వరసిద్ధి వినాయక స్వామికి అభిషేకాలు.

వరసిద్ధి వినాయక స్వామికి అభిషేకాలు.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

న్యాల్కల్ మండలం రేజింతల్ లోని స్వయంభు వరసిద్ధి వినాయక స్వామికి మంగళవారం ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను నిర్వహించారు. అర్చకులు వేదమంత్రాలతో స్వామి వారికి పూజా కార్యక్రమాలను జరిపించారు. అనంతరం వరసిద్ధి వినాయక స్వామికి ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని దర్శించుకునేందుకు సంగారెడ్డి తో పాటు మహారాష్ట్ర కర్ణాటక నుంచి భక్తులు తరలివచ్చారు.

జాతర మహోత్సవ గోడ పత్రిక ఆవిష్కరణ.

జాతర మహోత్సవ గోడ పత్రిక ఆవిష్కరణ.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గ కేంద్రమైన తెలంగాణ రాష్ట్ర దేవదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన రాయికోడ్ గ్రామంలో ప్రసిద్ది చెందిన భద్రకాళి సమేత వీరభద్రేశ్వర జాతర. మహోత్సవం ఏప్రిల్ 17వ తేదీ గురువారం నుండి 22వ తేదీ మంగళవారం వరకు నిర్వహించునున్న శుభ సందర్భంగా సోమవారం నాడు ఏర్పాటుచేసిన అనే చైర్మన్ కులకర్ణి ప్రభాకర్ రావు (సతీష్) ఆలయ కార్య నిర్వహణ అధికారి శివ రుద్రప్ప. అధ్యక్షతన ధర్మకర్త మండలి సభ్యులు గ్రామ పెద్దల సమక్షంలో జాతర ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆలయ చైర్మన్ కార్య నిర్వాణ అధికారి వారు మాట్లాడుతూ ఆలయంలో చలువ పందిళువిద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని భోజనాలు ఏర్పాటుకై జాతర మహోత్సవం గురించి గ్రామ గ్రామాన తెలియపరచాలని జాతరకు వచ్చే భక్తులకు ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తదితర అంశాలపై వాటి నిర్వహణపై ఈ సమావేశంలో చర్చించారు. అనంతరం ఆలయ చైర్మన్ కార్యనిర్మాణ అధికారి శివ రుద్రప్ప ఆధ్వర్యంలో ఆదివారం జాతర మహోత్సవ కార్యక్రమం వివరాల ఆహ్వాన పత్రిక గోడ పత్రికను ఆలయ ఆవరణలో ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో. ఆలయ చైర్మన్ కులకర్ణి ప్రభాకర్ రావు (సతీష్) కార్యనిర్వాన అధికారి శివ రుద్రప్ప. మాజీ చైర్మన్ నట్కరి మావయ్య. గ్రామ పెద్దలు యువకులు ఆలయ సిబ్బందులు అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

మహిళపై అత్యాచారం ఎమ్మెల్యే ఆగ్రహం.

మహిళపై అత్యాచారం.. ఎమ్మెల్యే ఆగ్రహం

జడ్చర్ల / నేటి ధాత్రి

నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలంలోని పబ్బతి ఆంజనేయ స్వామి దేవాలయ సమీపంలో జరిగిన సామూహిక అత్యాచార సంఘటనలో నిందితులు ఎవరైనా వదిలేది లేదని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. సామూహిక అత్యాచారానికి పాల్పడిన వారు ఏ పార్టీకి చెందిన వారైనప్పటికీ వారిని వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని జిల్లా ఎస్పీని కోరానని వెల్లడించారు. ఊర్కొండలోని ఆంజనేయ స్వామి దేవాలయ సమీపంలో ఆరుగురు యువకులు ఒక వివాహిత యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే సోమవారం జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ తో ఫోన్లో మాట్లాడిన అనిరుద్ రెడ్డి పవిత్ర ప్రదేశంలో ఈ దురాగతానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. అత్యాచారానికి పాల్పడిన వారు బిఆర్ఎస్ పార్టీకి చెందిన వారని తన దృష్టికి వచ్చిందని అయితే ఈ సంఘటనకు పాల్పడింది ఎవరైనాప్పటికీ తాను రాజకీయాలు చేయదలుచుకోలేదని బాధిత యువతికి న్యాయం చేయాలన్నదే తన ఉద్దేశమని చెప్పారు. ఈ సంఘటనలో బాధిత యువతికి అండగా ఉంటానని అనిరుధ్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ సంఘటన నేపథ్యంలోని ఊర్కొండ పోలీసులతో కూడా మాట్లాడి ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చి రాత్రి పూట బస చేసే భక్తులకు రక్షణ కల్పించాలని కోరారు. గ్రామంలోనీ యువతులు కూడా జరిగిన సంఘటన పట్ల భయాందోళనలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేయాలని కూడా అనిరుధ్ రెడ్డి ఆదేశించారు.

