యశ్ రాజ్ ఫిలిమ్స్, నెట్ ఫ్లిక్స్ సంయుక్త నిర్మాణంలో రూపుదిద్దుకున్న వెబ్ సీరిస్ ‘మండల మర్డర్స్’. ఇది జులై 25 నుండి స్ట్రీమింగ్ కాబోతోంది.
ది రైల్వే మ్యాన్’ (The Railway Man) వెబ్ సీరిస్ కు మంచి స్పందన లభించడంతో ఇప్పుడు యశ్ రాజ్ ఫిలిమ్స్ (Yash Raj Films), నైట్ ఫ్లిక్స్ (Netfilx) భాగస్వామ్యంలో మరో వెబ్ సీరిస్ రూపుదిద్దుకుంది.
అదే ‘మండల మర్డర్స్’ (Mandala Murders). వాణీ కపూర్ (Vani Kapoor), సుర్వీన్ చావ్లా ప్రధాన పాత్రలు పోషించిన ఈ వెబ్ సీరిస్ ను గోపీపుత్రన్, మనన్ రావత్ డైరెక్ట్ చేశారు.
వాణీ కపూర్, సుర్వీన్ చావ్లా ఇద్దరూ తెలుగు వారికి సుపరిచితులే. వాణీ కపూర్ హీరో నాని (Nani) సరసన ‘ఆహా కళ్యాణం’లో నటించగా, సుర్వీన్ చావ్లా తన కెరీర్ ప్రారంభంలో ‘రాజు మహరాజు’ చిత్రంలో హీరోయిన్ గా చేసింది.
తాజాగా ఈ డార్క్ మిస్టరీ థ్రిల్లరీ స్ట్రీమింగ్ డేట్ ను ప్రకటించారు. జులై 25 నుండి ఈ వెబ్ సీరిస్ నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం కాబోతోంది.
‘మండల మర్డర్స్’ వెబ్ సీరిస్ లో చరణ్ దాస్ పూర్ పట్టణంలో ఆచారాల పేరుతో జరిగే హత్యలు, వాటి వెనుక ఉన్న రహస్యాలు, చీకటి కోణాలకు సంబంధించిన సంఘటనలు ఉండబోతున్నాయి.
ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఆ పట్టణం హత్యలతో అట్టుడికిపోతుంది.
ఈ రహస్యాన్ని ఛేదించే డిటెక్టివ్ రియా పాత్రను గ్లామర్ క్వీన్ వాణీ కపూర్ పోషించింది. ఇతర కీలక పాత్రలను వైభవ్ రాజ్ గుప్తా, సామ్మి జోనస్ హెనీ, జమీల్ ఖాన్, శ్రియా పిల్గాన్కర్ పోషించారు.
Chevireddy Custody: లిక్కర్ స్కామ్‌లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. నేటి నుంచి మూడు రోజుల పాటు చెవిరెడ్డిని సిట్ విచారించనుంది.
విజయవాడ, జులై 1: ఏపీ మద్యం కుంభకోణం కేసులో (AP Liquor Scam) మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (Former MLA Chevireddy Bhaskar Reddy), వెంకటేష్ నాయుడులను సిట్ అధికారులు (SIT Officials) అదుపులోకి తీసుకున్నారు. నేటి నుంచి మూడు రోజుల పాటు చెవిరెడ్డిని విచారించేందుకు ఏసీబీ కోర్టు నిన్న (సోమవారం) ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈరోజు ఉదయమే చెవిరెడ్డితో పాటు వెంకటేష్ నాయుడును కూడా సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకుని సిట్ కార్యాలయానికి తరలించారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు విచారించేందుకు సిట్‌కు కోర్టు అనుమతించింది.అయితే కస్టడీలోకి తీసుకునే సమయంలో మరోసారి జైలు వద్ద చెవిరెడ్డి హల్‌చల్ చేశారు. సిట్ కార్యాలయానికి తరలించే సమయంలో ‘నా పై తప్పుడు కేసు పెట్టారంటూ’ అరుస్తూ వచ్చారు. ఎవ్వరినీ వదిలేది లేదంటూ హెచ్చరిస్తూ చెవిరెడ్డి పోలీసు జీపు ఎక్కారు. లిక్కర్ స్కాంలో చెవిరెడ్డి ఏ 38గా ఉండగా, వెంకటేష్ నాయుడు ఏ 34గా ఉన్నారు. ఐదు రోజుల పాటు చెవిరెడ్డిని కస్టడీకి ఇవ్వాలని సిట్ కోరినప్పటికీ కేవలం మూడు రోజుల పాటు కస్టడీకి మాత్రమే అనుమతి ఇచ్చింది కోర్టు. అలాగే జైలులోని దేవాలయానికి వెళ్లేందుకు చెవిరెడ్డికి పది నిమిషాల పాటు అనుమతి ఇచ్చింది. కానీ బయట ఆహారం పంపాలన్న మాజీ ఎమ్మెల్యే అభ్యర్థనను మాత్రం న్యాయస్థానం తోసిపుచ్చింది.
ప్లేయింగ్ ఎలెవన్‌తో షాక్ ఇచ్చిన ఇంగ్లండ్ ఇలా చేశారేంటి…
రెండో టెస్ట్ కోసం ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించింది ఇంగ్లండ్. అయితే అనూహ్య రీతిలో ఒక ప్లేయర్‌ను పక్కనపెట్టేసింది. తుది జట్టు ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
లీడ్స్ టెస్ట్‌లో విజయంతో ఫుల్ ఖుషీగా ఉంది ఇంగ్లండ్. టీమిండియాను 5 వికెట్ల తేడాతో ఓడించడంతో స్టోక్స్ సేన కాన్ఫిడెన్స్ మరింత పెరిగింది. ఇదే జోరులో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగే రెండో టెస్ట్‌లో కూడా గెలుపుబావుటా ఎగురవేయాలని చూస్తోంది ఆతిథ్య జట్టు.
ఈ క్రమంలోనే ప్లేయింగ్ ఎలెవన్‌ను కూడా ప్రకటించింది. అయితే అనూహ్యంగా ఓ స్టార్ పేసర్‌ను పక్కనబెట్టేసింది.
అతడ్ని తీసుకుంటారంటూ బాగా ప్రచారం జరిగినా తుది జట్టులో మాత్రం అవకాశం కల్పించలేదు.
అతడు ఎవరనేది ఇప్పుడు చూద్
ఎందుకు తీసుకోలేదు?
తొలి టెస్టులో ఆడిన జట్టునే ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌కూ యథావిధిగా కొనసాగించింది ఇంగ్లండ్. ఓపెనర్లుగా జాక్ క్రాలే, బెన్ డకెట్ బరిలోకి దిగుతారు. ఆ తర్వాత ఓలీ పోప్, జో రూట్ ఆడతారు.
హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జేమీ స్మిత్ మిడిలార్డర్ బాధ్యతలు పంచుకుంటారు. క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్, జోష్ టంగ్ పేస్ బాధ్యతలు తీసుకుంటారు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా షోయబ్ బషీర్ బరిలోకి దిగుతాడు.
అయితే అంతా బాగానే ఉన్నా పేస్ సెన్సేషన్ జోఫ్రా ఆర్చర్‌ను తుది జట్టులోకి తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. కౌంటీల్లో అదరగొట్టిన ఆర్చర్.. ఫామ్, ఫిట్‌నెస్ రెండూ నిరూపించుకున్నాడు.
దీంతో అతడ్ని స్క్వాడ్‌లోకి తీసుకున్నారు. కానీ ఈ మ్యాచ్ ప్లేయింగ్ ఎలెవన్‌లో మాత్రం అవకాశం కల్పించలేదు.
ఆర్చర్ విషయంలో మరికొంత కాలం వేచి ఉండాలని పూర్తి ఫిట్‌నెస్ సాధించాకే ఆడించాలనే ఆలోచనల్లో ఇంగ్లండ్ టీమ్ మేనేజ్‌మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది.
-బిజేపి రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్ర రావు ఎదిగేదాక.
-సనాతన ధర్మం సాక్షిగా..ఆర్‌ఎస్‌ఎస్ వాదిగా
-దేశం కోసం, ధర్మం కోసం, కట్టర్ హిందూ అనే ముద్ర దాకా…
-కమ్యూనిజానికి వ్యతిరేకంగా.. బిజేపికి అనుకూలంగా.
