చేశారుఝరాసంగం: విద్యార్థులందరూ ధర్మం వైపు వెళ్లాలని, అది మనల్ని రక్షిస్తుందని జహీరాబాద్ సివిల్ కోర్ట్ సీనియర్ జడ్జ్ గంట కవితా దేవి దత్తగిరి మహారాజ్ వేద పాఠశాల విద్యార్థులకు సూచించారు. గురువారం సాయంత్రం బర్దిపూర్ శ్రీ దత్తగిరి ఆశ్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. వారికి ఆలయ రాజగోపురం వద్ద వైదిక పాఠశాల విద్యార్థులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. జ్యోతిర్లింగాలు, దత్తాత్రేయ స్వామి, పంచవృక్షాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈనెల 29న శనైశ్వర స్వామి జయంతి కరపత్రాన్ని విడుదల . వారికి ఆశ్రమ పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ 1008 వైరాగ్య శిఖామణి అవధూత గిరి మహరాజ్, మహామండలేశ్వర్ సిద్ధేశ్వరానందగిరి మహరాజ్ తీర్థ ప్రసాదాలు అందజేసి సన్మానించారు.
సంగారెడ్డి జిల్లాలో వింత.. బ్రహ్మంగారి భవిష్యవాణి నిజమవుతోందా?
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం: సంగారెడ్డి జిల్లాలో ఒక ఆశ్చర్యకరమైన చోటు చేసుకుంటుంది. ఝరాసంగం మండలంలోని ఈదులపల్లి గ్రామ శివారులో ఉన్న ఒక రావి చెట్టు నడిమధ్య నుండి ఒక ఈత చెట్టు మొలకెత్తి పెద్దగా పెరిగింది. ఒక చెట్టు మొదలు నుండి వేరొక చెట్టు పెరగడం చాలా అరుదు. కానీ ఇక్కడ రెండు రకాల చెట్లు ఒకే చోట పెరగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ అద్భుతం చూసిన స్థానికులు, బ్రహ్మంగారు చెప్పిన భవిష్యత్తు నిజమవుతున్నాయని అనుకుంటున్నారు. కొన్ని సంవత్సరాల క్రితమే ఈ చెట్లు ఇక్కడ ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. భవిష్యత్తులో ఇంకెన్ని వింతలు చూడాల్సి వస్తుందని గ్రామ ప్రజలు అంటున్నారు
కరీంనగర్ జిల్లా సంస్థాగత ఎన్నికల పరిశీలకులుగా రఘునాథ్ రెడ్డి..
రామకృష్ణాపూర్ నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా సంస్థాగత ఎన్నికల పరిశీలకులుగా క్యాతనపల్లి మునిసిపాలిటీకి చెందిన టిపిసిసి ప్రధాన కార్యదర్శి పిన్నింటి రఘునాథ్ రెడ్డి నియమితులయ్యారు. ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ లు కరీంనగర్ జిల్లా పరిశీలకులుగా తనను నియమించినట్లు రఘునాథ్ రెడ్డి తెలిపారు.రానున్న రోజుల్లో తెలంగాణలో సంస్థాగత ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గ్రామం, మండలం, జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పనిచేసే తీరును పరిశీలించేందుకు పరిశీలించేందుకు జిల్లా పరిశీలకునిగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఆయన అన్నారు.
మండల కేంద్రానికి చెందిన బోడ కుల్దీప్ అతను తేదీ 06.04.2025 రోజున అతని యొక్క సెల్ ఫోను ఎక్కడో పడిపోయినదని తేదీ 07.04.2025 రోజున పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు, వెంటనే CEIR Portal లో వివరాలను నమోదు చేయడం జరిగింది. అయితే ఆ బాధితుడు పోగొట్టుకున్నతన ఫోనును ట్రేస్ అవుట్ చేసి అతడికి అప్పగించడం జరిగినది. మరియు ఎవరైనా వారి ఫోన్ పోగొట్టుకున్న లేదా దొంగతనానికి గురి అయిన ఫోన్ వివరాలను CEIR Portal లో నమోదు చేస్తే తిరిగి ఆ మొబైల్ ఫోన్ ను పొందే అవకాశం ఉంటుంది, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి, ఎవరికైనా మొబైల్ లేదా ఇతర విలువైన వస్తువులు దొరికితే వాటిని సమీప పోలీస్ స్టేషన్లో అప్పగించాలని ఏఎస్ఐ S.ఆంజనేయులు తెలిపినారు.
బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే సుంకే
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని వైశ్య భవన్ లో ఈనెల 27న వరంగల్ లో నిర్వహించే బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభ జరగనున్న నేపథ్యంలో రామడుగు బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో ముఖ్యఅతిథిగా చోప్పదండి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు సుంకే రవిశంకర్ పాల్గోని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈకార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రామడుగు సింగిల్విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంట్ల జితేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ మర్కొండ కిష్టారెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ గంట్ల వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీపీ తౌటు మురళి, మాజీ రైతుబంధు సమితి అధ్యక్షులు జూపాక కరుణాకర్, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
చెరుకు రసం ఎక్కువగా తాగొద్దు.. అధిక చక్కెర స్థాయిలతో అనారోగ్య సమస్యలు: ఐసీఎంఆర్!