శ్రీ వేంకటేశ్వర దేవాలయం పంచాంగం శ్రావణములో.

శ్రీ వేంకటేశ్వర దేవాలయం పంచాంగం శ్రావణములో

రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి

సన్మానం చేసిన ఆలయ అయ్యలూరి రగునాథం శర్మ

వనపర్తి నేటిదాత్రి :

వనపర్తి పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పంచాంగం శ్రవణం కార్యక్రమంలో రాష్ట్ర ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ జి చిన్నారెడ్డి పాల్గొన్నారు .

Temple

 

సందర్భంగా ఆలయ ఆలయ చైర్మన్ అయ్యలు రఘునాథ శర్మ చిన్నారెడ్డిని శాలువతో సన్మానించారు ఆలయ పూజారులు ఆశీర్వదించారు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ మాజీ కౌన్సిలర్ తిరుమల్ నాయుడు గంధం నాగరాజ్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి పంచాగ కర్త నాగరాజు సిద్దాoతి ని ఆలయ చైర్మన్ అర్చకులను శా లువతో సన్మానించారు

రాచన్న స్వామి ఆలయంలో అభిషేకాలు.

రాచన్న స్వామి ఆలయంలో అభిషేకాలు.

 

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

కోహిర్ మండలం బడంపేటలోని రాచన్న స్వామి దేవాలయంలో సోమవారం ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. స్వామివారికి బిల్వదళాలతో ప్రత్యేక పూజ కార్యక్రమాలను చేశారు. రాచన్న స్వామిని దర్శించుకునేందుకు సంగారెడ్డి తో పాటు మహారాష్ట్ర కర్ణాటక నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.

శనీశ్వర ఆలయంలో మంత్రి దామోదర్ ప్రత్యేక పూజలు.

శనీశ్వర ఆలయంలో మంత్రి దామోదర్ ప్రత్యేక పూజలు

జహీరాబాద్. నేటి ధాత్రి:

శని అమావాస్య సందర్భంగా ఝరాసంగం మండలం బర్దిపూర్ లోని శనీశ్వర ఆలయంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనీశ్వర విగ్రహానికి తైలాభిషేకాలను చేశారు. అనంతరం ఆశ్రమ పీఠాధిపతి వైరాగ్య శిఖామని 1008 అవధూత గిరి మహారాజ్ ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

రాచన్న స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు.

రాచన్న స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు.

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహీర్ ర్ మండలం బడంపేటరాచన్న స్వామి ఆలయంలో శనివారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈకార్యక్రమంలోభక్తులకు ఆలయ ప్రధాన అర్చకులు జగదీశ్వర్ స్వామి, బుచ్చయ్య స్వామి, చిన్న వీరయ్య స్వామి, తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.

రేపు శని అమావాస్య వేడుకలు.

రేపు శని అమావాస్య వేడుకలు

జహీరాబాద్. నేటి ధాత్రి:

ఝరాసంగం మండల పరిధిలోని ఏడాకులపల్లి సప్తపురి శనిఘాట్ దేవాలయంలో శని అమావాస్య వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.

ఉదయం 5గంటల నుంచి స్వామివారికి తైలాభిషేకం, శని మహాయజ్ఞం, మహా మంగళహారతి నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.

రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఎమ్మార్వోకి వినతిపత్రం.

రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఎమ్మార్వోకి వినతిపత్రం…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి..