-మానవత్వానికి బాసటగా..పార్టీకి న్యాయ సహాయకుడిగా
-పదవులకు కోసం కాకుండా.. పార్టీ కోసం పనిచేసిన నాయకుడుగా
-విద్యార్థి ఉద్యమాలు, ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాలు, రాజకీయ ప్రస్థానం దాకా
-పార్టీకి అలుపెరగని సేవలందిస్తున్న నాయకుడు ఎన్. రామంచంద్రరావు.
-‘‘నేటిధాత్రి’’ గత ఎడాది కాలంగా అనేక సార్లు చెప్పింది.
-రామచంద్రరావుకే బిజేపి అధ్యక్ష పదవి అని రాసింది.
-ఇప్పుడు అదే నిజమైంది. రామచంద్ర రావు కు గౌరవం దక్కింది.
జీవితాంతం నమ్మినసిద్దాంతం కోసం రాజకీయాలు చేసే వారు అతికొద్ది నాయకుల్లో ఎన్. రామచంద్రరావు ఒకరు. ఆయన చేసిన ఉద్యమాలు, త్యాగాలు చాలా గొప్పవి. తెలంగాణలో బిజేపి ఉనికి కోసం, ప్రస్తానం కోసం ఆయన పడిన శ్రమ ఈ తరానికి తెలియకపోవచ్చు. కాని బిజేపి జెండా రెపరెపలాడాలని కలలు గని కష్టించిన అతి కొద్ది మంది నాయకుల్లో రామచంద్రరావు ముందువరసలోవుంటారు. సహజంగా పార్టీ బలపడిన తర్వాత పాతతరం నేతలు కాస్త కనుమరుగు కావడం సహజం. కానీ రామచంద్రరావు సుమారు నలభై ఏళ్లుగా బిజేపికి సేవ చేస్తూనేవున్నారు. విద్యార్ధిరాజకీయాలలో అఖిలబారత విద్యార్ధి పరిషత్‌ను బలంగా విద్యార్ధి సమాజంలోకి తీసుకుపోవడంలో రామచంద్రరావు పాత్ర ఎంతో గొప్పది. నిజానికి ఆయన ఎప్పుడో పెద్ద నాయకుడు కావాలి. ఎందుకంటే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్ధి నాయకులుగా పేరున్న వాళ్లెంతో మంది నాయకులయ్యారు. కాని రామచంద్రరావు పార్టీ కోసం పనిచేస్తూ వచ్చారు. పార్టీని జాతీయ స్ధాయిలో నిలబెట్టేందుకు కృషిచేశారు. ఒకప్పుడు తెలంగాణలో బిజేపి జెండా పట్టుకునేవారు లేరు. కొద్ది మంది మాత్రమే ఆర్‌ఎస్‌ఎస్ బావాలకు ఆకర్షితులై, దేశం కోసం, ధర్మం కోసం పనిచేసేవారు. అయితే ప్రజల్లో స్పందన కనిపించకపోయినా, ఎప్పటికైనా సమాజంలో మార్పు వస్తుందని రామచంద్రరావు నమ్మారు. అది రెండు దశాబ్ధాలుగా నిజమౌతోంది. అయినా ఏనాడు పార్టీలో తనకు ఈ పదవి కావాలని, ఆ పదవి కావాలని కోరుకున్నది లేదు. ఒకప్పుడు హైదరాబాద్ నగర అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టాలంటే కూడా నాయకులు ముందుకు వచ్చే పరిస్ధితి లేని సమయంలో అండగా వున్న నాయకుడు రామచంద్రరావు. నగరం నుంచి పార్టీని జిల్లాలు, నియోజకవర్గాలు, మండలాల దాకా పెరిగేందుకు కృషి చేసిన నాయకుడు రామచంద్రరావు. పార్టీ పిలిచి పదువులు ఇవ్వడం తప్ప, తనకు పదవులు కావాలని ఏనాడు కోరలేదు. ఇక బిజేపికి లీగల్ సెల్ బాద్యుడిగా ఆయన చేసిన సేవలు సామాన్యమైనవి కాదు. పార్టీ కోసం, ఆయన అనేక త్యాగాలు చేశారు. తెలంగాణలోనే కాదు, ఉమ్మడి రాష్ట్రంలో బిజేపి నాయకులకు ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా వారికి న్యాయపరమైన సేవలు అందించిన ఏకైక నాయకుడు రామచంద్రరావు. ఎంతటి క్లిష్టమైన కేసులైనా అవలీలగా గెలిచి, పార్టీ నాయకులను శిక్షలను తప్పించి, పార్టీకి సేవ చేశారు. బిజేపి నాయకులు, ఆర్‌ఎస్‌ఎస్ వాదులకు ఉచిత న్యాయ సేవలందించారు. అందుకే ఆయన వెనుకబడి పోయారని కూడా ఆయన సన్నిహితులు అంటుంటారు. అయితే ఈసారి ఎలాగైనా రామచంద్రరావు తెలంగాణ అద్యక్షుడు అవుతారని నేటి ధాత్రి ఏడాది కాలంగా చెబుతోంది. గత ఆరు నెలల కాలంగా ఎంత విసృతమైన బిజేపి అద్యక్ష పదవిపై రకరకాల చర్చలు జరుతున్నా బిజేపి అద్యక్ష ఎంపిక సమయం కూడా ఖచ్చితంగాచెప్పిన ఏకైక పత్రిక నేటిధాత్రి. అదిగో బిజేపి అద్యక్షుడు వస్తున్నాడు. ఇదిగో వస్తున్నాడని వార్త పత్రికలు, మీడియా సంస్ధలు విపరీతమైన ప్రచారం చేస్తున్న సమయంలో బిజేపి ఆలోచనలు, అడుగులు పక్కాగా చెప్పిన ఏకైక పత్రిక నేటిధాత్రి. అంతే కాదు రకరకాల నాయకులు పేరు తెరమీదకు తెచ్చి గందరగోళం సృష్టించిన మీడియాకుకూడా రామచంద్రరావుకే ఈసారి అవకాశం అని చెప్పిన ఏకైక మీడియా నేటిదాత్రి. ఇప్పుడు అదే నిజమైంది.ఎందుకంటే పార్టీ కేంద్ర విభాగం ఆలోచనలు ఎప్పటికిప్పుడు నేటిధాత్రి పసిగడుతూ చెబుతూనే వుంది. ఈసారి ఆర్‌ఎస్‌ఎస్ వాదికే బిజేపి అద్యక్ష పదవి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే బిజేపి బలపడక ముందు ఇతర పార్టీల నుంచి రావాలంటే నాయకులు ఒకటికి రెండు సార్లు ఆలోచించేవారు. గతంలో బిజేపి కేంద్రంలో అదికారంలో వున్నప్పటికీ బిజేపిలో చేరడానికి ముందుకొచ్చేవారు కాదు. కాని ఎప్పుడైతే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధాని అయ్యారో అప్పటి నుంచి బిజేపి దేశ వ్యాప్తమైంది. అప్పటి నుంచి ఇతర పార్టీలలో స్ధానం లేదనుకున్నవాళ్లు బిజేపిలో చేరుతూ వచ్చారు. కొన్ని కటువుగా అనిపించినా సరే నిజాలు చెప్పుకోవాలి. ఈ మధ్య కాలంలో బిజేపిలో చేరిన వారు ఎవరూ బిజేపి సిద్దాంతాలకు ఆకర్షితులై చేరిన వారు కాదు. తమ రాజకీయ ప్రాబల్యం కోసం, పరపతి కోసం , రాజకీయ పదువుల కోసం, ఎన్నికల్లో సీట్ల కోసం చేరిన వారే ఎక్కువ. రాజకీయంగా ఇతర పార్టీలలో ఆశ్రయం దొరకని వారు కూడా చాల మంది బిజేపి గొడుకు కిందికు చేరారు. ఆ తర్వాత తమదే పెత్తనం అని కలలుగన్నవారున్నారు. బిజేపిపార్టీ వల్ల తమ రాజకీయ భవిష్యత్తుకు దారి దొరికిందన్న ఆలోచన లేకుండా తమ వల్లే బిజేపి ఎదిగిందని అనుకుంటున్న వారు కూడా తెలంగానలో చాలా మంది వున్నారు. అలాంటి నాయకులు ఈసారి పగటి కలలు కంటూ వచ్చారు. పార్టీని ఏలుదామనుకున్నారు. కాని అన్ని రాజకీయ పార్టీలు వేరు. బిజేపి వేరు. ఎందుకంటే దివంగత వాజ్‌పాయ్ ప్రధానిగా వున్నప్పుడు , తమిళనాడుకుచెందిన అప్పటి ముఖ్యమంత్రి జయలలిత కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నది. ఆ సమయంలో ఒక్క ఓటుతో బిజేపి కేంద్ర ప్రభుత్వం పడిపోయింది. నిజానికి ఆనాడు వాజ్‌పాయ్ తన పదవిని నిలుపుకోవాలంటే ఏ ఒక్క ఎంపిని మద్దతు కావాలని కోరినా సరిపోయేది. కాని ధర్మంగా పాలన చేయాలనుకున్నప్పుడు ప్రజల తీర్పుతో మళ్లీ వస్తా అని చెప్పారు. మళ్లీ బిజేపిని గెలిపించి వాజ్‌పాయ్ ప్రధాని అయ్యారు. అంతటి అంకితభావం ఒక్క బిజేపిలోనే చూస్తారు. అలాంటి పార్టీలో అవకాశవాదులకు, వలసవాదులకు పార్టీపరమైన పదవులు అప్పగించొద్దని ఈసారి బిజేపి కేంద్ర పెద్దలు ఆలోచించారు. జీవితాంతం పార్టీ కోసం త్యాగం చేసిన, కృషి చేసిన ఎన్. రామచంద్రరావును సేవలను గుర్తించారు. బిజేపి ఉనికి కోసం ఆరాపడుతున్న సమయం నుంచి, బిజేపి బలపడి దేశాన్ని ఏలుతున్న రోజుల దాకా పార్టీ కోసం పనిచేసిన రామచంద్రరావుకు గుర్తింపు దక్కడమంటే ఆయనకు పార్టీ ఇచ్చిన గౌరవం అని చెప్పాలి. నిన్నగాక మొన్న చేరిన వారు , పార్టీ చలవతో పదవులు పొందిన వారు పోటీలు పడడం విడ్డూరం. అంతే కాదు బిజేపి అద్యక్షపదవికి పోటీ పడుతున్నట్లు నిత్యం ప్రచారం చేసుకున్నవారెవరూ అసలైన బిజేపి నాయకులు కాదు. సనాతన ధర్మం గొప్పదనం తెలిసిన వారు కాదు. ఆర్‌ఎస్‌ఎస్ సిద్దాంతాలను మోసిన వారు కాదు. కేవలం రాజకీయ భవితవ్యం కోసం వచ్చినవారే. అందువల్ల తెలంగాణలోని నిబద్దులైన బిజేపి నాయకులు ఈసారి ఎలాగైనా బిజేపి సిద్దాంతాలను నరనరాన జీర్ణించుకున్న వారికే ఇవ్వాలని కోరుకున్నది. కేంద్ర పార్టీ అదే చేసింది. అయితే రామచంద్రరావు ఎంపికపై రకరకాల వార్తలు ప్రచారం చేస్తున్నారు. వారికి పదవి దక్కలేదన్న అక్కసును వెళ్లగక్కుతున్నారు.
`ప్రజా రాజ్యం జెండా పీకేద్దామా? అని వార్త వచ్చినప్పుడు ఏం చేశారో పవన్‌కు గుర్తు లేదా?
`దక్కన్ క్రానికల్ పేపర్ కార్యాలయం మీద పవన్ దాడి చేయలేదా!
`ఇటీవల సాక్షి కార్యాలయాల మీద ఏపీలో దాడి జరగలేదా!
`ఏపీలో రాజకీయాలు చేస్తారు.
`ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజా ప్రతినిధులౌతారు.
`సాయంత్రం హైదరాబాద్ చేరుకుంటే గాని నిద్రపోలేరు.
`ఏపీ ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసుకుంటూ నిత్యం అమరావతి, హైదరాబాద్‌కు చక్కర్లు కొడతారు.
`ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వంచించి, పాలన గాలికొదిలేస్తారు.
`ఇది ఏపీ మీడియాకు కనిపించడం లేదా!
`ఏపీలో ఏం జరిగినా వార్త కాదు.
`తెలంగాణలో జరిగే విచారణలను వార్తలు చేసి విషం చిమ్ముతారా?
`కాళేశ్వరం మీద విషం కక్కుతారా?
`పోలవరం స్పిల్ వే కొట్టుకుపోయింది వార్త కాదా?
`కాళేశ్వరం మొదలైనప్పుడు ప్రారంభమైన పోలవరం ఎందుకు పూర్తి కాలేదని ఏపి. మీడియాకు అవసరం లేదా?
`విశాఖలో మంచి నీటి ఎద్దడి కనిపించడం లేదా.
హైదరాబాద్,నేటిధాత్రి:
మీడియాకు కొన్ని హద్దులుంటాయి. ప్రమాణాలుంటాయి. మీడియా అయినంత మాత్రాన రాజ్యాంగంలో ప్రత్యేకమైన ఆర్టికల్స్ ఏమీ వుండవు. వ్యక్తి స్వేచ్చ, భావ ప్రకటనా స్వేచ్చ 19(1)ప్రకారమే హక్కులంటాయి. తప్ప మీడియా అనే దానికి ఎలాంటి ప్రత్యేక వెలుసులుబాటు లేదు. ఈ విషయం తెలియని అల్పులు కొందరు మీడియా స్వేచ్ఛ అనేది వుందని భ్రమ పడుతుంటారు. అందులోనూ ఎలక్రానిక్ మీడియా అనే దానికి ఎలాంటి గుర్తింపులేదు. సమచార శాఖ ఎలక్రానిక్ మీడియాను గుర్తించింది లేదు. న్యూస్ చానల్స్ అయినా అవి వినోదాత్మక ఛానల్స్‌లో భాగం మాత్రమే. ఆ సంగతి తెలిసి కూడా లేని పోని వార్తలువండి వార్చడమే కాకుండా, రాజకీయ నాయకుల వ్యక్తిగత జీవితాలలో తొంగి చూస్తామంటే సమాజం ఊరుకోరు. ఆ రాజకీయ పార్టీలు, నాయకులు వదిలిపెట్టరు. ముఖ్యంగా తెలంగాణలో జరుగుతున్న మీడియా విశృంకల పోకడలో రెండురకాల విషయాలు ఆధారపడి వున్నాయి. తెలంగాణను అస్ధిరపర్చాలన్న కుట్ర కోణం దాగి వుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది కొన్ని రాజకీయ పార్టీలకు, నాయకులకు, మీడియా సంస్ధలకు సుతారం ఇష్టం లేదు. ఎప్పటికైనా సరే తెలంగాణ విఫల రాష్ట్రం చేయాలన్న కుట్రను ఆనాటి నుంచి చేస్తూనే వున్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా అనేక రకాలుగా అడ్డుకునే ప్రయత్నం చేసింది. తెలంగాణ సమాజం మొత్తం ఏకం కావడంతో తప్పని పరిస్ధితుల్లో మద్దతు తెలుపకపోయినా, సైలెంటుగా వున్నారు. తెలంగాణలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం వున్నంత కాలం ఏపి మూలాలున్న మీడియా సంస్దలు రంకెలు వేయలేదు. 2018 ఎన్నికల ముందు వేయాలని ఒకసారి చూశాయి. తెలంగాణలో బిఆర్‌ఎస్ ఓడిపోతుందని ప్రచారం చేశాయి. కాని ఆ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ ఊహించనంత మెజార్టీ సొంతం చేసుకోవడంతో ఎన్నికల సమయంలో కూడా బిఆర్‌ఎస్‌పై వార్తలు రాయడానికి భయపడ్డాయి. కాకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ప్రయత్నం చేశాయి. అందులో కూడా కాంగ్రెస్ మీద ప్రేమతోనో, లేక సిఎం. రేవంత్ రెడ్డికి మద్దతివ్వాలని కాదు. తెలంగాణలో రాజకీయ అస్ధిరత అనేది ఏ దశలోనైనా చూపించడానికి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మేలనుకున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యమెక్కువ. దాంతో సీమాంద్ర మీడియా ఆడిరది, ఆట పాడిరది పాట అవుతుందని అంచనా వేసుకున్నాయి. ఇప్పుడు