వేసవిలో ఎండ వేడిమిని తట్టుకోలేక ఉపశమనం కో సం చాలా మంది చెరకు రసం, పండ్ల జ్యూస్‌లు, సాఫ్ట్ డ్రింక్‌లు తాగుతుంటారు. అయితే చక్కెర స్థాయి అధికంగా ఉండే డ్రింక్‌లకు వ్యతిరేకంగా భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) తాజాగా మార్గదర్శకాల్లో పలు సూచనలు చేసింది.
◆ పండ్ల జ్యూస్‌లు, సాఫ్ట్‌డ్రింకులు మానుకోండి
◆ నీరు, మజ్జిగ, పండ్లు వంటివి తీసుకోవాలి
◆ భారత వైద్య పరిశోధనా మండలి సూచనలు
జహీరాబాద్. నేటి ధాత్రి:
వేసవిలో ఎండ వేడిమిని తట్టుకోలేక ఉపశమనం కో సం చాలా మంది చెరకు రసం, పండ్ల జ్యూస్‌లు, సాఫ్ట్ డ్రింక్‌లు తాగుతుంటారు. అయితే చక్కెర స్థాయి అధికంగా ఉండే డ్రింక్‌లకు వ్యతిరేకంగా భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) తాజాగా మార్గదర్శకాల్లో పలు సూచనలు చేసింది. చెరకు రసంలో చక్కెర ఎక్కువగా ఉంటుందని, దాన్ని తాగడాన్ని తగ్గించుకోవాలని పేర్కొన్నది. నీరు లేదా తాజా పండ్లకు సాఫ్ట్ డ్రింక్‌లు ప్రత్యామ్నాయం కాదని, వాటిని తీసుకోవడం మానేయాలని పేర్కొన్నది. వాటికి బదులుగా మజ్జిగ, నిమ్మ రసం నీరు, కొబ్బరి నీళ్లు, చక్కెర లేకుండా పండ్ల జ్యూస్‌లు తాగాలని సూచించింది.
sugarcane juice.
డీహైడ్రేషన్, డయాబెటిస్ రిస్క్
అధికంగా చెరకు రసం తాగడం వల్ల పలు అనారోగ్య ముప్పులు ఉంటాయని డీహెచ్‌ఈఈ డైటీషియన్ డాక్టర్ శుభా రమేశ్ పేర్కొన్నారు. అధికంగా చక్కెర తీసుకోవడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ సమస్య ఎదురవుతుందని, చెమట రూపంలో శరీరం నుంచి నీరు అధికంగా బయటకు వెళ్లే వేసవిలో ఇది ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయని, తద్వారా ఇన్సులిన్ నిరోధకత, టైప్-2 డయాబెటిస్ ముప్పు ఏర్పడుతుంది. అదేవిధంగా అధిక కెలోరీల వల్ల బరువు పెరిగే అవకాశం ఉన్నదని, ఇది డయాబెటిస్, హృదయ సంబంధిత వ్యాధులకు దారితీసే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు.
‘100% ఫ్రూట్ జ్యూస్’ అని చెప్పుకోవద్దు
ఆహార ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపార ప్రకటనలు, లేబుల్స్‌పై నుంచి ‘100 శాతం ఫ్రూట్ జ్యూస్’ అనే పదాలను తక్షణమే తొలగించాలని భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లకు ఆదేశాలు జారీ చేసింది. నీరు కలిపిన పండ్ల రసాలను నూటికి నూరు శాతం పండ్ల రసాలుగా చెప్పుకుంటూ ప్రకటనలు జారీ చేస్తున్నట్లు, లేబుల్స్‌పై రాస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. అమ్ముతున్న జ్యూస్‌లో అత్యధిక భాగం నీరైనపుడు, అది 100% ఫ్రూట్ జ్యూస్ అని చెప్పడం తప్పుదోవ పట్టించడమేనని తెలిపింది.
భూభారతి అవగాహన సదస్సులు సోమవారం మూడు మండలాల్లో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదివారం ఓ ప్రకటనలు తెలిపారు. మొగుడంపల్లిలో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1:30, రాయికోడులో 1: 30 నుంచి 3. 30, జహీరాబాద్ లో 3: 30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సదస్సులు జరుగుతాయని చెప్పారు. అధికారులు, రైతులు సమయానికి హాజరుకావాలని సూచించారు.
ఈనెల 21 వ తేదీన హైదరాబాద్ లో జరుగబోయే ఉద్యమకారుల ప్లీనరీ కి ఉద్యమకారులందరూ హాజరు కావాలని కోరుతూ కేసముద్రం మండల తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో శనివారం కేసముద్రం పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పి.సి.సి. సభ్యులు గుగులోత్ దస్రూ నాయక్ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమకారులందరికీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫేస్టోలో ఇచ్చిన హామీలన్నింటిని తప్పకుండా నెరవేరుస్తుందని అన్నారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షులు చాగంటి కిషన్ మాట్లాడుతూ ఉద్యమంలో అమరులైన ఉద్యమకారుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించి, 10 లక్షల పరిహారం అందించి ఆదుకోవాలని, ఉద్యమకారులందరికీ మండల కేంద్రంలో నివాస స్థలం కేటాయించి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని గుర్తింపు కార్డులు ఇవ్వాలని నెరకు 25000 పింఛను ఇవ్వాలని మనవి చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఉద్యమకారుల ఫోరం మండల ప్రధాన కార్యదర్శి షేక్ ఖాదర్, కోశాధికారి దామరకొండ ప్రవీణ్ కుమార్, కేసముద్రం స్టేషన్ మాజీ సర్పంచ్ భట్టు శీను, విద్యార్థి, యువజన జెఎసి పూర్వ కన్వీనర్ దండు శ్రీనివాస్, కొలిపాక వెంకన్న, చిట్యాల వీరన్న, బాలు మోహన్, వేం నరసింహారెడ్డి, సోమారపు వెంకటయ్య, జనిగల పరమేశ్వర్, మాందాటి ఆంజనేయులు, షేక్ యాకుబ్ అలీ, గుగులోత్ సునీత, నాగరబోయిన చంద్రకళ పాల్గొన్నారు.
