విక్రమ్ స్థానంలో మాధవన్ .

విక్రమ్ స్థానంలో మాధవన్

 

దర్శక ధీరుడు రాజమౌళి చిత్రంలో ఆఫర్ అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ చియాన్ విక్రమ్ మాత్రం… ‘సారీ… నో’ అనే శాడట!

దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) సినిమాలో ఛాన్స్ వస్తే చాలు అని ఎంతోమంది నటీనటులు అనుకుంటారు. ఆయన డైరెక్షన్ లో ఒక్క సినిమా చేస్తే చాలు… తమకు ఓవర్ నైట్ స్టార్ డమ్ వస్తుందని హీరోలు, హీరోయిన్లు నమ్ముతారు. ఆయన ఆఫర్ ఇవ్వాలే కానీ.. రెండు మూడేళ్ళ పాటు కాల్ షీట్స్ ఇవ్వడానికీ బిజీ ఆర్టిస్టులు సిద్థపడతారు. అయితే ఈ మాయ పడకుండా… తమ కెరీర్ ను జాగ్రత్తగా బిల్డ్ చేసుకునే నటీనటులూ కొందరు ఉంటారు. రాజమౌళికి రెండు మూడేళ్ళు రాసిచ్చేయడానికి ఆసక్తి చూపించవారి విషయమే ఇది! చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) తన కెరీర్ ను చిన్న చిన్న పాత్రలతో మొదలు పెట్టాడు. అప్పట్లో తెలుగులో పెద్దంత ప్రాధాన్యం లేని పాత్రలను సైతం చేశాడు. చివరకు తమిళంలో బ్రేక్ వచ్చిన తర్వాత అతని సినిమాలు తెలుగులో డబ్ అయ్యి గ్రాండ్ గా రిలీజ్ కావడం మొదలైంది. ఒకానొక సమయంలో విక్రమ్ సినిమాలు తమిళంలో కంటే తెలుగులోనే భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. వైవిధ్య మైన పాత్రలు చేయడానికి ఎప్పుడూ ఆసక్తిని కనబరిచే విక్రమ్.. మహేశ్ బాబు (Mahesh Babu), రాజమౌళి సినిమాలో వచ్చిన ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించాడని తెలుస్తోంది.
కొంతకాలం క్రితం రాజమౌళి బృందం విక్రమ్ ను కాంటాక్ట్ చేసి, మహేశ్ బాబు – రాజమౌళి ప్రాజెక్ట్ లో పాత్ర చేయమని కోరిందట. ఈ ప్రాజెక్ట్ కు ఉన్న క్రేజ్ తెలిసి కూడా విక్రమ్ ఆ ఆఫర్ కు నో చెప్పాడట. ఎందుకంటే… అతని పాత్ర సినిమాలో నెగెటివ్ షేడ్స్ తో సాగుతుందట! ఇప్పుడు తనకున్న ఇమేజ్ కు అలాంటి పాత్ర చేయడం సబబు కాదని విక్రమ్ భావించాడని సన్నిహితులు చెబుతున్నారు. హీరోగా ఎంతటి రిస్క్ చేయడానికైనా సాహసించే విక్రమ్… మహేశ్, రాజమౌళి ప్రాజెక్ట్ లో నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయడానికి మాత్రం ధైర్యం చేయలేకపోయాడని తెలుస్తోంది. విక్రమ్ ‘నో’ చెప్పిన తర్వాతే చిత్ర బృందం ఆర్. మాధవన్ (R Madhavan) ను అప్రోచ్ అయ్యిందని, ఆయన వెంటనే ఈ సినిమా చేయడానికి అంగీకరించి, డేట్స్ అడ్జస్ట్ చేశాడని అంటున్నారు. మాధవన్ హీరోగా కొన్ని చిత్రాలు చేసి, హీరోగా తనను తాను నిరూపించుకుని ఇప్పుడు ప్రతినాయకుడి పాత్రలు సైతం చేస్తున్నాడు. అంతే కాదు… ఇటీవల దర్శకుడిగా మారి మెగాఫోన్ నూ చేతిలోకి తీసుకున్నాడు. మొత్తానికి రాజమౌళి మూవీలో ఆర్టిస్టుల ఎంపిక కుర్చీల ఆటను తలపిస్తోందని సినిమా రంగానికి చెందిన వారు చెవులు కొరుక్కుంటున్నారు. దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్ తో కె. ఎల్. నారాయణ (K.L. Narayana) దీనిని నిర్మిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి స్వరరచన చేస్తున్న ఈ మూవీ తాజా షెడ్యూల్ సోమవారం మొదలైంది.
Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version