స్తున్నాయి. థియేట‌ర్ల‌లో ఈ సినిమాల‌ను మిస్స‌యిన వారు, ఇంటి పట్టునే ఉండి చూసే వారికి ఈ వీక్ స‌రిపోను వినోదం అందించ‌డానికి రెడీగా ఉన్నాయి.

 

 

 

Jio Hotstar

Padakkalam (Malayalam + Multi)

Snow White (English + Hindi) – JioHotstar

The Real Housewives Of Miami: S4 (English) [Series]

Subham (Telugu + Multi )

When No One Sees Us (Spanish)

Under Dogs (English)

 

 

 

 

 

 

Netflix

Train Wreck : The AstroWorld Tragedy (English)

OurTimes (Mexican)

Aniela (Polish) [Series]

CheersToLife (Brazilian)

Titan : The OceanGate Disaster (English)

CocaineAir : Smugglers at 30,000 Ft. (English) [Series]

FlatGirls (Thai)

MasameerJunior (Saudi)

AndTheBreadWinnerIs (Filipino)

Cells At Work (Japanese)

Rana Naidu : Season 2 (Hindi)

A Business Proposal (Indonesian)

Too Hot To Handle: Spain (Spanish) [Series]

The Rookie (English) – Netflix

 

Prime Video

The Amateur (English)

Misericordia (English) Rent

When Fallis Coming (English) Rent

Clown In A Cornfield (English) Rent

Deep Cover (English)

Eleven (Tamil)

Kesari Chapter2 June 13

DD Next Level June 13

Bonjour Tristesse (English) Rent

The Chosen: Last Supper Season 5 (English) [Series]

Final Destination Bloodlines Rent June 17

Zee5

Maaman (Tamil) June 13

Aha Tamil

Eleven (Tamil)

 

 

 

Sony Liv

Alappuzha Gymkhana (Malayalam + Multi)

Tentkotta

Eleven (Tamil)

ETv win

Aa Okkati Adakku (Telugu)

HBO Max

Cleaner (English)

Apple Tv+

EchoValley (English)

Simply South

Eleven (Tamil)

Alappuzha Gymkhana (Malayalam + Multi)

Lionsgate Play

The Prosecutor (Chinese) (Cantonese, Eng, Hi, Ta, Tel)

మ‌రోసారి.. ఫుల్‌గా ఓపెన్ అయిన తెలుగు బ్యూటీ.

మ‌రోసారి.. ఫుల్‌గా ఓపెన్ అయిన తెలుగు బ్యూటీ..

 

 

నేటిధాత్రి:

 

 

 

 

సుప్రీతా నాయుడు సోష‌ల్ మీడియా ఫాలోవ‌ర్స్‌కు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేని ఇన్‌ఫ్లూయెన్స‌ర్‌, న‌టి.

సుప్రీతా నాయుడు (Supritha Bandaru Naidu) సోష‌ల్ మీడియా ఫాలోవ‌ర్స్‌కు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేని ఇన్‌ఫ్లూయెన్స‌ర్‌, న‌టి. ఇప్ప‌టివ‌ర‌కు అధికారికంగా ఒక సినిమా చేయ‌కున్నా బ‌డా హీరోయిన్లను త‌ల‌న్నేలా అందాల‌తో హోయ‌లు బోతూ త‌న ఫ్యాన్స్‌కు నిత్యం త‌నివితీరా ఫుల్ మీల్స్ పెడుతోంది.

 

స‌మ‌యం దొరికితే విదేశాలు, బీచులు, ప‌బ్‌లు తిరుగుతూ అందాల‌ను వ‌డ్డిస్తోంది. తాజాగా త‌ను హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తూ న‌టించిన సినిమా ప్ర‌మోష‌న్‌లో పాల్గొన్న ఆమె నా ఇష్ట ప్ర‌కారమే నా డ్రెస్సింగ్ ఉంటుందంటూ బోల్డ్ కామెంట్లు చేసింది.

 

అది మ‌ర‌కువ‌కు ముందే తాజాగా త‌న ఎద అందాల‌న్నింటినా ఒపెన్‌గా ప్ర‌ద‌ర్శిస్తూ మ‌రోసారి చూసే వారికి క‌నుల వింతు చేసింది.

 

ఇప్పుడు ఈ పొటోలు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. మీరూ ఓ లుక్కేయండి.

యాపిల్ మ్యాక్‌బుక్‎పై రూ.31 వేల తగ్గింపు ఆఫర్..

క్రేజీ డీల్.. యాపిల్ మ్యాక్‌బుక్‎పై రూ.31 వేల తగ్గింపు ఆఫర్..

 

నేటిధాత్రి:

 

 

 

 

 

చాలా రోజుల నుంచి మీరు యాపిల్ MacBook కొనాలని అనుకుంటున్నారా. అయితే మీకు ఇప్పుడు మంచి ఛాన్స్ వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే MacBook Air M1పై ప్రస్తుతం 31 వేల తగ్గింపు ఆఫర్ అందుబాటులో ఉంది.

