నూతన పోలీస్ స్టేషన్ కు తాత్కాలిక.!

నూతన పోలీస్ స్టేషన్ కు తాత్కాలిక భవనమును ఎమ్మెల్యే జిఎస్ఆర్

భూపాలపల్లి నేటిధాత్రి

కొత్తపల్లి గోరి మండలం కేంద్రంలో నూతనగా పోలీస్ స్టేషన్ కు అవసరమైన తాత్కాలిక భవనమును ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పరిశీలించారు.అదేవిధగా ఈ నెల చివరికల్లా నూతన పోలీస్ స్టేషన్ భవనము శంకుస్థాపన కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి లేదా వరంగల్ జిల్లా ఇంచార్జీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వస్తారని ఎమ్మెల్యే జీఎస్సార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి సంపత్ రావు చిట్యాల సీఐ మల్లేష్ రేగొండ ఎస్ఐ సందీప్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇ విజయం తాత్కాలికమే.!

ఇ విజయం తాత్కాలికమే
`బీఆర్‌ఎస్‌, బీజేపీ చీకటి రాజకీయలతోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం
`రాబోయో ఎన్నికలల్లో గెలిచేంది కాంగ్రెస్సే
`వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్‌ చైర్మన్‌ నరుకుడు వెంకటయ్య
వర్దన్నపేట,నేటిదాత్రి:
వర్ధన్నపేట మండల కేంద్రము లో వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్‌ చైర్మన్‌ నరుకుడు వెంకటయ్య మాట్లాడుతూ ఇటీవల జరిగిన టీచర్స్‌, గ్రాడ్యువేట్‌ ఎన్నికల్లో బీజేపీ గెలవడం బీజేపీ, బిఆర్‌ఎస్‌ చీకటి రాజకీయలతోనే జరిగింది.
కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు ఎక్కడా చెక్కు చెదరలేదని గత పదేళ్ళలో బీఆర్‌ఎస్‌ చేసిన అడ్డగోలు అవినీతి తో కేసీఆర్‌ కుటుంబం అనేక కేసులలో కీలకంగా ఉన్నారని దీంతో క్విడ్‌ ప్రో కో పద్ధతిన బిఆర్‌ఎస్‌ బీజేపీ లు వారి వారి లాభాల కోసం పని చేస్తున్నాయి. గత పార్లమెంట్‌ ఎన్నికల ముందు నుంచే ఈ ఒప్పందాలు అమలు అవుతున్నాయి . పార్లమెంట్‌ ఎన్నికలలో కూడా బిఆర్‌ఎస్‌ పూర్తిగా లోపాయకారి ఒప్పందం తో బీజేపీకి మద్దతు ఇవ్వడం వల్లనే బీజేపీ 8 సీట్లు గెలిచింది అందులో భాగంగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బిఆర్‌ఎస్‌ 22 మంది ఆ ప్రాంతంలో ఎమ్మెల్యేలు ఉన్న కూడా పోటీకి దూరంగా ఉండి బీజేపీని గెలిపించింది. ఇది తాత్కాలిక విజయమే ఈ ఎన్నికలకు రాబోయే ఎన్నికలకు ఏమి సంబంధం ఉండదని రాబోయో ఎన్నికలల్లో గెలిచేంది కాంగ్రెస్సే అని వెంకటయ్య అన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version