శాయంపేట మండలంలో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు అంబేద్కర్ భవనం రావడం అన్ని కులాల పేదల ప్రజల అదృష్టం. అంబేద్కర్ ఆశయ కొనసాగిస్తాం. ఎమ్మా ర్పీఎస్ మండల అధ్యక్షుడు తుడుం వెంకటేష్ పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మారపేల్లి రవీంద ర్ (బుజ్జన్న) మర్యాద పూర్వ కంగా కలిసి శాలువాతో సన్మానించారు. మండలకేంద్రం ఒకప్పుడు నియోజకవర్గ కేంద్రమైన అంబేద్కర్ భవనం లేకపోవడం చాలా దురదృష్ట కరం. అంబేద్కర్ భవనం రావడం సంతోషం. అంబేద్కర్ భవనం నిర్మాణ చేస్తానని కాంగ్రెస్ భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారా యణరావు హామీ ఇవ్వడం జరిగింది.. ఈ ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని ప్రజలు కోరారు. ఈ కార్యక్రమంలో ముక్కెర ముఖేష్ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి తుడుం వెంకటేష్ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మామిడి భాస్కర్ మాదిగ, ఎంఎస్ పి మండల అధ్యక్షులు మారపేల్లి చిరంజీవి మాదిగ ఎమ్మార్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి పోతుగంటి రజినికర్ మాదిగ ,మాజీ మండల అధ్యక్షులు కొమ్ముల పరమేష్, ఎమ్మార్పీ ఎస్ మండల సీనియర్ నాయకు లు.రంగు బాబు మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల సీనియర్ నాయకులు రమేష్ మాదిగ ఎమ్మార్పీఎస్ నాయకు లు,పోతుగంటి సాంబరాజ్, ఎమ్మార్పీఎస్ పత్తిపాక గ్రామ శాఖ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కొనుగోలు సమర్ధవంతంగా నిర్వహించాలని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో శుక్రవారం క్షేత్రస్థాయిలో పర్యటించి ఆర్. వెంకటాపూర్ గ్రామంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించి నిర్వహణ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఐకెపి కొనుగోలు కేంద్ర నిర్వాహకులు ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ఓపిఎంఎస్ లో వివరాలను నమోదు చేయాలని సూచించడం జరిగిందన్నారు. తద్వారా రైతులకు సకాలంలో డబ్బులు అందుతాయని అకాల వర్షాల కారణంగా ధాన్యం తరవకుండా టార్పలిన్ అందుబాటులో ఉంచుకోవాలని సూచించడం జరిగిందన్నారు. కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకువచ్చిన రైతుల ధాన్యం తేమశాతాన్ని పరిశీలించి తేమశాతం వచ్చిన వెంటనే ధాన్యం కొనుగోలు చేసి సంబంధిత మిల్లులకు తరలించలని సూచించడం జరిగిందన్నారు. నిత్యం అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని పౌరసరఫరాల అధికారులు కొనుగోలు కేంద్రాలను ఎప్పటికప్పుడు పరిశీలించవలెనని సూచించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న భూభారతి పోర్టల్ ద్వారా రాష్ట్రంలోని భూ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం జడ్చర్ల కేంద్రంలో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులో ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రజాపాలనలో ప్రజల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయనే దానికి భూభారతి ముఖ్య ఉదాహరణ అని వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ పరిపాలనలో ధరణి పోర్టల్ ద్వారా రెవెన్యూ శాఖలో అనేక చిక్కులు ఏర్పడ్డాయని విమర్శించారు. అధికారులు భూ సమస్యలను పరిష్కరించడంలో ధరణి పోర్టల్ ద్వారా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భాలు ఉన్నాయన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధరణి పోర్టల్ తీసుకొచ్చి రెవెన్యూ శాఖకు ప్రజలకు మధ్య సంబంధాలు లేకుండా చేశారని తెలిపారు.
Bhu Bharati
ప్రతిరోజు హైదరాబాద్ లోని నా.. నివాసానికి ఎంతోమంది భూ సమస్యలపై వస్తుంటారని అనిరుధ్ రెడ్డి గుర్తు చేశారు. ప్రజలు ఇచ్చిన భూ ఫిర్యాదులన్నిటిని ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ కు పంపించి వాటిని పరిశీలన చేయాలని కోరానని పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులుగా ఉన్న మా యొక్క భూ సమస్యలే పరిష్కారం కావడం లేదనీ.. పేద ప్రజల భూ సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని వివరించారు. నేను కూడా భూభారతిలో నా యొక్క భూ సమస్యలపై దరఖాస్తు చేసుకుంటానని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వెల్లడించారు. భూ భారతిపై నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి అధికారులతో కలిసి వెళ్లి అవగాహన సదస్సులు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
కుల మతం బేధాలు లేకుండా విద్యార్థుల మధ్య ఐక్యత పెంచాలి .