అదే పనిని మొదలు పెట్టాయి. కాంగ్రెస్‌కు అనుకూలంగా వార్తలు రాయపోయినా, సరే బిఆర్‌ఎస్‌పై లేనిపోని వార్తలు రాస్తూ వస్తున్నారు. అంటే సహజంగా ఏ వ్యక్తికైనా తనను మెచ్చుకోకపోయినా, అవతలి వ్యక్తిని తిడితే సంతోషించడం అనేది మానవసహజం. ఇదే సీమాంద్ర మీడియా పట్టుకున్నది. బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంటు కేటిఆర్ మీద లేనిపోని వార్తలు సృష్టిస్తోంది. విపరీతమైన ధంబ్ నెయిల్స్‌తో రకరకాల స్టోరీలు ప్రసారం చేస్తున్నాయి. చర్చలు సాగిస్తున్నాయి. అది మరీ హద్దులు దాటింది. ఓ వైపు టెలిఫోన్ ట్యాపింగ్‌పై సిట్ విచారణ జరుగుతోంది. అందులో ఏం జరుగుతుందో పూస గుచ్చినట్లు, ప్రజలు నమ్మేలా వార్తలు ప్రసారం చేస్తున్నారు. నిజానికి ఓ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు దానిపై వార్తలు రాయడం తప్పు కాదు. కాని విచారణలో ఏంజరుగుతుందో ప్రసారం చేయడం చట్టపరంగా తప్పు. నిజంగానే విచారణ పూర్తయి, కేటిఆర్ తప్పు చేశాడని తేలితే, ఆ వివరాలు వెలుగులోకి వస్తే వార్తలు వేయడంలో తప్పుండదు. కాని ఆలు లేదు చూలు లేదు కొడుకుపేరు సోమలింగం అన్నట్లు వార్తలు రాయడానికి ఎవరూ స్వాగతించరు. అందుకే నోరుంది కదా? స్టూడియోలో కూర్చొని రంకెలెస్తే కొంకులు పగిలిపోతాయని బిఆర్‌ఎస్ తేల్చి చెప్పింది. తెలంగాణ రాజకీయాల మీద లేనిపోని తప్పుడు కథనాలు ప్రసారం చేస్తే పంగలు పగులుతాయని రుచి చూపించారు. తెలంగాణ బ్రాండ్‌ను దెబ్బతీయాలని చూస్తే తెలంగాణ సమాజమే ఊరుకోదు. మరోసారి తెలంగాణ ఉద్యమ రుచి చూపిస్తారు. అప్పుడు ఈ మాత్రం స్ధానం కూడా లేకుండా చేస్తారు. మీడియా ముసుగులో కొన్ని ఛానళ్లు చేస్తున్న దాడిని తెలంగాణ సమాజం కూడా చూస్తూ ఊరుకోదు. ఎందుకంటే బిఆర్‌ఎస్ అనేది రాజకీయ పార్టీయే కాదు, తెలంగాణ ఉద్యమ పార్టీ. తెలంగాణ సాధించిన పార్టీ. తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ. ఆ పార్టీ నాయకుడు తెలంగాణ సాధనలో ముందున్నాడు. తెలంగాణ సాధించాడు. పదేళ్లపాటు ముఖ్యమంత్రిగా తెలంగాణను తీర్చిదిద్దాడు. ఈ రోజు స్టూడియోలో రెప్పపాటు కరంటు పోకుండా నడుస్తున్నాయంటే కారణం కేసిఆర్. ఇండ్లలో కూడా కరంటు నిరంతరాయం సరఫరా అవుతుందంటే కారణం కేసిఆర్. హైదరాబాద్ ఇంతలా విస్తరించిందంటే కారణం కేసిఆర్. ఈ సంగతి మర్చిపోయి , తెలంగాణ మీద విషం చిమ్మడానికి నాయకుల మీద లేనిపోని బుదర జల్లితే తెలంగాణ సమాజమే సహించదు. తెలంగాణ అభివృద్దిని చూడలేక ఓర్వలేని తనం బాగా పెరిగిపోయింది. ఫోన్ ట్యాపింగ్ విచారణ సమయంలో ఏపి మీడియా వికృత రూపాన్ని చూపిస్తే, తెలంగాణ సమాజం, బిఆర్‌ఎస్ పార్టీ తన అసలైన నిజ స్వరూపం చూపిస్తుంది. ఇప్పటి వరకు సిట్ విచారణ పూర్తి కాలేదు. ఇప్పుడే మొదలైంది. ఎంత కాలం సాగుతుందో తెలియని పరిస్దితి. సిట్ విచారణ పూర్తి కావాలి. అది ప్రభుత్వానికి సమర్పించాలి. ప్రభుత్వం వారిపై చర్యలకు ఉపక్రమించాలి. అందుకు ఇంకా చాలా కాలం వుంది. అయినా ఆ సిట్ ఎలాంటి నివేదిక ఇస్తుందన్నది కూడా ఎవరికీ తెలియదు. కాని ఏపి మీడియాకు మాత్రం తెలుస్తుందా? ఏపి మీడియా అత్యుత్సాహం హద్దులు దాటింది. అయితే ఇక్కడ తెలంగాణ సమాజం గమనించాల్సింది ఏపి మీడియా ఒక్క కేటిఆర్‌నే టార్గెట్ చేయలేదు. అటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇటు ప్రతిపక్ష పార్టీ బిఆర్‌ఎస్ అధినేత, కేసిఆర్, వర్కింగ్ ప్రెసిడెంటు కేటిఆర్‌ను టార్గెట్ చేశారు. ఇది చాల మంది గమనించడం లేదు. ఏక కాలంలో ఏపి మీడియా సంస్ధలు తెలంగాణ రాజకీయాల మీద విషం చిమ్ముతున్నాయి. ఏకంగా సిఎం. రేవంత్‌రెడ్డి మీద ఏబిఎన్ విషపు రాతలు రాస్తోంది. పదేళ్లపాటు జవసత్వాలు లేని, కాంగ్రెస్ పార్టీని బతికించి, నిలబెట్టి అదికారంలోకి తెచ్చిన నాయకుడు రేవంత్‌రెడ్డి. ఆయన పది కాలాల పాటు పదవిలో వుండాలని కోరుకోవాలి. కాని ఆయనపై డిల్లీలో ఏదో జరుగుతుందోన్న అసత్య ప్రచారం విసృతంగా చేస్తున్నారు. రేవంత్‌రెడ్డి చేసిన కష్టాన్ని చూసిన తర్వాతే ఆయనను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సిఎంను చేసింది. అ ంతే కాని ఎవరో చెబితేనో, మీడియాలో వచ్చే వార్తల వల్లనోచేయలేదు. ఆ మాత్రం స్పష్టత అధిష్టానానికి వుంది. కాంగ్రెస్ పార్టీ అదికారంలోకి వచ్చి రెండేళ్లు కూడా కాలేదు. అప్పుడే లుకలుకలు అంటూ వార్తలు రాస్తున్నారు. ఏబిఎన్ కూడా రేవంత్‌రెడ్డిని తప్పించాలని కోరుకుంటున్నట్లుంది. ముందు బిఆర్‌ఎస్ మీద దెబ్బకొట్టాలని ఏపి మీడియా చూసింది. ఇప్పుడు కాంగ్రెస్ మీద కూడా పగపట్టింది. ఆనాడు కాంగ్రెస్‌ను పావుగా వాడుకున్నది. ఇప్పుడు కాంగ్రెస్‌ను దెబ్బతీయాలని చూస్తోంది. ఏం కొంపలు మునిగిపోతున్నాయని సిఎం. రేవంత్‌రెడ్డిని తప్పిస్తారు? తెలంగాణలో ప్రశాంతమైన వాతావరణం వుంది. ఎక్కడా శాంతి బద్రతల సమస్యలేదు. ప్రజల్లో అసంతృప్తిలేదు. ఎక్కడా ప్రజా పోరాటాలు సాగడం లేదు. ఆఖరుకు రైతులు కూడా సంతోషంగా వున్నారు. తప్పుడు వార్తలతో కాంగ్రెస్ పార్టీలో అలజడి సృష్టించాలని ఏపి మీడియా చూస్తోంది. అలాగే కేటిఆర్ మీద కూడా అవాస్తవాలు వండి వార్చుతోంది. కేటిఆర్ మీద తప్పుడు కథనాలు విపరీతంగా ప్రసారం చేస్తున్నాయి. కేటిఆర్ సినిమా వాళ్ల దగ్గర నుంచి మీడియా ఛానళ్ల యాంకర్ల వరకు వదిలిపెట్టలేదన్నట్లు అర్దమొచ్చేలా కథనాలు ప్రసారం చేశారు. అంటే సినిమా హీరోయిన్లంటే మహా న్యూస్‌కు అంత చులకనగా