మిల్లర్‌ ‘‘జగన్‌’’కు అధికారులు నోటీసులిచ్చారు..చేతులు దులుపుకున్నారు?

త్వరలోనే చర్యలు తీసుకుంటాం అని ‘‘నేటిధాత్రి’’ ఎడిటర్‌ ‘‘కట్ట రాఘవేందర్‌ రావు’’ తో చెప్పిన సివిల్‌ సప్లై ‘‘కమీషనర్‌ చౌహాన్‌.’’

-జగన్‌ నుంచి సమాధానం రాకపోతే అధికారులు ఏం చేస్తున్నారు?

-మాయమైన వడ్లను జగన్‌ అప్పగిస్తానంటున్నాడని సమాచారం?

-వడ్లు తిరిగి ఖమ్మం సివిల్‌ సప్లయ్‌కి అప్పగిస్తే తప్పు ఒప్పవుతుందా?

-మోసం చేసిన మిల్లర్‌కు శిక్ష తప్పుతుందా?

-ఖమ్మం జేసినే తప్పుపడుతూ వున్న జగన్‌ను హన్మకొండ అధికారులు వదిలేస్తారా?

-రైతులను మోసం చేసిన జగనే ‘‘నేటిధాత్రి’’ మీద కేసులు నమోదు చేస్తుంటే చూస్తూ

ఊరుకుంటారా?

-రేపటి రోజు హన్మకొండ అధికారులు ‘‘కోర్టు’’కు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది.

-మోసం చేసిన జగన్‌పై చర్యలేవీ అని ప్రశ్నిస్తే ఏం సమాధానం చెబుతారు?

-‘‘నేటిధాత్రి’’ వల్లనే జగన్‌ మోసం వెలుగులోకి వచ్చింది.

-జగన్‌ ప్రభుత్వాన్ని మోసం చేశాడని తెలిసింది.

-మోసం చేసిన జగనే ‘‘నేటిధాత్రి’’ మీద కేసు నమోదు చేయడం బరితెగింపు కాదా?

-రైతులను మోసం చేయాలనుకునే మిల్లర్లు పెరిగిపోరా?

-అది ప్రభుత్వ చేతగాని తనం అనిపించుకోదా!

-దొంగే దొంగ అని అరిచి ఇంకా ఎవరి కళ్లుగప్పాలనుకుంటున్నాడు?

-జగన్‌ చేసిన మోసం అధికారుల మెడకు చుట్టుకోదా?

హైదరాబాద్‌,నేటిధాత్రి:

హన్మకొండ సివిల్‌ సప్లై శాఖ ఏం చేసింది? ఏం చేస్తోంది? అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్త చర్చగా మారింది. హన్మకొండకు చెందిన మిల్లర్‌ జగన్‌ చేసిన నిర్వాకం అందరికీ తెలుసు. ఖమ్మం జిల్లా నుంచి వడ్లు వచ్చాయన్నది నిజం. హన్మకొండ జిల్లాకు చెందిన కొంత మంది మిల్లర్ల పేరు మీద ఆర్వోలు జారీ అయ్యాయని తెలుసు. ఆ మిల్లులకే తొలత వడ్లు చేరాయన్నది నిజం. చేరిన వడ్లు ఆ మిల్లర్లు తీసుకోవడం లేదని హన్మకొండ సివిల్‌ సప్లై అధికారులు లేనిపోనివి సృష్టించారన్నది తెలుసు. ఖమ్మం నుంచి వచ్చిన వడ్లు ఆ మిల్లలకు కాకుండా, మరుసటి రోజులు అర్ధాంతరంగా మిలర్ల జగన్‌ మిల్లులకు తరలిపోయాయన్నది నిజం. ఆ మిల్లర్‌ అధికారుల ఆశీస్సులతో ఆ వడ్లు తన మిల్లలకు చేరవేసుకున్నారన్నది నిజం. ఈ విషయంలో తొలత ఖమ్మం జేసికి సమాచారం ఇవ్వలేదన్నది నిజం. తర్వాత వడ్ల లెక్కల్లో తేడాలొచ్చాయన్నది నిజం. ఆ విషయం ఖమ్మం జిల్లా జేసి గుర్తించారన్నది నిజం. వెంటనే జగన్‌కు ఖమ్మం జేసి తాఖీదులు పంపిచారన్నది నిజం. ఈ విషయాలన్నీ నేటిధాత్రి అక్షరం పొల్లు పోకుండా నిజాలు రాసిందన్నది కూడా వాస్తవం. ఇక్కడ వడ్లు చెందాల్సిన మిల్లులకు చెరలేదు. చెందలేదు. కాని ముందు లిస్టులో లేని జగన్‌ మిల్లులు వడ్లు తరలించిన అధకారులు బాగానేవున్నారు. వచ్చిన వడ్లు తమ మిల్లులకు చేరకపోయినా మిల్లర్లు సైలెంట్‌గానే వున్నారు. ఆ మిల్లులకు న్యాయం జరగాలన్న నేటిదాత్రికి మిల్లర్‌ జగన్‌ నోటీసులు పంపడం జరిగింది. అంటే అక్రమంగా వడ్లను మిల్లులకు తరలించిన వ్యక్తే, తనకు అన్యాయం జరిగిందని గగ్గోలు పెట్టడం అంటే దొంగే దొంగ అని అరిచినట్లే వుంది. అసలు హన్మకొండ అధికారులు ఎవరి మేలు కోసం పనిచేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రజలు చెల్లించిన జీతాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వానికి, రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారు. పైగా మిల్లర్‌ జగన్‌కు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. మిల్లర్‌ జగన్‌ ఆగడాలకు వంత పాడుతున్నారు. ఖమ్మం జిల్లా జేసి పంపిన వడ్ల లెక్కలు చూసుకునే తీరిక హన్మకొండ అధికారులకు లేదు. మరి అధికారులు ఏం చేస్తున్నట్లు? రైతులకు, ప్రభుత్వానికి కుచ్చుటోపీ పెట్టే వారిపై వార్తలు రాసినందుకు నేటిధాత్రికి నోటీసులు పంపడాన్ని అధికారులు ఎలా సమర్ధించుకుంటారో కోర్టులో తేలుతుంది. రైతులను మోసం చేసి తిరిగి న్యాయస్ధానాలను కూడా తప్పుతోవ పట్టించాలని చూస్తున్న జగన్‌ సంగతి తేలుతుంది. రైతులను మోసం చేసి, ప్రభుత్వం కళ్లుగప్పి నేరం చేసిన అక్రమార్కులకు కూడా పరువు అనేది ఒకటి వుంటుందా? అది పరువుకు భంగం కలుగుతుందా? తప్పు చేసినప్పుడు పరువు గుర్తుకు రాలేదా? మోసం చేసినప్పుడు పరువు పోతుందన్న ఆలోచన రాలేదా? నేటిధాత్రి నిజాలు వెలుగులోకి తేవడం వల్ల పరువు పోయిందా? పరువుగా బతకాలనుకున్నప్పుడు తప్పు చేయడమే విడ్డూరం. తప్పు చేసిన తన పరువును వెతుక్కోవాలనుకోవడం నిజంగానే విచిత్రం. అందుకే జగన్‌ వ్యవహారం చూసేందుకు ఏకంగా సివిల్‌ సప్లైశాఖ కమీషనర్‌ చౌహన్‌ రంగంలోకి దిగుతున్నట్లు నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావుతో చెప్పారు. ఇంతటి దుర్మార్గం ఎందుకు జరుగుతోంది? అధికారులు ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారు? అందరి లెక్కలు తేల్చుతా? అని చెప్పారు. ఎందుకంటే హన్మకొండ జాయింట్‌ కలెక్టర్‌ మిల్లర్‌ జగన్‌కు నోటీసులు పంపించానంటున్నారు. తాను చేసింది పొరపాటు అని ఒప్పుకోని జగన్‌, మాయమైన వడ్లను తిరిగి ఇచ్చేస్తానని చెబుతున్నట్లు సమాచారం అందుతోంది. అంటే మాయం చేసిన వడ్లను తిరిగి సివిల్‌ సప్లై శాఖకు అప్పగిస్తే చేసిన నేరం మాసిపోతుందా? తప్పు ఒప్పవుతుందా? అందుకు ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం వుంది. అందుకే నేరుగా కమీషనర్‌ చౌహన్‌ రంగంలోకి త్వరలో దిగుతున్నట్లు చెబుతున్నారు. అక్రమ మిల్లర్‌ జగన్‌, వార్తలు రాసిన నేటిధాత్రిపై కేసులు నమోదు చేస్తే అధికారులు కూడా కోర్టుకు హజరుకాకతప్పుతుందా? మిల్లర్‌ జగన్‌ను అధికారులు ప్రోత్సహించినట్లు స్పష్టమైన ఆదారులున్నాయి. ఖమ్మం నుంచి వచ్చిన వడ్లు మిల్లర్‌ జగన్‌కు పంపలేదు. కాని ఆ వడ్లు హన్మకొండకు వచ్చి, ఆర్వోలున్న మిల్లుల వద్దకు లారీలు చేరుకున్న తర్వాత దారి మళ్లింపబడ్డాయి. అధికారుల పర్యవేక్షణలోనే అవి జగన్‌ మిల్లులకు చేరాయి. అందుకు కారణాలు అధికారులు ఎన్ని చెప్పినా సమర్ధనీయం కాదు. అంతే కాకుండా ఈ విషయాలన్నీ నేటిదాత్రి రాయడం వల్లనే వెలుగులోకి వచ్చాయి. ఖమ్మం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ స్పందించాల్సి వచ్చింది. మిల్లర్‌ జగన్‌కు నోటీసులు పంపడం జరిగింది. అసలు వడ్లు తన మిల్లులకు మళ్లించుకుపోవడమే జగన్‌ చేసిన తొలి నేరం. తర్వాత ఆ వడ్ల లెక్కలను తారు మారు చేసి వాటిని మాయం చేయడం అతి పెద్ద నేరం. ఇన్ని నేరాలు చేసిన వ్యక్తి నేటిధాత్రికి నోటీసులు పంపించడం అంటేనే ఆయన వెనుక అధికారులు సపోర్టు ఎంత వుందనేది తెలిసిపోతోంది. ఇలా నేరం చేసిన వారే న్యాయస్దానాలను ఆశ్రయిస్తున్నానని ఎవరిని బెదిరిస్తారు? న్యాయాన్ని ఎవరూ బెదించలేరు. అన్యాయం ఎప్పటికీ గెలవలేదు. కమీషనర్‌ చౌహాన్‌ రంగంలోకి దిగిన తర్వాత అంతా తేలుతుంది. జగన్‌ వ్యహారం బండారం అంతా బైటపడుతుంది. అదికారులు తీరు అంతా వెలుగులోకి వస్తుంది.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version