 

.తంగళ్ళపల్లి గ్రామానికి చెందిన రెడ్డిసంఘం సభ్యులు తంగళ్ళపల్లి ఎమ్మార్వో గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ తంగళ్ళపల్లి మండలం గోపాలరావు పల్లె రెడ్డి సంఘం ఆధ్వర్యంలో మహంకాళి అమ్మవారి గుడి నిర్మించుట కొరకు రెడ్డి సంఘం ఆధ్వర్యంలో కుల సభ్యులం అందరము నిర్ణయించడం జరిగిందని దీని ప్రకారం గోపాలపల్లి గ్రామంలో బే ద్రెంపల్లి వెళ్లే దారిలో స్థానిక ఐకెపి సెంటర్ దగ్గర గుట్ట బోరు ఉన్నందున ఇట్టి భూమి సర్వే నెంబర్.647. లో ఉన్నస్థలాన్ని స్థానిక మహంకాళి అమ్మవారి గుడికి స్థలంఇవ్వడానికి ప్రొసీడింగ్ ఇవ్వాలని ఇవ్వాలని స్థానిక రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఎమ్మార్వోకి కలిసి రెడ్డి సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో రెడ్డి సంఘం అధ్యక్షులు ఏసి రెడ్డి నరసింహారెడ్డి ఉపాధ్యక్షులు కరుణాకర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి కాసర్ల నర్సింహారెడ్డి సభ్యులు తంకర తిరుపతి రెడ్డి ఆలూరి బాల్రెడ్డి రాజిరెడ్డి బింద్రపు రాజిరెడ్డి ఎగుమంటి సాయి రెడ్డి కాసర్ల లిజీ ప్ రెడ్డి రెడ్డి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు

బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన శ్రీలక్ష్మీవెంకటేశ్వర స్వామి.

బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన శ్రీలక్ష్మీవెంకటేశ్వర స్వామి ఆలయం

ఇబ్రహీంపట్నం. నేటిధాత్రి

 

మండలంలోని,వర్షకొండ గ్రామంలో
కోలిచినవారికి కొంగు బంగారంగా నిలుస్తున్న స్వామివారు 150 సంవత్సరాల క్రిందటి పురాతన ఆలయం గా సంతానం లేని వారికి ఏడు శనివారాలు గిరి ప్రదక్షణ చేసిన వారికి సంతానం ప్రసాదించే పరమాత్మునిగా భక్తులు నమ్మకం పురాతనైనటువంటి కాలం నాటి ఆలయాలలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఆలయం  రాతితో గుండుతో ఏర్పాటు చేయబడి ఆలయ గర్భాలయం శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామివారి  మూలవిరాట్  స్వామివారి కుడి భాగాన గోదాదేవి అమ్మవారి రెండుమిటర్ల, స్వామివారి   రాతి విగ్రహాలు పురాతన ఆలయం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఆలయం ప్రతి సవత్సరం ఉగాది రోజున ఘనంగా జాతర నిర్వహిస్తారు గ్రామాభివృద్ధి కమిటీ గ్రామ ప్రజల సహాయ సహకారాలతో జరుగుతాయి. కొన్ని సంవత్సరాలుగా  మధుర అన్వేష్ చార్యుల మరియు మధుర రాము చార్యుల మరియు లక్ష్మణ్ చార్యులు లచేతుల మిదుగా  ఆలయంలో స్వామివారికి అభిషేకాలు, కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో హనుమంతుడు మరియు గరుత్మంతుడు. భక్తుల సహకారంతో నిర్మించారు మరియు భక్తుల సౌకర్యం కోసం సల్కం నాడ్పి రాములు ట్యాంకు ఏర్పాటు చేశారు మరియు మామిడి వంశస్థులు రథం చేపించి భగవంతునికి సమర్పించారు బ్రహ్మోత్సవాలకు వేలాది సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం పద్మశాలి యువజన సంఘం ఆధ్వర్యంలో త్రాగునీరు అందజేస్తారు ఉత్సవాలను గ్రామాభివృద ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.

తొలి ఉగాది.

శీర్షిక:తొలి ఉగాది.

 

నేటి ధాత్రి:

*పుడమి ఆకు పచ్చని చీర కట్టుకుని…
స్వా గతం సుస్వా గతం తెలుపగా
వచ్చింది తొలి ఉగాది..!