విద్యార్థి నీతో ఎంక్వయిరీ చేసిన విషయాల్ని బహిర్గతం చేయాలి.
గర్ల్స్ ఆశ్రమ పాఠశాలల్లో లేడీ హెచ్ఎం నే నియమించాలి.
జిల్లా కలెక్టర్ గారు, ఐటీడీఏ పీవో గారు స్పందించాలి
టీ ఏ జి యస్, ఏ ఎస్ పి, పీ డి ఎస్ యు,, యస్ .ఫ్. ఐ డిమాండ్.*
నేటి ధాత్రి భద్రాచలం.
రామచంద్రన్నపేట ఆశ్రమ పాఠశాలలో జరిగిన ఘటనపై విద్యార్థి ,ఆదివాసి సంఘాలు స్పందిస్తూ విద్యార్థిని స్వగ్రామానికి వెళ్లి విద్యార్థిని విచారించడం జరిగింది.
విద్యార్థిని. నాగజ్యోతి చెప్పిన వివరాలు. ఈరోజు నేను పెట్టిన వీడియో చూసి స్పందించిన ఐటీడీ అధికారులు మా ఇంటికి డిడి మేడం డి సి డి ఓ మేడం ఏ టి డి ఓ సార్ వాళ్ళు నన్ను విచారణ చేయడానికి మా ఇంటికి వచ్చినారు. నన్ను వీడియో ఎలా చేశావు ఎవరన్నా చేయించారా నువ్వే చేసావా నీకు ఏవి ఇబ్బంది ఉన్నది నిజం చెప్పు అని నన్ను అడిగారు. నేను వీడియోని తీసి పెట్టింది వాస్తమని ఎవరు బలవంతంగా తీయమని నాకు చెప్పలేదని నేను ఆ వీడియోని అందరికీ అందజేయాలని ఆలోచనతో చేశానని నన్ను కులం పేరుతో ఇబ్బంది పెడుతున్నారని నేను డిడి మేడం కి చెప్పాను అనేక సందర్భాల్లో నన్ను తిడుతున్నారని ఇవన్నీ అందరికీ తెలియాలని ఈ వీడియోని లీడ్ చేశానని మేడం వాళ్ళకి చెప్పాను మేడం వాళ్ళు పదేపదే మార్చి మార్చి అడిగింది అడుగుతూ నన్ను కనిపించడం జరిగింది అయినా సరే నేనే వీడియో తీశాను నేను ఇబ్బంది పడ్డాను కాబట్టే నేను ఈ వీడియోని బయట పెట్టాను అని చెప్పాను. హెచ్ఎం గారిపై ఏమి యాక్షన్ తీసుకుంటారో వేచి చూస్తున్నాను.
పీ డి యస్ యు రాష్ట్ర కమిటీ సభ్యులు మునిగేలా శివ ప్రశాంత్ , టీ జి ఏ యస్ జిల్లా కార్యదర్శి కారం పుల్లయ్య , ఎ యస్ పి, డివిజన్ అధ్యక్షులు మల్లు, దొర యస్ ఫ్ ఐ సండ్రా ఉపేందర్ నాయకులు మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాల విద్యార్థుల మధ్య ఐక్యతను పెంచాలని కుల మతం భేదం లేకుండా అందరికీ ఒకే విద్యని అందించాలని విద్యార్థులకు కులాలతో కూడిన విద్యను కాకుండా నాణ్యమైన విద్యని స్వచ్ఛమైన విద్యని విద్యార్థుల మధ్య ఐక్యతను పెంచే విద్యని కులాల పేరు లేకుండా విద్యని అందించాలని వారు డిమాండ్ చేశారు. ఈరోజు నిన్న జరిగిన ఘటనపై ఐటిఐ అధికారులు DD,ATDO అధికారులు వచ్చి విద్యార్థులని విచారణ చేశారని వివరణ అడిగితే పొంతనలేని సమాధానం చెప్పి అక్కడ నుండి వెళ్లిపోయారని వారు అన్నారు. విద్యార్థిని ఇంటికి వెళ్లి జరిగిన ఘటనపై వివరణ తీసుకొని పూర్తిస్థాయి విచారణ చేయకుండానే వెడ్డి నుండి వెళ్లిపోయారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సంఘ నాయకులు అడిగినప్పుడు విద్యార్థిని ఒక్కొక్క సమాధానం చెబుతుందని వారంటూ హాస్టల్ కి వెళ్తున్నాము అని చెప్పి అధికారులు హాస్టల్ రాకుండా వెళ్లిపోవడం సరైన పద్ధతి కాదని నాయకులు విమర్శించారు. ఐటిడిఏ పై అధికారులు పర్యవేక్షణ లేకపోవడమే సమస్యలు విలయతాండవం