MacBook Air M1: క్రేజీ డీల్.. యాపిల్ మ్యాక్‌బుక్‎పై రూ.31 వేల తగ్గింపు ఆఫర్..
MacBook Air M1

మీరు అనేక రోజుల నుంచి యాపిల్ మ్యాక్‌బుక్‎ కొనుగోలు చేయాలని చూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఇప్పుడు మీ కలల ల్యాప్‌టాప్‌ను తీసుకునేందుకు మంచి ఛాన్స్ వచ్చింది. Amazonలో MacBook Air M1పై అదిరిపోయే డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ప్రీమియం డిజైన్, శక్తివంతమైన పనితీరు, తక్కువ ధర ఇవన్నీ కూడా ప్రస్తుతం మీకు లభించనున్నాయి. అయితే దీని ఫీచర్లు ఎలా ఉన్నాయి. ఏంటనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

 

ధర తగ్గింపు ఆఫర్..

MacBook Air M1 8GB RAM, 256GB SSD వేరియంట్ ప్రస్తుతం Amazonలో రూ. 58,990కి లభిస్తోంది. అయితే దీని అసలు ధర రూ. 89,900తో పోలిస్తే రూ.31 వేల తగ్గింపుతో లభిస్తుండటం విశేషం. దీంతోపాటు అదనంగా బ్యాంక్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్, ఎక్స్‌చేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

MacBook Air M1 ప్రధాన ఫీచర్లు

ప్రాసెసర్: Apple M1 చిప్ (8-కోర్ CPU, 7-కోర్ GPU)

RAM: 8GB

స్టోరేజ్: 256GB SSD

డిస్‌ప్లే: 13.3-అంగుళాల Retina డిస్‌ప్లే

బ్యాటరీ: 18 గంటల వరకు బ్యాటరీ జీవితం

కెమెరా: 720p FaceTime HD కెమెరా

కనెక్టివిటీ: Wi-Fi 6, Bluetooth 5.0

పోర్ట్స్: 2x Thunderbolt 3 (USB-C)

లాంగ్ బ్యాటరీ లైఫ్: 18 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్

స్లిమ్, లైట్ డిజైన్: 1.29 కిలోల బరువు

macOS: సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ సపోర్ట్

 

సూర్యవంశీ సిక్సుల వర్షం..

సూర్యవంశీ సిక్సుల వర్షం.. ఈ రాక్షసుడ్ని ఆపడం అయ్యే పనికాదు!

 

 

నేటిధాత్రి:

 

 

 

 

 

యువ కెరటం వైభవ్ సూర్యవంశీ రెచ్చిపోయి ఆడుతున్నాడు. ఐపీఎల్-2025 ముగిసినా వైభవ్ అదే ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. సిక్సుల వర్షం కురిపిస్తున్నాడు.

యువ కెరటం వైభవ్ సూర్యవంశీ తగ్గేదేలే అంటూ దూసుకెళ్తున్నాడు. సిక్సుల వర్షం కురిపిస్తున్నాడు. ఐపీఎల్-2025లో ధనాధన్ ఇన్నింగ్స్‌లతో అదరగొట్టిన వైభవ్.. అదే ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. తాజాగా అండర్-19 ఎన్‌సీఏ క్యాంప్‌లో అతడు విశ్వరూపం చూపించాడు. భారీ షాట్లతో బౌలర్లను హడలెత్తించాడీ 14 ఏళ్ల బ్యాటర్. త్వరలో జరిగే ఇంగ్లండ్ టూర్ కోసం సన్నద్ధమవుతోంది భారత అండర్-19 టీమ్. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఈ జట్టు క్యాంప్ నడుస్తోంది. ఇందులో పాల్గొన్న వైభవ్.. అగ్రెసివ్ బ్యాటింగ్‌తో బౌలర్లకు చుక్కలు చూపించాడు.

రోహిత్-కోహ్లీకి అరుదైన గౌరవం.

రోహిత్-కోహ్లీకి అరుదైన గౌరవం.. ఆస్ట్రేలియాను మెచ్చుకోవాల్సిందే!

 

నేటిధాత్రి

 

 

 

 

 

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం దక్కింది. ఈ ఇద్దరి విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియా మంచి నిర్ణయం తీసుకుంది. మరి.. ఆ నిర్ణయం ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఆధునిక క్రికెట్‌పై చెరగని ముద్ర వేశారు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. ఆడిన ప్రతి దేశంలోనూ అదరగొట్టారీ స్టార్లు. టీ20, వన్డే, టెస్ట్ అనే తేడాల్లేకుండా బరిలోకి దిగితే చాలు.. పరుగుల వర్షం కురిపించడమే ధ్యేయంగా ఆడుతూ వచ్చారు. అయితే పొట్టి ప్రపంచ కప్-2024 తర్వాత టీ20లకు గుడ్‌బై చెప్పిన ఈ ద్వయం.. ఇటీవలే టెస్టులకూ రిటైర్‌మెంట్ ప్రకటించారు. ఇకపై వన్డేల్లో మాత్రమే కొనసాగుతామని వెల్లడించారు. దీంతో అభిమానులు తెగ బాధపడుతున్నారు. కనీసం ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడకుండా రిటైర్ అవడం ఏంటని ఫీల్ అవుతున్నారు. సత్కరించే అవకాశం కూడా ఇవ్వరా అని వాపోతున్నారు. ఈ తరుణంలో రోహిత్-కోహ్లీ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా చేస్తున్న పని తెలిసి ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. అసలు సీఏ ఏం చేసిందంటే..

మొదలుపెట్టిన టీమిండియా..

మొదలుపెట్టిన టీమిండియా.. వీడియో చూస్తే ప్యూర్ గూస్‌బంప్స్!