కనిపిస్తున్నారా? పరోక్షంగా వారి క్యారెక్టర్‌ను దెబ్బతీస్తున్నారా? సినిమా హీరోయిన్లు అంత బలహీన మైన వారా? వారికి సమాజంలో వున్న గౌరవం, పేరు , ప్రఖ్యాతులను దెబ్బతీస్తారా? ఇదేనా జర్నలిజం అంటే? సినిమా హీరోయిన్లు అంటే ఎవరు బెదిరిస్తే వారికి లొంగిపోతారా? మీడియాలో పనిచేసే యాంకర్లంటే మహా న్యూస్‌కు అంత చిన్న చూపా? వారంటే అంత చులకనా? అంటే పరోక్షంగా మహా న్యూస్‌లో పనిచేసే యాంకర్లను కూడా వేలెత్తి చూపిస్తున్నట్లు కాదా? వాళ్లు ఎంత కష్టపడితే వార్తలు ప్రసారమౌతున్నాయో చూసుకుంటూ కూడా ఇలాంటి ధంబ్ నెయిల్స్ ఎలా పెడుతున్నారు? వాటిని మళ్లీ మహిళా యాంకర్లతో ఎలా చదవిస్తున్నారు? ఎవరూ అడగరని అహంకారమా? యాంకర్లకు వ్యక్తిత్వం, ఆత్మాభిమానం వుండదని మహా టీవి చెబుతున్నట్లు కాదా? కేటిఆర్ బెదిరిస్తే సినిమా హీరోయిన్లు, యాంకర్లు లొంగిపోతారని చెప్పడం మహా న్యూస్ చేస్తున్న నేరం కాదా? ఇక మహా న్యూస్ మీద బిఆర్‌ఎస్ కార్యకర్తలు దాడి చేస్తే అది ప్రజాస్వామ్యం మీద దాడిగా మారిపోయిందా? మరి ఇటీవల ఏపిలో సాక్షి కార్యాలయాల మీద తెలుగుదేశం శ్రేణులు చేసిన దాడి ప్రజాస్వామ్య విరుద్దం కాదా? ఇలాంటి దాడులు తెలుగుదేశం పార్టీ చేస్తే సంసారమౌతుందా? బిఆర్‌ఎస్ చేస్తే మరొకటి అవుతుందా? ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు సమర్ధనీయమా? గతంలో ప్రజారాజ్యం పార్టీపై జెండా పీకేద్దామా? అని వార్త వచ్చినప్పుడు ఏం చేశారు. పవన్ కళ్యాణ్‌కు గుర్తులేదా? దక్కన్ క్రానికల్ కార్యాలయం ద్వంసం పవన్‌కు మర్చిపోయాడా? అయినా తెలంగాణ రాజకీయాల మీద మీడియా మాట్లాడిరదంటే ఒక అర్దం వుంది. కాని చంద్రబాబు నాయకుడు, పవన్ కళ్యాణ్‌కు ఏం పని. ఈ మధ్య ఏపిలో సాక్షి కార్యాలయాలపై దాడి జరిగితే తెలంగాణ నుంచి ఏ ఒక్కరైనా స్పందించారా? బిఆర్‌ఎస్ ఏ ఒక్క నాయకుడైనా మాట్లాడారా? తెలంగాణ నాయకులు ఎంతో విజ్ఞులు. అందుకే ఆ రాష్ట్ర రాజకీయాలు పట్టించుకోలేదు. ఏపిలోవున్న రెండు పార్టీల ఆలోచనలు వేరు. అందుకే తెలంగాణ రాజకీయాల్లో వేలు పెడుతున్నారు. ఒకనాడు పవన్ కళ్యాన్ 2014 ఎన్నికల సమయంలో మహబూబాబాద్‌లో కేసిఆర్ మీద చేసిన వ్యాఖ్యలు ఆయన గుర్తుంచుకుంటే పరిస్దితి ఎలా వుండేదో ఆలోచించుకోవాలి. వాటిన్నింటినీ మర్చిపోయి పవన్ కళ్యాణ్‌తో సుహృద్భావంగా వున్నారు. గౌరవి ంచారు. ఏకంగా ప్రజా భవన్‌కు పలిపించి కేసిఆర్ మర్యాదలు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులు అయ్యోడివా? నువ్వు అవ్వోడివా? అని పాడిన పాటలే కరక్టు. బిఆర్‌ఎస్ కూడా ఇప్పటికైనా తెలుసుకుంటేనే మేలు. ఎందుకంటే పాముకు నిత్యం పాలు పోసి పెంచినా అది సాదు జంతువు కాదు. విషాన్ని చిమ్మక మానదు. కాటేయక మానదు. అదే కొందరి నైజం.
నగరంలోని 14వ డివిజన్ ఏనుమాముల ముసలమ్మ కుంట ఫేస్ వన్ గ్రామంలో మైసమ్మ తల్లి గుడి స్లాప్ ప్రారంభోత్సవ సందర్భంగా ముసలమ్మ కుంట ఫేస్ వన్ డెవలప్ కమిటీ అధ్యక్షుడు కాశెట్టి కమలాకర్ పిలుపుమేరకు సోషల్ మీడియా రాష్ట్ర మాజీ కోఆర్డినేటర్ అడుప మహేష్ వెళ్లి సందర్శించి వారికి డెవలప్ కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ పులి చేరి రాధాకృష్ణ. సుందరయ్య నగర్ గ్రామ పార్టీ అధ్యక్షుడు. త్రికోవెల శీను. కాలనీలో ఇంకా అభివృద్ధి పనులు ఎక్కువ చేయాలని అన్నారు. డెవలప్మెంట్ ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శి, సహాయ కార్యదర్శిలు, కోశాధికారి, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
*తీర్పు వెల్లడించిన ఆర్ఎస్ఎస్ ఏడీజే కోర్టు న్యాయమూర్తి.
తిరుపతి(నేటి ధాత్రి) జూన్ 30:
ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన ఇద్దరు స్మగ్లర్లకు ఐదేళ్ల జైలు శిక్ష, ఒకొక్కరికి రూ. 6లక్షల చొప్పున జరిమానా విధిస్తూ ఆర్ఎస్ఎస్ ఏడీజే కోర్టు న్యాయమూర్తి నరసింహమూర్తి సోమవారం తీర్పు నిచ్చారు. ఆర్ఎస్ఎఎస్టీఎఫ్ హెడ్, ఎల్. సుబ్బారాయుడు రూపొందించిన ప్రత్యేక కార్యాచరణ మేరకు టాస్క్ ఫోర్సు ఎస్పీ పీ.శ్రీనివాస్ పర్యవేక్షణలో గతంలో నమోదయ్యి, కోర్టులో విచారణ దశలో ఉన్న కేసుల గురించి ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు. పగడ్బందీగా సాక్ష్యాధారాలను నిరూపించి ముద్దాయిలకు శిక్షలు పడే విధంగా ప్రణాళికలు రూపొందించారు.ఇందులో భాగంగా క్రైమ్ నెంబర్, 27/2016 కేసులో ఇద్దరు ముద్దాయిలు అరెస్టయ్యారు. వీరు తిరుపతి, చిత్తూరు జిల్లాలకు చెందిన జె. దామోదరం, ఏ.హరిప్రసాద్ కాగా ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ చంద్రగిరి మండలం, పాండురంగవారి పల్లి ప్రాంతంలో పట్టుబడ్డారు. వీరి నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఇద్దరు స్మగ్లర్లకు ఐదేళ్ల జైలు శిక్ష తో పాటు రూ. 6లక్షల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. తదుపరి కోర్టు ఆదేశాలు మేరకు వీరిని నెల్లూరు సెంట్రల్ జైలులో అప్పగించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లోని శేషాచలం రిజర్వు ఫారెస్టులో అతి విలువైన సహజ సంపద అయిన ఎర్రచందనం చెట్లను నరికి అక్రమ రవాణా చేయడమే కాకుండా, అడవిలోకి అక్రమ ప్రవేశం చేసిన నేరస్తులకు కూడా ఇది ఒక హెచ్చరికగా పరిగణించబడుతుందని టాస్క్ ఫోర్సు అధికారులు తెలిపారు. ముద్దాయిలకు శిక్షలు పడే విధంగా సహకరిస్తున్న కోర్టు సిబ్బందిని అభినందించారు.