చేస్తున్నాయని సమస్య జరిగినప్పుడు తోతూ మంత్రంగా చర్యలు తీసుకొని చేతులు దులుపుకుంటున్నారు కాబట్టి మళ్ళీ మళ్ళీ సమస్యలు పురాణావతం అవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పై అధికారులు ఎంక్వయిరీ చేసిన విషయాలని బహిర్గతం చేయాలని వారు డిమాండ్ చేశారు. గత ఐదు రోజుల కిందట జరిగిన ఘటనపై పూర్తి సమాచారం హెచ్ఎం ఇవ్వకుండా ప్రవేట్ పంచాయతీ చేసి అగ్రిమెంట్ రాసుకొని ప్రవేట్ పంచాయతీకి హెచ్ఎమ్ కూడా వెళ్లడం దారుణమైన విషయమని వారన్నారు ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటూ హాస్టల్లో సమస్య వచ్చినప్పుడు పై అధికారులకు తెలియజేయకుండా ఆ విషయాన్ని అక్కడే కప్పుపుచ్చే ప్రయత్నం చేస్తూ కాలం గడుపుతున్న హెచ్ఎం పై ఇప్పటివరకు ఏ చర్యలు తీసుకుంటారో అధికారులు స్పష్టం చేయాలని వారు డిమాండ్ చేశారు విద్యార్థిని సెల్ఫీ వీడియో విచారణ పూర్తి స్థాయిలో చేసి వేగవంతంగా సమస్యని పరిష్కారం చేయాలని వారు ఐటిడిఏ అధికారులని డిమాండ్ చేశారు. గర్ల్స్ ఆశ్రమ పాఠశాలలో అనేక సంవత్సరాల నుండి విద్యార్థి సంఘాలు ఆదివాసి సంఘాలు బాయ్స్ టీచర్స్ ని ఉంచకూడదని చెప్పినప్పటికీ అదే పద్ధతిలో ఐటిఐ అధికారులు కొనసాగించడం వలన ప్రతిసారి ప్రతి హాస్టల్లో సమస్యలు తలెత్తుతున్నాయని సాయంత్రం 6 దాటితే హాస్టల్లో బాయ్స్ టీచర్స్ ని ఉంచకుండా ప్రధాన బాధ్యత లల్లో నియామకాలు లేకుంటే సమస్యలు జరగకుండా ఉంటాయని వారు అన్నారు. ఇప్పటికైనా తక్షణమే ఐటీడీఏ అధికారులు స్పందించి హెచ్ఎం ని సస్పెండ్ చేయాలని, గర్ల్స్ హాస్టల్ లో గర్ల్స్ హెచ్ఎం ని నియమించాలని వారు డిమాండ్ చేశారు. నారాయణరావుపేట కురం బుర్రయ్య గ్రామ పెద్ద వివరణ.
కులాలతో విద్యని కాకుండా అందర్నీ సమానంగా చూడాలని పిల్లల దగ్గర కులాల గురించి మాట్లాడొద్దని మరణమైన విద్య అందించి వారిని మంచి భవిష్యత్తు ఉండేలా ఎదిగేలా తయారు చేయాలి అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో PDSU భద్రాచలం డివిజన్ అధ్యక్షుడు దండుగుల రామ్ చరణ్, వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్ అధ్యక్షులు దాసరి సాయన్న, విద్యార్థిని తల్లిదండ్రులు సురేషు ,పార్వతి, గ్రామ పెద్ద మనుషులు తదితరులు పాల్గొన్నారు.
రెవెల్లి మండల బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షులు,మాజీ సింగి ల్ విండో అధ్యక్షులు రఘురామారావు కు వారిస్వగృహంలో బారస జిల్లా అధికార ప్రతినిధి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ వారి చిత్రపటానికి పూలమాలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు.నివాళులర్పిం చిన వారి లో హై కోర్ట్ న్యాయవాది వెంకటేశ్వరావు మాజీ కౌన్సిలర్ ఉంగ్లం తిరుమల్ లక్ష్మణ్ యాదవ్ శ్రీహరి శ్రీనివాస్ యాదవ్ మాజీ సర్పంచ్ గోపాల్రావు నారాయణ్ రావు భాస్కర్ రావు ప్రవీణ్ రావు నాయకులు కార్యకర్తలు ఉన్నారు.