 

నేటిధాత్రి:

 

 

 

 

భారత జట్టు వేట మొదలుపెట్టేసింది. 5 టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లండ్ గడ్డ మీద అడుగుపెట్టిన టీమిండియా కుర్రాళ్లు.. బంతి, బ్యాట్ చేతపట్టి ప్రాక్టీస్ ప్రారంభించారు.

వేట మొదలుపెట్టిన టీమిండియా.. వీడియో చూస్తే ప్యూర్ గూస్‌బంప్స్!

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్.. ఈ ముగ్గురూ లేని భారత టెస్ట్ జట్టును ఊహించడం కష్టమే. గత కొన్నేళ్లుగా టీమిండియాకు అన్నీ తామై నిలిచారీ త్రిమూర్తులు. మన జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించారు. అయితే తక్కువ వ్యవధిలోనే ముగ్గురూ రిటైర్‌మెంట్ ప్రకటించారు. దీంతో ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో భారత్ ఎలా ఆడుతుందో అనే అనుమానాలు నెలకొన్నాయి. ఈ తరుణంలో ఇంగ్లీష్ గడ్డపై అడుగుపెట్టారు టీమిండియా ప్లేయర్లు. కొత్త కెప్టెన్ శుబ్‌మన్ గిల్ నేతృత్వంలోని కుర్రాళ్ల బృందం ఉరిమే ఉత్సాహంతో ప్రాక్టీస్ సెషన్‌ను మొదలుపెట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

 

బెండు తీయడం ఖాయం!

ప్రఖ్యాత లార్డ్స్ స్టేడియంలో గిల్ అండ్ కో ప్రాక్టీస్ చేస్తున్న సందర్భంగా తీసిన వీడియోను బీసీసీఐ అభిమానులతో పంచుకుంది. ఇందులో జట్టు ఆటగాళ్లంతా పరుగులు తీస్తూ చెమటోడ్చుతూ కనిపించారు. రన్నింగ్‌‌తో పాటు ఫుట్‌బాల్ సాధన చేస్తూ దర్శనమిచ్చారు. కెప్టెన్ గిల్‌, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ ఫీల్డింగ్ డ్రిల్స్ చేయడాన్ని వీడియోలో చూడొచ్చు. హెడ్ కోచ్ గౌతం గంభీర్ అటు ఫీల్డింగ్ సెషన్స్‌తో పాటు ఇటు ఫిట్‌నెస్ డ్రిల్స్‌ను కూడా దగ్గరుండి గమనిస్తూ కనిపించాడు.ఇంగ్లండ్ గ్రౌండ్స్‌కు తగ్గట్లు ఫీల్డింగ్‌లో చేసుకోవాల్సిన మార్పులపై కోచ్ టి దిలీప్ కుర్రాళ్లతో చర్చిస్తూ కనిపించాడు. అటు పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్‌తో మాట్లాడుతూ దర్శనమిచ్చాడు. ఇంగ్లండ్ జట్టు బెండు తీసేందుకు లండన్‌లో ల్యాండ్ అయిన భారత బృందం.. ఇలా జోరుగా ప్రాక్టీస్ చేస్తూ తాము వేటాడేందుకు సిద్ధమని చెప్పకనే చెప్పేశారు.

 

ఇంగ్లండ్‌కు బుమ్రా భయం..

ఇంగ్లండ్‌కు బుమ్రా భయం.. ఒక్క వీడియోతో దడ పుట్టిస్తున్నాడు!

 

నేటిధాత్రి:

 

 

 

 

 

 

ఇంగ్లండ్‌కు గుబులు పుట్టిస్తున్నాడు టీమిండియా పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా. అతడి పేరు చెబితేనే ఇంగ్లీష్ బ్యాటర్లు వణుకుతున్నారు. ఎక్కడ తమ బెండు తీస్తాడోనని భయపడుతున్నారు.

 ఇంగ్లండ్‌కు బుమ్రా భయం.. ఒక్క వీడియోతో దడ పుట్టిస్తున్నాడు!

టీమిండియా పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఇంగ్లండ్‌తో 5 టెస్టుల సిరీస్ కోసం లండన్‌కు చేరుకున్న బుమ్రా.. అలా ల్యాండ్ అయ్యాడో లేదో సాధన షురూ చేసేశాడు. ప్రఖ్యాత లార్డ్స్ స్టేడియంలో బుమ్రా పరుగులు తీస్తున్న వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. టీమ్ క్యాంప్‌లో జాయిన్ అయిన స్పీడ్‌గన్.. రన్నింగ్‌తో పాటు బౌలింగ్ డ్రిల్స్ చేస్తూ కనిపించాడు. గ్యాప్‌లో బౌలింగ్ కోచ్‌ మోర్నీ మోర్కెల్‌తో కలసి అతడు మాట్లాడటాన్ని కూడా వీడియోలో చూడొచ్చు. బుమ్రా సాధన చూసి ప్రత్యర్థి బ్యాటర్లు వణుకుతున్నారని తెలుస్తోంది.

 

వణుకుతున్న బ్యాటర్లు!