తెలంగాణ ఉద్యమకారుల శాంతియుత దీక్షకు మద్దతు ప్రకటించిన 10 సంవత్సరాల క్రితం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి గత ప్రభుత్వము మోసం చేసినది ఉద్యోగాలు ఇవ్వలేదు పెన్షన్ ఇవ్వలేదు గుంట భూమి ఇవ్వలేదు అవసరానికి వాడుకొని మోసం చేసిన ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో న్యాయం జరుగుతుందని ఉద్యమకారులకు తెలియపరచడం జరిగింది. పై విషయం మా ప్రియతమా నాయకులు ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు దృష్టికి తీసుకు వెళ్తామని ఉద్యమకారులకు తెలియపరిచినాము ఉద్యమకారులు కూడా రాబోయే స్థానిక ఎన్నికలలో ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉద్యమకారుల రాష్ట్ర అధికార ప్రతినిధి అయివుద్దీన్ ఉద్యమకారుల భూపాల్ పల్లి జిల్లా అధికార ప్రతినిధి అక్రముద్దీన్ మండల అధ్యక్షులు సట్ల సత్యనారాయణ జనరల్ సెక్రటరీ దేవేందర్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభాకర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు
ఏడాది కాలంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశ్యంతో చేపట్టదలచిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నియోజకవర్గ వ్యాప్తంగా విజయవంతం చేయాలని పలమనేరు శాసన సభ్యులు అమరనాథ రెడ్డి పేర్కొన్నారు. పలమనేరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం సమన్వయ కమిటీ సభ్యులతో అయన సమావేశం నిర్వహించారుఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి చేసుకున్న సందర్బంగా ఇప్పటి వరకు ప్రజలకు చేసిన సంక్షేమం అభివృద్ధి పై గ్రామ స్థాయిలోని ప్రజలకు తెలియజేయడంతో పాటు వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారించ డమే కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ఇందుకోసం (కే ఎస్ ఎస్) కుటుంబ సాధికారిక సభ్యులుగా ఉన్న వారు బాధ్యత తీసుకొని పార్టీ రూపొందించిన ఫార్మట్ ప్రకారం వివరాలను పొందుపరచాల్సి ఉంటుందన్నారు. ప్రజల వద్దకు పాలనను తీసుకెళ్లాలన్నదే ముఖ్యమంత్రి ప్రధాన లక్ష్యం. కాబట్టి పార్టీలకు అతీతంగా అర్హులైన పేదలందరికి సంక్షేమ ఫలాలు తప్పక అందెలా చూడాలన్నారుబూత్ లెవల్ స్థాయిలో కనీసం రోజుకు 50 కుటుంబాలకు తగ్గకుండా ఇంటింటికి కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంటుందని సూచించారు. ఇక ఈ కార్యక్రమం నియోజకవర్గం లోని వి. కోట మండలంలోని కొంగాటం పంచాయతీ నుంచి ఈ నెల 2 న ప్రారంభించి ఏక కాలంలో అన్ని మండలాల్లో విజయవంతంగా సాగేలా చూడాలని కోరారు. అనంతరం కార్యక్రమ కార్యాచరణ పై నాయకులతో ఆయన చర్చించారు. ఈ సమావేశం లో సీనియర్ నాయకులు ఆర్వీ బాలాజీ, విజయ భాస్కర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు రంగనాథ్,కిషోర్ గౌడ, సోమశేఖర్ గౌడ్, ఆనంద,నాగరాజు రెడ్డి, కుట్టి,నాయకులు సుబ్రహ్మణ్యం గౌడ్,రాంబాబు, గిరి, ప్రతాప్, బ్రహ్మయ్య, నాగరాజు, చౌడప్ప, చాంద్ భాషా తదితరులు పాల్గొన్నారు.
◆ మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా౹౹ఎ.చంద్రశేఖర్
జహీరాబాద్ నేటి ధాత్రి:
న్యాలకల్ మండలంలోని ముంగి గ్రామంలో గల శ్రీ శ్రీ శ్రీ. ఆదిలక్ష్మి ఆశ్రమం లో నిర్వహించిన శ్రీ.వారాహి దేవి నవరాత్రి చండి హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలో పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ ఇండస్ట్రియల్ ఛైర్మెన్ తన్వీర్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి,రామలింగారెడ్డి,మాజీ జడ్పీటీసీ భాస్కర్ రెడ్డి, ఏయంసి.వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి ,కేతకి సంగమేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ పాటిల్ ,యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాకేష్ షెట్కార్ ,జిల్లా అధ్యక్షులు నరేశ్ గౌడ్ ,కాంగ్రెస్ నాయకులు హుగ్గేలి. రాములు తదితరులు పాల్గొన్నారు.
శాయంపేట మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల పోరం ఆధ్వర్యంలో శాంతి యుత దీక్ష నిర్వహించారు ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలిపినటువంటి నాయకులు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యు లు (మాజీ జెడ్పిటిసి) ఎన్నం పెళ్లి పాపన్న తెలంగాణకమ్యూ నిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి వంగరి సాంబయ్య సిపిఎం జిల్లా నాయకులు అంకేశ్వరపు ఐలయ్య ఎమ్మార్పీఎస్ నాయ కులు అరికిల దేవయ్య మాజీ వైస్ ఎంపీపీ వంగల నారాయ ణరెడ్డి జె ఎ సి రాష్ట్ర కార్యదర్శి దామర కొండ కొమురయ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జిన్నా ప్రతాప్ సేనారెడ్డి సంఘీభావం తెలి పారు ఈ కార్యక్రమం మండల ఉద్యమకారుల ఫోరం అధ్య క్షులు ఇమ్మడిశెట్టి రవీందర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉద్య మకారుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి పోలేపల్లి శ్రీనివాస్ రెడ్డి హనుమకొండ జిల్లా అధ్యక్షులు పొడి శెట్టి గణేష్ ఉపాధ్యక్షులు గిద్దమారి సురేష్ పల్లెబోయిన సారయ్య గిద్దమారిరామన్న పాల్గొన్నారు హనుమకొండ జిల్లా అధ్య క్షుడు పొడి శెట్టి గణేష్ మాట్లా డుతూ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి వర్యులు ఇనుముల రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని లేని పక్షాన ఈ ఉద్యమాన్ని ఉవ్వె త్తున కొనసాగిస్తామని కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి అడుగు స్థలముజార్ఖండ్ రాష్ట్ర తరహాలో ఇస్తున్నటు వంటి 25 వేల పెన్షన్ ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు ఉద్యమకా రులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి 100 కోట్లతో నిధులు కేటా యింపు,ఇందిరమ్మ ఇండ్లురాజీ వ్ యువ వికాసం పథకంలో 20% ఉద్యమకారులకు కేటాయించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి చల్ల శ్రీనివాస్ రెడ్డి మండల ఉపాధ్యక్షులు ఎండి రఫీ రాజ్ మహమ్మద్ మదర్ సాహెబ్ మండల కోశాధికారి కానుగుల నాగరాజు మండల నాయ కులు మండల సభ్యులు నరసింహరాములు గంట శ్యాంసుందర్ రెడ్డి తుమ్మ ప్రభాకర్ మేకల శ్రీనివాస్ మామునూరి రాజన్న మారపల్లి సదానందం అడప ప్రభాకర్ కోడెపాక బాబు శాయంపేట టౌన్ ప్రెసిడెంట్ రంగు మహేందర్ జోగి రెడ్డి దూదిపాల రాజిరెడ్డి చిందం ప్రభాకర్ అరికెళ్ల వీరయ్య కర్రు ఆదిరెడ్డి జాలిగపు అశోక్ ఎలమంచి సలేందర్ రెడ్డి తుడుం వెంకటేష్ ఎర్ర తిరుప తిరెడ్డి వనం దేవరాజు, నరహ రిశెట్టి రామకృష్ణ ,రాయరాకుల మొగిలి, బాసాని నవీన్, కోడిమల సంతోష్ ఓరుగంటి గోపాల్ రెడ్డి పురాణం రమేష్ పాల్గొన్నారు.
బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే కార్యక్రమం
గ్రీవెన్స్ డే కార్యక్రమంలో 27 ఫిర్యాదులు స్వీకరణ
జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపీఎస్
సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి)
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ మహేష్. బి.గితే ఐపీఎస్., తెలిపారు. ఈరోజు నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి 27 ఫిర్యాదులు స్వీకరించి, ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫోన్ చేసి బాధితుల సమస్యలను చట్టపరంగా త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా, ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతుందని, పోలీస్ అధికారులు, సిబ్బంది పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించి, వినతులు, ఫిర్యాదులు స్వీకరించి, అవసరమైతే క్షేత్ర స్థాయిలో పరిశీలించి చట్ట ప్రకారం బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలన్నారు. తద్వారా ఫిర్యాదుదారునికి పోలీస్ శాఖపై భరోసా, నమ్మకం కలుగుతుందన్నారు. గ్రీవెన్స్ డే లో వచ్చిన ఫిర్యాదులు ఆన్ లైన్ లో పొందుపరుస్తూ ఏ మేరకు పరిష్కారం అయ్యాయో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ప్రజలకు మరింత సమర్ధవంతంగా సేవలందించడం జరుగుతుందని అన్నారు. గ్రీవెన్స్ డే ద్వారా ప్రజలు నేరుగా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడం ద్వారా సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించేలా చూస్తామని ఎస్పీ తెలిపారు.