పంటలు పరిశీలించి…… రైతులకు ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే
పంట నష్టపోయిన రైతులు అధైర్య పడొద్దు
ఎమ్మెల్యే సత్యనారాయణ రావు
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలంలో అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన మొక్కజొన్న అరటి చెట్లు అధికారులతో కలిసి పరిశీలించి,అకాల వర్షంతో నష్టపోయిన రైతులు అధైర్య పడొద్దు వారికి ప్రభుత్వం అండగా ఉంటుం దని అన్నారు అకాల వర్షం వల్ల దెబ్బతిన్న పంటలు చూసి ఎమ్మెల్యే అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు అకాల వర్షాలకు పంటలు దెబ్బతినడంతో రైతులు నష్టపోయారు అని అన్నారు. అయితే అకాల వర్షాలు పంటలకు నష్టం కలిగించే అన్న విషయాన్ని గుర్తించి వారికి సహాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. పదేళ్లు అధికారంలో ఉన్న అప్పటి ప్రభుత్వం నష్టపోయిన రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని ప్రస్తుతం తాము రైతులకు నష్టపోకుండా కృషి చేస్తామని అన్నారు. రైతులకు నష్టపరిహారం కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు
అతి పేదలకు ఇందిరమ్మ ఇండ్లు… లబ్ధిదారులకు ఐదు లక్షలు
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గరిబీ హటావో నినాదం తెచ్చారు పెద్దరికం తొలగిపో వాలని అన్నది ఆమె ఉద్దేశం. ఇప్పటికీ మనదేశంలో ఇల్లు లేని నిరుపేదలు చాలామంది ఉన్నారు.ఇందిరాగాంధీ ఆశయంతో కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇండ్ల పథకం తెచ్చింది. ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో వేగం పెంచాలి. మండలంలోని అన్ని గ్రామాల్లో కమిటీలు నిర్వహించి వారి నుండి నిరుపేదల ఇండ్ల జాబితాను అతి త్వరలో నా దగ్గరికి పంపాలని అన్నారు. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా లబ్ధిదారులు ఎంపిక పారదర్శకంగా జరగాలని అన్నారు. ఒకవేళ తప్పుగా చేస్తే అధిష్టానం శిక్షిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దూది పాల బుచ్చిరెడ్డి, బాసని చంద్ర ప్రకాష్
MLA
మార్కండేయ,చిందం రవి,భాసని శాంత- రవి , రవిపాల్ ,దుబాసి కృష్ణమూర్తి రాజు ,కట్టయ్య, పోలేపల్లి శ్రీనివాసరెడ్డి, వలిఐధర్, ఎండి రఫీ, మండల నాయకులు, అన్ని గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు
మాజీ జెడ్పి చైర్మన్ సీతదయాకర్ ను సన్మానము చేసిన ఐక్యవేదిక అధ్యక్షులు వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి జిల్లా ఆత్మకూరు శ్రీ షిర్డీ సాయిబాబా మందిర రోజుతోత్సవ వేడుకల్లో ఐక్యవేడిక జిల్లా అధ్యక్షులు మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్ దంపతులు పాల్గొన్నారు ఆత్మ కూ ర్ షిర్డీసాయి బాబా దేవాలయం కమిటీ మెంబర్ గా వ్యవహరించిన సతీష్ యాదవ్ అక్కడి ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు రజతోత్సవ వేడుకల్లో పాల్గొని వనపర్తి జిల్లా ప్రజలు బాగుండాలని శ్రీ షిర్డీ సాయి భగవాన్ ను వేడుకున్నారు ఆనంతరం మాజీ జెడ్పి చైర్మన్, చైర్మన్,సీతా దయాకర్ రెడ్డి ని సతీష్ యాదవ్ సన్మానించారు
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పలువురు బాధితులు బుధవారం స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిని కలిసి విన్నవించారు. తొలుత పలమనేరు ఫుట్ వేర్ అసోసియేషన్ సభ్యులు తమ సమస్యను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. పట్టణం నందు మొత్తం 42 దుకాణాలు ఉన్నాయని అయితే ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వ్యాపారుల వల్ల తమ తీవ్రంగా నష్టపోతున్నామని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు ఫుట్ పాతులపై విక్రయాలు జరుగుతుండడంతో తామ తీవ్రంగా నష్టపోతున్నామని వాపోయారు. ఇప్పటికే ఆన్లైన్ బిజినెస్ ద్వారా తమ వ్యాపారాలు 50 శాతానికి పడిపోయాయని ఇతర ప్రాంతాల వారితో పూర్తిగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై అధికారులతో చర్చించి పట్టణానికి దూరంగా వారు వ్యాపారాలు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా కార్పొరేషన్ రుణాలను అందించి తమను ఆదుకోవాలని విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు జగా, జాకీర్ రాఘవేంద్ర, కాలేషా తదితరులున్నారు.
వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలి…
వీఆర్ఏలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించేలా చొరవ చూపాలని వీఆర్ఏల సంఘం నాయకులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. వీఆర్ఏల పై నిబంధనలకు విరుద్ధంగా మోపిన నైట్ డ్యూటీలు, ఇసుక,రైస్ మిల్లుల వద్ద డ్యూటీలు వెంటనే నిలిపివేయాలని కోరారు. తెలంగాణలో ఇస్తున్నట్లు వీఆర్ఏలు అందరికీ పేస్ కేల్ జీతాలు చెల్లించాలని, డీఏను జీవితంలో కలపాలన్నారు. గతంలో వైసిపి పాలనలో రికవరీ చేసిన డి ఏ నగదును తిరిగి చెల్లించాలని ఇంటర్మీడియట్ విద్యా అర్హతల ఆధారంగా ప్రమోషన్లు అమలు చేయాలనే డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆయనకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వీఆర్ఏల సంఘ నాయకులుతో పాటు, కార్మిక సంఘ నాయకులు ఓబుల్ రాజు పాల్గొన్నారు.
మట్టి దొంగల చేతిలో ధ్వంసం అవుతున్న ప్రభుత్వ ఆస్తులు
గుడ్లప్పగిచ్చి చూస్తున్న అధికారులు
నాకు రాజకీయ పలుకుబడి ఉంది
ఆనాడు పెట్టుబడి పెట్టా.. ఇప్పుడు సంపాదించుకోవడం తప్పా?
కరీంనగర్, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం షానగర్ గ్రామంలోని ఎల్లమ్మ చెరువులో మట్టి తరలింపునకు ఇరిగేషన్ శాఖ అధికారులు ఒక వెయ్యి క్యూబిక్ మీటర్లు తరలింపునకు కోమండ్లపల్లి గ్రామం సుల్తానాబాద్ మండలం పెద్దపల్లి జిల్లాకు చెందిన వ్యక్తికి నాలుగు లారీల ద్వారా పరిమిషన్ ఇచ్చియున్నారు. దీనిని ఆసరాగా చేసుకున్న సంబంధిత కాంట్రాక్టర్ పదుల సంఖ్యలో వాహనాల ద్వారా మట్టిని తరలించడమే కాకుండా విద్యుత్ శాఖకు సంబంధించిన ఒక ట్రాన్స్ఫార్మర్, మూడు విద్యుత్ పోలను విరగగొట్టి మట్టిని తరలించుచున్నారు.