ఇంద్రుడు మేఘ మాలికల విల్లులతో
తుంపర, తుంపరులుగా
చినుకుల బాణాలు విడుస్తూ …
స్వా గతం సుస్వా గతం తెలుపగా వచ్చింది తొలి ఉగాది..!

పండిన కొత్త చింత పులుపు వగరు మామిడి ఉరింపులు పలుకగా భిన్నసంస్కృతులకు బహు పునాది వేస్తూ వచ్చింది తొలి ఉగాది..!

సంస్కృతి సంప్రదాయాలను ఒకటిగా చేసి చైత్ర మాసపు ఊసులు చెప్తూ గండు కోయిల తీయని పాటలతో స్వాగతం సుస్వాగతం పలుకగా
వచ్చింది తొలి ఉగాది..!

పంచభూతాలు దీవించగా…
చావిడలో పంచాంగ శవ్రణాలు
స్వా గతం సుస్వా గతం తెలుపగా
వచ్చింది తొలి ఉగాది..!

తెలుగు లోగిళ్లలోన మామిడితోరణాలు,
షడ్రురుచులతో ఉగాదిపచ్చడి…
స్వా గతం సుస్వా గతం తెలుపగా
వచ్చింది తొలి ఉగాది..!

మీకు మీ కుటుంబ సభ్యులకు విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు 2025

శ్రీమతి “మంజుల పత్తిపాటి” (కవయిత్రి).

మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్.

జాతరకు ముస్తాబవుతున్న బద్ది పోచమ్మ ఆలయం..

జాతరకు ముస్తాబవుతున్న బద్ది పోచమ్మ ఆలయం..

# 20 దశాబ్దాలుగా పూజలు అందుకుంటున్న బద్ధి పోచమ్మ తల్లి..

# జాతరలో అలరించునున్న ప్రభ బండ్లు.

#పకడ్బద్ధంగా పోలీసుల భారీ భద్రత ఏర్పాటు.

#గ్రామంలో రెండు రోజుల ముందే పండుగ వాతావరణం.

#ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జాతరకు హాజరు కానున్న భక్తులు.

 

నల్లబెల్లి,నేటిధాత్రి:

 

కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారమైన శ్రీ బద్ది పోచమ్మ జాతర ఈనెల 28 న వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో బోల్లోనిపల్లి (పోచంపల్లి)లో అంగరంగ వైభవంగా జాతరను జరగనున్నది.జాతరను దిగ్విజయం చేయడం కోసం అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో చలవ పందిళ్ళు, విద్యుత్ దీపాల అలంకరణతో సుందరంగా ఆలయం చుట్టూ అలంకరించారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జాతర నిర్వహించడం ఆనవాయితీ వస్తున్నది. ఈ జాతరకు ఉమ్మడి వరంగల్ జిల్లా లోని పలు ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటారు.

బద్ది పోచమ్మతల్లి ఎక్కడి నుండి వచ్చి వెలసింది..!

బద్ది పోచమ్మ తల్లి మొదటగా కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని దుద్యాల గ్రామంలో గల కూన వంశస్థులు ఆరాధ్య దైవంగా పూజలు చేసేవారు తదనంతరం కూన అమ్మక్క బోల్లోనిపల్లి గ్రామానికి తీసుకువచ్చి ప్రతిష్టాపన చేసి నేటికీ 20 దశాబ్దాలు కావస్తుంది.నాటి నుండి నేటి వరకు గ్రామస్తులతోపాటు, చుట్టుప్రక్కల గ్రామ ప్రజల సహకారంతో ఆలయ నిర్వాహకులు జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు.

Baddi Pochamma Temple

ఆకర్షించనున్న ప్రభ బండ్లు…

జాతరలో ప్రత్యేక ఆకర్షణగా ప్రభ బండ్లు ఆకర్షిస్తాయి.భక్తులు తమ కోరిన కోర్కెలు తల్లి తీర్చడం వల్ల భక్తులు మొక్కుబడిగా ప్రభ బండ్లు కట్టి తమ మొక్కును చెల్లించుకుంటారు. అలాగే సంతానం లేని వారికి సంతానం కలగడంతో తల్లి బద్దిపోచమ్మ పేరుతో వచ్చే అక్షరాలతో నామకరణం చేసి ఆ తల్లి యొక్క ఆశీర్వాదాన్ని బిడ్డలకు అందించే విధంగా ఆలయ ప్రాంగణంలో నామకరణం చేసి మొక్కును చెల్లిస్తారు.