జులై 7న జరిగే ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జయప్రదం చేయాలి భూపాలపల్లి ఇంచార్జ్ కొలిక పోగు వెంకటేశ్వరరావు మాదిగ.
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:
మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఇన్చార్జీలతో సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇన్చార్జి కొలికపోగు వెంకటేశ్వరావు మాదిగ పాల్గొన్నారు వారు మాట్లాడుతూ భూపాలపల్లి జిల్లాలో అన్ని మండలాల్లో ఇన్చార్జీలు కో ఇన్చార్జిలు గ్రామ కమిటీల నిర్మాణం గద్దెలు త్వరితగతిన పూర్తి చేసి జులై 7న జరిగే ఎమ్మార్పీఎస్ అవిద్భవ దినోత్సవ వేడుకలను జయప్రదం చేయాలని కోరారు ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు జీడి సంపత్ మాదిగ అంతడుపు ల సారయ్య మాదిగ పల్లి శ్రీను మాదిగ బండారు రాజ్ కుమార్ మాదిగ నేర్పటి శ్రీను క్రాంతి బండారు బాబు జీ సమ్మయ్య సారయ్య రాజు తదితరులు పాల్గొన్నారు
పలు బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే జీఎస్సార్.
చిట్యాల, నేటిధాత్రి :
సోమవారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు గారు నియోజకవర్గంలోని చిట్యాల మండలాల్లోని వివిధ గ్రామాలల్లో పర్యటించారు. ఆయా గ్రామాలల్లో ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన పలువురి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు స్థానిక నేతలతో కలిసి పరామర్శించారు. చనిపోయిన వారి చిత్రపటాల వద్ద ఎమ్మెల్యే పూలు వేసి నివాళులర్పించారు. ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలని, మండలంలో. తిరుమలాపూర్ గ్రామంలో కంచర్ల పోషాలు, చిట్యాల మండల కేంద్రంలో చింతకింది రాజమణి, నవాబుపేట గ్రామంలో మహమ్మద్ హకీమ్, కైలాపూర్ గ్రామంలో సకినాల కుమారస్వామి ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు. ఈ పరామర్శ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి జిల్లా అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి మధు వంశీకృష్ణ మాజీ ఎంపీటీసీ దబ్బటఆనిలు యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు అల్లకొండ కుమార్ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఉన్నారు.
ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు…
నేటి ధాత్రి- మహబూబాబాద్-గార్ల:-
కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని,రైతాంగాన్ని,కూలీలను ఆదుకోవడంలో పూర్తి వైఫల్యం చెందాయని అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జడ సత్యనారాయణ,జిల్లా ప్రధాన కార్యదర్శి గుజ్జు దేవేందర్ అన్నారు.సోమవారం అఖిలభారత రైతుకూలీ సంఘం గార్ల మండల కమిటీ సమావేశం మండల అధ్యక్షులు సూత్రపు మనోహర్ అధ్యక్షతన మండల కేంద్రంలోని స్థానిక న్యూడెమోక్రసీ కార్యాలయంలో నిర్వహించారు.ఈ సందర్బంగా జడ సత్యనారాయణ,గుజ్జు దేవేందర్ లు ప్రసంగిస్తూ,ఆదివాసీలను, గిరిజన ప్రాంతాలను అభివృద్ధి పరుస్తామని అధికారంలోకి వచ్చిన కేంద్రం బిజెపి ప్రభుత్వం,రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆసిఫాబాద్,ములుగు,భద్రాది కొత్తగూడెం జిల్లా లో ఉన్న 339 ఆదివాసి గ్రామాలను 49వ జీవో ప్రకారం ఖాళీ చేయటం కోసం ప్రయత్నిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.అనేక దశాబ్దాలుగా ఏజెన్సీ ప్రాంతంలో జీవిస్తున్న ఆదివాసీలను చట్టాల ద్వారా బయటికి పంపడానికి పూనుకోవడం దారుణమని అన్నారు.ఈ మూడు జిల్లాల్లో ఉన్న గ్రామాలను బడా కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి కోరుకుంటున్నాయని అన్నారు.ఇలాంటి తప్పుడు పద్ధతులు మానుకోకుంటే ప్రతిఘటన ఉద్యమం చేయాల్సి వస్తుందని అన్నారు.రాజ్యాంగంలో ఉన్న సెక్యులరిజాన్ని,సమానత్వాన్ని రద్దు పరచాలని చెప్పి ఆర్ఎస్ఎస్ పరివార్ ప్రయత్నిస్తుందని రాజ్యాంగాన్ని రద్దుచేసి మనువాదాన్ని తీసుకురావడం కోసం బిజెపి ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ కోరుకుంటున్నాయని అన్నారు.ఆదివాసీల నివసించే అడవులను అదానీ, అంబానీలకు వేదాంత కంపెనీలకు దారాదత్తం చేయడానికి బిజెపి ప్రభుత్వం పూనుకోవడం శోచనియమని అన్నారు.రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలని,ఎరువులు,పురుగు మందులు కల్తీ లేకుండా నాణ్యమైనవి ఇవ్వాలని కోరారు.ఈ సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శి జి. సకృ,మండల నాయకులు గౌనీ మల్లేష్,పాక వెంకన్న, మాలోతు మాన్య,శ్రీరాములు, నందగిరి శ్రీను, వి. సక్రు, జయరాం,చింతల గురవయ్య తదితరులు పాల్గొన్నారు.
37 మందికి రూ.38 లక్షల లోన్ బీమా చెక్కులు, ఇద్దరికి ప్రమాద బీమా రూ. 20 లక్షలు పంపిణీ
సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని స్వయం సహాయక సంఘాల (ఎస్.హెచ్.జీ) సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం బీమా కల్పిస్తూ ఆర్థికంగా భరోసా కల్పిస్తుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. స్వయం సహాయక సంఘాలు తీసుకున్న రుణాలకు బీమా, సభ్యులకు ప్రమాద బీమా చెక్కులను జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అధికారులతో కలిసి సోమవారం పంపిణీ చేశారు. ముస్తాబాద్ మండలంలో 14 మందికి రూ. 14,96,457, తంగళ్ళపల్లి మండలంలో ఒకరికి రూ. 30 వేలు, గంభీరావుపేట మండలంలో 8 మందికి రూ.7,66,925, వీర్నపల్లి మండలంలో ఇద్దరికి రూ.2,67,434, ఎల్లారెడ్డిపేట మండలంలో 12 మందికి రూ.13,04,133 మొత్తం రూ. 38, 64,949 విలువైన చెక్కులు ఆయా స్వయం సహాయక సంఘాల బాద్యులకు అందజేశారు. ఇద్దరికి ప్రమాద బీమా పంపిణీ అలాగే ముస్తాబాద్ మండలంలోని స్వయం సహాయక సంఘాలకు చెందిన ఇద్దరు సభ్యులు ప్రమాదవశాత్తూ మరణించగా, వారికి నామిని లకు రూ. 10 లక్షల చొప్పున మొత్తం రూ. 20 లక్షల విలువైన చెక్కులు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పంపిణీ చేశారు.కార్యక్రమంలో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్, డీఆర్డీఓ శేషాద్రి, జడ్పీ సీఈవో వినోద్ కుమార్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
నర్సంపేట పాకాల మహిళా బ్యాంక్ 25 లక్షల 50వేల లాభం అర్జించిందని పాకాల మహిళా బ్యాంక్ అధ్యక్షురాలు పెండం రాజేశ్వరి తెలిపారు.శాంతినగర్ లోని మహిళా బ్యాంక్ కార్యాలయంలో 24 వార్షిక మహాసభ ఎంతో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మాక్స్ సొసైటీ అధ్యక్షురాలు పెండెం రాజేశ్వరి మాట్లాడుతూ2024-25 సంవత్సరానికి గాను డిపాజిట్లు రెండు కోట్ల పైగా ఉన్నట్లు తెలిపారు. 2000 సంవత్సరంలో ప్రారంభమైన మహిళ బ్యాంక్ 236 సంఘాలు మరియు బృందాలతో ఆర్థిక అభివృద్ధి దిశలో ముందుకు కొనసాగుతున్నట్లు తెలిపారు. 3000 పైచిలుకుల సభ్యులు గల సంఘంలో పాడి గేదె రుణాలు, వ్యాపార రుణాలతో పాటు ఉచిత కుట్టు శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు రాజేశ్వరి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాక్స్ కోశాధికారి ఇమ్మడి పద్మ, డైరెక్టర్ గొర్రె రాధ, గండు శ్రీదేవి,గాధగోని నిర్మల, రాపాక మాణిక్యం, మండల పద్మ, దేవులపల్లి వాణి,గుడిశాల వనజ, బొమ్మగాని మంజుల, గొడిశాల రజిత ,లీగల్ అడ్వైజర్ పెండెం శివానంద్ సిబ్బంది కీసరి విజయ, పాకాల రంజిత్ తో పాటు సంఘ సభ్యులు పాల్గొన్నారు.