Goervnment
ఈవిషయమై సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శిని వివరణ కోరగా గ్రామానికి చెందిన ముగ్గురు రైతులకు పర్మిషన్ ఇచ్చామని తెలిపారు. పరిమిషన్ రైతులకు ఇచ్చినట్లయితే సంబంధిత చెరువులో పదుల సంఖ్యలో ర్యాలీలు గ్రామపంచాయతీ ముందు నుండి ఎలాంటి పర్మిషన్ లేకుండా మట్టిని తరలిస్తుంటే సంబంధిత గ్రామపంచాయతీ కార్యదర్శి కళ్ళున్న గుడ్డివాడి లాగా ప్రవర్తించడం మండలంలోని ప్రజలను విష్మయానికి గురిచేస్తుంది. విద్యుత్ పోల్లు మరియు ట్రాన్స్ఫార్మర్ ధ్వంసం విషయమై సంబంధిత విద్యుత్ శాఖ ఏఈ కమలేష్ ను వివరణ కోరగా సంబంధిత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని పోలీస్ శాఖ వారు వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని తెలిపారు.
Goervnment
ఇరిగేషన్ శాఖ ఏఈ రఘురాంను వివరణ కోరగా సమాచారం అందించిన పిదప మేము వర్క్ ఇన్స్పెక్టర్ మల్లయ్యను మోఖాపై పంపి రెండు ఎక్సావేటర్ లను సంబంధిత టిప్పరులను నిలిపివేయడం జరిపామని సంబందిత ఫోటోలు పంపడం జరిగినది. ఒక అధికారి ఎంతవరకైతే మార్కింగ్ ఇచ్చారో అంతవరకు మాత్రమే మట్టి తరలింపునకు ఆస్కారం ఉంటుంది. అలాంటిది సంబంధంలేని వెహికల్ ద్వారా ఇష్టానుసారంగా పరిమితికి మించి మట్టిని తరలిస్తున్న సంబంధిత ఏఈ రఘురాం మోఖాపై వెళ్లి పరిశీలించకుండా నిమ్మకు నీరేత్తినట్లు ఉండడం చూస్తుంటే వారిచ్చిన అమ్యామ్యాలకు తలోగ్గి నిమ్మకు నీరెత్తి ఉన్నట్లు గ్రామ, మండల ప్రజలు చర్చించుకుంటున్నారు.
Goervnment
ఇప్పటికైనా సంబంధిత అధికారులు మేల్కొని మార్కింగ్ ఇచ్చిన స్థలంపై కాకుండా ఇంకా ఎన్నాచోట్ల నుండి మట్టిని తోలగించారో పూర్తి విచారణ జరిపడంతో పాటు ఎన్ని వాహనాల ద్వారా మట్టి తరలింపు జరిగిందో ఎన్ని క్యూబిక్ మీటర్లు తరలించారో లెక్కగట్టి ఒక్క క్యూబిక్ మీటర్ ఎక్కువ తరలించిన సంబంధిత కాంట్రాక్టర్ పై శాఖపరమైన చర్యలు తీసుకొని పరిమిషన్ లేకుండా మట్టి తరలిస్తున్న వాహనాలను సీజ్ చేయవలసిందిగా మండల ప్రజలు అధికారులను పత్రికా ముఖముగా కోరుకుంటున్నారు. ఈవిషయమై పలుమార్లు ఫోన్ ద్వారా వివరణ ఇవ్వాలని కోరగా మంగళవారం సంబంధిత ఏఈ రఘురాం మోకాపై వచ్చినప్పుడు మోకాపై నుండి వాహనాలను వెళ్ళగొట్టామని తెలియపరిచారు. ఏఈ మోఖాపై ఉన్నప్పుడు పదుల సంఖ్యలో వాహనాలు ఉన్న ఎందుకు సీజ్ చేయకపోవడం లేదో చూస్తుంటే కళ్ళున్న గుడ్డివాళ్ళ లాగా అధికారులు నటిస్తున్నారని మండలంలోని ప్రజలు బహుబాటంగానే చర్చించుకుంటున్నారు
బార్ అధ్యక్షులు వలుసా సుదీర్ ను కలిసిన వరంగల్ పోపా :-
వరంగల్, నేటిధాత్రి (లీగల్):-
ఇటీవల వరంగల్ బార్ అసోసియేషన్ ఎన్నికలలో ఘన విజయం సాధించిన సుధీర్ వలుస ను వరంగల్ బార్ అంబేద్కర్ హాల్ లో పోపా కార్యవర్గం మంగళవారం శాలువా, పూల మాల తో ఘనంగా సన్మానంచించారు. ఈ సందర్బంగా పోపా రాష్ట్ర అధ్యక్షులు, న్యాయవాది శామంతుల శ్రీనివాస్ మాట్లాడుతూ, 20సంవత్సరాల తర్వాత వరంగల్ బార్ అధ్యక్షులు గా పద్మశాలి ఉండటం పద్మశాలి కులానికి గౌరవం దక్కిందని, భవిష్యత్తులో మన సామజిక వర్గానికి వన్నె తేవాలని కోరారు.న్యాయవాదుల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. వరంగల్ పోపా అధ్యక్షులు గుండు కామేశ్వర్ మాట్లాడుతూ,యువ న్యాయవాది సుధీర్ బార్ అధ్యక్షులుగా విజయం సాధించడం గొప్ప విషయమని అన్నారు.ఈ కార్యక్రమం లో రాష్ట్ర ప్రతినిధులు గోషికొండ సుధాకర్, ధర్మపురి రాజగోవింద్, పాము శ్రీనివాస్, మాటేటి అశోకకుమార్, న్యాయవాదులు నల్ల మహాత్మ, అనుమాండ్ల రాజకుమార్, మెరుగు సుభాష్, చెన్నూరి రమేష్, తదితరులు పాల్గొన్నారు
తూర్తి గ్రామంలో ఘనంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు. జయంతి ఎందుకు జరుపుకుంటారు అని వివరించారు.