కోచ్‌తో బుమ్రా సుదీర్ఘంగా చర్చించడం, గ్రౌండ్‌లో రేసుగుర్రంలా పరుగులు తీయడం, ఫుల్‌ ఫిట్‌గా కనిపించడంతో ఇంగ్లండ్ శిబిరంలో కలవరం మొదలైనట్లు తెలుస్తోంది. ఎక్కడ తమ పని ఫినిష్ చేస్తాడోనని ఇంగ్లీష్ బ్యాటర్లు భయపడుతున్నారట. అతడి ఫిట్‌నెస్ చూసి అవాక్కవుతున్నారట. 3 టెస్టులు ఆడితే గొప్ప అనుకుంటే.. ఇప్పుడు 5 టెస్టులు పక్కా ఆడేలా కనిపిస్తున్నాడని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఆతిథ్య జట్టుకు దబిడిదిబిడేనని అంటున్నారు. స్టోక్స్ సేన కాచుకో.. అంటూ సవాల్ విసురుతున్నారు. కాగా, ఇంగ్లండ్ టూర్‌ కోసం ఇటీవల భారత జట్టును ప్రకటించిన సమయంలో బుమ్రా మూడు మ్యాచులు మాత్రమే ఆడే అవకాశం ఉందని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ అన్నాడు. దీంతో అతడి ఫిట్‌నెస్‌పై అనుమానాలు నెలకొన్నాయి. అయితే భారత ట్రెయినింగ్ సెషన్‌లో మాత్రం పేస్ గన్ ఉత్సాహంగా పాల్గొనడం, ఫిట్‌గా కనిపించడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మన టీమ్‌కు తిరుగులేదని అంటున్నారు.

 

నల్లకలువదే ఎర్రకోట.

నల్లకలువదే ఎర్రకోట

 

నేటిధాత్రి:

 

 

 

 

 

ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో కొత్త చాంపియన్‌గా కొకో గాఫ్‌ నిలిచింది. శనివారం ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో 21 ఏళ్ల ఈ అమెరికన్‌.. 6-7 (5-7), 6-2, 6-4తో వరల్డ్‌ నెంబర్‌ 1 ఎరీనా సబలెంక (బెలారస్‌)ను ఓడించి ఎర్రకోటలో…

 

ఇద్దరూ ఇద్దరే.. ఒకరు వరల్డ్‌ నెంబర్‌ వన్‌ సబలెంక, మరొకరు వరల్డ్‌ నెంబర్‌ టూ కొకొ గాఫ్‌. బరిలోకి దిగిన పదిసార్లు కూడా సమాన విజయాలే. గ్రాండ్‌స్లామ్స్‌లోనే కాదు.. క్లే కోర్టుల్లోనూ తలపడిన రెండేసిసార్లూ పైచేయి. అలాంటి వీళ్లు ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లో బరిలోకి దిగితే ఎలా ఉంటుంది? అంచనాలకు తగ్గట్టుగానే ఇద్దరూ నువ్వా.. నేనా? అనే రీతిలో ఆడి అభిమానులను ఉర్రూతలూగించారు. అయితే ఆఖరి పోరాటంలో చివరకు నల్ల కలువ గాఫ్‌కే ఫ్రెంచ్‌ కిరీటం దక్కింది. గెలుపు అవకాశాలను చేజార్చుకున్న సబలెంక రన్నరప్‌తో సరిపెట్టుకుంది.

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో కొత్త చాంపియన్‌గా కొకో గాఫ్‌ నిలిచింది. శనివారం ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో 21 ఏళ్ల ఈ అమెరికన్‌.. 6-7 (5-7), 6-2, 6-4తో వరల్డ్‌ నెంబర్‌ 1 ఎరీనా సబలెంక (బెలారస్‌)ను ఓడించి ఎర్రకోటలో పాగా వేసింది. గాఫ్‌ కెరీర్‌లో ఇదే తొలి ఫ్రెంచ్‌ ఓపెన్‌ కాగా.. ఆమెకిది రెండో గ్రాండ్‌స్లామ్‌. 2023లో యూఎస్‌ ఓపెన్‌ గెలిచింది. అలాగే 2015లో సెరెనా తర్వాత మరో యూఎస్‌ క్రీడాకారిణి ఇక్కడ నెగ్గడం ఇదే మొదటిసారి. అంతేకాకుండా సెరెనా (2002లో) తర్వాత ఫ్రెంచ్‌ ఓపెన్‌ను గెలిచిన యంగెస్ట్‌ అమెరికన్‌గానూ గాఫ్‌ నిలిచింది. ఇక సబలెంక కెరీర్‌లో ఆస్ట్రేలియన్‌, యూఎస్‌ ఓపెన్‌ గెలిచినా ఇప్పటిదాకా ఫ్రెంచ్‌ ఓపెన్‌ నెగ్గలేకపోయింది. ఈ పోరులో సబలెంక 70 అనవసర తప్పిదాలకు పాల్పడి మూల్యం చెల్లించుకుంది. గాఫ్‌ 9 బ్రేక్‌ పాయింట్లు, 3 ఏస్‌లతో చెలరేగింది.