మృతుని కుటుంబానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి పరామర్శ అనారోగ్యంతో మృతి చెందిన లింగమోరి గూడెం మాజీ ఉప సర్పంచ్ శ్రీహరి
ఐనవోలు నేటిధాత్రి:
ఐనవోలు మండలంలోని లింగమొరిగూడెం గ్రామంలో అనారోగ్యంతో మరణించిన మాజీ ఉప సర్పంచ్ బుర్ర శ్రీహరి గౌడ్ కుటుంబ సభ్యులను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. శ్రీహరి గౌడ్ భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ, శ్రీహరి గతంలో బి. ఆర్. ఎస్ పార్టీ కి ఎనలేని సేవ చేశారని భవిష్యత్లో మృతుని కుటుంబానికి అండగా నిలబడతామని మాజీ మంత్రి దయాకర్ రావు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బి. ఆర్. ఎస్ పార్టీ ఐనవోలు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ తక్కలపెల్లి చందర్ రావు జిల్లా నాయకులు మరుపట్ల దేవదాసు ఎస్. కె. జిందా ఎం.డి గ్రామ బి. ఆర్. ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
రాజకీయాలు చేస్తున్న ఉపాధ్యాయుడు అక్రమ డిప్యూటేషన్ తొలగించాలి
ప్రజావాణి లో ఫిర్యాదు చేసిన ఐక్యవేదిక
వనపర్తి నేటిదాత్రి:
వీపనగండ్ల ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాల నుండి డిప్యూటే షన్ ద్వారా వనపర్తి ప్రభుత్వ బాలుర పాఠశాల కు బదిలీ చేయించుకొని వచ్చారని వనపర్తి లో రాజకీయ పార్టీ ల సంబంధాలు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్రజావాణిలా జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభికి ఫిర్యాదు చేశామని జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్ తెలిపారు వనపర్తికి ఆ ఉపాధ్యాయుని వద్దని ప్రజలు చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు వెంటనే కలెక్టర్ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి ఎమ్మెల్యే మెగారెడ్డి స్పందించి ఉపాధ్యాయుని పై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ సిపిఎం నాయకులు బాల్ రెడ్డి మాట్లాడుతూ, విద్యాశాఖ అధికారులు నిబంధనలను తుంగలో తొక్కి వీపనగండ్ల ప్రభుత్వ పాఠశాలలో ఉన్న ఇంగ్లీష్ టీచర్ ను ఆర్థిక లావాదేవీలతో వనపర్తికి బదిలీ చేయడాన్న సిపిఎం ఖండిస్తున్నామని వీపనగండ్లలో బాలికల బాలుర పాఠశాలల్లో కలిపి ఒక్కరే ఇంగ్లీష్ టీచర్ ఉన్నాడని , అతన్ని 5 మంది ఇంగ్లీష్ టీచర్లు ఉన్న వనపర్తి బాలుర పాఠశాలకు ఎలా పంపుతారని ప్రశ్నించారు. వెంటనే ఈ అక్రమ డిప్యూటేషన్ ను ఎత్తివేయకుంటే వనపర్తి లోని ప్రజా సంఘాలు అఖిలపక్ష రాజకీయ పార్టీలు విద్యార్థి సంఘాలు ఏకమై ఉద్యమం చేస్తుందని వారు అన్నారు ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్, సిపిఎం నాయకులు బాల్ రెడ్డి, దేవేందర్, టిడిపి నాయకులు కొత్త గొల్ల శంకర్, టిఆర్ఎస్ నాయకులు బొడ్డుపల్లి సతీష్, సామాజిక కార్యకర్త గౌనికాడి యాదయ్య, ఐక్యవేదిక పట్టణ అధ్యక్షుడు రామస్వామి, కురుమూర్తి, రవి, ఇటుకూరి రంజిత్, కొండ వెంకటేష్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు
నాగర్‌కర్నూల్ జిల్లా పరిసర ప్రాంతాలలో కుంటల ఆక్రమణలు,చెరువు శికం భూములలో అక్రమ నిర్మాణాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్దానిక సామాజిక ఉద్యమకారుడు రాజశేఖర శర్మ సోమవారం నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇచ్చిన పిర్యాదు లో పేర్కొన్నారు.
నాగర్‌కర్నూల్ పట్టణం కొత్త జిల్లా గా ఏర్పడిన నాటి నుండి జిల్లా పరిసర ప్రాంతాలలో చాలా వరకు కుంటలు,చెరువు శిఖం భూములు ఆక్రమణలు జరిగినట్లు వివిధ పత్రికలలో వార్తలు వినపిస్తున్నాయని ఇట్టి భూఆక్రమణల పై గతంలో కలెక్టర్ కూడ నివేదికలు ఇవ్వమని సంబంధిత అధికారులను ఆదేశించినా చర్యల విషయంలో అధికారాలు,ఆధారాలు ఉన్నా ఆలస్యం చేస్తూ నివేదికల పేరుతో కాలయాపన చేయడం వల్ల ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతున్నాయని,పట్టణ ప్రజలకు,రైతులకు మేలు చేసే చెరువులను, కుంటలను కాపాడవలిసిన తక్షణ కర్తవ్యం జిల్లా ఉన్నతాధికారులపై ఉందని ప్రకృతి వనరులను రాజకీయ అండదండలతో చెరబట్టి ధ్వంసం” చేసి కాంక్రీట్ జంగిల్ గా కందనూలు చెరువు”లను మారుస్తున్నా.జిల్లా ఉన్నతాధికారుల లో ఏమాత్రం చలనం కలగడం లేదని వాపోయారు.
జల వనరులను ఎవరు ఆక్రమించుకున్నా విచక్షణాధికారం ఉపయోగించి ప్రభుత్వ ఆధీనం లోకి తెచ్చుకునే అవకాశం ఉన్నా,ఆ దిశగ ఉన్నతాధికారులు ప్రయత్నించకపోవడం బాధాకరమని,ఆక్రమణలపై కోర్టుకేసులు ఉన్నా కబ్జాదారుల విషయాన్ని ప్రభుత్వ న్యాయవాదుల ద్వారా కోర్టుల దృష్టికి తీసుకెళ్లి కూల్చివేసే అధికారం జిల్లా ఉన్నతాధికారులకు ఉందని,ప్రజల ఆస్తులకు ఏ మాత్రం నష్టం వాటిల్లినా,తమ అధికార దండాన్ని ఉపయోగించే అవకాశం ఉన్నతాధికారులకు ఉన్నా చర్యలు తీసుకోకుండా..
Government lands
ప్రేక్షక పాత్ర వహిస్తే,మిగిలిన ప్రభుత్వ భూమి కూడ కబ్జా ల పాలుకావడంతో పాటు భవిష్యత్తు తరాలకు తీరని నష్టం”చేసిన వారు అవుతారాని సూచించారు.చెరువు బఫర్ జోన్, శిఖం పరిధి లో ఎలాంటి నిర్మాణాలు చేయకూడదని చట్టంలో ఉన్నా భూ ఆక్రమణదారులు నిర్మాణాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి కుంటలను ధ్వంసం చేస్తూ,చెరువు శిఖం భూములలో నిర్మాణాలు చేసిన వారిపై పీ.డి యాక్ట్ ఉపయోగించి అక్రమ నిర్మాణాలను కూల్చివేతలు చేపట్టాల్సిందిగా పిర్యాదు లో విజ్ఞప్తి చేసారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.