కథలపూర్ మండలంలోని తూర్తి గ్రామంలో. అంబేద్కర్ జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని అంబేద్కర్ గురించి అన్నో చెప్పుకొచ్చారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏప్రిల్ 14.1891జన్మిచారు. భారత రాజ్యాంగన్ని రూపొందిచడంలో మరియు సామజిక సమానంత్వం కోసం పోరాడారు అయన కీలక పత్రను గౌరవిస్తూ దేశవ్యాప్తంగాఅంబేద్కర్ జయంతిని ఈరోజు జరుపుకుంటారు.
నేటి ధాత్రి కథలాపూర్
అంబేద్కర్ ఎక్కడ జన్మిచారు. అసలు పేరు బీంరావ్ రంజి అంబేద్కర్. జననం.1891ఏప్రిల్ 14.మౌ సెంట్రల్ ప్రావిన్సు బ్రిటిష్ ఇండియా.మరణం.1956 డిసెంబర్ 6. ఢిల్లీ భారతదేశం అయన రాజకీయ పార్టీ. షెడ్యూల్ కులాల సంఘం *ఇతర రాజకీయ పదవులు.రిపబ్లిక్ పార్టీ ఇండిపెండెంట్లేబర్ పార్టీ.
భారత రాజ్యాంగంలో అంబేద్కర్ పాత్ర ఏమిటి ?
భారత రాజ్యాంగ రూపశిల్పి. అంబేద్కర్ చేసిన అత్యంత ముఖ్యమైన సహకారం భారత రాజ్యాంగం ముసాయిదా కమిటీ అధ్యక్షుడిగా అతని పాత్ర పౌరులందరికీ ప్రాథమిక హక్కులు మరియు సమాన అవకాశాల కోసం వాదించారు అంటరానితనాన్ని నిర్మూలించడానికి. ఆర్టికల్ 17. మరియు సామాజిక న్యాయాన్ని నిర్ధారించడానికి నిబంధనలను ప్రవేశపెట్టింది.
*అంబేద్కర్ చరిత్ర ఏమిటి ప్రముఖ భారతీయ న్యాయవాది ఆర్థిక శాస్త్రవేత్త రాజకీయ నేత. సంఘ సంస్కర్త ఇతను అంటరానితనం కుల నిర్మూలన కోసం ఎంతో కృషి చేశాడుఅతను స్వతంత్ర భారతదేశ మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రి రాజ్యాంగ శిల్పి. చెప్పారు.భారతీయ సమాజాన్ని ఎవరైనా చీకటి నుండి వెలుగులోకి నడిపించారంటే అది ఆయనే. అని అన్నారు. కార్యక్రమంలో అంబేద్కర్ నినాదాలతో. పూల మాలలు వేసి స్వీట్ పంపిణి చేసిన అంబేద్కర్ యూవజన సంఘం సభ్యులు. మరియు తూర్తి గ్రామ సభ్యులు. యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
భారత రాజ్యాంగ నిర్మాత డా బి ఆర్ అంబేద్కర్ 134 వ జయంతి సందర్భంగా ఆదివారం గీసుగొండ మండల కేంద్రంలో కీర్తిశేషులు తుప్పరి సూర్యనారాయణ జ్ఞాపకార్థం సందర్భంగా వారి కుమారుడు తుప్పరి వికాస్ ఏర్పాటుచేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆవిష్కరించారు.అనంతరం గీసుగొండ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు దౌడు అనిల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవూరి మాట్లాడుతూ భారత దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన రాజ్యాంగాన్ని రూపొందించే స్థాయికి ఎదిగిన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాసి పేద ప్రజల బతుకుల్లో వెలుగులు నింపారని అన్నారు. అటువంటి మహానేత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు సహకరించిన దాతలకు, కష్టపడ్డ ప్రతి వ్యక్తికి పేరు పేరునా అభినందిస్తున్నట్లు తెలిపారు.రాజ్యాంగ స్ఫూర్తిని అంబేడ్కర్ ఆశయాలను దెబ్బతీసేలా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని వారి కుట్రను తిప్పికొట్టేందుకే జై బాపు,జై భీమ్,జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నదని అన్నారు. అణగారిన వర్గాలకి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఆశాకిరణం అని బడుగు బలహీనుల జీవితాల్లో వెలుగు నింపిన మహనీయుడు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.