 

హోరాహోరీగా..: తొలి సెట్‌లో సబలెంక శక్తివంతమైన బేస్‌లైన్‌ ఆటతీరుతో పాటు గాఫ్‌ పదునైన సర్వీస్‌ రిటర్న్‌లతో పోరు రంజుగా సాగింది. సుదీర్ఘ ర్యాలీలు, డ్యూస్‌ల కారణంగా ఈ సెట్‌ గంటా 18 నిమిషాలు సాగింది. తొలి పాయింట్‌ గాఫ్‌దే అయినా సబలెంక ప్రత్యర్థి సర్వీస్‌లను బ్రేక్‌ చేస్తూ ఓ దశలో 4-1తో స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. కానీ తర్వాత పుంజుకున్న గాఫ్‌ వరు సగా 3 పాయింట్లతో స్కోరును సమం చేసింది. ఇక్కడి నుంచి కోర్టులో చిరుతల్లా ఇద్దరూ తలపడ్డారు. ఫలితంగా సెట్‌ 6-6తో టైబ్రేక్‌కు వెళ్లింది. ఇందులో సబలెంక ఆరంభంలో వెనుకబడినా పట్టు వదలకుండా ఆడి సెట్‌ను 7-6తో ముగించింది. అయితే కీలక రెండో సెట్‌లో చెలరేగిన గాఫ్‌ 35 నిమిషాల్లోనే 6-2తో గెలిచి పోటీలో నిలిచింది. ఇక నిర్ణాయక సెట్‌ తిరిగి రసవత్తరం గా మారింది.

మొదట గాఫ్‌ బ్రేక్‌ పాయింట్లతో 3-1తో హవా చూపింది. ఈ దశలో సబలెంక ఒత్తిడిని అధిగమిస్తూ గాఫ్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేస్తూ 3-3తో సవాల్‌ విసిరింది. కానీ సబలెంక అనవసర తప్పిదాలను సొమ్ము చేసుకుంటూ గాఫ్‌ రెండు వరుస పాయింట్లు ఖాతాలో వేసుకుంది. అయితే తొమ్మిదో గేమ్‌ను సబలెంక దక్కించుకున్నా.. 5-4 ఆధిక్యంతో గాఫ్‌ చాంపియన్‌షిప్‌ సర్వీస్‌కు దిగింది. ఇందులో సబలెంక పోరాడినా తన బ్యాక్‌ హ్యాండ్‌ విన్నర్‌ను బయటకు కొట్టడంతో.. గాఫ్‌ విజేతగా నిలిచింది.

 

ఘ‌నంగా అక్కినేని అఖిల్ పెళ్లి.

ఘ‌నంగా అక్కినేని అఖిల్ పెళ్లి.. వివాహ వేడుక‌లో సినీ తార‌ల సంద‌డి

నేటిధాత్రి

 

 

 

 

  • అక్కినేని అఖిల్, జైనాబ్ రవ్జీల వివాహం
  • హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘనంగా వేడుక
  • హాజరైన చిరంజీవి, ప్రశాంత్ నీల్ వంటి ప్రముఖులు
  • తెలుగు రాష్ట్రాల సీఎంల‌ను ఆహ్వానించిన నాగార్జున దంపతులు
  • ఈ నెలాఖరులో జోధ్‌పూర్‌లో గ్రాండ్‌గా రిసెప్ష‌న్‌

టాలీవుడ్ యువ కథానాయకుడు అక్కినేని అఖిల్ ఒక ఇంటివాడయ్యారు. తన ప్రియురాలు జైనాబ్ రవ్జీతో కలిసి ఆయన శుక్రవారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వైభవంగా జరిగిన వేడుకలో ఏడడుగులు నడిచారు. గతేడాది నవంబర్ లో వీరి నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న వివాహాల్లో ఇది ఒకటిగా నిలిచింది.

ఈ వివాహ వేడుకకు సినీ పరిశ్రమకు చెందిన పలువురు దిగ్గజాలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్, గ్లోబ‌ల్ స్టార్‌ రామ్‌చ‌ర‌ణ్ దంప‌తులు, ద‌గ్గుబాటి ఫ్యామిలీ ఈ కార్యక్రమానికి విచ్చేసి, వేడుకకు మరింత శోభను చేకూర్చారు. అఖిల్ తండ్రి, అగ్ర నటుడు నాగార్జున అక్కినేని, తల్లి అమల వ్యక్తిగతంగా పలువురు ప్రముఖులను ఈ వేడుకకు ఆహ్వానించారు. తెలుగు రాష్ట్రాల సీఎంలను కూడా నాగార్జున దంపతులు స్వయంగా కలిసి ఆహ్వానించడం గమనార్హం. దీనివల్ల ఈ వివాహానికి సినిమా రంగంలోనే కాకుండా, సామాజికంగా కూడా ఎంతటి ప్రాధాన్యత ఉందో స్పష్టమవుతోంది.

వధువు జైనాబ్ రవ్జీ ప్రతిభావంతురాలైన ఆర్టిస్ట్, పర్ఫ్యూమర్. ఆమె సృష్టించే ఎక్స్‌ప్రెసివ్ అబ్‌స్ట్రాక్ట్ ఆర్ట్‌వర్క్‌కు మంచి పేరుంది. అలాగే, “ఒన్స్ అపాన్ ది స్కిన్” అనే పేరుతో ఆమె నడుపుతున్న ఫ్రాగ్రెన్స్ బ్లాగ్ కూడా ఎంతో ప్రాచుర్యం పొందింది. హైదరాబాద్‌లో జన్మించిన జైనాబ్, ప్రస్తుతం ముంబైలో నివసిస్తున్నారు. ఆమె ఒక ప్రముఖ వ్యాపారవేత్తల కుటుంబానికి చెందినవారు. అంతేకాకుండా ఎం.ఎఫ్. హుస్సేన్ దర్శకత్వం వహించిన “మీనాక్షి: ఏ టేల్ ఆఫ్ త్రీ సిటీస్” చిత్రంలో కూడా జైనాబ్ చిన్న పాత్రలో నటించారు.