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ భద్రత.

హోలీ పర్వదినాన్ని పురస్కరించుకొని గీసుకొండ మండలం కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి జాతరలో రాజకీయ ప్రభ బండ్ల అత్యుత్సాహంతో ఏర్పడిన ఉద్రిక్తత వాతావరణం పునరావృతం కాకుండా బద్ది పోచమ్మ జాతరలో పకడ్పద్దంగా అన్ని ఏర్పాట్లు చేసేందుకు పోలీస్ శాఖ సిద్ధమైంది. జాతరలో ఎలాంటి అవచనీయ సంఘటనలు జరగకుండా,రాజకీయ వాతావరణానికి తావు లేకుండా చుట్టుపక్కల గ్రామాల అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి గొడవలకు తావులేకుండా జాతరను సజావుగా జరుపుకునేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరగా అన్ని పార్టీ నాయకులు సానుకూలంగా స్పందించారని ఎస్సై వి గోవర్ధన్ తెలిపారు.

వైభో పేతంగా బోనాలు..

Baddi Pochamma Temple

ప్రతీ రెండు సంవత్సరాలకు ఒక్కసారి ఉగాది పండుగకు ముందు వచ్చే శుక్రవారం బద్ది పోచమ్మతల్లి బోనాల జాతర అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.ఈ నేపథ్యంలో
ఈనెల 28 న శుక్రవారం జరిగే బద్ది పోచమ్మ జాతరకు బొల్లోనిపల్లి గ్రామంతో పాటు నల్లబెల్లి మండలం, ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారు.ఈ క్రమంలో ప్రతి ఇంటి నుండి బోనాలతో పాటు యాటా పోతులతో బయలుదేరగా శివసత్తులు పూనకాలతో ఊగిపోతూ తల్లిని స్మరించుకుంటారు. ఊరిలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నా జాతర సమయంలో సొంత ఊరికి చేరుకొని పిల్ల పాపలతో , బంధువులతో కలిసి పండుగను సంబరంగా జరుపుకుంటారు.

జాతరకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాం.

ఆలయ నిర్వాహకులు..కూన నారాయణస్వామి

జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాల వసతులు , తాగునీటి,ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఆలయ ప్రాంగణంలో భక్తుల తాకిడికి అనుగుణంగా భారీ కేడ్లు ఏర్పాటు చేయడం జరిగిందని ఆలయ నిర్వాహకులు..కూన నారాయణస్వామి తెలిపారు. గురువారం నుండి శుక్రవారం సాయంత్రం వరకు జాతర సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం కోసం పోలీస్ శాఖను కోరడం జరిగిందని అన్నారు.

హనుమాన్ చాలీసా పారాయణం.

హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణం

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమాన్ని మంగళవారం రోజున నిర్వహించడం జరిగింది.అలాగే ఆలయంలో భక్తులు మరియు హనుమాన్ మాలాధారణ స్వాములు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి హిందూ ఉత్సవ సమితి తరపున ధన్యవాదాలు తెలియజేశారు.

రూ.151తో ఇంటి వద్దకే సీతారాముల తలంబ్రాలు.

రూ.151తో ఇంటి వద్దకే సీతారాముల తలంబ్రాలు

జహీరాబాద్. నేటి ధాత్రి:

సీతారాముల తలంబ్రాల కోసం రూ.151 తో బుక్ చేసుకుంటే, ఆర్టీసీ లాజిస్టిక్ ద్వారా భక్తులకు ఇంటివద్దకే సీతారాముల తలంబ్రాలు చేర్చుతామని, జహీరాబాద్ ఆర్టీసీ కండక్టర్ బి. నరేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆర్టీసీ అధికారుల ఆదేశాల మేరకు కోహీర్, సహా వివిధ గ్రామాల్లో సీతారాముల కళ్యాణ తలంబ్రాలను ఆసక్తి కలిగిన వారికి బుక్ చేశారు. భక్తులు సీతారాముల కళ్యాణ తలంబ్రాల కోసం బుకింగ్ చేసుకున్న వారికి రశీదు అందజేస్తున్న కండక్టర్ బి. నరేష్. సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ కండక్టర్ బి. నరేష్ కోరారు.

శివాలయ పునర్నిర్మాణానికి కసిరెడ్డి బ్రదర్స్ విరాళం.

తండ్రి జ్ఞాపకార్థం శివాలయ పునర్నిర్మాణానికి కసిరెడ్డి బ్రదర్స్ విరాళం.

 

చిట్యాల, నేటిధాత్రి :

భక్తి, శక్తి, ముక్తి మానవ జీవితంలో పరమ పద సోపానాల్లాంటివని జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నవాబుపేట గ్రామ వాస్తవ్యులు కసిరెడ్డి కృష్ణారెడ్డి, కసిరెడ్డి రత్నాకర్ రెడ్డిలు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నవాబుపేట గ్రామంలో పురాతన శివాలయం శిథిలావస్థకు చేరడంతో..ఆ శివాలయాన్ని కూల్చివేసి..నూతన శివాలయ పునర్నిర్మాణానికి కసిరెడ్డి బ్రదర్స్ కంకణ బద్దులయ్యారు. గ్రామస్తులనంతా ఏకం చేసి..విరాళాలు సేకరిస్తూ..శివాలయం పునర్నిర్మాణ పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో వారి తండ్రి కీ: శే: కసిరెడ్డి పురుషోత్తం రెడ్డి స్మారకార్థం రూ.1,50,516 రూపాయల విరాళం అందించి వారి భక్తి భావాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. భక్తి భావం వలన ప్రజల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుందని, ఈర్ష్య, ద్వేషం, అసూయ లాంటి దుర్గుణాలు తొలగిపోయి, భగవత్ సాహిత్యం వలన మనిషి మనసులో ప్రశాంతత పెరిగి సద్గుణాలు కలుగుతాయని, తద్వారా గ్రామస్తులందరి మధ్యన మంచి సంబంధాలు ఏర్పడతాయన్నారు. ఈ కార్యక్రమంలో శివాలయం అర్చకుడు రఘునందన్, గ్రామ ప్రముఖులు సర్వ శరత్ కుమార్, అనగాని రాజయ్య, మందల రాఘవరెడ్డి, చెక్క నర్సయ్య, కొక్కుల సారంగం తదితరులు పాల్గొన్నారు.

ముత్యాల తలంబ్రాల కొరకు.!

శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణానికి ముత్యాల తలంబ్రాల కొరకు నగదు అందజేత

ఆలయ అభివృద్ధి కొరకు 10116నగదు అందజేత

గణపురం నేటి ధాత్రి:

గణపురం మండల కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ పట్టాభి సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ఏప్రిల్ ఆరవ తారీకు ఆదివారం నిర్వహించనున్న సీతారాముల కళ్యాణం కొరకు గణపురం వాస్తవ్యులు అయినా విశాఖపట్నంలో వెహికల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న తాళ్లపల్లి కిరణ్మయి రాజన్న దంపతులు స్వామివారి కళ్యాణానికి ముత్యాల తరంబ్రాల కొరకు 10116 రూపాయలను ఆలయ కమిటీ చైర్మన్ తాళ్లపల్లి గోవర్ధన్ కు అందజేయడం జరిగింది అదేవిధంగా రాజన్న మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నిర్వహించనున్న సీతారామ కళ్యాణానికి ముత్యాల తలంబ్రాల ను పంపిస్తానని తెలపడం జరిగింది అదేవిధంగా గణపురం మండల కేంద్రానికి చెందిన కీర్తిశేషులు మేడిపల్లి ప్రమీల కొమరయ్య జ్ఞాపకార్థం వారి కుమారులు శ్రీనివాస్ శ్రీకాంత్ ఆలయ అభివృద్ధి కొరకు10116 రూపాయలను ఆలయ కమిటీ అధ్యక్షులకు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు ముసునూరి నరేష్ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు

జోగులాంబ అమ్మవారిని దర్శించుకున.!

జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

వనపర్తి నేటిదాత్రి:

అలంపూర్ జోగులాంబ అమ్మవారిని గురువారం రాష్ట్ర *మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి దర్శించుకున్నారు ఈసందర్భంగా
మాజీ మంత్రి నిరంజన్ రెడ్డని జోగులాంబ అమ్మవారి ఆలయ అర్చకులు ఆశీర్వదించారు మాజీమంత్రి వెంట ఆర్యవైశ్యడు
వెంకట్రామయ్య శెట్టి మధుసూదన్ రెడ్డి తదితరులు ఉన్నారు

భద్రాచల సీతారామచంద్రుల కళ్యాణ తలంబ్రాలు.

భద్రాచల సీతారామచంద్రుల కళ్యాణ తలంబ్రాలు..ఆర్టీసీ సంస్థ సేవలు

సిరిసిల్ల టౌన్ :(నేటి దాత్రి)

శ్రీరామనవమి సందర్బంగా భద్రాచలం లోని శ్రీ సీతారామచంద్రుల కళ్యాణం తలంబ్రాలను భక్తుల ఇంటి వద్దకే ఆర్టీసీ కార్గో ద్వారా అందచేస్తామని సిరిసిల్ల ఆర్.టీ.సీ డిపో మేనేజర్ ప్రకాష్ రావు అన్నారు .బుధవారం సిరిసిల్ల బస్ స్టేషన్ లో తలంబ్రాల బుకింగ్ రశీదు పుస్తకాలను ఆవిష్కరించినారు.ఈ సందర్బంగా డిపో మేనేజర్ ప్రకాష్ రావు మాట్లాడుతూ కల్యాణ తలంబ్రాలు బుకింగ్ కోసం భక్తులు సిరిసిల్ల బస్టాండ్ లోని కార్గో కార్యాలయం లో మరియు డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ వద్ద,ఏజెంట్ ల వద్ద 151/- లు చెల్లించి బుకింగ్ రసీదును పొందాలనిఅన్నారు . కళ్యాణ అనంతరం భక్తుల ఇండ్లకు తలంబ్రాలను అందజేస్తామని,స్వామివారి కల్యాణానికి వెళ్లలేని భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని శ్రీరాముడి ఆశీస్సులను పొందాలని అన్నారు. తలంబ్రాలు బుకింగ్ కోసం 9154298576
,9154298577,9492448189 నెంబర్లను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్గో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కార్గో సిబ్బంది, ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు.

శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవ ఆహ్వానము.

శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవ ఆహ్వానము

జహీరాబాద్. నేటి ధాత్రి:

గ్రా రంజోల్ (బాబానగర్), మం॥ జహీరాబాద్, జిల్లా సంగారెడ్డి,తేది : 25-03-2025 మంగళవారము రోజున ఉ॥ 7-00 ని॥లకు సృష్టి, స్థితి, లయకారిణి తన కంటి చూపుతో జగత్తును నడిపించు తల్లి అపారశక్తి మాతా ఆ శక్తి దివ్య స్వరూపిణి, శ్రీ పెద్దమ్మతల్లి మాతా సుమారుగా 150 సం॥ల నుండి ఇక్కడి చుట్టు ప్రక్కల ప్రాంతాల ప్రజలు పొడి, పంటలకు సంబందించి భక్తులందరిని అనుగ్రహిస్తూ, భక్తులందరికి కొంగు బంగారమై వెలసిన శ్రీ పెద్దమ్మతల్లి కోరిన కోరికలు వెంటనే తీర్చి సుఖ శాంతి సంతోషాలను ప్రసాదిస్తుందని ఇక్కడి స్థల ప్రతిష్ఠ ఆచల్లని తల్లి అయిన శ్రీ పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవము వైభముగా జరుగును. కావున భక్తులందరూ కార్యక్రమములో తన, మన, ధన రూపేన పాల్గోని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కాగలరు.