ఇక‌, అక్కినేని అభిమానులు ఎంతోకాలంగా ఈ పెళ్లి వేడుక వివరాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా వీరి నిశ్చితార్థం ప్రైవేట్‌గా జరగడం, అంతకుముందు 2017లో అఖిల్ ఫ్యాషన్ డిజైనర్ శ్రియా భూపాల్‌తో నిశ్చితార్థం జరిగి, తర్వాత ఇరు కుటుంబాల అంగీకారంతో రద్దు కావడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ పెళ్లిపై మరింత ఆసక్తి నెలకొంది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం, కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఈ వేడుక అనంతరం, ఈ నెలాఖరులో రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో మరో భారీ వేడుకను నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ వివాహానికి దేశవ్యాప్తంగా మీడియాలో విస్తృత ప్రచారం లభించింది. పలువురు శ్రేయోభిలాషులు నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆశీస్సులు అందిస్తున్నారు.

 

4 గంటలు పని చేసే నటులు కూడా ఉన్నారు.

4 గంటలు పని చేసే నటులు కూడా ఉన్నారు: దీపికా పదుకొణే వివాదంపై రానా వ్యాఖ్యలు

 

 

నేటిధాత్రి:

 

 

 

 

భారతీయ సినిమా పరిశ్రమలో నటీనటుల పని గంటలపై జరుగుతున్న చర్చకు నటుడు రానా దగ్గుబాటి తనదైన శైలిలో స్పందించారు.

నటి దీపికా పదుకొణె…

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ సినిమాకు సంబంధించి పనివేళల విషయంలో విభేదాల కారణంగా ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారనే వార్తల నేపథ్యంలో, రానా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

భారత్ ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశమని, ఇక్కడ నిర్దిష్ట ప్రమాణాలను చేరుకోవడానికి ఎక్కువ గంటలు పనిచేయడం, ఎక్కువ కృషి చేయడం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఒక ఇంటర్వ్యూలో రానా మాట్లాడుతూ, “భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమని మనం అర్థం చేసుకోవాలి.

మనం అభివృద్ధి చెందిన దేశం కాదు.

తలసరి ఆదాయం పరంగా చూస్తే మన ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో బహుశా 186వ స్థానంలో ఉంటుంది” అని పేర్కొన్నారు.

తెలుగు సినిమా పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్‌కు తరలివచ్చిన వైనాన్ని గుర్తుచేస్తూ, “కొన్ని కుటుంబాలు, వందలాది మంది తమ సర్వస్వాన్ని వదులుకుని ఒక నగరం నుంచి మరో నగరానికి వచ్చి ఇక్కడ పరిశ్రమను స్థాపించారు.

నాకు ఇది పనిలా కాకుండా ఒక జీవన విధానంలా అనిపిస్తుంది” అని తెలిపారు.

పరిశ్రమను బట్టి మారే పనివేళలు

పనిగంటలు అనేవి ఒక పరిశ్రమ నుంచి మరో పరిశ్రమకు, అలాగే ప్రాజెక్టును బట్టి కూడా గణనీయంగా మారుతాయని రానా వివరించారు.

“ఉదాహరణకు, మహారాష్ట్రలో 12 గంటల షిఫ్ట్ ఉంటుంది, తెలుగులో 8 గంటల షిఫ్ట్ ఉంటుంది.

కానీ మహారాష్ట్రలో ఉదయం 9 గంటలకు పని మొదలుపెడితే, తెలుగులో మేం ఉదయం 7 గంటలకే మొదలుపెడతాం.

అలాగే, షూటింగ్ జరిగే ప్రదేశం, నగరం, సెట్‌లో చిత్రీకరిస్తున్నారా లేదా స్టూడియోలోనా అనే అంశాలు కూడా పనిగంటలను ప్రభావితం చేస్తాయి.

సెట్‌లో షూట్ చేయడానికి ఎక్కువ సన్నాహాలు అవసరం, అదే స్టూడియో అయితే సౌకర్యవంతంగా ఉంటుంది.

కాబట్టి ఇది ప్రాజెక్టును బట్టి మారుతుంది.

దీన్ని ఒక సాధారణ విషయంగా చూడకూడదు” అని ఆయన స్పష్టం చేశారు.

నటీనటులను ఎక్కువ గంటలు సెట్‌లో ఉండమని బలవంతం చేస్తారా అన్న ప్రశ్నకు రానా సమాధానమిస్తూ, “ఎవరూ ఎవరినీ బలవంతం చేయడం లేదు.

ఇది ఒక ఉద్యోగం.

‘మీరు ఈ షో చేయాల్సిందే’ అని ఎవరూ మిమ్మల్ని నిర్బంధించలేరు.

ఇది పూర్తిగా వ్యక్తిగత ఎంపిక.

జీవితంలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలనే దానిపై ప్రతి ఒక్కరికీ వారి వారి అభిప్రాయాలు ఉంటాయి.

కేవలం 4 గంటలు మాత్రమే షూట్ చేసే నటులు కూడా ఉన్నారు.

అది వారి పనివిధానం” అని తెలిపారు.

దేశ జనాభాలో 70-80 శాతం మంది రోజుకు 100 రూపాయలు సంపాదించే పరిస్థితులున్నాయని, ఈ కోణంలో చూసినప్పుడు మనం ఇంకా ఎంతో దూరం ప్రయాణించాల్సి ఉందని రానా అన్నారు.