వేదిక కార్యక్రమ వివరములు :

తేది : 25-03-2025 మంగళవారము రోజున ఉ॥ 6-00 గం॥లకు గోపూజ, అగ్రోదకము, ధ్వజారోహణము, యాగశాల ప్రవేశము, అఖండ దీపారాధనము, మహా గణపతిపూజ, స్వస్తిశివపుణ్యహావచనము తరువాత విగ్రహ జలాధి వాసము తరువాత పంచాచార్య పూజ, పంచ గవ్వ ప్రాశనము, నాడి సమారాధనము, నవగ్రహ అష్టదిక్పాలక పూజా సర్వతో భద్ర మండప ప్రధాన కళశ దేవత ఆహ్వాన పూజ, అగ్ని ప్రతిష్ఠ మరియు తీర్ధ ప్రసాదములు మంగళవారము ఉ. 7-00 గం॥లకు విగ్రహము ఊరేగింపుతో విగ్రహం ఆలయం వద్దకు వచ్చుట మరియు హోమము విగ్రహ జలధివాసనము. సా॥ 6-00 గం॥ హోమము విగ్రహ దాన్యాధి వాసము.
తేది: 26-03-2025 బుధవారము రోజున ఉ॥ 5-00 గం॥లకు సుప్రభాత సేవా తరువాత విగ్రహ శయ్యాధి వాసనము తరువాత మండవ దేవతా ఆరాధనము కళశ పూజా. జపాది స్నానము (మహాస్నపనము) హోమము.
ఉ॥ 11-39 ని॥లకు విగ్రహ ప్రతిష్టాపన, శిఖర ప్రతిష్టా, నేత్రనిర్మలనము, పూర్ణాహుతి అమ్మవారి ధర్శనము, సద్గురువుల ఆశీర్వాద ప్రవచనము. పండిత సన్నానము ఆశీర్వచనములు మరియు తీర్థ ప్రసాదములు, మ॥ 1-00 గం॥లకు గ్రామము నుండి గుండి వరకు భోనాల

కార్యాక్రమము తర్వాత.

తేది: 25-03-2025 రోజు మ॥ 2-00 గం॥ మరియు తేది: 26-03-2025 రోజు సా॥ 5-00 గం॥లకు భక్తులందరు అన్నదాన ప్రసాదము స్వీకరించుకోగలరు.

ఈ కార్యక్రమమునకు విచ్చేయు పూజ్యగురువరేణ్యులు:

వేధిక నిర్వాహణ:

శ్రీ గురు శాంతయ్య స్వామి,

శ్రీ రాజు స్వామి, శివప్రసాద్ స్వామి

శ్రీ వద్దమ్మ తల్లి దేవాలయ కమిటీ మరియు గ్రామ ప్రజలు, పెద్దలు.

హరిహర క్షేత్రం దేవాలయం నిర్మాణానికి.

హరిహర క్షేత్రం దేవాలయం నిర్మాణానికి:
ఎమ్మెల్యే, కార్పొరేటర్

ఉప్పల్ నేటిదాత్రి మార్చి 17:

హరిహర క్షేత్రం శ్రీ చిలుకశ్వేర అంజనేయు స్వామి శ్రీ గాయత్రి దేవాలయం చిల్కానగర్ శివాలయం పున్నరునిర్మాణం పనుల్లో భాగంగా ముఖ్యమైన కార్యం మొదటి అంతస్తు స్లాబ్ తర్వలో వేయడం జరుగుతుంది. స్లాబ్ నిర్మాణంకోసం అవసరమైన రెడీమిస్స్ కాంక్రీట్ ను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఇస్తామని హామీ ఇచ్చారు. స్లాబ్ కోరకు అవసరమైన స్టీల్ ను చిల్కానగర్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ఇస్తామని చెప్పారు. అందులో భాగంగా నిన్న ఎమ్మెల్యే మనిషి వంశీ మరియు బన్నాల ప్రవీణ్ వచ్చి సెంట్రగ్ స్లాబ్ పనులు పరిశీలించారు. ఈకార్యక్రమంలో ఆలయకమిటీ అధ్యక్షులు దాసరి కృష్ణ, కమిటీ సభ్యులు గోనె అంజయ్య, ఆడెపు అంజయ్య, కావాలి నర్సింహ్మ, బొమ్మ రమేష్, సిక్కరి కృష్ణ, గుర్రాల మల్లేష్ ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version