గుంటూరులో ఘనంగా ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ వేడుక

గుంటూరులో ఘనంగా ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ వేడుక

 

నేటిధాత్రి

 

 

 

 

* అంగరంగ వైభవంగా జరగనున్న కార్యక్రమం
* ఈవెంట్‌ను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే సౌకర్యం
* భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ‘కన్నప్ప’ చిత్రం
* సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఈ వేడుక

తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ వేడుక గుంటూరులో ప్రారంభమైంది. ఈ వేడుకను ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి మోహన్ బాబు, బ్రహ్మానందం, ప్రభుదేవా, ముఖేశ్ రిషి తదితరులు హాజరయ్యారు. కాసేపట్లో హీరో మంచు విష్ణు కూడా హాజరుకానున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ అతిథి పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

భారీ బడ్జెట్‌తో, ఉన్నత సాంకేతిక విలువలతో రూపుదిద్దుకుంటున్న ‘కన్నప్ప’ చిత్రంపై ప్రేక్షకుల్లో మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా విడుదలకు ముందు ప్రచార కార్యక్రమాల్లో భాగంగా చిత్ర యూనిట్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గుంటూరులో ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమం ద్వారా సినిమా ట్రైలర్ లేదా కొత్త పాటలను విడుదల చేసే అవకాశం ఉంది.

సమంత బోల్డ్ ఫోటోలు వైరల్ మతి పోవాల్సిందే.!

సమంత బోల్డ్ ఫోటోలు వైరల్… మతి పోవాల్సిందే !

 

నేటిధాత్రి:

 

 

 

 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. భర్త విడాకులు ఇచ్చినప్పటికీ ఒంటరి జీవితాన్ని గడుపుతూ తన లైఫ్ ను లీడ్ చేస్తోంది సమంత. హీరోయిన్ గా, అలాగే నిర్మాతగా.. బిజినెస్ మ్యాన్ గా దూసుకు వెళ్లోంది సమంత. దాదాపు 14 సంవత్సరాలుగా టాలీవుడ్ ໐໕໖ (Tollywood Industry) .

అయితే అలాంటి సమంత.. తాజాగా దుబాయ్ లో (Dubai ) పర్యటించారు. ఈ సందర్భంగా దుబాయ్ అందాలను ఆస్వాదిస్తూ సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను పంచుకుంటున్నారు. దాదాపు మూడు రోజుల నుంచి సమంత దుబాయ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడికి ఓ ఖరీదైన హోటల్లో దిగిన సమంత.. ఎడారి దిబ్బలు, నైట్ లైఫ్, ఇలా అన్ని ఎంజాయ్ చేస్తోంది.

ఇక తాజాగా స్విమ్మింగ్ పూల్ లో స్విమ్ చేస్తూ ఓ బోల్డ్ ఫోటోను పంచుకుంది. బ్లాక్ డ్రెస్ లో స్నానం చేస్తూ కనిపించింది. ఈ ఫోటోలను స్వయంగా సమంత పంచుకోవడంతో వైరల్ గా మారింది. ఈ ఫోటోలు చూసిన ఆమె ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఏం అందం రా బాబు.. అంటూ సమంతను పొగుడుతున్నారు. ఇది ఇలా ఉండగా 2021 లో అక్కినేని నాగచైతన్య- సమంత విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.

నితిన్ ‘తమ్ముడు’ నుంచి హీరోయిన్ పోస్టర్ రిలీజ్.

నితిన్ ‘తమ్ముడు’ నుంచి హీరోయిన్ పోస్టర్ రిలీజ్.. ట్రైబల్ యువతిగా ఆకట్టుకుంటున్న లుక్

 

నేటిధాత్రి

 

 

 

 

యంగ్ హీరో నితిన్ (Nithin) రీసెంట్గా ‘రాబిన్ హుడ్’ (Robin Hood) సినిమాతో మనముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీగా బోల్తా కొట్టింది. ప్రస్తుతం నితిన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘తమ్ముడు’ (Thammudu). శ్రీరామ్ వేణు(Sriram Venu) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు (Dil Raju) నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో లయ(Laya), స్వశిక (Swashika), వర్ష బొల్లమ్మ(Varsha Bollamma), సౌరభ్ సన్దేవా (Sourabh Sachdev) కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రానికి అజనీష్ లోక్నాథ్ (Ajaneesh Loknath) సంగీతం అందించారు.

 

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మూవీ టైటిల్తో వస్తున్న ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ చిత్రం జులై 25న గ్రాండ్గా థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా నుంచి ఓ హీరోయిన్ పోస్టర్ను రిలీజ్ చేశారు మూవీ టీమ్. ఈ సినిమాలో ‘కాంతార’ (Kanthara) నటి సప్తమి గౌడ (Sapthami Gouda) కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. నేడు సప్తమి బర్త్డే కావడంతో ఆమెకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కొత్త పోస్టర్ను పంచుకున్నారు. ఈ ఫొటో చూస్తుంటే.. ట్రైబల్ యువతిగా సప్తమి కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.

ఇండస్ట్రీలో పనిగంటలపై చర్చ రానా దగ్గుబాటి కీలకవ్యాఖ్యలు.

ఇండస్ట్రీలో పనిగంటలపై చర్చ.. రానా దగ్గుబాటి కీలకవ్యాఖ్యలు

 

నేటిధాత్రి:

 

 

 

 

ఇటీవల పని గంటలపై జరుగుతున్న చర్చలు చిత్ర పరిశ్రమకు కూడా వ్యాపించాయి. ‘స్పిరిట్’ (Spirit) సినిమా నుంచి దీపికా పదుకొణె (Deepika Padukone) వైదొలగడంతో ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో నటుడు రానా దగ్గుబాటి (Rana Daggubati) తనదైన శైలిలో స్పందించారు. పని సంస్కృతి, ఆర్థిక పరిస్థితులపై చర్చలు అనవసరమని, నిరంతర సాధన, కృషే పని జీవితానికి నిజమైన విలువని అన్నారు. భారత్ ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశమని, అధిక సామర్థ్యం, ఎక్కువ పని గంటలు దేశ అభివృద్ధికి అవసరమని పేర్కొన్నారు.

సినీ పరిశ్రమలో పని గంటలు ప్రాజెక్ట్ను బట్టి మారతాయని రానా వివరించారు. “భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం. తలసరి ఆదాయంలో మన ఆర్థిక వ్యవస్థ 186వ స్థానంలో ఉంది. తెలుగు సినీ పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్కు మారినప్పుడు వందలమంది కుటుంబాలతో వలస వచ్చారు. నా దృష్టిలో అది కేవలం పని కాదు, జీవనశైలి. ప్రతి ప్రాజెక్టు, దానిలో పనిచేసే వ్యక్తులను బట్టి పని గంటలు మారతాయి” అని అన్నారు.

 

మహారాష్ట్రలో 12 గంటల షిఫ్ట్ విధానం, తెలుగు పరిశ్రమలో 8 గంటల షిఫ్ట్ సాధారణమన్నారు. అయితే షూటింగ్ షెడ్యూల్లు లొకేషన్, సెట్, స్టూడియో వంటి అంశాలపై ఆధారపడతాయని రానా వివరించారు. “మహారాష్ట్రలో ఉదయం 9 గంటలకు షూటింగ్ మొదలవగా, తెలుగులో 7 గంటలకే ప్రారంభమవుతుంది. సెట్ సన్నద్ధత, లొకేషన్ ఎంపిక వంటివి సులభమైనవి కావు. దేశంలో 70-80% మంది రోజువారీ సంపాదన వంద రూపాయలే. ఈ విషయాలను సూక్ష్మంగా చూడాలి” అని ఆయన అన్నారు.

నటులు సెట్ లో ఎక్కువ సమయం గడపడానికి బలవంతంగా ఒత్తిడి ఉంటుందనే వాదనపై రానా స్పందిస్తూ.. “ఎవరూ బలవంతంగా ఉండమని చెప్పరు. సినిమా ఒక వృత్తి. ఒత్తిడి చేయడం జరగదు. ఇందులో పనిచేయాలనుకుంటే చేయొచ్చు. అది వ్యక్తిగత ఎంపిక. కొంతమంది నటులు 4 గంటలు మాత్రమే పనిచేస్తారు, అది వారి విధానం” అని పేర్కొన్నారు.

కొరియన్ స్టార్లా ఉన్నావంటూ నెటిజన్ల కామెంట్స్.

*40 ఇయర్స్ ఏజ్లో ఆ విషయంలో గట్టి పోటీ ఇస్తున్న పవన్ కళ్యాణ్ బ్యూటీ.. కొరియన్ స్టార్లా ఉన్నావంటూ నెటిజన్ల
కామెంట్స్*

నేటిధాత్రి

 

 

 

అలనాటి స్టార్ హీరోయిన్ శ్రియ శరణ్ (Shriya Saran) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. కెరీర్ స్టార్టింగ్లో ట్రెడిషనల్గా ఆకట్టుకున్న ఈ భామ.. ‘మల్లన్న'(Mallanna) సినిమాతో బోల్డ్ రెచ్చిపోయింది. దీంతో ఈ అమ్మడు పై నెగిటివిటీ రావడమే కాకుండా ట్రోలింగ్ కూడా పెద్ద ఎత్తున చేశారు. అంతేకాకుండా అప్పటి నుంచి అవకాశాలు రావడం చాలా వరకు మానేశాయి. దీంతో చేసేది ఏమి లేక ఇండస్ట్రీకి దూరం అయింది.

ఇక కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడే ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రజెంట్ ఈ ముద్దుగుమ్మకు ఒక పాప ఉంది. నిత్యం తన ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోలు, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. కాగా ఈ బ్యూటీ ప్రస్తుతం రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉంది. ఇదిలా ఉంటే.. నిత్యం సామాజిక మాధ్యమాల్లో తన గ్లామర్తో పిచ్చేక్కిస్తుంది ఈ అమ్మడు. 42 సంవత్సరాల్లోనూ యంగ్ హీరోయిన్స్కి అందం విషయంలో మంచి ఫిజిక్ను మొయిన్ టైన్ చేస్తూ గట్టి పోటీ ఇస్తుంది.

 

ఈ క్రమంలో శ్రియ శరన్ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా శ్రియ తన ఇన్స్టా వేదికగా కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అందులో సిల్వర్ కలర్ ట్రెండింగ్ డ్రెస్లో మెస్మరైజ్ చేసింది. హాట్ హాట్ స్టిల్స్తో నెట్టింట రచ్చ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారగా.. నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కొరియన్ స్టార్లాఉన్నావని, బ్యూటిఫుల్, సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

error: Content is protected !!
Exit mobile version